LibreOffice-Suite-Draw/C3/Polygons-and-Curves/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 లిబరే ఆఫీసు డ్రాలో Creating Curves and Polygons పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్లో మనం, డ్రాలో కర్వ్స్(Curves) మరియు పాలీగన్స్(Polygons)తో ఎలా పని చేయాలో నేర్చుకుంటాం.
00:14 ఈ ట్యుటోరియల్ కోసం, మీకు లిబరే ఆఫీసు డ్రా(LibreOffice Draw)లో ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి.

లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం ఈ వెబ్ సైట్ను సందర్శించండి.

00:25 ఇక్కడ, మనం ఉపయోగిస్తున్నది, ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు , లిబరే ఆఫీసు సూట్ వర్షన్ 3.3.4.
00:34 పాలీగన్స్(Polygons) అంటే ఏమిటి? పాలీ(Poly)అనగా అనేక అని అర్థం. అనేక భుజాలు గల ఆకారాన్ని బహుభుజి లేదా పాలీగన్ అంటారు.
00:43 మనం, ఈ స్లయిడ్ లో చూపిన విధంగా ఒక మ్యాప్ ఎలా గీయాలో నేర్చుకుంటాము. ఈ మ్యాప్ ఇంటి నుండి పాఠశాల వరకు మార్గం చూపిస్తుంది.
00:53 ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చే వరకు, మీరు ఇదే రేఖాచిత్రం సృష్టించగలరు.
01:00 డ్రాకు వెళ్దాం. నేను ఈ ఫైల్కు రూట్ మ్యాప్(RouteMap) అనే పేరు పెట్టాను మరియు డెస్క్టాప్ పైన సేవ్ చేశాను.
01:09 ముందుగా, గ్రిడ్ వ్యూ(Grid View)ని ఎనేబ్ల్ చేద్దాం. ఇందుకోసం వ్యూ(View) క్లిక్ చేసి, గ్రిడ్(Grid) ఎంచుకొని, డిస్ప్లే గ్రిడ్(Display Grid) ఎంచుకోండి.
01:19 డ్రాయింగ్ ప్రారంభించడానికి ముందు, పేజీ మారిజిన్లు (Page Margins) మరియు పేజీ ఓరియేన్టేషన్(Page Orientation)సెట్ చేద్దాం.
01:26 డ్రా(Draw) పేజీ పై కర్సర్ ఉంచండి, కాంటెక్స్ట్ మెనూ (Context menu)కోసం రైట్ క్లిక్ చేయండి.
01:33 పేజీ(Page) ఎంచుకొని, పేజీ సెటప్(Page Setup) క్లిక్ చేయండి.
01:36 పేజీ సెటప్(Page Setup) డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
01:40 ఫార్మాట్(Format) డ్రాప్-డౌన్ క్లిక్ చేసి A4 ఎంచుకోండి. ఓరియేన్టేషన్ పోర్ట్రైట్ గా ఎంచుకోండి(Orientation Portrait).
01:49 లెఫ్ట్, రైట్, టాప్ మరియు బాటమ్ మారిజిన్లు 1గా సెట్ చెయ్యబడతాయి. ఓకే(OK) క్లిక్ చేయండి.
01:57 డిఫాల్ట్ ఫాంట్ సైజుని 24 కు సెట్ చేద్దాం.
02:02 మెయిన్ మెనూ(Main menu) నుండి, ఫార్మాట్ (Format) మరియు క్యారెక్టర్(Character) ఎంచుకోండి.
02:06 క్యారెక్టర్(Character) డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
02:10 ఫాంట్స్(Fonts) ట్యాబ్ క్లిక్ చేసి, సైజు(Size) ఫీల్డ్, స్క్రోల్ చేసి 24 ఎంచుకోండి. ఓకే(OK) క్లిక్ చేయండి.
02:18 ఆకారాల లోపల టైప్ చేసిన టెక్స్ట్ స్పష్టంగా కనిపిస్తుందని ఇది నిర్థారిస్తుంది.
02:24 ఇప్పుడు, ఇల్లు గీయడంతో ప్రారంభిద్దాం.
