LibreOffice-Suite-Writer/C2/Typing-text-and-basic-formatting/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time NARRATION
00:01 లిబ్రే ఆఫీస్ - టైపింగ్ ది టెక్స్ట్ మరియు బేసిక్ ఫోర్మట్టింగ్ గురించి తెలియ చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది.
00:10 రైటర్ లో టెక్స్ట్ ను సమరేఖలోనికి తెచ్చుట.
00:12 బులెట్స్ మరియు నంబరింగ్.
00:14 రైటర్ లో కట్(cut), కాపీ(copy) మరియు పేస్ట్(paste) ఎంపికలు.
00:18 బోల్డ్(bold),అండర్లైన్ (underline)మరియు ఐట్యాలిక్స్( Italics) ఎంపికలు.
00:21 ఫాంట్ నేమ్(Font name), ఫాంట్ సైస్(Font size), మరియు ఫాంట్ కలర్ (Font color).
00:26 డాక్యుమెంట్స లో ఈ లక్షణాలు వివియోగిస్తే, సాదా టెక్స్ట్లో లో వున్న డాక్యుమెంట్సతో పోలిస్తే మరింత ఆకర్షణీయంగా మరియు చదవడానికి చాలా సులభంగా మార్చవచ్చు.
00:36 మనం ఇక్కడ ఓపెరటింగ్ సిస్టమ్ ఉబుంటు లినుక్ష్ వర్షన్ 10.04 మరియు లైబ్ర్ ఆఫీస్ సూయీట్ వర్షన్ 3.3.4.ను ఉపయోగిస్తున్నాము.
00:47 ముందుగా రైటర్ లో టెక్స్ట్ ను సమరేఖలోనికి ఎలా తేవాలో చూద్దాం.
00:50 మీరు మీ ఇష్టప్రకారంగా రైటర్ లో ఒక కొత్త డాక్యుమెంట్ ను తెరిచి ఈ లక్షణములను అమలు చేయొచ్చు.
00:57 ముందరి ట్యుటోరియల్ లోనే resume.odt ఫైల్ ను తయారు చేసాం కనుక ఈ ఫైల్ ను తెరుద్దాం.
01:08 మనం ముందుగానే RESUME అనే పదం టైపు చేసి పేజి మధ్యలోకి సమలేఖనం చేసాము.
01:14 కనుక, ఈ పదమును ఎంచుకొని Align Left(అలైన్ లెఫ్ట్) పై క్లిక్ చేద్దాం. RESUME(రెస్యూమె) పదం ఎడమ వైపు సమలేఖనం కావడం గమనించవచ్చు, అనగా డాక్యుమెంట్ పేజీ లోని ఎడమ మార్జిన్ వైపు.
01:25 ఒకవేళ (అలైన్ రైట్)Align Right పై క్లిక్ చేస్తే, (రెస్యూమె)RESUME పదం కుడి వైపు సమలేఖనం కావడం గమనించవచ్చు.
01:32 ఒకవేళ (జస్టిఫై)Justify పై క్లిక్ చేస్తే, (రెస్యూమె)RESUME పదం లోని టెక్స్ట్, ఇప్పుడు పేజీ యొక్క కుడి మరియు ఎడమ అంచులు మధ్య సమానముగా సమలేఖనం కావడం గమనించండి.
01:44 వరస లేదా విభాగము లోని టెక్స్ట్ లో ఈ లక్షణము సహజమైనది.
01:51 దీనిని (అండూ)undo చేద్దాం.
01:54 స్వతంత్రమైన అంశములను వ్రాయడానికి బులెట్స్(Bullets ) మరియు నంబరింగ్ (numbering)ను ఉపయోగిస్తారు.
01:58 ప్రతి అంశము ఒక బులెట్( bullet) లేదా సంఖ్యతో మొదలు అవుతుంది.
02:02 ఈ విధముగా డాక్యుమెంట్ లో వ్రాసిన వివిధ అంశములను వర్గీకరించవచ్చు.
02:07 మేను బార్(menu bar) లోని Format(ఫార్మ్యాట్) ఎంపిక పై క్లిక్ చేసి తర్వాత Bullets and Numbering(బులెట్స్ అండ్ నంబరింగ్) పై క్లిక్ చేయడం ద్వారా దీనిని ప్రవేశ పెట్టవచ్చు.
