LibreOffice-Suite-Base/C4/Indexes-Table-Filter-SQL-Command-window/Telugu
From Script | Spoken-Tutorial
| Time | Narration |
| 00:00 | LibreOffice Base నందు Spoken tutorial కు స్వాగతం |
| 00:03 | ఈ ట్యుటోరియాల్లో మనం Indexes Table Filter మరియు the SQL Command window గురించి నేర్చుకుందాం |
| 00:14 | ముందు Index గురించి నేర్చుకుందాం |
| 00:16 | Index అంటే ఏమిటి? |
| 00:18 | ఇండెక్స్ database table లోని recordలను కనుగొనుటకు మరియు సార్ట్ చేయుటకు ఒక పద్దతి. |
| 00:26 | మనము ఒక table లో ఒక field లేదా అనేక fieldsలను ఎన్నుకోవచ్చు. |
| 00:36 | మనం ఎన్నుకున్నfield లేదా fields ని బట్టి ఇండెక్స్ రికార్డుల ప్రదేశాన్ని భద్రపరుస్తుంది |
| 00:43 | కాబట్టి డాటాను తిరిగి పొందటానికి Base ను ఉపయోగించి ఆ ప్రదేశానికి నేరుగా చేరుకోవచ్చు. |
| 00:51 | కాబట్టి కావలసిన డేటా ను కనుగొనడానికి ఇది మిగిలిన పద్ధతులకంటే వేగవంతంగా ఉంటుంది. |
| 00:59 | పట్టిక యొక్క primary key స్వయంగా ఇండెక్స్ చేయబడుతుంది |
| 01:03 | ఉదాహరణకు మన Library డేటాబేస్ లో ఒక ఇండెక్స్ ను తయారు చేద్దాం |
| 01:09 | మనం Books పట్టికలో Title కాలమ్ పై ఇండెక్స్ తయారు చేయడం వలన పుస్త్తకాల టైటిల్ పై వెతకటం ను వేగవంతం చేయవచ్చు. |
| 01:18 | తెరచి ఉండకపోతే, ముందుగా Library డాటాబేస్ ను తెరవాలి. |
| 01:34 | Edit మోడ్ లో Books పట్టికను తెరవండి |
| 01:39 | Table Design విండోలో Tools మెనూ కి వెళ్ళి Index Design ను ఎన్నుకొనండి |
| 01:48 | Indexesవిండో లో, Base Primary Key ని ఒక Unique ఇండెక్స్ గా తీసుకొనుట గమనించవచ్చు. |
| 01:57 | మనం ఇండెక్స్ ను తయారుచేయడానికి ఎడమవైపున ఉన్న New Index ఐకాన్ ను ఎన్నుకోవాలి. |
| 02:05 | కుడివైపు ఉన్న Index ఫీల్డ్ కింద డ్రాప్-డౌన్ జాబితా నుండి Title ను ఎంచుకోండి. |
| 02:14 | ఇక్కడ మనము Ascending లేదా Descending ను కూడా ఎన్నుకోవచ్చు |
| 02:19 | ఎడమవైపు ఉన్న మూడవ ఐకాన్ పై క్లిక్ చేసి ఈ ఇండెక్స్ ను IDX_Title గా rename చేసి, దాని ప్రక్కన ఉన్న Save ఐకాన్ ను ఉపయోగించి సేవ్ చెయ్యండి. |
| 02:37 | కాబట్టి అక్కడ Title ఫీల్డ్ లో మన ఇండెక్స్ ఉంది |
| 02:42 | ఈ విధంగా మనం Base ను ఉపయోగించి పట్టికలు కోసం సూచికలు సృష్టించవచ్చు, సవరించవచ్చు, పేరు మార్చవచ్చు లేదా తొలగించవచ్చు. |
| 02:51 | ఇక్కడ మీకొరకు ఒక అస్సైన్మెంట్ ఉంది |
| 02:54 | Members పట్టికలో పేర్ల ఆధారంగా ఒక ఇండెక్స్ ను తయారుచేసి దానికి IDX_MemberName అని పేరు ఇవ్వండి. |
| 03:03 | Table Filter అంటే ఏమిటో చూద్దాం. |
| 03:07 | Table Filter ఫీచర్, ఇతర అప్లికేషన్ల నుండి, Base డాటాబేస్ లోని పట్టికలను దాచడానికి ఉపయోగపడుతుంది |
| 03:15 | Library database లోని Books పట్టిక మినహా అన్ని పట్టికలను దాచుదాం. |