02:28 ఇల్లు చూపించడానికి ఒక చతురస్రం ప్రవేశ పెట్టి, దాని లోపల హోమ్(Home) అని టైపు చేయండి.
02:37 తర్వాత, ఇంటి యొక్క కుడి వైపు పార్క్ గీద్దాం.
02:42 ఉద్యానవనం వికృతాకార దీర్ఘ చతురస్రంలా ఉంది. ఎడమ వైపు వెడల్పు కుడి వైపు కంటే ఎక్కువ.
02:51 దీనిని చూపించడానికి ఒక పాలీగన్(Polygon)ను ఉపయోగిద్దాం. పాలీగన్(Polygon)ను గీయడానికి డ్రాయింగ్(Drawing) టూల్బార్ వద్దకు వెళ్ళి,
02:58 కర్వ్(Curve) పై క్లిక్ చేసి ఆపై ఐకాన్ పక్కన చిన్న నల్ల బాణం క్లిక్ చేయండి.
03:04 పాలీగన్ ఫిల్డ్ (Polygon filled) ఎంచుకోండి.
03:08 డ్రా(Draw) పేజీలో కర్సర్ ఉంచండి. ఎడమ మౌస్ బటన్ పట్టుకొని కర్సర్ని కిందికి లాగండి. మౌస్ బటన్ వదలండి.
03:18 మనం ఒక సరళ రేఖ గీశాం. ఆకారం ఒక లంబ కోణ త్రిభుజం (right triangle) వచ్చే వరకు మౌస్ను కుడి వైపుకు లాగండి.
03:26 ఎడమ మౌస్ బటన్ క్లిక్ చేసి మౌస్ ను పైకి లాగండి. ఇప్పుడు, ఎడమ మౌస్ బటన్ని డబుల్ క్లిక్ చేయండి.
03:35 మీరు ఒక బహుభుజి గీశారు. పార్క్(Park) అని దాని లోపల టైప్ చేద్దాం.
03:41 పార్క్(Park) తర్వాత, ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది. ఇది కుడా ఒక వికృతాకార పాలీగన్. దీనిని గీద్దాం!
03:50 డ్రాయింగ్ టూల్బార్ వద్దకు వెళ్ళి, ఆ తర్వాత కర్వ్(Curve) చిహ్నం పక్కన వున్న చిన్న నల్ల బాణం క్లిక్ చేసి పాలిగాన్ ఫిల్డ్ (Polygon filled) క్లిక్ చేయండి.
04:00 డ్రా(Draw) పేజీ పై కర్సర్ పెట్టి, ఎడమ మౌస్ బటన్ పట్టుకొని దానిని కిందికి లాగండి.
04:07 ఇప్పుడు, మౌస్ బటన్ వదలండి. మీరు ఒక సరళ రేఖ చూస్తారు. ఆకారం త్రిభుజం వచ్చే వరకు మౌస్ను ఎడమకు తరలించoడి.
04:19 ఎడమ మౌస్ బటన్ను క్లిక్ చేసి మౌస్ను పైకి లాగండి. ఇప్పుడు షిఫ్ట్ కీ పట్టుకొని కర్సర్ను లోపలికి లాగండి.
04:31 ఎడమ మౌస్ బటన్ను డబుల్ క్లిక్ చేయండి.
04:35 మీరు మరో బహుభుజి గీశారు. దీని లోపల కమర్షియల్స్ కాంప్లెక్స్(Commercial Complex) అనే టెక్స్ట్ని టైప్ చేయండి.
04:45 మునుపటి సోపానాలు అనుసరిస్తూ, డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి ఒక పార్కింగ్ లాట్ గీద్దాం.

పాలిగాన్ ఫిల్డ్(Polygon filled) ఎంచుకొని, ఆపై డ్రా(Draw) పేజీలో కర్సర్ వుంచి బహుభుజి గీయండి.

05:02 దాని లోపల పార్కింగ్ లాట్(Parking Lot) అనే టెక్స్ట్ టైప్ చేయండి.
05:08 మీకు కావలసినన్ని భుజాలతో బహుభుజిని మీరు గీయవచ్చునని గుర్తుంచుకోండి.
05:14 ఈ ట్యుటోరియల్ను ఆపి ఈ అసైన్మెంట్ ప్రయత్నించండి. ఇదు, ఆరు మరియు పది భుజాలతో బహుభిజి లను గీయండి.