02:15 Bullets and Numbering(బులెట్స్ అండ్ నంబరింగ్) ఎంపిక పై క్లిక్ చేసిన తర్వాత వచ్చే డైయలోగ్ బాక్స్ లోని వివిధ టాబ్స్ లో వేరు వేరు Styles(స్టైల్స్) ను డాక్యుమెంట్ లో వినియోగించవచ్చు.
02:26 నంబరింగ్ను కూడా ఇదే విధముగా నంబరింగ్ ఎంపికను ఎంచుకోవడం ద్వారా చేయవచ్చు. ప్రతి లైన్ ఒక కొత్త సంఖ్య తో మొదలవుతుంది.
02:34 కాబట్టి Numbering type(నంబరింగ్ టైప్) స్టైల్ క్రింద రెండవ స్టైల్ పై క్లిక్ చేద్దాం.
02:40 OK(ఓకే)బటన్ పై క్లిక్ చేద్దాం.
02:42 ఇప్పుడు మీరు మీ మొదటి స్టేట్మెంట్ టైపు చేయడానికి సిద్దముగా వున్నారు.
02:46 NAME: RAMESH(నేమ్: రమేశ్) అని టైపు చేద్దాం.
02:50 స్టేట్మెంట్ టైపు చేసిన తర్వాత ఎంటర్ కీ ప్రెస్ చేద్దాం. ఇప్పుడు ఒక కొత్త బులెట్ పాయింట్(bullet point) లేదా కొత్త పెరిగిన సంఖ్య రావడం గమనించండి.
03:05 మీరు ఎంచుకున్న ఫార్మాట్ రకం ను బట్టి బుల్లెట్స్ లోపట బుల్లెట్స్ లేదా సంఖ్యల లోపట సంఖ్యలు ఉండవచ్చు.
03:13 resume(రెస్యూమె) లో రెండవ స్టేట్మెంట్ FATHER’S NAME colon MAHESH(ఫాదర్స్ నేమ్ కోలన్ మహేష్)అని టైపు చేద్దాం.
03:20 మళ్ళీ ఎంటర్ కీ నొక్కి MOTHER’S NAME colon SHWETA(మదర్’స్ నేమ్ కోలన్ శ్వేత) అని టైపు చేద్దాం.
03:27 అదేవిధముగా FATHERS OCCUPATION colon GOVERNMENT SERVANT(ఫాదర్స్ ఆక్యుపేషన్ కోలన్ గవర్న్మెంట్ సర్వెంట్) మరియు MOTHERS OCCUPATION colon HOUSEWIFE(మదర్స్ ఆక్యుపేషన్ కోలన్ హౌస్వైఫ్)లను వేరు వేరు అంశాలుగా టైపు చేద్దాం.
03:39 బులెట్స్ యొక్క ఇన్డెంట్ ను పెంచడానికి మరియు తగ్గించడానికి Tab(ట్యాబ్) మరియు shift tab keys(షిఫ్ట్ ట్యాబ్ కీస్) ను ఉపయోగించవచ్చు.
03:47 Bullets and Numbering(బులెట్స్ అండ్ నంబరింగ్) ఎంపికను తీసివేయు టకు HOUSEWIFE (హౌస్వైఫ్ )పదం పక్క కర్సర్ ను పెట్టి ఎంటర్ కీ పై క్లిక్ చేసి తర్వాత Bullets and Numbering(బులెట్స్ అండ్ నంబరింగ్) డైయలోగ్ బాక్స్ లో Numbering Off(నంబరింగ్ ఆఫ్) ఎంపిక పై క్లిక్ చేయాలి.
04:03 మేరు టైపు చేసే తర్వాతి టెక్స్ట్ bullet style(బుల్లెట్ స్టైల్) ఇకపై అందుబాటులో లేదని గమనించండి.
04:10 మన డాక్యుమెంట్ లో NAME(నేమ్) రెండు సార్లు టైపు చేయడం గమనించండి.
04:14 ఒకే టెక్స్ట్ మాటిమాటికి టైపు చేయడం కన్నా రైటర్ లో Copy(కాపీ) మరియు Paste (పేస్ట్) ఎంపికను ఉపయోగించవచ్చు.
04:21 ఇప్పుడు దీనిని ఎలా చేయాలో చూద్దాం.
