LibreOffice-Suite-Base/C4/Database-Design-Primary-Key-and-Relationships/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 స్పోకెన్ ట్యుటోరియల్ లిబ్రేఆఫీస్ బేస్ కు స్వాగతం
00:04 ఈ ట్యుటోరియల్ డేటాబేస్ డిజైన్ లోని మునుపటి ట్యుటోరియల్ కు కొనసాగింపు.
00:10 ఇక్కడ మనము ఈ క్రింది అంశాల గురించి నేర్చుకుంటాము
00:13 సమాచార అంశాలను కాలమ్ లుగా మార్చండం
00:17 primary keys ను పేర్కొనడం
00:20 table relationships ను సెట్ చేయడం.
00:23 క్రితం ట్యుటోరియల్లో, ఒక సాధారణ లైబ్రరీ అప్లికేషన్ కోసం మనము డేటాబేస్ రూపకల్పన ప్రక్రియను ప్రారంభించాము
00:30 లైబ్రరీ డేటాబేస్ ను నిర్మించడం లో ఉద్దేశ్యంను మొదట మనము నిర్ణయించాము.
00:36 తరువాత, మనము లైబ్రరీ గురించి సమాచారాన్ని కనుగొని, నిర్వహించడం ద్వారా ఆ ప్రక్రియను కొనసాగించాము
00:44 మనము సమాచారాన్ని పట్టికలు గా విభజించాము.
00:49 కాబట్టి, మన లైబ్రరీ డాటాబేస్లో నాలుగు పట్టికలు గుర్తించాము. Books, Authors, ublications మరియు Members.
01:00 ఇప్పుడు మనము సమాచారపు అంశాలను columns గా మార్చే తరువాత సోపానముకు వెళ్దాం.
01:07 ఇక్కడ, మనము ప్రతీ table లో భద్రపరచాలనుకుంటున్న సమాచార అంశంలను నిర్ణయించాము.
01:13 ఇంతకు ముందు మనం గుర్తించిన ప్రతి సమాచార అంశం ఫీల్డ్ అవుతుంది మరియు పట్టికలో కాలమ్ గా ప్రదర్శించబడుతుంది.
01:23 తెరపై చిత్రంలో చూపిన విధంగా, Books పట్టిక లో 5 కాలమ్ లు ఉన్నాయి, ఇవి ఫీల్డ్స్ అని కూడా పిలువబడతాయి.
01:31 కాబట్టి, ఇక్కడ ప్రతి వరుస లేదా రికార్డు దాని కాలమ్ లలో సరిగ్గా ఒక పుస్తకం గురించిన సమాచారాన్ని కలిగి ఉంది.
01:40 అదే విధంగా, Authors పట్టికలోని ప్రతి రికార్డు కేవలం ఒక రచయిత గురించి సమాచారాన్ని కలిగి ఉంది.
01:49 Publishers పట్టికలో ప్రతి రికార్డు కేవలం ఒక ప్రచురణకర్త గురించి సమాచారాన్ని కలిగి ఉంది.
01:58 ఇప్పుడు, మన అవసరాలపై ఆధారపడి కాలమ్ లను మరింత మెరుగు పరుస్తాము.
02:04 ఉదాహరణకు, మనము Author name ను First Name మరియు Last Name గా విభజించి, క్రమబద్ధీకరించవచ్చు మరియు వెతకవచ్చు.
02:17 మరియు, మనము లెక్కల ఫలితాలను పట్టికలలో ప్రత్యేక కాలమ్ లుగా నిల్వ చేయవలసిన అవసరం లేదు
02:24 ఎందుకంటే Base మనం ఫలితాలను చూడాలనుకున్నప్పుడు లెక్కలను నిర్వహించగలదు.
02:31 ఇప్పుడు మనము పట్టికలు మరియు కాలమ్ ల గురించి స్పష్టంగా ఉన్నాము, మనము primary keys ఎలా చెప్పాలో తరువాత చూద్దాం.
02:41 primary key అంటే ఏమిటి?
02:44 ప్రతి పట్టిక , పట్టికలో నిల్వ చేసిన ఒక్కొక్క వరుసను గుర్తించే కాలమ్ లేదా నిలువు వరుసలను కలిగి ఉండాలి.
02:54 ఈ కాలమ్ లేదా కాలమ్స్ table యొక్క primary key గా చెప్పబడతాయి.
03:00 ఇది తరచుగా ఒక Book Id లేదా ఒక Author Id వంటి ఏకైక గుర్తింపు సంఖ్య.
03:08 బహుళ పట్టికల నుండి తార్కిక సంబంధిత డేటాను త్వరితంగా అనుసంధానించడానికి డేటాను కలిపి తీసుకురావడానికి primary key ఫీల్డ్స్ ను ఉపయోగించవచ్చు.
