LibreOffice-Suite-Writer/C4/Creating-newsletter/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:00 | లిబ్రే ఆఫీస్ రైటర్- క్రియేటింగ్ న్యూస్ లెటర్స్ విత్ మల్టీపల్ కాలమ్స్ గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్‌లో మనం,
లిబ్రే ఆఫీస్ రైటర్ లో వార్తాలేఖలు ఎలా తయారు చేయ్యలి మరియు వాటి పై ఇతర ఆపరేషన్లు ఎలా చేయ్యలో నేర్చుకుంటాము. |
00:17 | ఇక్కడ మనం ఆపరేటింగ్ సిస్టం ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు లిబరే ఆఫీ సు సూట్ వర్షన్ 3.3.4 ఉపయోగిస్తున్నాము. |
00:27 | వార్తాలేఖను ఒక ప్రచురణగా ఉపయోగిస్తారు. ఇది చందాదారులకి ఒక క్రమ సమయ విరామం లో చెలామణి అవుతుంది. ఉదాహరణకు - పత్రిక, కరపత్రం మరియు మరెన్నో. |
00:39 | ఇది బహుళ కాలమ్‌లు విభాగాలుగా కలిగి ఉంటుంది మరియు పాఠకులకు ఈ విభాగాలలోని వివిధ కథనాలను చదవడానికి సులభతరం చేస్తుంది. |
00:47 | లిబ్రే ఆఫీస్ రైటర్‌ను ఉపయోగించి, చాలా సులభంగా, వేగంగా కథనాలను చదివే విధంగా వార్తాలేఖలను సృష్టించవచ్చు. |
00:55 | File(ఫైల్), New(న్యూ) మరియు Text Document(టెక్స్ట్ డాక్యుమెంట్) ఎంపికలతో ఒక కొత్త డాక్యుమెంట్‌ను తెరుద్దాం. |
01:03 | Newsletter(న్యూస్ లెటర్) ఫైల్ పేరు తో ఈ డాక్యుమెంట్ ను సేవ్ చేద్దాం. |
01:13 | Newsletter(న్యూస్ లెటర్) పేరుతో మన వద్ద ఒక కొత్త డాక్యుమెంట్ వుంది. |
01:17 | ఇప్పుడు డాక్యుమెంట్లో కాలమ్‌లను ప్రవేశ పెడదాం. |
01:20 | దీని కోసం,ముందుగా Menu(మెనూ) బార్‌లోని Format(ఫార్మట్) బటన్ పై క్లిక్ చేసి ఆ పై Columns(కాలమ్స్) పై క్లిక్ చేయండి. |
01:27 | వివిధ ఏమ్పికలతో ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
01:31 | మీకు ఎన్ని కాలమ్స్ కావాలో అన్నిటిని ఎంచుకోండి. |
01:34 | మరియు ఈ కాలమ్స్ యొక్క width(విడ్త్) మరియు spacing(స్పేసింగ్) సెట్ చేయడం, |
01:37 | separator lines (సెపరేటర్ లైన్స్)కు ఇతర లక్షణాలు సెట్ చేయడం ఇందులో వున్నవి. |
01:42 | కాలమ్ ఫీల్డ్ విలువను 2 కు మార్చి, న్యూస్‌లెటర్ డాక్యుమెంట్‌కు రెండు కాలమ్స్ ను ఎంపిక చేసుకుందాం. |
01:49 | కాలమ్ ఫీల్డ్ పక్కన వున్న ఐదు ఐకాన్స్, మీకు అందుబాటులో వున్న వివిధ ఫార్మాట్ల ప్రివ్యూను చూపిస్తాయి. |
01:56 | రెండవ ఫార్మాట్ పై క్లిక్ చేద్దాం. |
01:59 | కాలమ్‌ల యొక్క ఇతర లక్షణాలను నిర్వచించే విలువలను డిఫాల్ట్‌గా నే ఉంచుదాం. |
02:05 | OK బటన్ పై క్లిక్ చేద్దాం. |
02:08 | టెక్స్ట్ ప్రదేశంలో రెండు కాలమ్‌లు కనిపించడం గమనించండి. |
02:12 | మన మొదటి కాలమ్‌లో ఒక వ్యాసం రాద్దాం. |
02:15 | హెడ్డింగ్ బోల్డ్ టెక్స్ట్‌లో Nature (నేచర్) మరియు ఫాంట్ సైజును 15 ఇవ్వండి. |
02:21 | మరియు దీని క్రింద ఒక కథనం రాద్దాం. |
02:25 | మొదటి కాలమ్ ముగింపుకు చేరుకున్న తర్వాత కర్సర్ స్వయంచాలకంగా తదుపరి కాలమ్‌కు వెళ్ళడం గమనించండి. |
02:33 | మీరు కాలమ్‌లో ఒక చిత్రాన్ని కూడా ప్రవేశ పెట్టవచ్చు మరియు అది కాలమ్‌లోకి సరిపోయే విధంగా దాని పరిమాణాన్ని మార్చవచ్చు. |
02:39 | ఇప్పుడు కొన్ని ఖాళీలను వదిలి తర్వాత మీరు కాలమ్‌లో మరో కథనం వ్రాయవచ్చు. |
