LibreOffice-Suite-Base/C2/Create-queries-using-Query-Wizard/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:02 లిబ్రేఆఫీస్ బేస్ లో స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్లో మనము నేర్చుకొనేవి-

Query wizard ను ఉపయోగించి క్వరీ ను సృష్టించుట. ఫీల్డ్స్ ను ఎంచుకొనుట, అలియాస్ ఏర్పాటు చేయుట, మరియు క్రమబద్ధీకరణ క్రమాన్ని ఏర్పాటు చేయుట. ఒక క్వరీకు వెతుకుటకు ప్రమాణం తెలుపుట నేర్చుకుంటాము.

00:24 ముందుగా, క్వరీ అంటే ఏమిటి? అని నేర్చుకుందాం.
00:29 ఒక డేటాబేస్ నుండి నిర్దిష్టమైన సమాచారాన్ని పొందడానికి ఒక క్వరీ ను ఉపయోగించవచ్చు.
00:36 వేరొక విధంగా చెప్పాలంటే, ఇచ్చిన ప్రమాణంతో సరిపోయే కొంత డేటా కోసం డేటాబేస్ కు క్వరీ ను ఇవ్వవచ్చు.
00:48 ఉదాహరణకు, మనకు తెలిసిన లైబ్రరీ డేటాబేస్ ను ఉదాహరణ గా తీసుకుందాం.
00:56 మనము మన లైబ్రరి డాటాబేస్ లో పుస్తకాలు మరియు సభ్యుల గురించి సమాచారాన్ని నిల్వ చేసాము.
01:04 ఇప్పుడు లైబ్రరీలోని సభ్యులందరి వివరాల కోసం లైబ్రరి డాటాబేస్ కు ఒక క్వరీ ను ఇవ్వవచ్చు.
01:12 లేదా, లైబ్రరీలో లేని అన్ని పుస్తకాల వివరాలకు డేటాబేస్ కు ఒక క్వరీ ను ఇవ్వవచ్చు.
01:21 బేస్ ఉపయోగించి మనము సాధారణ క్వరీ ను ఎలా సృష్టించాలో చూద్దాం.
01:30 మన ఉదాహరణ, లైబ్రరీ లోని సభ్యుల అందరి వివరాలను, వారి ఫోన్ నంబర్లతో పాటు జాబితా గా ఇస్తుంది.
01:44 మనము లైబ్రరీ డేటాబేస్ లో ఉన్నాము. దీన్ని ఇప్పుడు ఎలా తెరవాలో బహుశా మీకు తెలిసి ఉండవచ్చు.
01:51 ఎడమ ప్యానెల్లోని Queries ఐకాన్ పై క్లిక్ చేద్దాం.
01:57 కుడివైపున ప్యానెల్లో, మనము మూడు ఎంపికలను చూస్తాము.
02:03 మనము ముందుగా సరళమైన క్వరీను సృష్టిస్తున్నందున, సులభమైన మరియు వేగవంతమైన పద్ధతిని ఎన్నుకుంటాం.
02:11 అనగా Query Wizard.
02:17 సంక్లిష్ట క్వరీలను సృష్టించడం కోసం, బేస్, మనకు Create Query in Design View మరియు Create Query in SQL view
02:28 లాంటి చాలా సులభ ఎంపికలను అందిస్తుంది. వీటి గురించి తరువాత నేర్చుకుందాం.
02:36 ఇప్పటికి, Use Wizard to Create Query పై క్లిక్ చేద్దాం.
02:43 ఇప్పుడు, Query Wizard అని ప్రదర్శిస్తున్న ఒక pop-up window -ను చూడవచ్చు.
02:50 ఎడమవైపున, మనం పాటించవలసిన 8-సోపానాలు ఉన్నాయి.
02:57 మనం ఇప్పుడు Step 1 - Field Selection లో ఉన్నాము.
03:03 కుడివైపున, టేబుల్స్ అనే లేబిల్ క్రిందన ఒక డ్రాప్ డౌన్ బాక్స్ చూడవచ్చు.
