LibreOffice-Suite-Math/C2/Using-Greek-characters-Brackets-Steps-to-Solve-Quadratic-Equation/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:00 | లిబ్రేఆఫీస్ మాథ్ పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము. |
00:04 | ఈ ట్యుటోరియల్ లో మనము ఈ క్రింది అంశములు నేర్చుకుంటాము. |
00:08 | ఆల్ఫా, బీటా, తీటా మరియు పై వంటి గ్రీక్ కారెక్టర్లను వాడడము, |
00:15 | ఒక క్వాడ్రాటిక్ సమీకరణమును సాధించడము కొరకు బ్రాకెట్లను వినియోగించడము, |
00:21 | Math ను వినియోగించి గ్రీక్ కారెక్టర్లను ఎలా వ్రాయాలో ఇప్పుడు నేర్చుకుందాము. |
00:26 | దీని కొరకు మనము ఇంతక్రితము ట్యుటోరియల్ లో క్రియేట్ చేసిన MathExample1.odt అనే Writer డాక్యుమెంట్ లో మన ఉదాహరణను ఓపెన్ చేద్దాము. |
00:41 | మనము వ్రాసిన ఫార్ములాలు ఉన్న గ్రే బాక్స్ పైన డబుల్ క్లిక్ చేయండి. |
00:47 | దీని వలన మనకు Math Formula Editor మరియు Elements window లు అందుబాటులోకి వస్తాయి. |
00:54 | Formula Editor ఫ్లోట్ అవ్వడము కొరకు దాని బోర్డర్ పైన క్లిక్ చేయండి మరియు దానిని కుడి వైపున డ్రాగ్ చేయండి. |
01:02 | ఇది Writer window చక్కగా కనిపించేలా పెద్దగా చేస్తుంది. |
01:07 | ఆల్ఫా, బీటా, తీటా మరియు పై వంటి సాధారణముగా ఉండే గ్రీక్ కారెక్టర్లను ఉదాహరణకు తీసుకోండి. |
01:16 | కానీ మనము ఈ కారెక్టర్లను Elements window లో కనుగోనలేము. |
01:21 | ఒక పర్సంటేజ్ సైన్ ప్రక్కన ఆ కారెక్టర్ యొక్క పేరును ఇంగ్లీష్ లో వ్రాయడము ద్వారా మనము వాటిని సూటిగా వ్రాయవచ్చు. |
01:30 | ఉదాహరణకు పై ను వ్రాయడము కొరకు మనము Formula Editor లో కేవలము %pi అని టైప్ చేస్తే చాలు. |
01:41 | ఒక లోయర్ కేస్ కారెక్టర్ ను వ్రాయడము కొరకు ఆ కారెక్టర్ యొక్క పేరును లోయర్ కేస్ లెటర్లలో వ్రాయండి. |
01:47 | ఉదాహరణకు ఆల్ఫా ను లోయర్ కేస్ లో వ్రాయడము కొరకు %alpha or %beta అని టైప్ చేయండి. |
01:59 | ఒక అప్పర్ కేస్ కారెక్టర్ ను వ్రాయడము కొరకు ఆ కారెక్టర్ పేరు ను అప్పర్ కేస్ లో వ్రాయండి. |
02:06 | ఉదాహరణకు గామా అని అప్పర్ కేస్ లో వ్రాయడము కొరకు %GAMMA లేదా %THETA అని టైపు చేయండి. |
02:17 | గ్రీకు కారెక్టర్లను ఎంటర్ చేయడము కొరకు మరొక మార్గము Tools మెనూ లోని Catalog ను వాడడము. |
02:26 | Symbol set క్రింద Greek అని ఎంచుకోండి |
02:31 | మరియు లిస్ట్ నుంచి ఒక గ్రీక్ లెటర్ పైన డబుల్ క్లిక్ చేయండి. |
02:35 | క్రింద లిస్ట్ లో డిస్ప్లే చేసిన విధముగా గ్రీక్ లెటర్ యొక్క మార్క్ అప్ alpha అని గమనించండి. |
02:43 | కనుక ఒక ఫార్ములా లో ఇలా మనము గ్రీక్ కారెక్టర్లను పెట్టగలుగుతాము. |
02:49 | ఇతర గ్రీకు కారెక్టర్ల మార్క్ అప్ ను తెలుసుకోవడము కొరకు Symbols Catalogను చూడండి |
02:56 | మన ఫార్ములా లలో బ్రాకెట్లను ఎలా వాడలో ఇప్పుడు నేర్చుకుందాము. |
03:01 | ఒక ఫార్ములా లోని ఆపరేషన్ ఆర్డర్ గురించి మాథ్ కు తెలియదు. |
