Linux-Old/C2/Desktop-Customization-14.04/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 అందరికీ నమస్కారము. Desktop Customization in Ubuntu Linux OS పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్లో మనము,

లాంచర్ గురించి, లాంచర్ నుండి అప్లికేషన్ లను ఎలా తొలగించుట మరియు ఎలా జోడింcచుట బహుళ డెస్క్టాప్లు ఉపయోగించడం, ఇంటర్నెట్ కనెక్టివిటీ, సౌండ్ సెట్టింగ్స్, సమయం మరియు తేదీ సెట్టింగులు మరియు వేరొక user account కు మారడం నేర్చుకుంటాము.

00:27 ఈ ట్యుటోరియల్ కోసం నేను ఉబుంటు లైనక్స్ OS 14.04 ను వాడుతున్నాను.
00:34 లాంచర్తో ప్రారంభించండి.
00:36 లాంచర్ ఉబుంటు లైనక్స్ డెస్క్టాప్ లో డిఫాల్ట్ గా ఎడమ వైపు ప్యానెల్ , ఇది కొన్ని డిఫాల్ట్ అప్లికేషన్ లను కలిగి ఉంది.
00:44 లాంచర్, తరచుగా ఉపయోగించే అప్లికేషన్ లను సులభంగా యాక్సెస్ చేయుటకు వీలుకలిగిస్తుంది.
00:49 కాబట్టి, లాంచర్ పై ఉన్న, ఒక ప్రోగ్రాం యొక్క డెస్క్టాప్ షార్ట్ కట్ పై క్లిక్ చేసి, దానిని ప్రారంభించగలము.
00:56 అప్రమేయంగా, లాంచర్ కొన్ని అప్లికేషన్ లను కలిగి ఉంటుంది.
01:00 మన అవసరాల ఆధారంగా లాంచర్ను customize చేయుట నేర్చుకుందాం.
01:06 నా రోజువారీ పని కోసం, Terminal, LibreOffice Writer, Gedit వంటి అప్లికేషన్లు నాకు అవసరం.
01:15 ఈ అప్లికేషన్ లను లాంచర్ లో చేర్చుదాం.
01:19 ఇలా చేయటానికి ముందు, నాకు అవసరం లేని కొన్ని అప్లికేషన్ లను నేను తొలగిస్తాను.
01:25 VLC అప్లికేషన్ ను తొలగించాలనుకుంటే,
01:30 VLC అప్లికేషన్ ఐకాన్ పై రైట్ -క్లిక్ చేసి, లాంచర్ నుండి అన్లాక్ చేయండి.
01:37 VLC అప్లికేషన్ ఐకాన్ లాంచర్ నుండి తొలగించబడటం మీరు చూడవచ్చు.
01:43 అదే విధంగా, మనం తరచుగా వాడని అన్ని షార్ట్ కట్స్ను తొలగించవచ్చు.
01:49 నేను నా డెస్క్టాప్ పై ఉన్న లాంచర్ నుండి కొన్ని అప్లికేషన్ లను తొలగించానని మీరు ఇక్కడ చూడగలరూ.
01:55 ఇప్పుడు, నేను లాంచర్కు టెర్మినల్ షార్ట్ కట్ ను జోడిస్తాను.
02:00 డాష్ హోమ్ పై క్లిక్ చేయండి.
02:02 Search బార్ లో, టెర్మినల్ అని టైప్ చేయండి.
02:05 దానిని తెరవడానికి, టెర్మినల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.
02:09 మీరు లాంచర్ పై టెర్మినల్ ఐకాన్ ను చూడవచ్చు.
02:13 లాంచర్ పై టెర్మినల్ ఐకాన్ ను ఫిక్స్ చేయుటకు, దానిపై రైట్-క్లిక్ చేసి,
02:18 తరువాత Lock to Launcher పై క్లిక్ చేయండి.
02:21 లాంచర్ లో అప్లికేషన్ షార్ట్ కట్ లను ఫిక్స్ చేయడానికి మరొక మార్గం dragging మరియు dropping. నేను ఇప్పుడు దీన్ని ప్రదర్శిస్తాను.
02:30 డాష్ హోమ్ ని తెరిచి, సెర్చ్ బార్ లో లిబ్రేఆఫీస్ అని టైప్ చేయండి.
02:37 లాంచర్ పైకి లిబ్రేఆఫీస్ ఐకాన్ ను లాగండి.
02:42 మనము ఆలా చేస్తున్నపుడు, Drop to Add application అనే సహాయ టెక్స్ట్ కనపడుతుంది. సహాయ టెక్స్ట్ ఏదీ కనిపించకపోతే చింతించకండి.
02:51 ఇప్పుడు, లాంచర్ పై లిబ్రేఆఫీస్ ఐకాన్ ను వదలండి.
02:55 ఇప్పుడు లాంచర్ కు ఆ షార్ట్ కట్ జోడింపబడటం మీరు చూడవచ్చు.
03:00 ఈ విధం గా, మనం లాంచర్ కు షార్ట్ కట్స్ ను జోడించవచ్చు.
03:04 ఉబుంటు లైనక్స్ OS లో తదుపరి ముఖ్యమైన లక్షణం multiple desktop లేదా వర్క్స్పేస్ స్విచ్చర్.
03:12 కొన్నిసార్లు మనము బహుళ అప్లికేషన్ లలో పని చేయవలసిరావచ్చు.
03:17 మీకు ఒక అప్లికేషన్ నుండి మరొకదానికి మారడం కష్టం అనిపించవచ్చు.
03:22 మరింత సౌకర్యవంతంగా చేయడానికి, మనము వర్క్స్పేస్ స్విచ్చర్ను ఉపయోగించవచ్చు.
03:27 లాంచర్ కు తిరిగి రండి.
03:30 లాంచర్ పై, వర్క్స్పేస్ స్విచ్చర్ ఐకాన్ ను గుర్తించండి. దానిపై క్లిక్ చేయండి.
03:36 అది 4 డెస్క్టాప్లు తో 4 భాగాలను చూపిస్తుంది.
03:40 అప్రమేయంగా, ఎగువ-ఎడమ డెస్క్టాప్ ఎంచుకోబడింది.
03:44 అంటే, అది మనం ప్రస్తుతం పని చేస్తున్న డెస్క్టాప్.
03:48 ఇప్పుడు, రెండవ డెస్క్టాప్ ను దానిపై క్లిక్ చేయడం ద్వారా ఎంచుకుందాం.
03:53 నేను లాంచర్ లోని ఐకాన్ పై క్లిక్ చేసి టెర్మినల్ ను తెరుస్తాను.
03:59 ఇప్పుడు, వర్క్స్పేస్ స్విచ్చర్ పై మళ్ళీ క్లిక్ చేయండి.
04:02 మీరు రెండవ Workspace Switcher పై Terminal ను, మొదటి దానిపై మన Desktop ను చూడవచ్చు.
04:09 ఈ విధంగా, మీరు multiple Desktop లలో పని చేయవచ్చు.
04:12 మనము మొదటి డెస్క్టాప్ కు తిరిగి వద్దాం.
04:15 ట్రాష్ లాంచర్ లో మరో ముఖ్యమైన ఐకాన్.
04:19 ట్రాష్, తొలగించిన అన్ని ఫైళ్ళు మరియు ఫోల్డర్లను కలిగి ఉంటుంది.
04:23 ఒక వేళ మనము ఏదైనా ఫైల్ ను అనుకోకుండా తొలగిస్తే, దానిని Trash నుండి మళ్ళి పొందవచ్చు.
04:28 దీనిని వివరించుటకు, నేను నా డెస్క్టాప్ లో ఉన్న DIW ఫైల్ ను తొలగిస్తాను.
04:33 ఫైల్ పై రైట్-క్లిక్ చేసి, Move to Trash ఎంపికను క్లిక్ చేయండి.
04:38 దానిని మళ్ళి పొందుటకు, లాంచర్ లో ట్రాష్ చిహ్నం పై క్లిక్ చేయండి.
04:43 ట్రాష్ ఫోల్డర్ తెరుచుకుంటుంది.
04:46 ఫైల్ ను ఎంచుకోని, దానిపై రైట్-క్లిక్ చేసి, Restore పై క్లిక్ చేయండి.
04:50 ట్రాష్ విండో మూసివేసి, డెస్క్టాప్ కు తిరిగి రండి.
04:54 ముందుగా తొలగించిన ఫైలు ఇప్పుడు restore చేయబడిందని మనము చూడవచ్చు.
04:59 ఒక ఫైల్ మీ సిస్టం నుండి శాశ్వతంగా తొలగించుటకు, దానిని ఎంచుకొని, shift+Delete లను నొక్కండి.
05:07 Are you sure want to permanently delete DIW అనే ఒక డైలాగ్ బాక్స్ కనపడుతుంది. Delete పై క్లిక్ చేయండి.
05:15 మరోసారి ట్రాష్ ఐకాన్ పై క్లిక్ చేయండి.
05:18 ట్రాష్ ఫోల్డర్ లో మన ఫైల్ కనిపించుట లేదు, అది మన సిస్టమ్ నుండి శాశ్వతంగా తొలగింపబడుతుంది.
05:24 ఇప్పుడు, డెస్క్టాప్ యొక్క కుడి ఎగువ మూలలో కొన్ని అప్లికేషన్ లను చూద్దాం.
05:31 మొదటిది ఇంటర్నెట్ కనెక్టివిటీ.
05:34 మీరు ఏదైనా లాన్ లేదా వైఫై నెట్వర్క్ కు కనెక్ట్ అయ్యి ఉంటే కనెక్షన్ ఏర్పడుతుంది.
05:39 మీరు ఇక్కడ వీటిని చూడవచ్చు.
05:42 మీరు యాక్సెస్ చేయదలచిన నెట్వర్క్ను ఎంచుకోవచ్చు.
05:46 నెట్వర్క్ ను Enable/ Disable చేయుటకు Enable Networking ఎంపికను చెక్ లేదా ఆన్-చెక్ చేయండి.
05:52 మనము Edit Connections ఎంపికను ఉపయోగించి నెట్వర్క్లను సవరించవచ్చు.
05:57 తదుపరి ఎంపిక సౌండ్. దానిపై క్లిక్ చేయండి.
06:00 మీరు ఇక్కడ ఒక స్లయిడర్ చూడవచ్చు. ఇది మన ఎంపిక ప్రకారం, ఆడియో స్థాయిని పెంచడం లేదా తగ్గించడం చేస్తుంది.
06:07 Sound Settings పై క్లిక్ చేసి, మీ సిస్టమ్ యొక్క ధ్వని స్థాయిని మరింత సర్దుబాటు చేయవచ్చు.
06:14 ఈ విండోలో ఉన్న సెట్టింగులను మీరు స్వంత అన్వేషించండి.
06:17 తదుపరి ఐకాన్ టైమ్ & డేట్.
06:20 మనము ఈ ఐకాన్పై క్లిక్ చేస్తే, క్యాలెండర్ తెరవబడుతుంది. ప్రస్తుత తేదీ, నెల మరియు సంవత్సరం ఇక్కడ చూడవచ్చు.
06:29 బాణం బటన్లు మన ఎంపిక ప్రకారం, ఇతర నెలల మరియు సంవత్సరాలకు తరలించడానికి మనకు అనుమతిస్తాయి.
06:35 టైమ్ & డేట్ సెట్టింగుల పై క్లిక్ చేసి తేదీ మరియు సమయాన్ని సవరించవచ్చు. మీ సొంతంగా ఈ ఎంపిక గురించి మరింత తెలుసుకొనండి.
06:44 తరువాత, wheel ఐకాన్ పై క్లిక్ చేయండి.
06:47 ఇక్కడ మనం లాగ్ అవుట్ మరియు షట్ డౌన్ ఎంపికలతో పాటు కొన్ని షార్ట్ కట్ ఐచ్ఛికాలను చూడవచ్చు.
06:53 మనము మన సిస్టమ్లో అందుబాటులో ఉన్న User accountsని చూడగలము.
06:59 మనము నిర్దిష్ట వినియోగదారుని క్లిక్ చేయడం ద్వారా మనము కోరుకున్న యూజర్ ఖాతాకు మారవచ్చు.
07:05 ట్యుటోరియల్ సారాంశం.
07:07 ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకున్నది లాంచర్ గురించి, లాంచర్ పై అప్లికేషన్లను ఎలా తొలగించుట మరియు ఎలా జోడించుట, బహుళ డెస్క్టాప్లు ఉపయోగించడం, ఇంటర్నెట్ కనెక్టివిటీ, సౌండ్ సెట్టింగ్స్, సమయం మరియు తేదీ సెట్టింగులు మరియు వేరొక user accounts కు మారడం.
07:26 ఈ కింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంగ్రహిస్తుంది. దయచేసి దానిని చూడండి.
07:32 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్లైన్ పరీక్షలను పాస్ అయిన వారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
07:39 మరింత వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
07:42 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, భారతదేశం యొక్క ప్రభుత్వంచే నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ పై మరింత సమాచారం క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉంది.
07:53 ఈ రచనకు సహకరించింది స్పోకన్ ట్యుటోరియల్ జట్టు. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Nancyvarkey