LibreOffice-Suite-Draw/C4/Working-with-3D-objects/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | లిబరే ఆఫీసు డ్రా లో 3D ఆబ్జెక్ట్స్ (3D Objects in LibreOffice Draw)పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకునేది, ఈ కింది ఎంపికలను వాడి 3D ఆబ్జెక్ట్ ల ను ఎలా సృష్టించడం
ఎక్స్ట్రుషన్(Extrusion), 3D టూల్బార్(3D Toolbar), 3D రొటేషన్ ఆబ్జెక్ట్(3D Rotation Object). |
00:16 | ఆబ్జెక్ట్స్ ను ఎడిట్(edit) చేయడం, 3D ఎఫెక్ట్స్(ప్రభావాలు) అప్లై చేయడం మరియు డుప్లికేషన్ (Duplication) వాడి ప్రత్యేక ప్రభావాలు (special effects) సృష్టించడం నేర్చుకుంటారు. |
00:24 | ఈ ట్యుటోరియల్ ను ఉపయోగించడానికి, మీకు డ్రా(Draw)లో బేసిక్ మరియు ఇంటర్మీడియట్ స్థాయి ట్యుటోరియల్స్ తెలిసి ఉండాలి. |
00:30 | ఇక్కడ, మనం ఉపయోగిస్తున్నది ఉబుం టు లినక్సు వర్షన్ 10.04 మరియు , లిబరే ఆఫీసు సూట్ వర్షన్ 3.3.4 |
00:40 | ఒక 2D ఆకారం మరియు దానితో సమానమైన 3D రూపం చూపే జామెట్రీ చార్ట్ సృష్టిద్దాం. ఉదాహరణకు, ఒక చదరం 2D ఆబ్జెక్ట్ మరియు ఒక ఘనం దాని 3D రూపం. |
00:53 | 3D ఆబ్జెక్ట్స్ చార్ట్(3DObjectsChart) అనే పేరు గల ఒక కొత్త డ్రా(Draw) ఫైల్ ఇక్కడ వుంది. |
00:59 | మనం డ్రాయింగ్ ప్రారంభించడానికి ముందు, గ్రిడ్స్(grids) మరియు గైడ్ లైన్స్(guidelines) ఎనేబుల్ చేద్దాం. మీరు మునుపటి ట్యుటోరియల్స్ లో దీని గురించి తెలుసుకున్నారు. |
01:08 | మెయిన్ మెనూ(Main menu) నుండి వ్యూ(View) క్లిక్ చేయండి, గ్రిడ్(Grid) మరియు డిస్ప్లే గ్రిడ్(Display Grid) ఎంచుకోండి. |
01:17 | మళ్ళీ వ్యూ(View) క్లిక్ చేసి, గైడ్స్(Guides) మరియు డిస్ప్లే గైడ్స్ (Display Guides) ఎంచుకోండి. |
01:23 | నేను రెండు రులర్స్ ను సెంటీమీటర్కు సెట్ చేయాలనుకుంటున్నాను. |
01:29 | మౌస్ పాయింటర్(mouse pointer)ను హారిజాంటల్ రులర్ పై ఉంచండి. ఇప్పుడు, రైట్-క్లిక్ చేసి సెంటీమీటర్(Centimeter) ఎంచుకోండి. |
01:38 | మౌస్ పాయింటర్(mouse pointer)ను వర్టికల్ రూలర్ పై ఉంచండి. మళ్ళీ, రైట్-క్లిక్ చేసి, సెంటీమీటర్(Centimeter) ఎంచుకోండి. |
01:45 | ఇప్పుడు పేజీ(page) పైన టెక్స్ట్ బాక్స్ డ్రా చేద్దాం. |
01:49 | దీని లోపల టెక్స్ట్ జామేట్రిక్ షేప్స్ ఇన్ 2D అండ్ 3D(Geometric shapes in 2D and 3D) అని ప్రవేశ పెడదాం. |
01:55 | మనం ఒక స్నాప్ లైన్(snap line) ఉపయోగించి పేజీ(page)ని రెండు నిలువు భాగాలుగా విభజిద్దాం. |
02:01 | నిలువు రూలర్ మీద క్లిక్ చేసి, దాన్ని డ్రా పేజీ(Draw page)కి లాగండి. |
02:05 | ఒక నిలువెత్తు చుక్కల రేఖ కనిపిస్తుంది. |
02:08 | పేజీ రెండు భాగాలుగా విభజించబడేలా పేజీలో చుక్కల రేఖ పెట్టండి. |
02:14 | ఎడమ వైపు ఒక టెక్స్ట్ బాక్స్ ఇన్సర్ట్ చేసి, దాని లోపల 2D షేప్స్ (Shapes) టైప్ చేయండి. |
02:23 | కుడి వైపున ఇంకో టెక్స్ట్-బాక్స్ డ్రా చేసి, దాని లోపల 3D షేప్స్(3D Shapes) అని టైప్ చేయండి. |
02:30 | మనం 3D టూల్బార్స్(toolbars) ఎనేబ్ల్ చేద్దాం. |