04:24 MOTHER’S NAME(మదర్స్ నేమ్) టెక్స్ట్ నుండి NAME(నేమ్) పదమును తొలగించి కాపీ మరియు పేస్ట్ ఎంపికల తో NAME (నేమ్)తిరిగి రాద్దాం.
04:33 FATHER’S NAME(ఫాదర్స్ నేమ్) టెక్స్ట్ లో ముందుగా, NAME(నేమ్) పదము పై cursor (కర్సర్ )ను లాగుతూ NAME(నేమ్) పదమును ఎంచుకోవాలి.
04:40 మౌస్ కుడి బటన్ పై క్లిక్ చేసి Copy(కాపీ) ఎంపిక పై క్లిక్ చేయాలి.
04:45 MOTHER’S(మదర్స్) పదం పక్కన cursor (కర్సర్ )ను పెట్టాలి.
04:48 మళ్ళి మౌస్ కుడి బటన్ పై క్లిక్ చేసి Paste(పేస్ట్) ఎంపిక పై క్లిక్ చేయాలి.
04:54 NAME(నేమ్) పదం స్వయంచాలకంగా పేస్ట్ అవ్వడం గమనించండి.
04:57 ఈ ఎంపికల కోసం షార్ట్కట్ కీస్ కూడా వున్నవి. CTRL + C (కంట్రోల్ సీ). కాపీ చేయుటకు మరియు CTRL + V (కంట్రోల్ వీ)పేస్ట్ చేయుటకు.
05:08 డాకుమెంట్స్ లో ఎక్కడైతే మొత్తం టెక్స్ట్ ను మాటిమాటికి వ్రాయనవసరం లేదో, ఒకేవిధమైన టెక్స్ట్ ను చాలా పెద్ద మొత్తంలో రాసేటప్పుడు ఈ లక్షణము ఉపయోగపడుతుంది.
05:19 డాకుమెంట్స్ లో టెక్స్ట్ ను ఒక స్థానం నుండి మరొక స్థానంనకు కదపడానికి Cut(కట్) మరియు paste(పేస్ట్) లక్షణము ను కూడా ఉపయోగించవచ్చు.
05:26 ఇప్పుడు దీనిని ఎలా చేయాలో చూద్దాం.
05:29 MOTHER’S(మదర్స్) పదం తర్వాత NAME(నేమ్) పదం తొలగిద్దాం.
05:34 ఈ పదమును cut(కట్) మరియు paste(పేస్ట్) చేయడానికి, ముందుగా FATHERS NAME(ఫాదర్స్ నేమ్) స్టేట్మెంట్ లో, NAME(నేమ్) పదం ఎంచుకుందాం.
05:40 మౌస్ కుడి బటన్ క్లిక్ చేసి Cut(కట్)ఎంపిక చేసుకుందామ్. FATHER'S(ఫాదర్స్ ) పదం తర్వాత NAME(నేమ్) పదం ఉండకపోవడం గమనించండి.
05:54 MOTHER’S(మదర్స్) పదం తర్వాత కర్సర్ ను పెట్టి మౌస్ కుడి బటన్ పై క్లిక్ చేయoడి.
05:59 Paste(పేస్ట్) ఎంపిక పై క్లిక్ చేయoడి.
06:02 MOTHER'S(పేస్ట్) పదం తర్వాత ఆ పదం paste(పేస్ట్) కావడం గమనించండి.
06:07 cut (కట్ )చేయడానికి షార్ట్కట్ కీ CTRL+X(కంట్రోల్ X).
06:11 అందువల్ల, కాపీ మరియు టెక్స్ట్ కటింగ్ మధ్య తేడా ఏమిటంటే కాపీ ఎంపిక అసలు పదమును ఏ స్థానం నుండి కాపీ చేసామో అదే స్థానం లో ఉంచుతుంది అయితే కట్ ఎంపిక అసలు స్థానంలో నుండి పూర్తిగా తొలగిస్తుంది.
06:27 Father’s(ఫాదర్’స్) తర్వాత కూడా name(నేమ్) అనే పదం పేస్టు చేద్దాం.
06:31 EDUCATION DETAILS(ఎజుకేషన్ డీటేల్స్) అనే కొత్త heading(హెడ్డింగ్) టైపు చేద్దాం .