| 03:22 | Tools మెనూ లో Table Filter అందుబాటులో ఉంటుంది |
| 03:27 | ఇక్కడ All Views ను చెక్(మార్క్) చేసి, Books పట్టికను చెక్(మార్క్) చేద్దాం. |
| 03:33 | అంటే Books పట్టిక మాత్రమే ఇతర అప్లికేషన్లకు కనపడేలా తయారుచేశాం |
| 03:39 | ఇప్పుడు OK బటన్ పై క్లిక్ చేద్దాం. |
| 03:43 | తరువాత View మెనుపై క్లిక్ చేసి Refresh Tables పై క్లిక్ చేద్దాం |
| 03:50 | ఇక్కడ కేవలం Books పట్టిక మాత్రమే కనిపిస్తుందని గమనించాలి. |
| 03:54 | మనం LibreOffice Writer or Calc నుండి డాటాను యాక్సెస్ చేస్తున్నప్పుడు కేవలం Books పట్టిక మాత్రమే కనిపిస్తుంది |
| 04:04 | ఇక్కడ మరొక అస్సైన్మెంట్ ఉంది |
| 04:06 | LibreOffice Writer ను ఓపెన్ చేసి Library డాటాబేస్ ను యాక్సెస్ చేసి అందుబాటులో ఉన్న పట్టికలను పరీక్షించండి |
| 04:14 | అన్ని పట్టికలను Base లో కనపడేలా చేయండి. |
| 04:19 | LibreOffice Writer మరల ఓపెన్ చేసి, పట్టికలు అందుబాటులో ఉన్నవో లేవో చూడండి |
| 04:26 | చివరిగా SQL command window గురించి తెలుసుకుందాం |
| 04:31 | Tools మెనూ నుండి SQL ను ఎంచుకొనుట ద్వారా SQL command window యాక్సెస్ చేయబడింది |
| 04:41 | databaseకు SQL statements జారీ చేయడానికి మనం ఈ విండోను ఉపయోగించవచ్చు. |
| 04:47 | ఇప్పుడు, SQL queriesను అమలు చేయడానికి మనం Queries ను కూడా ఉపయోగించవచ్చు, కానీ డేటాబేస్ నుండి డేటాను అడగడానికి మాత్రమే మనకు అనుమతి ఉంది. |
| 04:59 | అంటే మనం కేవలం SELECT statementsను మాత్రమే జారిచేయగలం. |
| 05:04 | కానీ మనము డేటా ను మార్చే మరియు టేబుల్ స్ట్రక్చర్లను సవరించే లేదా కొత్త పట్టికలు సృష్టించే SQL స్టేట్మెంట్స్ ను execute చేయలేము. |
| 05:14 | అంతేకాకుండా, SQL command window data manipulation మరియు data definition లకు ఉపయోగపడుతుంది |
| 05:24 | Data Manipulation Language లేదా DML కి ఉదాహరణ |
| 05:31 | INSERT, UPDATE and DELETE data. |
| 05:37 | Data Definition Language లేదా DDL కి ఉదాహరణ |
| 05:45 | CREATE TABLE, DROP TABLE and ALTER statements. |
| 05:51 | ముందు మనం DML ఉదాహరణలను చూద్దాం |
| 05:55 | Base విండోలో Tools మెనూ నుండి SQL Command Window ను ఓపెన్ చేద్దాం |
| 06:02 | “Command to execute” టెక్స్ట్ ఏరియా లో క్రింది కమాండ్ టైప్ చేసి Books పట్టికలో కొత్త రికార్డు ను చేర్చవచ్చు |
| 06:12 | INSERT INTO "Books" ( "Title", "Author", "PublishYear", "Publisher", "Price")
VALUES (The Hobbit, J.R.R Tolkien, 2002, Oxford, 500); |
| 06:45 | Execute బటన్ను క్లిక్ చేసే ముందు,కమాండ్ ను కొంచెం జాగ్రత్తగా గమనించండి |
| 06:52 | INSERT స్టేట్మెంట్ table పేరు మరియు field పేరును సూచిస్తుంది మరియు Values కొత్త చేర్చే రికార్డులను సూచిస్తుంది |
| 07:03 | పట్టిక పేరు మరియు ఫీల్డ్ పేర్లు డబుల్ కోట్స్లో మూసివేయబడతాయని గమనించండి. |