02:33 | మెయిన్ మెనూ(Main menu) నుండి, వ్యూ(View) క్లిక్ చేసి, టూల్బార్స్(Toolbars) మరియు 3D-ఆబ్జెక్ట్స్ (3D-Objects) ఎంపిక చేయండి. |
02:43 | మళ్ళీ, వ్యూ(View) క్లిక్ చేసి, టూల్బార్స్(Toolbars) మరియు 3D-సెట్టింగ్స్(3D-settings) ఎంపిక చేయండి. |
02:53 | 3D-ఆబ్జెక్ట్స్ (3D-Objects) మరియు 3D-సెట్టింగ్స్(3D-settings) టూల్ -బాక్స లు కనిపిస్తాయి. |
03:02 | మొదటా 2D షేప్స్(2D shapes) గీద్దాం. |
03:05 | మనం ఒక దీర్ఘ చతురస్రం, ఒక చదరo,ఒక వృత్తం మరియు ఒక త్రిభుజం డ్రా చేసి మరియు వాటిని ఒక దాని క్రింద మరొకటి పెడుదాం. |
03:14 | ఒక 2D ఆబ్జెక్ట్ను(object) ఉపయోగించి, ఒక 3D ఆబ్జెక్ట్(object)ను పొందే పద్ధతిని, ఎక్స్ట్రుషన్(Extrusion) అంటారు. |
03:19 | సాధారణంగా, 3D ఆబ్జెక్ట్(object) సృష్టించడానికి ఉపరిభాగం అనగా సర్ఫేస్ బయటికి కదులుతుంది. |
03:25 | ముందుగా మనం దీర్ఘచతురస్రo యొక్క రంగు టర్కాయిస్ 1( Turquoise 1)కు మారుద్దాం. |
03:31 | దీర్ఘ చతురస్రం యొక్క ఒక కాపీని తయారు చేద్దాము. |
03:35 | కాపీ చేసిన దీర్ఘచతురస్రం లాగి, దానిని పేజీ యొక్క కుడి భాగంలో ఉంచుదాం. |
03:40 | అది ఎంపిక చేసి ఉండగానే, కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం, రైట్ క్లిక్ చేయండి. |
03:45 | ఇప్పుడు, కన్వర్ట్(Convert)పై క్లిక్ చేసి 3D ఎంచుకోండి. |
03:48 | 2D దీర్ఘచతురస్రం ఒక క్యుబాయిడ్(cuboid)గా మార్చబడుతుంది. |
03:52 | దీర్ఘచతురస్ర ఆకారం లోపల రెక్టాన్గల్(Rectangle) అని టైపు చేద్దాం. |
03:55 | అయితే, మనం 3D ఆబ్జెక్ట్స్(objects) లోపల టెక్స్ట్ టైప్ చేయలేం. |
04:00 | టెక్స్ట్ టైప్ చేయడానికి, టెక్స్ట్ టూల్ ఉపయోగించాలి. |
04:04 | టెక్స్ట్ టూల్ పై క్లిక్ చేసి ఘనము లోపల ఒక టెక్స్ట్ బాక్స్ డ్రా చేద్దాం. |
04:10 | దాని లోపల క్యుబాయిడ్(Cuboid) అని టెక్స్ట్ టైప్ చేయండి. |
04:14 | టెక్స్ట్ బాక్స్ మరియు ఘనము(క్యుబాయిడ్(Cuboid)) రెండు ప్రత్యేక ఆబ్జెక్ట్స్ (objects)గా చూడ బడుతాయి. అందువలన, వాటిని సముహ పరుద్దాం. |
04:21 | ఇదేవిధంగా, మనం స్క్వేర్, సర్కిల్ మరియు ట్రయాంగిల్లను 3D ఆబ్జెక్ట్ (objects)లుగా మార్చగలo మరియు వాటికి రంగు వేయగలం. |
04:30 | మనం ఎక్స్ట్రుషన్(Extrusion)ను వాడి 2D మరియు 3D బొమ్మల ఒక చార్ట్ ను సృష్టించాం. |
04:36 | ఈ ట్యుటోరియల్ను ఆపి ఈ అసైన్మెంట్ చేయండి. |
04:40 | మీ డ్రా(Draw) ఫైల్కు ఒక కొత్త పేజీ(page) కలపండి. |
04:42 | ఒక చదరo గీసి, టెక్స్ట్ స్క్వేర్(Square) టైప్ చేయండి. |
04:46 | టెక్స్ట్ తో పాటు చదరoను 3Dకి మార్చండి. |
04:49 | ఈ టెక్స్ట్ ను 2D చదరo టెక్స్ట్ తో పోల్చండి. |
04:53 | సూచన: 3D ఆబ్జెక్ట్స్(objects) రూపొందించడానికి 3D సెట్టింగ్స్ టూల్బార్(Settings toolbar)ను ఉపయోగించండి. |
04:58 | డ్రా (Draw) సిద్ధంగా చేసిపెట్టిన 3D షేప్స్ ను కూడా అందిస్తుంది. |
05:01 | మీరు 3D ఆబ్జెక్ట్స్ టూల్బార్(Objects toolbar)ను ఉపయోగించి ఈ షేప్స్ చేర్చవచ్చు. |
