Linux/C3/More-on-grep-command/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 More on grep పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్ లో మనం,
00:07 మరి కొన్ని grep commandల గురించి,
00:10 కొన్ని ఉదాహరణలు ద్వారా నేర్చుకుంటాము.
00:13 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను ఉపయోగిస్తున్నది,
00:16 ఉబుంటు లైనక్స్ వర్షన్ 12.04 ఆపరేటింగ్ సిస్టం
00:20 GNU BASH వర్షన్ 4.2.24.
00:24 ఈ ట్యుటోరియల్ సాధన కు GNU bash 4 లేదా అంతకన్నా పై వర్షన్ ఉపయోగించండి.
00:31 దీని కోసం ముందుగా,
00:33 మీకు Linux టెర్మినల్ యొక్క బేసిక్స్ తెలిసి ఉండాలి.
00:36 మీకు grep కమాండ్ పై అవగాహన ఉండాలి.
00:39 లేకపోతే సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, క్రింద చూపిన మా వెబ్-సైట్ ను సందర్శించండి: http://spoken-tutorial.org
00:45 మనం ఒకటి కంటే ఎక్కువ నమూనాలను కూడా పోల్చవచ్చు.
00:49 మనం హైఫన్ e ఎంపిక ను ఉపయోగించాలి.
00:53 నేను grepdemo.txt అనే అదే ఫైలును ఉపయోగిస్తున్నాను.
00:58 మనకు civil లేదా electronics లో ఉన్న వాళ్ళ సమాచారం కావాలనుకుందాం.
01:05 మనము టెర్మినల్ లో,
01:07 grep స్పేస్ హైఫన్ e స్పేస్ డబల్ కోట్స్ లో electronics డబల్ కోట్స్ తరువాత స్పేస్ హైఫన్ e స్పేస్ డబల్ కోట్స్ లో civil డబల్ కోట్స్ తరువాత స్పేస్ grepdemo.txt టైప్ చేసి,
01:24 ఎంటర్ నొక్కండి, అవుట్పుట్ ఇలా కనిపిస్తుంది.
01:28 చౌదరి అని పేరు కలిగిన వారి విషయాలు కావాలనుకొందాం.
01:33 సమస్య ఏమిటంటే, వివిధ రకాల ప్రజలు వివిధ రకాలుగా తమ శీర్షికలను అక్షరక్రమంలో ఉంచుతారు.
01:40 అయితే, పరిష్కారం ఏమిటి?
01:42 అటువంటప్పుడు మనం హైఫన్ i తో హైఫన్ e ఎంపిక ఉపయోగించవచ్చు.
01:48 grep స్పేస్ హైఫెన్ ie స్పేస్ డబల్ కోట్స్ లో chaudhury డబల్ కోట్స్ తరువాత స్పేస్ హైఫన్ ie స్పేస్ డబుల్ కోట్స్ లో chowdhari డబల్ కోట్స్ తరువాత స్పేస్ grepdemo.txt అని టైప్ చేసి,
02:12 Enter ను నొక్కండి.
02:14 అవుట్ ఇలా కనిపిస్తుంది.
02:16 కానీ దీనిలో మనం పేర్లు వ్రాయడానికి అనేక ఇతర మార్గాలు ఉన్నాయి.
02:23 ఎన్ని హైఫన్ e ఎంపికలు ఇవ్వగలము?
02:26 దీనికి ఒక మంచి మార్గం అవసరం, ఆ మార్గం Regular expressions.
02:33 Regular expressions ప్రత్యేక అక్షరాలు, పదాలు లేదా అక్షర నమూనాలు వంటి టెక్స్ట్ యొక్క స్ట్రింగ్స్ ను,
02:41 సరిపోల్చడం కోసం ఒక సంక్షిప్త మరియు సరళమైన మార్గాలను అందిస్తుంది.
02:47 Regular expressions characters అనేకం ఉన్నాయి.
02:52 మనం వాటిన గురించి ఒక్కొక్కటిగా నేర్చుకుందాం.
02:55 The character class:
02:57 ఒక జత స్క్వేర్ బ్రాకెట్లలో లోపల అక్షర సమూహాన్ని తెలుపగలము.
03:03 ఈ అక్షరాల సమూహంలో నుండి కేవలం ఒకేఒక అక్షరము సరిపోల్చబడును.
03:08 ఉదా. [abc] అనే regular expression a లేదా b లేదా c లను సరిపోల్చును.
03:18 chaudhury ని పోల్చుటకు,
03:23 grep స్పేస్ హైఫెన్ i స్పేస్ డబల్ కోట్స్ లో ch ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ ao క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ uw క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ dh ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ ua క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ r ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ yi క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ డబల్ కోట్స్ తరువాత స్పేస్ grepdemo.txt అని ప్రాంప్ట్ వద్ద టైప్ చేసి,
03:54 Enter నొక్కండి.
03:56 అవుట్పుట్ ఇలా కనిపిస్తుంది.
03:59 ఇప్పటికీ డబుల్ e తో ఉన్న choudhuree తో సరిపోలడం లేదు.