03:07 | కనుక ఆ ఆపరేషన్ ఆర్డర్ గురించి తెలపడము కొరకు మనము బ్రాకెట్లను వాడవలసి ఉంటుంది. |
03:13 | ఉదాహరణకు, మనము ఫస్ట్ యాడ్ x అండ్ y, దెన్ డివైడ్ 5 బై ది రిజల్ట్? అనే దానిని ఎలా వ్రాస్తాము. |
03:22 | మనము 5 ఓవర్ x + y అని టైప్ చేయవచ్చు. |
03:28 | ఇప్పుడు మనము నిజముగా వ్రాయాలి అనుకున్నది ఇదేనా? |
03:32 | కాదు, మనము x మరియు y లను ముందుగా కలపాలి అని అనుకున్నాము మరియు x మరియు y ల చుట్టూ కర్లీ బ్రాకెట్లను పెట్టడము ద్వారా మనము అలా చేయవచ్చు. |
03:44 | మరియు మార్క్ అప్: 5 ఓవర్ x+yఇన్ కర్లీ బ్రాకెట్స్ గా కనిపిస్తుంది |
03:52 | కనుక ఒక ఫార్ములా లో ఆపరేషన్ యొక్క ఆర్డర్ ను సెట్ చేయడములో కర్లీ బ్రాకెట్లు ఉపయోగపడతాయి. |
03:58 | పైన ఉన్న File మెనూ లో Save ను ఎంచుకోవడము ద్వారా మనము మన పనిని సేవ్ చేసుకోవచ్చు. |
04:08 | ఇప్పుడు ఒక క్వాడ్రాటిక్ సమీకరణమును సాధించడములో ఉన్న స్టెప్ లను వ్రాద్దాము. |
04:13 | Control + Enter ను ప్రెస్ చేయడము ద్వారా Writer document లో మరొక క్రొత్త పేజీ కు మనము వెళ్ళగలము. |
04:21 | అక్కడ Solving a Quadratic Equation అని టైప్ చేయండి. |
04:25 | మరియు Insert>Object>Formula menu ల ద్వారా మాథ్ ను కాల్ చేయండి. |
04:33 | నేను ఇప్పటికే క్వాడ్రాటిక్ సమీకరణములను టైప్ చేసి ఉంచాను. సమయము ఆదా చేయడము కొరకు నేను వాటి కట్ చేసి పేస్ట్ చేస్తాను. |
04:42 | కనుక మనము సాధించవలసిన క్వాడ్రాటిక్ సమీకరణము ఇలా ఉన్నది x స్క్వేర్డ్ - 7 x + 3 = 0 |
04:53 | దీనిని సాధించడము కొరకు స్క్రీన్ మీద చూపిన విధముగా మనము క్వాడ్రాటిక్ ఫార్ములాను మనము వాడవచ్చు: |
04:59 | 04:59 ఇక్కడ a x స్క్వేర్డ్ టర్మ్ యొక్క కోఎఫిషియెంట్, b x టర్మ్ యొక్క కోఎఫిషియెంట్ మరియు c స్థిర రాసి. |
05:11 | మరియు ఫార్ములాలో a స్థానములో 1 ని , - b స్థానములో -7 ను మరియు c స్థానములో 3 ను ప్రతిక్షేపించడము ద్వారా సమీకరణమును మనము సాధించవచ్చు. |
05:23 | కనుక మనము సాధించాలి అని అనుకున్న క్వాడ్రాటిక్ సమీకరణము యొక్క మార్క్ అప్ ను ముందుగా వ్రాద్దాము. |
05:30 | ముందుగా మనము Insert>Object>Formula menu నుంచి Math ను కాల్ చేద్దాము. |
05:39 | Format Editor విండో లో మార్క్ అప్ ను ఇలా తీసుకుందాము: |
05:46 | x స్క్వేర్డ్ మైనస్ 7 x ప్లస్ 3 = 0 |
05:53 | చక్కగా చదవడము కోసము బ్లాంక్ లైన్ల కొరకు రెండు న్యూ లైన్ లను వ్రాద్దాము. |
06:01 | ఎంటర్ ను ప్రెస్ చేయండి మరియు Quadratic Formula అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. |
06:07 | క్లిష్టమైన ఫార్ములా ను అన్నిటికంటే లోపల ఉన్న ఎలిమెంట్లతో మొదలు పెట్టి విడగొట్టి సాధించడము అనేది చక్కని అభ్యాసముగా గుర్తింపబడుతుంది. |
06:16 | ఆ తరువాత మనము ఈ ఎలిమెంట్స్ తో పని చేయవచ్చు. |
06:21 | కనుక మనము అన్నిటికంటే లోపల ఉన్న స్క్వేర్ రూట్ ఫంక్షన్ ను ముందుగా వ్రాద్దాము. |
06:27 | మరియు మార్క్ అప్ కర్లీ బ్రాకెట్ లలో స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్డ్ - 4ac గా ఉంటుంది. |