| 07:11 | మనకు బేస్ కేస్ సెన్సిటివ్ అని తెలుసు మరియు డబుల్ కోట్స్, బేస్ ,పేర్లను సృష్టించినట్లుగా ఆమోదించుతుంది. |
| 07:22 | మనం కోట్స్ ఉపయోగించకుంటే, బేస్ స్వయంచాలకంగా , అన్ని పేర్లను ఎగువ కేసు అంటే upper case కు మారుస్తుంది. |
| 07:31 | డేటా టైప్ TEXT లో ఉన్న విలువలకు సింగల్ కోట్స్ ఉపయోగించాలి. |
| 07:37 | NUMERIC ఫీల్డ్స్ కు ఏ కోట్స్లోనూ ఉండకూడదు. |
| 07:43 | అదేవిధంగా AutoNumber ను కలిగిఉన్న BookId ఫీల్డ్ ను జోడించకూడదు |
| 07:51 | Base auto-generating సంఖ్య గురించి చూసుకుంటుంది.జాగ్రత్త తీసుకుంటుంది. |
| 07:56 | SQL ను గమనించండి. Command successfully executed అనే ఆదేశాన్ని గమనించండి |
| 08:05 | మనం రాసిన SQLలో తప్పులున్నట్లయితే , బేస్ వాటిని చూపుతుంది. |
| 08:12 | Books పై డబుల్ క్లిక్ చేసి, మనం చేర్చిన కొత్త రికార్డును చూడండి |
| 08:18 | ఇది చివరి వరుసలో చేర్చబడినది. |
| 08:23 | తరువాత DDL కు ఒక ఉదాహరణను చూద్దాం |
| 08:27 | మనము AuthorId, Author and Country అనే ఫీల్డ్స్ తో Authors అనే కొత్త పట్టికను తయారు చేద్దాం. |
| 08:36 | SQL command window లో ,తెరపై కనిపించిన విధంగా టైప్ చేయండి. |
| 08:43 | మరియు దానిని అమలు చేయండి |
| 08:47 | Tables జాబితా కు వెళ్ళి, View మెనూ నుండి పట్టికలను Refresh చేయండి |
| 08:54 | అక్కడ మనము కొత్త గా సృష్టించిన Authors పట్టిక ఉంది. |
| 08:59 | DML, గురించి మరింత తెలుసుకోవడం కొరకు తెరపై ఉన్న వెబ్సైట్ ను సందర్శించండి |
| 09:06 | DDL గురించి మరింత తెలుసుకోవాలంటే తెరపై చూపబడిన వికీపీడియా వెబ్ సైట్ ను సందర్శిచండి. |
| 09:13 | ఇక్కడ మీకొరకు ఒక అస్సైన్మెంట్ ఉంది. |
| 09:16 | UPDATE స్టేట్మెంట్ ను ఉపయోగించి, BookId లో పుస్తకాల ధరలు Rs. 3 నుండి Rs. 300 వరకు ఉంచవచ్చు. |
| 09:26 | The Hobbit అనే శీర్షిక ను కలిగి ఉన్న పుస్తకాన్ని తీసివేయండి |
| 09:30 | Authors table లో author name as J.R.R. Tolkien మరియు country as England |
| 09:41 | DROP స్టేట్మెంట్ ను ఉపయోగించి, డేటాబేస్ నుండి Authors పట్టికను తీసివేయండి |
| 09:47 | ఇదిమనల్ని LibreOffice Base ట్యుటోరియల్ చివరికి తీసుకొస్తుంది |
| 09:52 | సంగ్రహించేందుకు, మనము ఈ క్రింది అంశాలను నేర్చుకున్నాము:
Indexes Table Filter మరియు the SQL Command window. |
| 10:01 | Spoken Tutorial ప్రాజెక్టు Talk to a Teacher ప్రాజెక్టులోని ఒక భాగం, ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
| 10:13 | ఈ ప్రాజెక్ట్ http://spoken-tutorial.org ద్వారా సమన్వయించబడుతుంది. |
| 10:18 | దీనిపై మరింత సమాచారం క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
| 10:22 | దీనిని అనువదించినది హరికృష్ణ. చేరినందుకు ధన్యవాదాలు. |