06:35 రైటర్ లో Bullets and Numbering(బులెట్స్ అండ్ నంబరింగ్) గురించి నేర్చుకున్న తర్వాత, ఏ టెక్స్ట్ కైనా Font name(ఫాంట్ నేమ్) మరియు Font size(ఫాంట్ నేమ్) ఎలా మార్చాలో మరియు ఎలా అమలు చేయాలో చుద్దాం.
06:45 ఇప్పుడు పైన వున్నఫార్మటు టూల్ బాగర్లో Font Name(ఫాంట్ నేమ్) అనే ఒక ఫీల్డ్ వుంది.
06:52 డిఫాల్ట్ రూపం లో ఫాంట్ నేమ్ Liberation Serif(లిబరేషన్ సెరిఫ్) గా సెట్ చేయబడింది. కి
06:57 మీరు టైపు చేసే టెక్స్ట్ ఫాంట్ మీరు అనుకునే విధముగా మార్చడానికి Font Name(ఫాంట్ నేమ్) ఉపయోగపడుతుంది.
07:04 ఉదాహరణకు Education Details(ఎజుకేషన్ డీటేల్స్)హెడింగ్ కు వేరే రకమైన ఫాంట్ స్టైల్ మరియు ఫాంట్ పరిమాణం ఇద్దాం.
07:11 ముందుగా Education details (ఎజుకేషన్ డీటేల్స్) టెక్స్ట్ ఎంచుకొని, Font Name(ఫాంట్ నేమ్) ఫీల్డ్ లోని డౌన్ ఆరో పై క్లిక్ చేద్దాం.
07:19 డ్రాప్ డౌన్ మేను లో వివిధ రకములైన ఫాంట్ నేమ్ ఎంపికలు చూడవచ్చు.
07:25కి Liberation Sans(లిబరేషన్ స్యాన్స్) కోసం వెతికి దాని పై క్లిక్ చేద్దాం.
07:29 ఎంచుకున్న టెక్స్ట్ , ఫాంట్ మారడం గమనించండి.
07:34 Font Name(ఫాంట్ నేమ్) ఫీల్డ్ పక్కన Font Size(ఫాంట్ సైస్) ఫీల్డ్వుంది.
07:38 పేరులో వున్న విధముగానే, Font Size(ఫాంట్ సైస్) అనేది మీరు ఎంపిక చేసుకున్న టెక్స్ట్ సైజు ను లేదా మీరు టైపు చేసే టెక్స్ట్ యొక్క సైజు ను పెంచుతుంది లేదా తగ్గిస్తుంది.
07:52 ముందుగా EDUCATION DETAILS(ఎజుకేషన్ డీటేల్స్) టెక్స్ట్ ను ఎంచుకుందాం.
07:55 ఇప్పుడు వున్న Font Size (ఫాంట్ సైస్ )12 చూపిస్తుంది.
07:58 Font Size(ఫాంట్ సైస్ ) ఫీల్డ్ లో డౌన్ ఆరో పై క్లిక్ చేసి 11 పై క్లిక్ చేయండి.
08:05 టెక్స్ట్ ఫాంట్ సిజ్ తగ్గడం గమనించండి.
08:09 ఇదే విధముగా టెక్స్ట్ ఫాంట్ సిజ్ పెంచవచ్చు.
08:13 ఫాంట్ సిజ్ గురించి నేర్చుకున్న తర్వాత రైటర్ లో ఫాంట్ కలర్ ఎలా మార్చాలో చూద్దాం.
08:21 Font Color(ఫాంట్ కలర్) మీ డాక్యుమెంట్ లోని ఎంపిక చేసుకున్న టెక్స్ట్ రంగును లేదా టైపు చేయాలనుకున్న టెక్స్ట్ రంగును మార్చడానికి ఉపయోగపడుతుంది.
08:27 ఉదాహరణకు, EDUCATION DETAILS(ఎజుకేషన్ డీటేల్స్) హెడింగ్కు రంగు ఇద్దాం.
08:32 మళ్లీ EDUCATION DETAILS (ఎజుకేషన్ డీటేల్స్) టెక్స్ట్ ను ఎంపిక చేసుకుందాం.
08:36 టూల్బార్లోని Font Color(ఫాంట్ కలర్) ఎంపికలోని డౌన్ ఆరో పై క్లిక్ చేసి light green(లైట్ గ్రీన్) బాక్స్ పై క్లిక్ చేయడం ద్వార టెక్స్ట్ కులేత ఆకుపచ్చ రంగు ఇవ్వచ్చు.