03:11 క్వరీ కు అవసరమైన డేటా యొక్క సోర్స్ గా దీనిని ఎంచుకుంటాము.
03:21 మన మాదిరి క్వరీ, లైబ్రరీ లో గల మెంబర్స్ యొక్క లిస్ట్ కాబట్టి, మనం డ్రాప్ డౌన్ నుండి Tables: Members పై క్లిక్ చేస్తాము.
03:35 ఇప్పుడు, Available fields లిస్ట్ నుండి Name ఫీల్డ్ పై డబల్ క్లిక్ చేసి, కుడివైపున గల లిస్ట్ బాక్స్ కు పంపండి.
03:50 తరువాత, ఎడమవైపునుండి, Phone ఫీల్డ్ పై క్లిక్ చేసి, కుడి వైపుకు పంపండి.
04:00 ఒకేసారి అన్నీ ఫీల్డ్స్ ను పంపాలంటే, కుడి వైపుకు తిరిగి ఉన్న డబల్ యారో ను ఉపయోగించవచ్చు.
04:09 క్రిందన గల Next పై క్లిక్ చేయండి.
04:15 ఇప్పుడు మనం Step 2 - Sorting Order లో ఉన్నాము.
04:20 మన క్వరీ ఫలితం సభ్యుల జాబితా మరియు వారి ఫోన్ నంబర్లు కాబట్టి, మనము దీనిని వదిలిపెట్టవచ్చు.
04:30 లేదా మనం లిస్ట్ ను మెంబర్స్ పేర్ల ఆధారంగా క్రమంలో ఉంచవచ్చు.
04:36 బేస్ విజార్డ్ నందు ఫలిత జాబితాను ఒకే సమయంలో 4 ఫీల్డ్స్ ను ఉపయోగించి, క్రమబద్ధీకరించవచ్చు.
04:45 ఇప్పటికి, నేను, అన్నింటికన్నా పైనున్న డ్రాప్ డౌన్ బాక్స్ పై క్లిక్ చేసి,
04:51 మెంబెర్స్.నేమ్ పై క్లిక్ చేస్తాను.
04:55 పేర్లను ఆరోహణ లేదా అవరోహణ క్రమం లో ఉంచాలనుకున్నా కూడా ఎంచుకోవచ్చు.
05:03 Ascending ఎంపిక పై క్లిక్ చేయండి.
05:07 తరువాత సోపానం కు వెళ్ళండి.
05:11 మూడవ సోపానం Search Conditions.
05:16 ఈ దశ లో మన ఫలితమును, కొన్ని కండిషన్స్ కు పరిమితం చేయగలము.
05:22 ఉదాహరణకు, సభ్యుని పేరు R తో మొదలయ్యే సభ్యుల వివరాలకు మాత్రమే ఫలితాన్ని పరిమితం చేయవచ్చు.
05:34 దీనికై, Fields డ్రాప్ డౌన్ బటన్ పై క్లిక్ చేసి, Members.Name పై క్లిక్ చేయండి.
05:45 ఇప్పుడు, కండిషన్ డ్రాప్-డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి.
05:51 ఇక్కడ వివిధ కండిషన్స్ గమనించండి.
05:58 like పై క్లిక్ చేద్దాము.
06:02 Value టెక్స్ట్ బాక్స్ లో, capital R మరియు percentage symbolలను టైప్ చేద్దాము.
06:13 ఈ విధంగా సరళమైన మరియు సంక్లిష్ట మైన కండిషన్స్ ను మన క్వరీ లో ఉంచగలము
06:22 ఇప్పుడు మనం సభ్యులందరి జాబితా పొందుటకు Value టెక్స్ట్ బాక్స్ నుంచి R% ను తొలగించి, Next బటన్ పై క్లిక్ చేయండి.
06:37 మనం 7వదశ ను వదలివేశామని దయచేసి గమనించండి.
06:43 ఇది ఎందువల్లనంటే, మనం క్వరీ ను ఒకే table నుండి సృష్టిస్తున్నాము.
06:51 అదేవిధంగా, క్వరీ, సమ్మరీ కాకుండా, details మాత్రమే రిటర్న్ చేస్తుంది.
06:57 సమ్మరీ క్వరీస్, aggregate ఫంక్షన్ల నుండి, డేటా ను సమూహంచేసి ఫలితం ను చూపును.
07:05 కొన్ని ఉదాహరణలు, మొత్తం సభ్యుల సంఖ్య లేదా అన్ని పుస్తకాల ధరల మొత్తం.
07:13 మనము వీటి గురించి తరువాత నేర్చుకుంటాము.
07:17 సరే, ఇప్పుడు మనం మారుపేర్లను సెట్ చేద్దాము,
07:23 అంటే, ఫలిత జాబితాలో స్నేహపూర్వక మరియు వివరణాత్మక లేబుళ్ళు లేదా శీర్షికలను అందించుదాం.
07:32 కాబట్టి నేమ్ ఫీల్డ్ అలియాస్ గా Member Name ను మరియు ఫోన్ ఫీల్డ్ అలియాస్ గా ఫోన్ నంబర్ ను కలిగి ఉంటుంది.
07:46 కాబట్టి, ఈ రెండు టెక్స్ట్ బాక్సుల్లో, కొత్త మారుపేరులను టైప్ చేసి, Next బటన్ పై క్లిక్ చేయండి.
07:57 ఇప్పుడు, మనము Step 8 - final step లో ఉన్నాము.
08:03 ఇక్కడ మన సింపుల్ క్వరీ కు మంచి వివరణాత్మక పేరు ఇవ్వండి.
08:09 Name of the Query అనే లేబుల్ కు ఎదురుగా List of all members and their phone numbers అని టైప్ చేయండి.
08:20 విజార్డ్ లో మన ఎంపికల యొక్క అవలోకనాన్ని మనము చూస్తాము అని గమనించండి.
08:27 ఇక్కడ నుండి మనము ముందుకు ఎలా వెళ్ళాలని అనుకుంటున్నారు?
08:31 ఎగువ కుడి వైపున ఉన్న Display Query ఎంపికపై క్లిక్ చేసి Finish బటన్ పై క్లిక్ చేయండి.
08:41 విజర్డ్ విండో మూసివేసింది. అక్కడ List of all members and their phone numbers శీర్షిక తో ఒక కొత్త విండో తెరవబడినది.
08:52 మనం Members టేబుల్ లో ఫోన్ నెంబర్ల తో సహా ఎంటర్ చేసిన నలుగురి సభ్యుల వివరాలు చూడవచ్చు.
09:04 అలాగే, ఈ జాబితా అక్షర క్రమంలో ఏర్పాటు చేయబడిందని చూస్తారు.
09:13 కాబట్టి ఇది మన మొదటి సాధారణ క్వరీ.
09:18 ఇక్కడ ఒక assignment.
09:21 అన్ని పుస్తకాలను ఆరోహణ క్రమంలో జాబితాగా చేసే ఒక క్వరీ ను సృష్టించండి.
09:28 అన్ని ఫీల్డ్స్ ను చేర్చండి.
09:31 List of all books in the Library గా పేరు పెట్టండి
09:38 దీనితో మనము Creating Queries using Wizard in LibreOffice Base పై ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
09:45 సంగ్రహంగా, మనము నేర్చుకున్నది. Query wizard ను ఉపయోగించి సాధారణ క్వరీలను, సృష్టించుట, ఫీల్డ్స్ ను ఎంచుకొనుట, ఫీల్డ్స్ యొక్క క్రమమును సెట్ చేయుట, ఒక క్వరీకు వెతుకుటకు ప్రమాణం తెలుపుట.
10:00 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
10:12 ఇది http://spoken-tutorial.org చే నిర్వహించబడుతుంది.
10:17 దీనిపై మరింత సమాచారం ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉంది.
10:22 ఈ లిపికి దోహదపడింది ప్రియ సురేష్, దేసీక్రూ సొల్యూషన్స్. అనువదించినది స్వామి. చేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india