03:21 ఒక primary key లో నకిలీ విలువలను కలిగి ఉండము.
03:26 ఉదాహరణకు, పేర్లు ఏకైకం కానందున ప్రజల పేర్లను primary key గా ఉపయోగించలేము.
03:34 ఒకే పట్టికలో ఒకే పేరుతో ఇద్దరు వ్యక్తులు ఉండవచ్చు.
03:40 తరువాత,primary key ఎల్లప్పుడూ విలువ ను కలిగి ఉంటుంది.
03:45 అది ఖాళీగా ఉంటే లేదా Null అయితే దానిని primary key గా పరిగణించలేము.
03:52 primary key కాలమ్ యొక్క డేటా టైప్ ను ‘AutoNumber’ గా చేయుట ద్వారా Base ఆటోమేటిక్ గా ఒక విలువను ఉత్పత్తి చెయ్యడం ద్వారా primary key కాలమ్ లో ఎల్లప్పుడూ ఓక విలువ ఉండే విధంగా చేయవచ్చు.
04:09 తెరపై ఇమేజ్ లో చూపిన విధంగా, మా పట్టికల కు మనము ఈ క్రింది ప్రాథమిక కీలను సెటప్ చేయవచ్చు:
04:20 Books టేబుల్ కై BookId.
04:24 Authors టేబుల్ కై AuthorId
04:28 Publishers table కై PublishersId.
04:33 ఇదేవిధంగా, ఇక్కడ చూపించకపోయినా, Members table కై పట్టిక కోసం MemberId primary key అవుతుంది.
04:42 చివరగా, పట్టిలకు primary keysను ఏర్పాటు చేయడం ద్వారా మనముEntity Integrity ను అమలు చేస్తున్నాము.
04:52 Entity Integrity పట్టికలో నకిలీ రికార్డులు లేవు అని నిర్ధారిస్తుంది.
05:00 టేబుల్ లోపల ప్రతి రికార్డును గుర్తించే ఫీల్డ్ ప్రత్యేకమైనది మరియు ఇది శూన్యం కాదని కూడా ఇది నిర్ధారిస్తుంది.
05:10 ఇప్పుడు మనము మూడు పట్టికలలో ప్రాధమిక కీలు కలిగి ఉన్నాము, వాటి మధ్య relationships ఏర్పాటు చేయడం ద్వారా వాటిని అన్నింటినీ కలిపవచ్చు.
05:20 Base ఈ భావనకి మద్దతు ఇచ్చినందున, బేస్ ను Relational Database Management System, RDBMS అని పిలుస్తారు.
05:32 relationships వివిధ రకాలు ఉన్నాయి. మనము ఇప్పుడు వాటిని చూస్తాము.
05:37 మొదటిది One-to-Many relationship.
05:43 ఇప్పుడు మనము చిత్రంలో చూపిన Books మరియు the Authors పట్టికలు చూద్దాం.
05:49 ఒక పుస్తకం ఖచ్చితంగా ఒక రచయిత వ్రాయబడినది.
05:55 ఇప్పుడు, ఒకే పుస్తకం కు రెండు లేదా అంతకంటే ఎక్కువ మంది సహ రచయితగా ఉన్న సందర్భాలున్నాయి.
06:02 కానీ మన ఉదాహరణను మనము ఒక పుస్తకము యొక్క రచయిత గా ఒక వ్యక్తికి పరిమితం చేస్తాము.
06:10 మన ఉదాహరణతో కొనసాగుతూ, ఒక రచయిత అనేక పుస్తకాలను వ్రాయవచ్చు.
06:17 కాబట్టి, రచయిత Authors పట్టికలో ఒక రచయిత ప్రాతినిధ్యం వహించగా, Books పట్టికలో రచయిత వ్రాసిన అనేక పుస్తకాలు ఉన్నాయి.
06:28 అందువలన ఇది one-to-many relationship.
06:32 మనము దీనినిLibrary database లో సూచించవచ్చు.
06:36 Author Id ను Authors పట్టికలో primary key గా తీసుకొని Books టేబుల్ కు దానిని జోడించడం. ఇది చాలా తేలిక.
06:46 కాబట్టి, Books పట్టికలోని Author Id , Foreign key గా పిలువబడుతుంది.
06:53 అదే విధంగా Publishers పట్టికలో primary key ఐన Publisher Id, Books పట్టికలో చేర్చుట ద్వారా అక్కడ foreign key అవుతుంది.
07:06 కాబట్టి, ఒకకాలమ్ లేదా కాలమ్ లను పంచడం ద్వారా, మనము డేటాబేస్లో one-to-many relationships ను ఏర్పర్చవచ్చు.