06:37 | ఆ తరువాత మనము మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ ను పై ఎక్స్ప్రెషన్ కు కలుపుతాము మరియు వాటిని కర్లీ బ్రాకెట్లలో పెడతాము. |
06:48 | మరొక జత కర్లీ బ్రాకెట్లను జత చేయడము ద్వారా మనము పై ఎక్స్ప్రెషన్ ను హారముగా చేస్తాము. |
06:57 | ఓవర్ 2aను ఎక్స్ప్రెషన్ కు కలపండి. |
07:02 | మరియు చివరగా x ఈక్వల్స్ ను మొదటిలో కలపండి. |
07:08 | ఈక్వల్ టు సింబల్ కు రెండు వైపులా రెండు లాంగ్ గాప్ లు కూడా ఉంచండి. |
07:13 | మరియు మనకు కావలసిన క్వాడ్రాటిక్ ఫార్ములా ఇక్కడ ఉన్నది. |
07:16 | ఇలా క్లిష్టమైన ఫార్ములాను మనము విడగొట్టి ఒక్కో భాగముగా నిర్మిస్తాము. |
07:22 | ఆ తరువాత Formula Editor window లో మిగిలిన టెక్స్ట్ ను ఇలా టైప్ చేయండి: |
07:29 | ఇక్కడ aఅనేది x స్క్వేర్డ్ టర్మ్ యొక్క కోఎఫిషియెంట్, b x పదము యొక్క కోఎఫిషియెంట్, c స్థిర రాశి, దీని తరువాత ఒక క్రొత్త లైన్ ను ఇవ్వాలి. |
07:43 | మరియు స్థానములో 1 ని, b స్థానములో -7 ను మరియు c స్థానములో 3 ను ప్రతిక్షేపించడము ద్వారా మనము సమీకరణమును సాధించవచ్చు, దీనికి తోడుగా ప్రక్కన రెండు న్యూ లైన్లు కూడా ఇవ్వాలి. |
07:59 | ప్రతిక్షేపించిన తరువాత మార్క్ స్క్రీన్ మీద చూపిన విధముగా ఉంటుంది: |
08:05 | కనుక మనము సమీకరణములో సంఖ్యలను పెరాంథసిస్ ను వాడి ప్రతిక్షేపించాము. |
08:12 | ఒకే మీ కొరకు ఇక్కడ ఒక ఎసైన్మెంట్ ఉన్నది. |
08:15 | పై క్వాడ్రాటిక్ సమీకరణము సాధించడములో మిగిలిన స్టెప్ లను పూర్తి చేయండి. |
08:20 | రెండు ఫలితములను విడి విడిగా ప్రదర్శించండి. |
08:23 | ఎలైన్మెంట్ మరియు స్పేసింగ్ లను మార్చడము ద్వారా స్టెప్ లను ఫార్మాట్ చేయండి. |
08:28 | ఎక్కడ ఎక్కడ అవసరము అయితే అక్కడ అక్కడ long gaps ను మరియు క్రొత్త లైన్ లను యాడ్ చేయండి. |
08:33 | ఈ క్రింది ఫార్ములా ను వ్రాయండి. pi ఈజ్ సిమిలర్ ఆర్ ఈక్వల్ టు 3.14159 |
08:42 | దీనితో మనము గ్రీక్ కారెక్టర్స్ , బ్రాకెట్స్ మరియు ఈక్వేషన్స్ ఇన్ లిబ్రేఆఫీస్ మాథ్ అనే ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
08:52 | సంగ్రహముగా చెప్పాలి అంటే మనము ఈ క్రింది అంశములు నేర్చుకున్నాము: |
08:56 | ఆల్ఫా, బీటా, తీటా మరియు పై వంటి గ్రీక్ కారెక్టర్లను వాడడము |
09:01 | ఒక క్వాడ్రాటిక్ సమీకరణమును బ్రాకెట్లు సాధించడము కొరకు స్టెప్ లను వ్రాయడము |
09:07 | ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము |
09:12 | దీనికి ICT, MHRD భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది |
09:20 | http://spoken-tutorial.org. ఈ ప్రాజెక్ట్ కు సహకారము అందిస్తున్నది. |
09:24 | మరింత సమాచారము కొరకు http://spoken-tutorial.org/NMEICT-Intro. లింక్ ను చూడండి. |
09:29 | ఈ రచనకు సహాయపడినవారు లక్ష్మి, మరియు నిఖిల. ఇంక విరమిస్తున్నాము. |
09:38 | మాతో కలిసినందుకు కృతజ్ఞతలు. |