LibreOffice-Suite-Math/C2/Matrices-Aligning-Equations/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 లిబ్రేఆఫీస్ మాథ్ పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము
00:04 ఈ ట్యుటోరియల్ లో ఒక మాత్రికను ఎలా వ్రాస్తారో మీరు నేర్చుకుంటారు.
00:08 మరియు ఒక ప్రత్యేకమైన కారెక్టర్ మీద ఆధారపడి సమీకరణములను ఎలైన్ చేస్తారు.
00:12 దీని కొరకు మనము ఇంతక్రితము ట్యుటోరియల్ లో క్రియేట్ చేసిన MathExample1.odt అనే Writer డాక్యుమెంట్ లో మన ఉదాహరణను ఓపెన్ చేద్దాము.
00:25 మనము Math ను వాడి ఇంతకు పూర్వము వ్రాసిన ఉదాహరణ formulae లను గమనించండి.
00:30 ఇక్కడ ఇప్పుడు మనము డాక్యుమెంట్ యొక్క చివరి పేజీకు స్క్రోల్ అవుదాము మరియు ఒక క్రొత్త పేజీ కు వెళ్లడము కొరకు Control Enter ను ప్రెస్ చేద్దాము.
00:39 ఇప్పుడు Insert మెనూ ను, ఆ తరువాత Object మరియు Formula లను ప్రెస్ చేయడము ద్వారా Math ను కాల్ చేయండి.
00:49 గణిత శాస్త్రములో ఒక మాత్రిక అనేది ఎలిమెంట్స్ అని పిలవబడే సంఖ్యలు లేదా చిహ్నములను కలిగి ఉన్న ఒక చతురస్ర యారే.
00:59 ఒక మాత్రిక మరియు ఎలిమెంట్ ల రో లు మరియు కాలమ్ లను చూపడము కొరకు ఒక ప్రత్యేకమైన మార్క్ అప్ ను Math కలిగి ఉంటుంది.
01:08 సమయము ఆదా చేయడము కొరకు నా వద్ద కొన్ని అంతకు ముందే వ్రాయబడిన కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. నేను వాటిని కాపీ చేసి పేస్ట్ చేస్తాను.
01:24 ఈ మాత్రిక 2 రో లు మరియు 3 కాలమ్ లను కలిగి ఉంటుంది.
01:29 మనము ‘Matrix’ అనే మార్క్ అప్ ను వాడతాము మరియు Formula Editor window లో కర్లీ బ్రాకెట్లలో దాని యొక్క ఎలిమెంట్ లను ఉంచుతాము.
01:40 ఒక రో లోని ఎలిమెంట్లు అన్నీ ఒక హాష్ సింబల్ తో విడగొట్టబడ్డాయి అని గమనించండి.
01:48 మరియు రో లు రెండు హాష్ సింబల్ లతో విడగొట్టబడతాయి.
01:55 మాత్రిక ను బ్రాకెట్ లలో ఉంచడము కొరకు పెరాన్థసిస్ ను వాడండి.
02:01 ఇప్పుడు, బ్రాకెట్లు చిన్నగా ఉన్నాయి అని మరియు అవి మాత్రిక లోని అన్ని ఎలిమెంట్లను పూర్తిగా కప్పడము లేదు అని గమనించండి.
02:12 అవి ప్రతి ఒక్కటి ఎలిమెంట్ తో సమానము అయిన సైజ్ లో ఉన్నాయి మరియు అందువలన మాత్రిక యొక్క సైజులో సరిపోదు.
02:22 దీనిని సాధించడము కొరకు మనము Left మరియు Right అనే పదములను వాడవచ్చు.
02:28 బ్రాకెట్ లను స్కేలబుల్ అయ్యేలా చేయడము కొరకు అది బ్రాకెట్ ఓపెన్ అవ్వడానికి కొంచెం ముందు ఎడమ వైపు మరియు బ్రాకెట్ క్లోజ్ అవ్వడమునకు ముందుగా కుడి వైపు ఉండాలి.
02:41 నన్ను ఆ తరువాతి ఉదాహరణను కాపీ చేసి పేస్ట్ చేయనివ్వండి.
02:46 కనుక a 4 బై 1 మాత్రిక ఇక్కడ స్క్రీన్ మీద చూపిన విధముగా ఉంటుంది.
02:52 Writer గ్రే బాక్స్ లో స్కేలబుల్ బ్రాకెట్ లను గమనించండి.
02:57 మాత్రిక యొక్క మార్క్ అప్ స్క్రీన్ మీద చూపించబడినది.
03:03 ఇక్కడ పెరాన్థసిస్ కు బదులుగా మనము స్క్వేర్ బ్రాకెట్ లను కూడా వాడవచ్చు.
03:09 కనుక matrix mark up ను వాడి మనము ఏ డైమెన్షన్ ఉన్న మాత్రికను అయినా సరే వ్రాయవచ్చు.