05:23 రెసిడెన్షియల్ కాంప్లెక్స్(Residential Complex) ఇంటికి కుడి పక్కన ఉంది, మరియు దీర్ఘచతురస్రాకారంలో వుంది.
05:30 ।డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి, Rectangle ఎంచుకోండి.
05:35 తర్వాత, డ్రా(Draw) పేజీ పై మౌస్ పెట్టి ఒక దీర్ఘ చతురస్రం గీయడానికి దానిని లాగండి.
05:41 దీనికి రెసిడెన్షియల్ కాంప్లెక్స్(Residential Complex) అనే పేరు పెట్టండి.
05:45 ఈ ప్రాంతంలో ఒక ప్లే గ్రౌండ్(Play Ground)కుడా ఉంది. ఇది ఒక పొడుగాటి దీర్ఘచతురస్ర ఆకారంలో ఉంది.
05:53 డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి, పాలిగాన్ 45 డిగ్రీ ఫిల్డ్(Polygon 45 degree Filled) ఎంచుకోండి.
05:59 డ్రా(Draw) పేజీలో కర్సర్ ఉంచండి. ఎడమ మౌస్ బటన్ను క్లిక్ చేసి కిందికి లాగండి మరియు వదలండి.
06:07 మౌస్ను క్లిక్ చేసి మరియు కుడి వైపుకు తరలించి విడుదల చేయండి. ఇప్పుడు దీర్ఘచతురస్రంను పూర్తి చేయడానికి మౌస్ క్లిక్ చేసి పైకి లాగండి.
06:17 ఎడమ మౌస్ బటన్ను డబల్-క్లిక్ చేయండి.
06:21 మీరు మరో బహుభుజి గీసారు!
06:25 దీని లోపల ప్లేగ్రౌండ్(Play Ground) అనే టెక్స్ట్ టైప్ చేయండి.
06:30 ప్లేగ్రౌండ్కు పక్కన లేక్(Lake) ఉంది.
06:35 డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి, ఫ్రీ ఫాం లైన్ ఫిల్డ్(Freeform Line filled) ఎంచుకోండి.
06:40 డ్రా(Draw) పేజీలో, ఎడమ మౌస్ బటన్ను నొక్కి మరియు మౌస్ను అపసవ్యదిశలో తిప్పండి. ఎడమ మౌస్ బటన్ను వదిలివేయండి .
06:52 మనం ఒక సరస్సు గీశాo. లేక్(Lake) అని దాని లోపల టైపు చేయండి.
06:58 ఈ ప్రాంతంలో చివరి భవనం పాఠశాల. పాఠశాల ప్రాంగణం కూడా ఒక బహుభుజి రూపంలో ఉంది.
07:07 దీనిని మన మ్యాప్ పై గీద్దాం. మళ్ళీ డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి పాలిగాన్ 45 డిగ్రీస్ ఫిల్డ్(Polygon 45 degree filled) ఎంచుకోండి.
07:17 తర్వాత, డ్రా(Draw) పేజీలో కర్సర్ వుంచి బహుభుజి గీయండి. చివరగా, బహుభుజి గీయడం పూర్త చేసి మౌస్ని డబుల్ క్లిక్ చేయండి.
07:28 దీని లోపల స్కూల్ కాంపస్(School campus) అని టైప్ చేద్దాం.
07:34 ఒక టెక్స్ట్ బాక్స్ చేర్చి దాని లోపల స్కూల్ మెయిన్ గేట్స్(School Main Gates) అనే టెక్స్ట్ని టైప్ చేద్దాము.
07:44 టెక్స్ట్ బాక్స్ను తిప్పి సరైన స్థానంలో ఉంచండి.
07:48 ఇప్పుడు మెయిన్ మెనూ (Main menu)నుండి, మాడిఫాయ్(Modify) ఎంచుకొని రొటేట్(Rotate) క్లిక్ చేయండి.
07:54 హేండిల్స్(handles) ఎరుపు రంగుకు మారడం గమనిoచండి. ఇది మనం రొటేట్(Rotate) మోడ్లో వున్నాం అని సూచిస్తుంది.