04:03 అప్పుడు మనం పెద్ద పరిధిని పేర్కొనలంటే,
04:08 పరిధి లో మొదటి అక్షరం డాష్ చివరి అక్షరం వ్రాస్తాము.
04:13 మనం కేవలంఏ అంకెనైనా మ్యాచ్ చేయాలనుకుంటే, [0-9] అని వ్రాయాలి.
04:20 ఈ అక్షర సమూహంలో ఒక దానితో సరిపోల్చబడును.
04:24 asterisk గుర్తు, దానికి ముందు ఉన్న అక్షరం 0 లేదా ఎక్కువ సార్లు రావడం ను చూపించును.
04:33 ఉదాహరణకు, ab asterisk అనేది a, ab, abb, abbb మొదలగు వాటితో మ్యాచ్ చేయబడును.
04:44 కాబట్టి, విద్యార్థి పేరు ను Mira కు మ్యాచ్ చేయాలంటే,
04:48 మనం ప్రాంప్ట్ వద్ద,
04:51 grep స్పేస్ హైఫన్ i స్పేస్ డబల్ కోట్స్ లో m ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ ei క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ asterisk raa asterisk డబుల్ కోట్స్ తరువాత space grepdemo.txt అని టైప్ చేసి,
05:12 Enter నొక్కుదాం.
05:14 అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
05:16 డాట్, ఏదైనా ఒక అక్షరం ను సరిపోల్చును.
05:21 మనం M తో మొదలయ్యే, 4 అక్షరాల పొడవు గల పదాలు శోధించాలని అనుకుందాం.
05:29 మనం ఈవిధంగా,
05:31 grep స్పేస్ డబుల్ కోట్స్ లోపల M ... స్పేస్ డబుల్ కోట్స్ తరువాత grepdemo.txt స్పేస్ అని టైప్ చేసి,
05:44 Enter నొక్కాలి.
05:46 అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
05:48 డబుల్ కోట్స్ లో స్పేస్ చాలా ముఖ్యమైనది, ఎందువల్లనంటే అది 5 లేదా అంతకన్నా ఎక్కువ అక్షరాలను పోల్చుతుంది.
05:56 మనం మన నమూనాను ఒక నిర్దిష్ట వరుసలో వెతకవచ్చు.
06:01 ఇది వరుస ప్రారంభంలో ఉండవచ్చు.
06:04 దాని కొరకు caret గుర్తును ఉపయోగిస్తాము.
06:07 ఇప్పుడు A తో మొదలయ్యే rollno కలిగిన ఎంట్రీలు కనుగొనాలంటే,
06:14 ఫైల్ లో roll no మొదటి ఫీల్డ్ అని మనకు తెలుసు.
06:19 మనం ప్రాంప్ట్ వద్ద grep స్పేస్ డబుల్ కోట్స్ లోపల caret సైన్ A డబుల్ కోట్స్ తరువాత grepdemo.txt అని టైప్ చేసి,
06:29 Enter నొక్కుదాం.
06:32 అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
06:35 అదేవిధంగా, ఫైల్ చివరన ఒక నమూనాను పోల్చుటకు మనకు డాలర్($) గుర్తు కలదు.
06:41 7000 మరియు 8999 ల మధ్య గల stipends ను కనుకొనుటకు,
06:50 grep స్పేస్ డబుల్ కోట్స్ లోపల ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ 78 క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ డాట్ డాట్ డాట్ dollar sign డబుల్ కోట్స్ తరువాత స్పేస్ grepdemo.txt అని టైప్ చేసి,
07:06 Enter నొక్కుదాం.
07:08 అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
07:11 ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
07:13 సారాంశం చూద్దాం.
07:16 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి,
07:18 ఒకటి కంటే ఎక్కువ నమూనాలను పోల్చటం,
07:20 వేరువేరు స్పెల్లింగ్ కలిగిన ఒక పదం ను తనిఖీ చెయ్యడం.
07:24 క్యారెక్టర్ క్లాస్ asterisk యొక్క ఉపయోగం.
07:28 డాట్ ను ఉపయోగించి ఏదైనా ఒక అక్షరమును పోల్చడం,
07:32 ఫైల్ ప్రారంభంలో గల ఒక నమూనా ను పోల్చడం,
07:35 ఫైల్ చివరన గల ఒక నమూనా ను పోల్చడం.
07:40 అసైన్మెంట్ గా 5 అక్షరాలు కలిగిన Y తో ప్రారంభమయ్యే విలువలను లిస్ట్ చెయ్యండి.
07:48 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోచూడండి.
07:51 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశము ను ఇస్తుంది.
07:54 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
07:59 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది,
08:05 ఆన్ లైన్ పరీక్ష లో పాస్ అయిన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది.
08:08 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org ను సంప్రదించండి.
08:15 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఎ టీచర్ ప్రాజెక్ట్లో టాక్ ఒక భాగం.
08:20 దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రు ICT MHRD భారత ప్రభుత్వం చే మద్దతు లభిస్తుంది.
08:26 ఈ మిషన్ పై మరింత సమాచారం దిగువ చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org\NMEICT-Intro
08:32 ఈ రచనకు సహాయపడినవారు,
08:36 స్పోకన్ ట్యుటోరియల్ జట్టు. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india