03:17 ఇప్పుడు మాత్రిక కూడిక కొరకు ఒక ఉదాహరణను వ్రాద్దాము.
03:23 Formula Editor Window లో ఒక క్రొత్త లైన్ కు వెళదాము.
03:28 మనము Enter కీ ను రెండుసార్లు ప్రెస్ చేయడము ద్వారా రెండు ఖాళీ లైన్ లను యాడ్ చేయవచ్చు.
03:36 ముందుగా స్క్రీన్ మీద చూపిన విధముగా రెండు 2 బై 3 మాత్రికలను ఒకదాని ప్రక్కన ఒకటి వ్రాయండి.
03:46 ఆ తరువాత కూడికను సూచించడము కొరకు రెండు మాత్రికల మధ్య ఒక ప్లస్ సింబల్ ను యాడ్ చేయండి.
03:54 ఇలా చేయడము కొరకు మనము Writer Gray box లోని రెండు మాత్రికల మధ్య ఉన్న ఖాళీ లో క్లిక్ చేయవచ్చు.
04:03 Formula Editor Window లోని కర్సర్ రెండు మాత్రికల మార్క్ అప్ ల మధ్య ఉన్నది అన్న విషయమును గమనించండి.
04:12 ఈ రెండు మాత్రికల మధ్య ప్లస్ ను టైప్ చేయండి.
04:17 కనుక అక్కడ ప్లస్ సింబల్ వచ్చింది
04:20 ఆ తరువాత లాంగ్ గాప్స్ తరువాత ఈక్వల్ టు సింబల్ ను యాడ్ చేద్దాము.
04:28 మరియు కూడికను సూచిస్తూ కుడి వైపున మూడవ మాత్రికను యాడ్ చేద్దాము.
04:35 మన ఉదాహరణలో మనము గ్రీక్ కారెక్టర్లను వాడిన సంగతి గమనించండి.
04:42 కనుక రెండు మాత్రికల కూడిక యొక్క ఫలితము అక్కడ ఉన్నది.
04:47 మన పనిని సేవ్ చేసుకుందాము.
04:51 ఆ తరువాత ఒక సంఖ్యతో ఒక మాత్రికను గుణించే ఒక ఉదాహరణను చూద్దాము.
04:58 మనము ఒక 2 బై 3 మాత్రిక ను వ్రాద్దాము మరియు దానిని 4 తో గుణిద్దాము.
05:04 మనము ముందుగా మాత్రిక ముందు 4 టైమ్స్ అని వ్రాద్దాము.
05:10 నన్ను మాత్రికను కాపీ చేసి దానిని FEW లో పేస్ట్ చేయనివ్వండి.
05:17 ఆ తరువాత లాంగ్ గాప్స్ చివరలో ఈక్వల్ టు సింబల్ ను వ్రాద్దాము.
05:24 మాత్రికల లబ్దమును అనుసరిస్తూ నేను మాత్రిక లబ్దమునకు మార్క్ అప్ ను కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను.
05:33 కనుక, ఒక 2 బై 3 మాత్రిక ను ఒక సంఖ్యతో గుణిస్తే వచ్చే లబ్దము అక్కడ ఉన్నది.
05:40 ఇప్పుడు Format మెనూ పైన క్లిక్ చేసి మరియు font, font sizes, ఎలైన్మెంట్ లేదా స్పేసింగ్ ను ఎంచుకోవడము ద్వారా మనము మాత్రికలను ఫార్మాట్ చేయవచ్చు.
05:51 ఉదాహరణకు, స్పేసింగ్ ను ఎంచుకుందాము.
05:55 కుడి వైపున ఉన్న category డ్రాప్ డౌన్ లో మాత్రికలను ఎంచుకుందాము.
06:02 మరియు లైన్ స్పేసింగ్ ను 20 శాతమునకు మరియు కాలమ్ స్పేసింగ్ ను 50 శాతమునకు మార్చండి మరియు OK పైన క్లిక్ చేయండి.
06:17 మాత్రికలు మరియు వాటి ఎలిమెంట్లు ఎలా చక్కగా పెట్టబడ్డాయో గమనించండి.
06:23 ఇప్పుడు File మరియు Save పైన క్లిక్ చేయడము ద్వారా మన పనిని సేవ్ చేసుకుందాము.
06:29 ఇప్పుడు, మనము రెండు లేదా మూడు సమీకరణములను వ్రాయడము మరియు ఒక ప్రత్యేకమైన కారెక్టర్ మీద ఆధారపడి వాటిని ఎలైన్ చేయడము కూడా మాత్రికలు వాడి చేయవచ్చు.
06:37 ఉదాహరణకు, మనము సైమల్టేనియస్ సమీకరణములను వ్రాయవచ్చు మరియు వాటిని ఈక్వల్ టుకారెక్టర్మీదఆధారపడిఎలైన్చేయవచ్చు.
06:46 ఇప్పుడు స్క్రీన్ మీద చూపిన విధముగా ఒక సైమల్టేనియస్ సమీకరణముల సెట్ ను వ్రాద్దాము.