05:09 | డ్రా(Draw) ఫైలు లో ఒక కొత్త పేజీ చేర్చుదాం. |
05:13 | 3D ఆబ్జెక్ట్స్ టూల్బార్(Objects toolbar) నుండి ఒక ఆకారం, షెల్(Shell) ఎంచుకోండి. |
05:18 | తర్వాత పేజీలో డ్రా చేయండి. |
05:24 | మీరు 2D ఆబ్జెక్ట్స్ (Objects) పై బాడీ రొటేషన్ వాడి కూడా 3D ఆబ్జెక్ట్స్ (Objects)ను రూపొందించడానికి డ్రా (Draw) అనుమతిస్తుంది. |
05:33 | డ్రా పేజి(Draw page)లో ఒక 2D ఆకారం, సర్కిల్ డ్రా చేద్దాం. |
05:39 | కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి, కన్వార్ట్(Convert) ఎంచుకోండి. తర్వాత టు 3D రొటేషన్ ఆబ్జెక్ట్(To 3D Rotation Object) ఎంచుకోండి. |
05:47 | సర్కిల్కి ఏమయ్యిందో గమనించండి. ఇది ఇప్పుడు ఒక 3D ఆబ్జెక్ట్(object). |
05:54 | దిగువన వున్న డ్రాయింగ్ టూల్బార్(Drawing toolbar)లో నుండి ఫాంట్ వర్క్ గేలరీ(Fontwork Gallery) ఐకాన్(చిహ్నాo) మీద క్లిక్ చేయండి. |
05:59 | ఫేవరెట్ (Favorite)16 ఎంచుకొని, ఓకే(OK) బటన్పై క్లిక్ చేద్దాము. |
06:04 | మన డ్రా పేజి(Draw page)లో ఫాంట్ వర్క్(Fontwork) టెక్స్ట్ కనిపిస్తుంది. |
06:09 | అవసరమైనట్లు టెక్స్ట్ పరిమాణం మార్చవచ్చు. |
06:12 | ఇప్పుడు, దీని స్థానంలో కొంత ఇతర టెక్స్ట్ మనం కావలనుకోవచ్చు. అది ఎలా చేయాలి? |
06:17 | టెక్స్ట్ ఫాంట్ వర్క్(Fontwork) లోపల డబుల్ క్లిక్ చేయండి. |
06:21 | ఇప్పుడు మీరు నలుపు రంగులో, ఫాంట్ వర్క్(Fontwork) అనే పదం పెద్ద టెక్ట్స్ లో చూడగలరు. |
06:26 | ఈ టెక్స్ట్ ఎంచుకొని మరియు స్పోకెన్ ట్యుటోరియల్స్(Spoken Tutorials) అని టైప్ చేయండి. |
06:30 | ఇప్పుడు, డ్రా పేజీ(Draw page)లో ఎక్కడైనా క్లిక్ చేయండి. |
06:33 | పదాలు స్పోకెన్ ట్యుటోరియల్స్(Spoken Tutorials) పేజీలో చూపబడతాయి. |
06:36 | తర్వాత, 3Dఆబ్జెక్ట్స్(objects)కు ప్రభావాలు(ఎఫెక్ట్స్) ఎలా అప్లై చేయాలో నేర్చుకుందాం. |
06:41 | మన గోళాకార ఆకారంకు ప్రభావాలు (ఎఫెక్ట్స్(effects)) అప్లై చేద్దాం. |
06:44 | కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేయండి. 3D ఎఫెక్ట్స్(3D effects) ఎంచుకోండి. |
06:51 | మీరు ఇక్కడ వివిధ ఎంపికలు చూడగలరు. |
06:57 | డెమో కోసం, డెప్త్(Depth) పెరా మీటర్ 3cmకు మారుద్దాం. |
07:05 | సెగ్మెంట్స్(Segments) కింద హారి జాంటల్(Horizontal)ను 12కు మార్చుదాం. |
07:10 | నార్మల్(Normal) కింద ఫ్లాట్(Flat) ఎంపిక ఎంచుకోండి. |
07:14 | ప్రివ్యూ విండో (preview window)లో ఆబ్జెక్ట్ రూపాన్ని గమనించOడి. |
07:19 | ఇప్పుడు, డైలాగ్ బాక్స్ యొక్క కుడి చేతి మూలలో అసైన్(Assign) చిహ్నాన్ని క్లిక్ చేయండి. |
07:26 | తదుపరి, డైలాగ్ బాక్స్ నుండి నిష్క్రమించడానికి ఎగువ-ఎడమ చేతి మూలలో X గుర్తు మీద క్లిక్ చేయండి. |
07:32 | ఇప్పుడు మీ ఆకారం గమనించOడి . మనం ఎంచుకున్న ప్రభావాలు(effects) దానికి అప్లై చేయబడ్డాయి. |
07:38 | ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ ఉంది. స్లయిడ్ లో చూపినట్టు ఇదే చిత్రాన్ని సృష్టించండి. |