08:48 ఇప్పుడు హెడింగ్ ఆకుపచ్చరంగులో ఉందని గమనించండి.
08:52 ఫాంట్ సైజ్ ఎంపిక పక్కన Bold(బోల్డ్) Italic(ఐట్యాలిక్) మరియు Underline(అండర్లైన్) అనే మూడు ఎంపికలు ఉన్నాయి.
09:00 పేరులో వున్న విధముగానే, ఇవి టెక్స్ట్ ను బోల్డ్(bold) లేదా ఐట్యాలిక్(italic) లేదా అండర్లైన్(underline) చేస్తాయి.
09:07 ముందుగా EDUCATION DETAILS(ఎజుకేషన్ డీటేల్స్) హెడ్డింగ్ ఎంపిక చేసుకుందాం .
09:11 టెక్స్ట్ ను బోల్డ్ చేయడానికి Bold(బోల్డ్) ఐకాన్ పై క్లిక్ చేద్దాం.
09:15 ఎంపిక చేసుకు న్న టెక్స్ట్ బోల్డ్ అవ్వడం గమనించండి.
09:19 ఇదే విధముగా, Italic(ఐట్యాలిక్) ఐకాన్ పై క్లిక్ చేస్తే టెక్స్ట్ ఐట్యాలిక్ లో మారుతుంది.
09:25 Underline పై క్లిక్ చేయండి.
09:26 Underline(అండర్లైన్) ఐకాన్ పై క్లిక్ చేయడం ద్వారా టెక్స్ట్ అండర్లైన్ అవుతుంది.
09:31 ఎంపిక చేసుకున్న టెక్స్ట్ అండర్లైన్ అవ్వడం గమనించండి.
09:35 హెడ్డింగ్ ను bold(బోల్డ్) మరియు underline(అండర్లైన్) చేయడానికి, italic(ఐట్యాలిక్) ఎంపిక పై క్లిక్ చేసి దాని ఎంపిక రద్దు చేసి, మిగతా రెండు ఎంపికలను ఎంపిక చేసుకోండి.
09:45 అందువల్ల హెడ్డింగ్ బోల్డ్ మరియు అండర్లైన్ చేయబడింది.
09:50 లైబ్ర్ ఆఫీస్ రైటర్ గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
09:55 సంగ్రహముగా చెప్పాలంటే మనం నేర్చుకున్నది:
09:57 రైటర్ లో టెక్స్ట్ ను సమరేఖలోనికి తెచ్చుట.
10:00 బులెట్స్ మరియు నంబరింగ్.
10:02 రైటర్ లో కట్, కాపీ మరియు పేస్ట్ ఎంపికలు.
10:05 బోల్డ్, అండర్లైన్ మరియు ఐట్యాలిక్స్ ఎంపికలు.
10:09 రైటర్ లో ఫాంట్ నేమ్,ఫాంట్ సైజ్ , మరియు ఫాంట్ కలర్.
10:13 కాంప్రెహెన్సివ్ అసైన్మెంట్.
10:16 బుల్లెట్స్ మరియు నంబరింగ్ లను సక్రియం చేయుట.
10:18 ఒక స్టైల్ ఎంపిక చేసుకొని కొన్ని అంశాలను వ్రాయండి.
10:22 కొంత టెక్స్ట్ ను ఎంపిక చేసుకొని దాని ఫాంట్ నేమ్(font name) ను Free Sans మరియు ఫాంట్ సైజ్ (font size) 16 కు మార్చండి
10:29 టెక్స్ట్ ను Italics(ఐట్యాలిక్స్ ) కు మార్చండి.
10:32 ఫాంట్ కలర్ ఎరుపు కు మార్చండి.
10:35 ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
10:38 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది
10:41 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు
10:46 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాచేయండిజెక్ట్ టీం స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది
10:52 ఆన్లైన్ పరీక్షలో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది
10:55 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial. org(కాంట్యాక్ట్ అట్ ద రేట్ స్పోకన్ హై ఫెన్ ట్యూటోరియల్ డాట్ ఆర్గ్)కువ్రాసిసంప్రదించండి.
11:02 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
11:06 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
11:14 ఈ మిషన్ గురించి
11:18 http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది .
11:25 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. ధన్యవాదములు.

Contributors and Content Editors

Chaithaya, Madhurig