07:17 table relationships లను Foreign keys లను ఉపయోగించి అమర్చవచ్చు.
07:23 కాబట్టి, ఒక పట్టికలో primary key అనేది relationship ను స్థాపించడానికి రెండవ పట్టికలో foreign key గా సూచించబడుతుంది.
07:34 తద్వారా మనము Referential integrity ను అమలు చేస్తాము.
07:39 అంటే, ఒక పట్టికలోని ప్రతి foreign key విలువ సంబంధిత పట్టికలలో సరిపోలే primary key విలువను కలిగి ఉంటుంది.
07:50 తరువాత, Many-to-Many relationship అంటే ఏమిటో చూద్దాం.
07:56 ఇప్పుడు మనము table design కు తిరిగి వెళ్దాము.
07:59 ఒక పుస్తకాన్ని ఎంతమంది గ్రంథాలయ సభ్యులకైనా జారీ చేయవచ్చు (అక్కడ అనేక కాపీలు అందుబాటులో ఉన్నాయి అనుకుందాం ).
08:09 అదేవిధంగా, ఒక సభ్యుడు ఎన్ని పుస్తకాలను అయినా తీసుకోవచ్చు ( అందుబాటు లో ఉన్న పుస్తకాలను పరిగణనలోకి తీసుకోవాలనుకోండి ).
08:17 కాబట్టి, ఇక్కడ బహుళ సభ్యులకు జారీ చేయబడిన బహుళ పుస్తకాలకు ఒక ఉదాహరణ ఉంది
08:25 ఇదిMany-to-many relationship ను సూచిస్తుంది.
08:29 కాబట్టి, మన డేటాబేస్లో దీనిని many-to-many relationship గా సూచించుటకు,
08:35 Junction table గా పిలువ బడే మూడో పట్టికఅయిన, BooksIssued పట్టికను సృష్టించడం ద్వారా చేస్తాము.
08:45 ఇక్కడ, Books మరియు Members పట్టికలలోని primary keys లను BooksIssued పట్టికలో ఇన్సర్ట్ చేస్తాము.
08:57 ఫలితంగా,BooksIssued టేబుల్, ప్రతి సభ్యునికి ఇష్యూ చేసే రికార్డును కలిగి ఉంటుంది.
09:05 కాబట్టి, మూడవ జంక్షన్ పట్టికను సృష్టించడం ద్వారా many-to-many relationships లు ప్రాతినిధ్యం వహించగలము.
09:13 చివరికి అక్కడ One-to-one relationship ఉంది.
09:18 కొన్ని సందర్భాల్లో, కొన్ని attributes లేదా columns నిర్దిష్ట డేటాకు మాత్రమే ప్రత్యేకమైనవి మరియు అరుదుగా డేటాతో పూరించబడతాయి..
09:30 ఒక రచయిత మాత్రమే వెబ్సైట్ చిరునామాను కలిగి ఉండి, మిగిలిన వారు కలిగి ఉండని సందర్భమును పరిశీలిద్దాం.
09:38 Authors పట్టికలో కొత్త వెబ్సైట్ కాలమ్ ని వదిలివేస్తే, మనం ఎక్కువ డిస్క్ స్థలాన్ని వినియోగిస్తాము.
09:47 కాబట్టి, ఈ కాలమ్ ను ఒక క్రొత్త అనుబంధ పట్టికగా మార్చవచ్చు, దీని primary key Author Id గా ఉంటుంది..
09:58 అనుబంధ పట్టికలో ప్రతి రికార్డు ప్రధాన పట్టికలో సరిగ్గా ఒక రికార్డుగా ఉంటుంది
10:06 ఇది One-to-one relationship ను సూచిస్తుంది.
10:10 కాబట్టి, మన డేటాబేస్లో relationships ను ఏర్పాటు చేయడం నేర్చుకున్నాము.
10:15 ఇది LibreOffice Base లోని Database Design యొక్క రెండవ భాగం పై ట్యుటోరియల్ చివరకు తీసుకువస్తుంది.
10:23 సంగ్రహించేందుకు, డేటాబేస్ రూపకల్పనపై మేము ఈ క్రింది అంశాలను నేర్చుకున్నాము:
10:28 సమాచార అంశాలను కాలమ్స్ గా మార్చడం,
10:32 primary keys లను పేర్కొనడం,
10:34 పట్టికల మధ్య సంబంధాలను సెటప్ చేయడం.
10:38 Spoken Tutorial ప్రాజెక్ట్ అనేది Talk to a Teacher లో భాగం. దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
10:48 ఈ ప్రాజెక్ట్ http://spoken-tutorial.org ద్వారా సమన్వయించబడుతుంది.
10:54 దీనిపై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది..
10:58 దీనిని అనువదించినది హరికృష్ణ. చేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Yogananda.india