07:45 | ఇందుకోసం 3D ఎఫెక్ట్స్(3D Effects) డైలాగ్-బాక్స్ ఉపయోగించండి. |
07:49 | మీరు 2D మరియు 3D ఆబ్జెక్ట్స్(objects)తో డూప్లికేషన్(Duplication) ఉపయోగించి కుడా ప్రత్యేక ప్రభావాలు(ఎఫెక్ట్స్ (effects)) సృష్టించవచ్చు. |
07:55 | ఒక కొత్త పేజీ(page) సృష్టించి మరియు దాంట్లో ఒక దీర్ఘ చతురస్రం డ్రా చేద్దాం. |
08:00 | 2D రెక్ టాంగ్ ల్ పై డూప్లికేషన్(Duplication) ఉపయోగించి ఒక ప్రభావం సృష్టిద్దాం. |
08:04 | మెయిన్ మెనూ(Main menu) నుండి ఎడిట్(Edit) ఎంచుకోని, డూప్లికేట్(Duplicate) క్లిక్ చేయండి. |
08:09 | డూప్లికేట్(Duplicate) డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
08:12 | క్రింది విలువలను ఎంటర్ చేద్దాం -నెంబర్ అఫ్ కాపీస్(Number of copies) = 10. |
08:18 | ప్లేస్మెంట్(Placement) కింద, ఎక్స్ యాక్సిస్(X Axis) = 10. |
08:26 | వై యాక్సిస్(Y Axis) = 20. |
08:30 | ఆన్ గి ల్(Angle) = 0 డి గ్రీస్(degrees). |
08:34 | ఎన్లార్జ్మేంట్ విడ్త్(Enlargement Width) మరియు హైట్(Height) డిఫాల్ట గా ఉంచుదాం. |
08:44 | స్టార్ట్(Start) కలర్ యెల్లోకు మరియు ఎన్డ్(End) కలర్ రెడ్కు మారుద్దాం. |
08:57 | ఓకే(OK) క్లిక్ చేయండి. వచ్చిన ప్రత్యేక ప్రభావాలు (special effects(స్పెషల్ ఎఫెక్ట్స్))చూడండి! |
09:04 | మీరు కోణాలు(ఆన్గిల్స్(Angles)) మరియు ఇతర విలువలు మార్చడం ద్వారా మరిన్ని ప్రభావాలు పొందవచ్చు. |
09:09 | ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
09:12 | ఈ ట్యు టోరియల్ లో, మనం నేర్చుకున్నది, కింది ఎంపికలను వాడి ఎలా 3D ఆబ్జెక్ట్స్ ను సృష్టించడం ఎక్స్ట్రుషన్(Extrusion), 3D టూల్బార్(3D Toolbar), 3D రొటేషన్ ఆబ్జెక్ట్(3D Rotation Object) |
09:23 | మనమ్ 3D ఆబ్జెక్ట్స్ ను ఎడిట్ చేయడం మరియు ఆబ్జెక్ట్స్(objects)కు 3D ఎఫెక్ట్స్(3D effects) అప్లై చేయడం నేర్చుకున్నాo. |
09:27 | అలాగే డూప్లికేషన్(Duplication) ఉపయోగించి ప్రత్యేక ప్రభావాలను(స్పెషల్ ఎఫెక్ట్స్(special effects)) రూపొందించడo నేర్చుకున్నాo. |
09:32 | ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
09:35 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ సారాంశంను ఇస్తుంది. |
09:39 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు. |
09:44 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
09:49 | ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. |
09:53 | మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial.orgకు వ్రాసి సంప్రదించండి. |
09:59 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, |
10:03 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
10:10 | ఈ మిషన్ గురించి స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. |
10:20 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను, ధన్యవాదములు. |