06:52 అవి ఈక్వల్ టు కారెక్టర్ పైన ఖచ్చితముగా ఎలైన్ చేయబడలేదు అన్న విషయమును గమనించండి.
06:58 కనుక, వాటిని ఎలైన్ చేయడము కొరకు మాట్రిక్స్ మార్క్ అప్ ను వాడండి.
07:03 మనము సమీకరణములోని ప్రతి భాగమును విడిగా తీసుకోవచ్చు మరియు ఆయా భాగములను ఒక మాత్రిక యొక్క ఎలిమెంట్లుగా భావించవచ్చు.
07:10 ఇక్కడ 2x ఒక భాగము, y ఒక భాగము, ఈక్వల్ టు కారెక్టర్ ఒక భాగము.
07:20 ఎంటర్ ను రెండుసార్లు ప్రెస్ చేయండి. మార్క్ అప్ ను కాపీ పేస్ట్ చేయండి.
07:26 మరియు క్రొత్త మార్క్ అప్ స్క్రీన్ మీద చూపిన విధముగా కనిపిస్తుంది.
07:31 ఇక్కడమనము మాట్రిక్స్ మార్క్ అప్ ను వాడాము, సమీకరణము యొక్క ప్రతి భాగమును ఒక ఎలిమెంట్ గా భావించాము మరియు వాటిని # సింబల్ లతో విడగొట్టాము.
07:43 రెండు సమీకరణములను విడగొట్టడము కొరకు మనము రెండు హాష్ సింబల్ లను వాడాము.
07:50 కనుక అవి చక్కగా ఎలైన్ చేయబడిన సమీకరణముల సెట్ అవుతాయి.
07:56 ఇప్పుడు మరొక సమీకరణముల సెట్ ను వ్రాద్దాము.
07:59 ఇక్కడ ఈక్వల్ టు కారెక్టర్ యొక్క ఎడమ మరియు కుడి వైపుల మనకు సమానమైన సంఖ్యలో భాగములు లేవు అని ఇప్పుడు మనము ఊహిద్దాము.
08:09 స్క్రీన్ మీద ఉన్న సమీకరణములను గమనించండి మరియు అవి ఈక్వల్ టు కారెక్టర్ పైన ఎలైన్ చేయబడి లేవు.
08:16 ఇప్పుడు వాటిని ఎలైన్ చేయడము కొరకు మార్క్ అప్ ను తిరిగి వ్రాద్దాము. ఎంటర్ ను రెండుసార్లు ప్రెస్ చేయండి. నేను మార్క్ అప్ ను కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను.
08:25 కనుక ఇక్కడ ఈక్వల్ టు కారెక్టర్ యొక్క కుడి మరియు ఎడమ వైపు భాగములను ఎలైన్ చేయడము కొరకు మనము ఎలైన్ r మరియు ఎలైన్ l లను వాడాము.
08:36 మరియు అక్కడ మనము చక్కగా ఎలైన్ చేసిన సమీకరణముల సెట్ ఉన్నది.
08:41 ఇది మీరు చేయవలసిన ఎసైన్మెంట్:
08:43 ఒక 2x3 మాత్రిక బై ఒక 3x1 మాత్రిక యొక్క గుణకారమునకు స్టెప్ లను వ్రాయండి. fonts, sizes మరియు స్పేసింగ్ ను మార్చడము కొరకు ఫార్మాటింగ్ ను వాడండి.
08:56 మూడు సమీకరణముల ఒక సెట్ ను వ్రాయండి. సమీకరణములను ఈక్వల్ టు కారెక్టర్ మీద ఎలైన్ చేయండి.
09:04 దీనితో మనము మాట్రిక్స్ మరియు లిబ్రేఆఫీస్ మాథ్ లో సమీకరణములను ఎలైన్ చేయడము అనే ట్యుటోరియల్ చివరకు వచ్చేసాము.
09:11 సంగ్రహముగా చెప్పాలి అంటే మనము ఈ క్రింది అంశములను నేర్చుకున్నాము:
09:15 ఒక మాత్రికను వ్రాయడము మరియు ఒక ప్రత్యేకమైన కారెక్టర్ మీద ఆధారపడి సమీకరణములను ఎలైన్ చేయడము
09:20 ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము, దీనికి ICT, MHRD భారత ప్రభుత్వముద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది
09:32 http://spoken-tutorial.org. ఈ ప్రాజెక్ట్ కు సహకారము అందిస్తున్నది.
09:37 మరింత సమాచారము కొరకు http://spoken-tutorial.org/NMEICT-Intro. లింక్ ను చూడండి.
09:40 ఈ రచనకు సహాయపడినవారు లక్ష్మి, మరియు నిఖిల. ఇంక విరమిస్తున్నాము.
09:50 మాతో కలిసినందుకు కృతజ్ఞతలు.

Contributors and Content Editors

Sneha, Yogananda.india