08:02 మీరు ఇరువైపులా బాణాల తో చిన్న ఆర్క్లు చూశారా? వీటిని బాక్స్ రొటేట్ చేయడానికి ఉపయోగిస్తాం.
08:09 టెక్స్ట్ బాక్స్ యొక్క పై కుడి మూలలో చివరన వున్న హ్యాండిల్(handle)పై కర్సర్ ఉంచండి.
08:17 రొటేషన్ కర్వ్(Rotation curve) కనిపిస్తుంది.
08:21 ఎడమ మౌస్ బటన్ నొక్కండి. అది సరైన స్థానంలోకి వచ్చే వరకు క్లాక్-వైస్( clock-wise) దిశలో వక్రాన్ని లాగండి.
08:30 రొటేట్ మోడ్(Rotate mode) నుండి నిష్క్రమించడానికి డ్రా(Draw) పేజీలో ఎక్కడైనా క్లిక్ చేయండి.
08:36 పాఠశాలకు పక్క వైపు కూడా ద్వారం చూపిద్దాం.
08:41 మునుపటి లాగే, ఒక టెక్స్ట్ బాక్స్ గీసి, దాని లోపల స్కూల్ సైడ్ ఎంట్రన్స్(School Side Entrance) టెక్స్ట్ ప్రవేశ పెట్టండి.
08:50 బాణాలు ఉపయోగించి దిక్కులను డ్రా చేద్దాం. ఇంటి నుండి, కుడి వైపుకు తిరగాలి.
08:57 డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి లైన్ ఎండ్స్ విత్ ఆరో (Line Ends with Arrow) ఎంచుకోండి.
09:02 డ్రా(Draw) పేజి వద్దకు వెళ్ళి లైన్ గీద్దాం.
09:08 తర్వాత రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నుండి నడిచి ఎడమ వైపుకు తెరుగండి.
09:14 ఈ మార్గాన్ని చూపించడానికి మరొక లైన్ డ్రా చేద్దాం
09:19 తర్వాత, ప్లే గ్రౌండ్ పక్కన కుడికి తిరిగి, కిందికి నడవండి.
09:25 తర్వాత స్కూల్ యొక్క మెయిన్ గేటు చేరుకోవడానికి మళ్ళి కుడి వైపుకు తిరగండి.
09:32 మనం మొదటి మార్గం డ్రా చేశాo. మీరు రెండు రకాల వక్రతలు మరియు పాలిగాన్లను డ్రా చేయవచ్చునని గమనించి వుంటారు.
09:41 ఒకటి ఫిల్డ్ (Filled) ఎంపిక వుపయోగించి మరియు ఇంకోటి ఫిల్(fill) లేకుండా. మీరు ఫిల్డ్ (Filled) ఎంపికను ఉపయోగించినప్పుడు, వక్రత రంగుతో నింపి ఉంటుంది.
09:52 కర్వ్(Curve) టూల్బార్లో ప్రతి ఎంపికలో, కర్వ్ గీయడానికి మౌస్ ఆపరేషన్లు వివిధ పద్ధతిలో వుండడం గమనించి వుంటారు.
10:02 ఇక్కడ ఒక అసైన్మెంట్ ఉన్నది. కర్వ్(Curve) టూల్ బార్లోని ఎంపికలు ఉపయోగించి వక్రతలు మరియు పాలిగాన్లను గీయండి.
10:10 కర్సర్ యొక్క ఆకారం మరియు మౌస్ కార్యకలాపాలు, వక్రత లేదా బహుభుజి యొక్క ప్రతి ఎంపికతో ఎలా మారుతాయో గమనించండి.
10:20 మీరు ఫిల్డ్(Filled) ఎంపికలో ఫిల్(ఫిల్) రంగు మార్చవచ్చో లేదో తనిఖీ చేయండి.
10:25 ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
10:31 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం:

స్పోకెన్ ట్యూటోరియల్స్ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.ఆన్లైన్ పరీక్షలో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది.

10:45 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial. orgకు వ్రాసిసంప్రదించండి.
10:51 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
11:04 ఈ మిషన్ గురించి స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
11:14 ఈ ట్యూటోరియల్ను తెలుగులోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya