LibreOffice-Suite-Draw/C3/Flow-Charts-Connectors-Glue-Points/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | లిబరే ఆఫీసు డ్రాలో ఫ్లోచార్ట్స్, గ్లూ పాయింట్స్ మరియు బీజియెర్ కర్వ్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకునేది, బీజియెర్ కర్వ్స్(Beizer curves) మరియు ఫ్లోచార్ట్ లను (Flowcharts) ఎలా గీయాలి. |
00:14 | కనేక్టర్లు(Connectors) మరియు గ్లూ పాయింట్లను(Glue points) వాడి ఫ్లోచార్ట్లు (Flowcharts)ఎలా కలపాలో నేర్చుకుంటారు. |
00:20 | ఇక్కడ, మనం ఉపయోగిస్తున్నది: ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు, లిబరే ఆఫీసు సూట్ వర్షన్ 3.3.4. |
00:29 | బీజియెర్ కర్వ్స్(Bezier Curves) గురించి నేర్చుకుందాం. |
00:33 | బీజియెర్ కర్వ్లను(Bezier Curves) ప్రధానంగా కంప్యూటర్ గ్రాఫిక్స్ లో వక్రతలను(కర్వ్స్) సున్నితం చేయడానికి ఉపయోగిస్తారు. |
00:40 | వక్రతల యొక్క ఆకారం మరియు పరిమాణం మీద ప్రయోగం చేయడానికి ఈ వక్రతలను ఉపయోగించవచ్చు. |
00:45 | అన్ని వక్రతలకు ఒక ప్రారంభ బిందువు మరియు ఒక ముగింపు బిందువు ఉంటుంది. |
00:50 | కర్వ్ పై వున్న పాయింట్ల ను నోడ్స్(Nodes)గా సూచిస్తారు. |
00:54 | రూట్ మ్యాప్(Routemap) ఫైల్ వద్దకు వెళ్దాం. |
00:58 | హోం(Home) నుండి కమర్షియల్ కాంప్లెక్స్(Commercial Complex)కు వెళ్దాం. |
01:03 | అలా చేయుటకు, పార్కింగ్ లాట్(Parking Lot) నుండి కుడి వైపుకు వెళ్ళాలి. |
01:08 | రేఖా చిత్రాన్ని గతంలో మనం గ్రూప్ చేశాం. కాబట్టి, దీనిని ఇప్పుడు అన్ గ్రూప్(ungroup) చేద్దాం. |
01:14 | డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి కర్వ్(Curve) పై క్లిక్ చేసి కర్వ్(Curve) ఎంచుకోండి. |
01:20 | డ్రా(Draw) పేజీలో, రూట్(route) యొక్క ప్రారంభ బిందువు పై క్లిక్ చేయండి. అది హోం(Home). |
01:27 | మౌస్ ఎడమ బటన్ నొక్కి ప్లేగ్రౌండ్(Play Ground) వరకు లాగండి. |
01:32 | మీరు ఒక సరళ రేఖ చూస్తారు. |
01:36 | మౌస్ బటన్ వదలండి. |
01:39 | ఇప్పుడు, పాయింటర్ను కమర్షియల్ కాంప్లెక్స్(Commercial Complex) వరకు కదపండి. |
01:43 | మౌస్ కదులుతుంటే రేఖ వక్రంగా మారుతుంది. |
01:47 | ముగింపు స్థానం అనగా కమర్షియల్ కాంప్లెక్స్(Commercial Complex) పై డబుల్-క్లిక్ చేయండి. |
01:52 | మనం ఒక వక్రo(కర్వ్) గీశాం. |
01:55 | వక్రత పరివర్తన మృదువుగా కావడం గమనించండి. |
01:59 | ఇప్పుడు, ఎడిట్ పాయింట్స్(Edit Points) టూల్బార్ ఉపయోగించి ఈ కర్వ్ పై పాయింట్లను సవరిద్దాం. |
02:05 | కర్వ్(curve) పై క్లిక్ చేయండి. |
02:07 | ఎడిట్ పాయింట్స్(Edit Points) టూల్బార్ ఎనేబ్ల్ చేయడానికి, కర్వ్ పై రైట్-క్లిక్ చేసి ఎడిట్ పాయింట్స్(Edit Points) ఎంచుకోండి. |
02:14 | కర్వ్ చివరిలో నీలం బాక్సు లు కనిపిస్తే, కర్వ్ను మనం ఎడిట్(edit) చెయ్యవచ్చు. |
02:21 | వక్రత యొక్క మొదటి పాయింట్ పై క్లిక్ చేయండి. |
02:24 | మీరు ఒక నియంత్రణ పాయింట్తో చుక్కల లైన్ చూస్తారు. |
02:29 | మీ అవసరాన్ని బట్టి వక్రతను తగ్గించటకు లేదా విస్తరించేందుకు చుక్కల రేఖను లాగవచ్చు. |
02:35 | మార్పు చేసిన తర్వాత, డ్రా(Draw) పేజీలో ఎక్కడైనా డబుల్ క్లిక్ చేయండి. |
02:41 | సున్నితమైన వక్రత సృష్టించడానికి లేదా రేఖ పై పాయింట్లు ఇన్సర్ట్ చేయడానికి, తరలించడానికి లేదా తొలగించడానికి ఎడిట్ పాయింట్స్(Edit Points) టూల్బార్ ఉపయోగించవచ్చు. |
02:50 | ఇక్కడ మీ కోసం ఒక చిన్న అసైన్మెంట్ వుంది. |
02:54 | బీజియెర్ కర్వ్(Bezier Curve) గీసి మరియు |
02:59 | ఎడిట్ పాయింట్స్(Edit Points)టూల్బార్ ను వాడి, అన్ని ఎంపికల తో పని చేయండి. |
03:02 | ఇప్పుడు, ఫ్లో చార్ట్ లను(Flowcharts) సృష్టించడం తెలుసుకుందాం. |
03:05 | రూట్ మ్యాప్(RouteMap) ఫైలుకు రెండు కొత్త పేజీలు జోడిద్దాo. |
03:10 | డ్రా(Draw), ఫ్లోచార్ట్ ల(Flowcharts) కోసం డ్రాయింగ్(Drawing ) టూల్బార్ లో ఒక ప్రత్యేక ఎంపికను అందిస్తుంది. |
03:17 | ఈ ఫ్లోచార్ట్ స్పోకెన్ ట్యుటోరియల్(Spoken Tutorial) ప్రక్రియలో అన్ని దశలను వివరిస్తోంది. |
03:22 | ఈ ఫ్లోచార్ట్ ను సృష్టిద్దాం. |
03:26 | డ్రాయింగ్(Drawing) టూల్బార్లో ఫ్లోచార్ట్స్(Flowcharts) పై క్లిక్ చేయండి. |
03:30 | చిన్న నల్ల త్రికోణం పై క్లిక్ చేసి ఫ్లోచార్ట్: ప్రాసెస్ (Flowchart: Process) ఎంచుకొండి. |
03:37 | డ్రా పేజిలో కర్సర్ పెట్టి, మౌస్ ఎడమ బటన్ను నొక్కి దానిని కిందికి లాగండి. |
03:44 | మీరు ప్రాసెస్(Process) బాక్స్ గీశారు. |
03:47 | ప్రాసెస్(Process) బాక్స్, మొత్తం ప్రక్రియలో ఒక స్టెప్ లేదా ఒక ఈవెంట్ను సూచిస్తుంది. |
03:54 | ఫ్లోచార్ట్ అబ్జెక్ట్ లో టెక్స్ట్ కుడా చేర్చవచ్చు. |
03:59 | ప్రాసెస్(Process) బాక్స్ మీద డబుల్-క్లిక్ చేసి, క్రియేట్ ది ట్యుటోరియల్ అవుట్ లైన్ టు చంక్ కంటెంట్ ఇన్ టు 10-మినిట్ స్క్రిప్ట్స్(Create the Tutorial Outline to chunk content into 10-minute scripts) అనే టెక్స్ట్ ని దాని లోపల టైపు చేయండి. |
04:13 | ఫ్లోచార్ట్స్(Flowcharts) యొక్క ఫార్మాటింగ్ ఎంపికలు కూడా ఇతర అబ్జెక్ట్ లను పోలి ఉంటాయి. |
04:20 | ప్రాసెస్(Process)బాక్స్ లోపల టెక్స్ట్ ను అలైన్ చేద్దాం. |
04:24 | టెక్స్ట్ ను ఎంచుకుందాం. |
04:27 | కాంటెక్స్ట్ మెనూ(Context menu) కోసం రైట్ క్లిక్ చేసి టెక్స్ట్(Text) పై క్లిక్ చేయండి. |
04:32 | టెక్స్ట్(Text) డైలాగ్-బాక్స్ కనిపిస్తుంది. |
04:35 | టెక్స్ట్(Text) డైలాగ్-బాక్స్ లో రిసైజ్ షేప్ టు ఫీట్ టెక్స్ట్ విడ్త్(Resize shape to fit text width) బాక్స్ పై చెక్ పెట్టండి. OK(ఓకే) పై క్లిక్ చేయండి. |
04:43 | టెక్స్ట్ సరిపోయే విధంగా ప్రాసెస్(Process) బాక్స్ దాని ఆకారాన్ని మార్చడం చూడవచ్చు. |
04:49 | ఇప్పుడు, Ctrl + Zకీలు కలిపి నొక్కి ఈ చర్యను రద్దు చేద్దాం. |
04:55 | మళ్ళి టెక్స్ట్ ఎంచుకోండి. |
04:59 | మెయిన్ మెను కు వెళ్ళి ఫార్మాట్(Format) ఎంచుకొని టెక్స్ట్(Text) పై క్లిక్ చేయండి. |
05:05 | టెక్స్ట్(Text) డైలాగ్-బాక్స్ కనిపిస్తుంది. |
05:08 | వర్డ్ రాప్ టెక్స్ట్ ఇన్ షేప్(Word wrap text in shape)ఎంపిక పై చెక్ పెడుదాం. OK(ఓకే) పై క్లిక్ చేయండి. |
05:15 | ప్రాసెస్(Process) బాక్స్ ఆకారంకు సరిపోయే విధంగా టెక్స్ట్ సర్దుబాటు అవుతుంది. |
05:21 | ఇదే పద్ధతిలో, ఇప్పుడు మొదటి ప్రాసెస్(Process) బాక్స్ కింద మరొక బాక్స్ గీద్దాం. |
05:28 | క్రియేట్ స్క్రిప్ట్స్ (Create Scripts) అని దాని లోపల టెక్స్ట్ చేర్చుదాం. |
05:33 | ఇప్పుడు, డెసిషన్(Decision) బాక్స్ డ్రా చేసి,దాని లోపల రివ్యూ ఒకే?(Review Okay?) అనే టెక్స్ట్ ను చేర్చుదాం. |
05:42 | డెసిషన్(Decision) బాక్స్, తీసుకోవలసిన నిర్ణయాన్ని సూచిస్తుంది. |
05:46 | అది నిర్ణయం యొక్క ఫలితo ఆధారంగా తదుపరి ప్రక్రియను నిర్దేశిస్తుంది. |
05:52 | ఇప్పుడు డెసిషన్ (Decision)బాక్స్ కింద మరొక ప్రాసెస్(Process)బాక్స్ను డ్రా చేద్దాం. |
05:58 | దాని లోపల రికార్డ్ వీడియో (Record Video) అనే టెక్స్ట్ ను చేర్చుదాం. |
06:04 | తర్వాత, మనకు రివ్యూ ఒకే?(Review Okay?) టెక్స్ట్ తో ఇక్కడ మరొక డెసిషన్(Decision) బాక్స్ కావాలి. |
06:12 | ముందు తయారు చేసిన డెసిషన్(Decision) బాక్స్ కాపీ చేసి ఇక్కడ పెడుదాం. |
06:18 | డెసిషన్(Decision) బాక్స్ ఎంచుకొని Ctrl + C కీలను కలిపి నొక్కండి. |
06:25 | ఇప్పుడు, Ctrl + V కీలను కలిపి నొక్కండి. |
06:29 | ఈ బాక్స్ను మునుపటి ప్రాసెస్(Process) బాక్స్ క్రిందకి కదపండి. |
06:35 | ఇప్పుడు, రివ్యూ ఒకే(Review Okay) టెక్స్ట్ దాని లోపల చేర్చండి. |
06:40 | చివరగా, ఒక ఫ్లోచార్ట్ - కనెక్టర్(flowchart-connector) డ్రా చేసి, దాని లోపల A టైపు చేయండి. |
06:48 | ఫ్లోచార్ట్ - కనెక్టర్(flowchart-connector) ఫ్లోచార్ట్ యొక్క రెండు భాగాలను కలుపుతుంది. |
06:53 | ఫ్లోచార్ట్ యొక్క మొదటి భాగo ఒక పేజి లో ఉందనుకోండి. |
06:58 | మరియు రెండవ భాగo మరొక పేజి లో ఉందనుకోండి. |
07:02 | మొదటి పేజీలో, ఫ్లోచార్ట్ చివరిలో ఒక ఫ్లోచార్ట్- కనెక్టర్(flowchart-connector) డ్రా చేద్దాం. |
07:08 | తర్వాత రెండవ పేజీ యొక్క ప్రారంభంలో అదే కనెక్టర్ డ్రా చేద్దాం. |
07:13 | అబ్జెక్ట్ లను కలిపే ముందు, డ్రా(Draw) లో కనెక్టర్ లైన్స్(Connector Lines) మరియు గ్లూ పాయింట్స్(Glue Points) గురించి నేర్చుకుందాం. |
07:21 | కనెక్టర్స్(Connectors) అనగా, ఆబ్జెక్ట్ యొక్క చివర లకు జత చేసిన లేదా డాక్ చేసిన లైన్స్ లేదా ఆరోస్. |
07:28 | గ్లూ పాయింట్స్(Glue points)- అనగా పేరులో సూచించిన విధంగా కనెక్టర్ల (Connectors)ను ఆబ్జెక్ట్స్ కు అతికించే పాయింట్లు. |
07:35 | అన్ని ఆబ్జెక్ట్ లకు గ్లూ పాయింట్లు ఉంటాయి. |
07:39 | ఇవి కనిపించవు. |
07:41 | డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి కనెక్టర్ ను ఎంపిక చేసినపుడు లేదా ఆబ్జెక్ట్ మీద మౌస్ పాయింటర్(mouse pointer)ను కదిపినపుడు అవి కనిపిస్తాయి. |
07:51 | గ్లూ పాయింట్లు(Glue points) హ్యాండిల్స్లా కావు. |
07:54 | హ్యాండిల్స్, ఆబ్జెక్ట్ ల పరిమాణాన్ని మార్చడానికి వాడుతాము. |
07:58 | గ్లూ పాయింట్లు(Glue points), ఆబ్జెక్ట్ లకు కనెక్టర్స్(Connectors)ను అతికిస్తాయి. |
08:02 | ఇప్పుడు, కనెక్టర్లు(connectors) ఉపయోగించి ఫ్లోచార్ట్ లో ఆబ్జెక్ట లను కలుపుదాం. |
08:07 | డ్రాయింగ్(Drawing) టూల్బార్ వద్దకు వెళ్లి కనెక్టర్(Connector) ఎంచుకోండి. |
08:12 | వివిధ రకాల కనెక్టర్స్(Connectors) చూడటానికి చిన్న నల్ల త్రికోణం మీద క్లిక్ చేయండి. |
08:18 | స్ట్రెయిట్ కనెక్టర్ ఎండ్స్ విత్ ఆరో (Straight Connector ends with Arrow) ఎంపిక ఎంచుకోండి. |
08:23 | కనెక్టర్(Connector), ఎంపిక చేసినపుడు డ్రా పేజి లోని ఆబ్జెక్ట్స్ పై క్రాస్ మార్క్స్ చూస్తారు. |
08:31 | ఇవి గ్లూ పాయింట్స్(glue points). |
08:34 | ఇప్పుడు, మొదటి ప్రాసెస్(process) బాక్స్ యొక్క గ్లూ పాయింట్(glue point) నుండి తర్వాతి ప్రాసెస్(process) బాక్స్ యొక్క గ్లూ పాయింట్(glue point)కు ఒక లైన్ గీయండి. |
08:44 | అన్ని ఫ్లో చార్ట్ అబ్జెక్ట్ లను పై నుండి కింది వరకు కనెక్టర్ల లను ఉపయోగించి కలుపుదాం. |
08:52 | మీరు కర్సర్ ఎక్కడైతే పెడుతారో అక్కడ ప్రతి లైన్ స్వయంచాలకంగా సమీప గ్లూ పాయింట్(glue point)కు డాక్ అవ్వడం గమనించండి. |
09:03 | ఇప్పుడు, ప్రాసెస్(Process) మరియు డెసిషన్(Decision) బాక్సులను కలుపుదాం. |
09:08 | డ్రాయింగ్ (Drawing) టూల్బార్ నుండి కనెక్టర్ ఎండ్స్ విత్ ఆరో(Connector Ends with Arrow)ఎంపికను ఎంచుకోండి. |
09:14 | ప్రాసెస్(Process) బాక్స్ నుండి, డెసిషన్(Decision) బాక్స్ వరకు కలపండి. |
09:19 | అదేవిధంగా, డెసిషన్(Decision) బాక్స్ ను తదుపరి ప్రాసెస్(Process)బాక్స్ తో కనెక్ట్ చేద్దాం. |
09:25 | మీరు కనెక్టర్(connector)కు టెక్స్ట్ కూడా జోడించవచ్చు. |
09:29 | డెసిషన్(Decision) బాక్స్ నుండి ప్రాసెస్(Process) బాక్స్ వరకు వున్న కనెక్టర్(connector) పై నో(No) అని టైపు చేయండి. |
09:35 | కనెక్టర్ను ఎంచుకోవడానికి దాని పై డబుల్ క్లిక్ చేయండి. |
09:39 | చివరి కంట్రోల్-పాయింట్స్ క్రియశీలం అవుతాయి. |
09:43 | మరియు టెక్స్ట్ కర్సర్ కనిపిస్తుంది. |
09:46 | నో(No) అనే టెక్స్ట్ టైప్ చేద్దాం. |
09:49 | ఇతర కనెక్టర్ కోసం మరోసారి ఇలాగే చేద్దాం. |
09:54 | మనం ఒక సాధారణ ఫ్లోచార్ట్ సృష్టించం |
09:57 | Ctrl + S కీలు కలిపి నొక్కి ఫ్లోచార్ట్ ను సేవ్(save) చేద్దాం. |
10:03 | మీరు లైన్ లు మరియు ఆరోలు ఉపయోగించి కూడా ఆబ్జెక్ట్స్ లను కనెక్ట్ చేయవచ్చు. |
10:08 | కానీ ఆ సందర్భంలో, మీరు ఆబ్జెక్ట్స్ లను తప్పక సముహ పరచాలి. |
10:11 | ఎందుకంటే ఆరోస్, ఆబ్జెక్ట్స్ కు జత కలసి వుండవు. |
10:16 | లైన్స్(Lines) మరియు ఆరోస్ (Arrows) కనెక్టర్స్(connectors) కు ఎలా భిన్నంగా ఉంటాయి? |
10:21 | కనెక్టర్స్ (Connectors) అనగా, |
10:24 | ఆబ్జెక్ట్స్ యొక్క గ్లూ పాయింట్ల(glue points)కు, |
10:28 | అంత్య బిందువులను స్వయంచాలకంగా జత కలసి వున్న లైన్స్ లేదా ఆరోస్. |
10:31 | మరోవైపు, లైన్స్ మరియు ఆరోస్, స్వయంచాలకంగా జత కలసి (డాక్) వుండవు. |
10:36 | ఈ ట్యుటోరియల్ లో విరామం తీసుకొని ఈ అసైన్మెంట్ చేయండి. |
10:40 | స్పోకెన్ ట్యుటోరియల్ ఫ్లోచార్ట్ యొక్క రెండవ భాగం సృష్టించండి. |
10:45 | ప్రాసెస్(process) బాక్స్ లకు రంగు వేయండి. |
10:48 | లెటర్ A తో ఒక కనెక్టర్(connector) గీయండి. |
10:51 | ఈ ఫ్లోచార్ట్ లో ఇది మొదటి ఆబ్జెక్ట్ గా ఉండాలి. |
10:55 | ఇది ఇలా ఉండాలి |
10:59 | ఇప్పుడు మనం ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. |
11:02 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది. ఫ్లోచార్ట్స్ (Flowcharts), కనేక్టర్స్ (Connectors) మరియు , గ్లూ పాయింట్స్(Glue points). |
11:09 | ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి. |
11:13 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ సారాంశంను ఇస్తుంది. |
11:17 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
11:22 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం |
11:24 | స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
11:28 | ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. |
11:32 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org కువ్రాసిసంప్రదించండి. |
11:40 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, |
11:45 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
11:53 | ఈ మిషన్ గురించి స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. |
12:05 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు. |