02:46 | ముందుగా ఫాంట్ పరిమాణం 15తో బోల్డ్ టెక్స్ట్ లో Sports అనే హెడ్డింగ్ ఇచ్చి, దాని దిగువన స్పోర్ట్స్ గూర్చి ఒక కథనం రాద్దాం. |
02:56 | చూడండి! కాలమ్స్, బహుళ కథనాలను చదవడానికి సులభతరం చేస్తాయి. |
03:02 | మన కథనం మొదటి కాలమ్‌లోనే సరిపోయేలా కొన్ని వాక్యాలను తొలగిద్దాం. |
03:08 | తర్వాత, మరిన్ని కాలమ్‌లను ఆక్సెస్ చేయడానికి ఇన్సర్ట్(Insert) బటన్ పైన క్లిక్ చేసి తర్వాత మాన్యువల్ బ్రేక్ (Manual Break) పైన క్లిక్ చేయండి. |
03:16 | కనిపించే డైలాగ్ బాక్స్‌లో, కాలమ్ బ్రేక్ (Column break) బటన్ పైన క్లిక్ చేసి తర్వాత OK బటన్ పై క్లిక్ చేయండి. |
03:23 | కర్సర్ తర్వాతి కాలమ్‌లో స్వయంచాలకంగా రావడం చూడవచ్చు. |
03:27 | ఇక మీరు ఈ కాలమ్‌లో మరొక వ్యాసం రాయడం మొదలు పెట్టవచ్చు. |
03:31 | అన్ని ఫార్మాటింగ్ ఎంపికలు అనగా, |
03:33 | Align left(అలైన్ లెఫ్ట్), Align right(అలైన్ రైట్), |
03:36 | టెక్స్ట్‌కు Background Color (బాక్గ్రౌండ్ కలర్) ఇవ్వడం, |
03:38 | Highlighting(హైలైటింగ్) మరియు అనేక ఇతర లక్షణాలను, |
03:41 | టెక్స్ట్‌కు జోడించి మరింత ఆకర్షణీయంగా చెయ్యవచ్చు. |
03:45 | ఉదాహరణకు, బాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకున్న టెక్స్ట్ భాగంను ఎంచుకోండి. |
03:51 | ఇప్పుడు,Background Color(బాక్గ్రౌండ్ కలర్) ఐకాన్ పై క్లిక్ చేసి తర్వాత టూల్ బార్ లోని Green 4(గ్రీన్ 4) పై క్లిక్ చేయండి. |
03:59 | ఎంపిక చేసిన టెక్స్టు బాక్గ్రౌండ్ కలర్ లేత ఆకుపచ్చ రంగుకు మారడం చూడండి. |
04:05 | ఇదే విధముగా టెక్స్ట్ యొక్క వివిధ భాగాలకు వివిధ బాక్గ్రౌండ్ కలర్లను ఇవ్వవచ్చు. |
04:10 | మొదట డ్రాయింగ్ టూల్‌బార్‌లోని టెక్స్ట్ ఎంపికను క్లిక్ చేయడం ద్వారా వార్తాలేఖకు బ్యానరలను కుడా జోడించవచ్చు. |
04:18 | ఇప్పుడు డాక్యుమెంట్లో రాతపూర్వక టెక్స్ట్ లేని చోట ఎక్కడైనా టెక్స్ట్ బాక్స్‌ను పెట్టండి. |
04:24 | టెక్స్ట్ బాక్స్ లోపల ఏ టెక్స్ట్ అయినా రాయగలరు. అది బ్యానర్ లేదా ప్రకటనగా పని చేస్తుంది. |
04:30 | This is a newsletter(థిస్ ఇస్ అ న్యూస్‌లెటర్ ) అని కొంత టెక్స్ట్ టైపు చేద్దాం. |
04:35 | మీరు ఈ టెక్స్ట్‌కు ఎఫెక్ట్స్ కుడా ఇవ్వవచ్చు. |
04:37 | ఉదాహరణకు, మొదట టెక్స్ట్ పై రైట్ క్లిక్ చేసి మెనూ నుండి Text(టెక్స్ట్) ఎంపిక పై క్లిక్ చేయండి. |
04:45 | Text(టెక్స్ట్) మరియు Text Animation(టెక్స్ట్ అనిమేషన్) టాబ్స్తో ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
04:50 | Text Animation(టెక్స్ట్ అనిమేషన్) టాబ్ పై క్లిక్ చేయండి. |
04:53 | ఈ ట్యాబు కింద ఉన్న Effects(ఎఫెక్ట్స్) ఫీల్డ్ లో వివిధ ఎంపికలు వున్నవి. |
04:58 | వార్తాలేఖలోని టెక్స్ట్ బ్లింక్ లేదా రెప్పపాటు చేయడానికి, Blink ఎంపిక పై క్లిక్ చేయండి. |
05:04 | చివరగా OK బటన్ పై క్లిక్ చేయండి. |
05:07 | This is a newsletter(థిస్ ఇస్ అ న్యూస్‌లెటర్) అనే టెక్స్ట్, డాక్యుమెంట్లో నిరంతరం బ్లింక్ అవ్వడం గమనించండి. |
05:13 | ఇదేవిధముగా, ఇలాంటి ఇతర ఎఫెక్ట్స్ మరియు గ్రాఫిక్స్ టెక్స్ట్‌కు ఇవ్వవచ్చు. |
05:18 | ఇప్పుడు తదుపరి పేజీలో ఒక కొత్త వ్యాసం రాయడం కోసం, మొదట ఇన్సర్ట్'(Insert)బటన్ పై క్లిక్ చెయ్యాలి. |
05:25 | తర్వాత మానుఅల్ బ్రేక్(Manual Break) ఎంపిక పై క్లిక్ చేయండి. |
05:29 | కనిపించే డైలాగ్ బాక్స్‌లో Page break(పేజి బ్రేక్) బటన్ పై క్లిక్ చేయండి. |
05:34 | చివరగా, OK బటన్ పై క్లిక్ చేయండి. |
05:37 | కర్సర్ తర్వాతి పేజిలోకి రావడం చూడవచ్చు. |
05:40 | ఈ పేజీ, మునుపటి పేజి లాగానే అదే కాలమ్ ఫార్మాటింగ్ కలిగి వుంది. |
05:46 | మీ వ్యాసంలో పదములను లెక్కించడం కోసం మొదట మీ టెక్స్ట్ యొక్క ఒక భాగం లేదా మొత్తం డాక్యుమెంట్‌ను ఎంపీక చేసుకోండి. |
05:53 | ఇప్పుడు,Menu bar (మెనూ బార్) నుండి Tools(టూల్స్ ) ఎంపికను క్లిక్ చేయండి. |
05:57 | డ్రాప్ డౌన్ బాక్స్‌లో నుండి Word Count(వర్డ్ కౌంట్) ఎంపికను క్లిక్ చేయండి. |
06:02 | కనిపించే డైలాగ్ బాక్స్‌లో ప్రస్తుత ఎంపిక యొక్క మరియు మొత్తం డాక్యుమెంట్ యొక్క Word Count(వర్డ్ కౌంట్) రావడం గమనించండి. |
06:10 | ఇది మీ డాక్యుమెంట్ మొత్తంలో, అలాగే ఎంపీక చేసిన టెక్స్టులోని అక్షరాల మొత్తం లెక్కింపు చూపిస్తుంది. |
06:18 | డాక్యుమెంట్ రాసేటప్పుడు, స్పెల్ చెక్ స్వయంచాలకంగా చేయవచ్చు. |
06:23 | టూల్‌బార్‌లో AutoSpellcheck(ఆటో స్పెల్ల్చేచ్క్)చిహ్నాన్ని క్లిక్ చేయండి. |
06:27 | వ్యాసం రాసేటప్పుడు ఏవైనా స్పెల్లింగ్ తప్పులు ఉన్నట్లయితే, రైటర్ స్వయంచాలకంగా ఆపదంను ఎర్ర వరసతో అండర్లైన్ చేసి చూపిస్తుంది. |
06:37 | ఉదాహరణకు, Cat బదులు Caat అని రాసి స్పేస్ బార్ నోక్కడి. ఒక ఎర్ర వరస దాని కింద రావడం చూడవచ్చు. |
06:48 | మనం పదమును సరి చెయ్యగానే ఎర్ర వరస అదృశ్యమవుతుంది. |
06:52 | ఇక, మనం మునుపటి ట్యుటోరియల్స్ లో చర్చించిన ఫార్మాటింగ్ ఎంపికలు అన్నీ, వార్తాలేఖలకు కుడా అమలు చెయ్యవచ్చు. |
07:01 | ఇప్పుడు మనం లిబరే ఆఫీసు రైటర్ గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్ |
07:04 | ముగింపుకు వచ్చాం. |
07:06 | సంగ్రాహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది,లిబ్రే ఆఫీస్ రైటర్ లో వార్త లేఖలు ఎలా సృష్టించాలి మరియు వాటి పై ఇతర ఆపరేషన్స్ ఎలా చేయాలి. |
07:17 | ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
07:21 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
07:24 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
07:28 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, |
07:31 | స్పోకెన్ ట్యూటోరియల్స్ని ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
07:34 | ఆన్లైన్ పరీక్షలలో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది. |
07:38 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgను సంప్రదించండి. |
07:44 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, |
07:48 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
07:56 | ఈ మిషన్ గురించి, |
08:00 | స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ org స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్‌లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. |
08:07 | ఈ ట్యూటోరియల్ను తెలుగులోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు. |