LaTeX/C2/Mathematical-Typesetting/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 LaTeX లో Mathematical Typesetting పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం
00:06 నా పేరు కన్నన్ మౌడ్గల్య(Kannan Moudgalya)
00:08 గుర్తుంచుకోండి: మన ము దీనిని లేటెక్ అని పిలుస్తాము, లేటెక్స్ అని కాదు.
00:15 ఈ ట్యుటోరియల్లో, LaTeX లో గణిత సంకేతాలను ఎలా సృష్టించడం
00:20 మరి ముఖ్యంగా, mathematical మోడ్ కు వెళ్ళటం మరియు బయటకు రావటం. స్పేస్ యొక్క పాత్ర మరియు దానిని సృష్టించడం,
00:29 గణిత చిహ్నాలు,
00:31 చివరగా, A M S math ప్యాకేజీ మరియు matrices సృష్టించడంలో దాని ఉపయోగం ను నేర్చుకుందాము.
00:37 నేను ఈ ట్యుటోరియల్ను 10,000 రూపాయిలు కంటే తక్కువ విలువ ఉన్న మా ల్యాప్ టాప్ లో సృష్టిస్తున్నాను.
00:43 నేను Ubuntu, TeXworks మరియు LaTeX ను ఉపయోగిస్తున్నాను
00:47 LaTeX గురించి స్పోకెన్ ట్యుటోరియల్లో బేసిక్ పాయింట్స్ క్రిందన ఇవ్వబడ్డాయి
00:53 side-by-side ట్యుటోరియల్స్ గురించి నేర్చుకొనండి.
00:56 అవి అన్నీ మా వెబ్సైట్ నుండి అందుబాటులో ఉంటాయి
01:00 నేను maths.tex ఫైల్ ను వాడతాను.
01:04 ఇది మీకు ఈ ట్యుటోరియల్ వెబ్ పేజీలో కోడ్ ఫైల్ గా అందుబాటులో ఉంది
01:11 అదే చోట, మీరు "TeX user group, India" నుండి pdf file ను కనుగొంటారు.
01:17 మనము అసైన్మెంట్స్ ను చేస్తున్నప్పుడు దానిని వాడతాము
01:20 ఇప్పుడు TeXworks విండోస్ కి వెళ్దాం.
01:24 నేను ఇప్పటికే maths.tex ఫైల్ ను తెరిచాను.
01:27 దయచేసి ఈ ఫైల్ ను డౌన్లోడ్ చేసి, నాతో పాటు సాధన చేయండి.
01:32 మనము ఇప్పటికే ఈ ఫైలు మొదట్లో ఉన్న కమాండ్స్ చూసాము.
01:36 ఈ కమాండ్ paragraph indent ను తొలగిస్తుంది.
01:42 మనం ఈ అసైన్మెంట్ ద్వారా ఈ స్టేట్మెంట్ యొక్క ప్రభావాన్ని అధ్యయనం చేస్తాము.
01:47 మనం గణిత శాస్త్రంలో ఉపయోగించబడుతున్న గ్రీకు చిహ్నాలతో ప్రారంభిద్దాం.
01:52 LaTeX ను గణిత మోడ్ లోకి మార్చడానికి మనం డాలర్ గుర్తును ఉపయోగిస్తాము.
01:57 మనం ఆల్ఫాతో ప్రారంభిద్దాం, dollar back slash alpha dollar అని వ్రాద్దాం.
02:06 ఇప్పుడు కంపైల్ చేద్దాము, PDF ఫైల్ లో గ్రీకు అక్షరం alpha , కనబడింది చూడండి.
02:15 మొదటి డాలర్ గుర్తు మనం గణితశాస్త్ర నమూనాలోకి ప్రవేశిస్తున్నామని చెబుతుంది.
02:20 రెండవ డాలర్ మనం ఈ మోడ్ ను వదిలేస్తున్నామని చెబుతుంది.
02:24 ఇప్పటి నుండి, నేను స్పష్టంగా డాలర్ లేదా బ్యాక్ స్లాష్ గురించి ప్రస్తావించను.
02:30 కానీ మీరు తెరపై ఏమిటి చూస్తున్నారో సరిగ్గా అదే చేయవలసి ఉంటుంది.
02:34 అదేవిధంగా మనం బీటా, గామా మరియు డెల్టా అని వ్రాద్దాం, ఇప్పడు కంపైల్ చేద్దాం.
02:50 tex ఫైల్ నేను సేవ్ చేయలేదు, ఎందుకంటే, TeXworks దానిని స్వయంచాలకంగా సేవ్ చేస్తుంది.
02:56 వీటిని తొలగించుదాం.
03:00 మనం తరువాత వివరించేది, గణితశాస్త్ర వ్యక్తీకరణలో space s ను తీసుకురావటం.
03:05 alpha a , అనగా , alpha మరియు a ల యొక్క లబ్దం ను ఎలా సృష్టిస్తాం
03:12 మనం alpha a ను ప్రయత్నిద్దాం .
03:17 నన్ను కంపైల్ చేయనివ్వండి.
03:21 alfa నిర్వచించబడని ఒక నియంత్రణ శ్రేణి అని LaTeX చెబుతుంది.
03:27 ఇది ఈ కమాండ్ ని అర్థం చేసుకోలేదని చెప్పింది. దీనిని మూసి చేయనివ్వండి.
03:34 LaTeX ప్రతి కమాండ్ తరువాత ఒక space చే దీనిని నిర్వహిస్తుంది.
03:39 మనం alfa తర్వాత ఒక space ను వదిలివేద్దాం.
03:44 కంపైలేషన్ ను రద్దు చేద్దాం. మళ్ళీ కంపైల్ చేద్దాం. ఇది సమస్యను పరిష్కరించింది.
03:52 ఇది కమాండ్ ని రద్దు చేయడానికి ఉపయోగించబడుతుంది, space PDFలో కనిపించదు.
03:57 output లో spaces ను ప్రవేశపెట్టాలంటే మనం ఏమి చేద్దాము?
04:03 ఇప్పుడు మనం చేస్తున్నట్లుగా LaTeX కు స్పష్టంగా తెలియజేయాలి.
04:07 కొత్త లైన్ ను ప్రారంభించడానికి LaTeX ను అడుగుదాం.
04:11 alpha backslash space a ను వ్రాద్దాము.
04:17 దీనిని కంపైల్ చేయండి.
04:20 ఇది space ను సృష్టించింది.
04:23 మీకు మరింత space కావాలనుకుంటే, ఇప్పుడు మనం చేస్తున్నట్లుగా quad ను ఉపయోగించండి.
04:31 దీనిని కంపైల్ చేయండి.
04:34 క్వాడ్, ఎక్కువ స్పేస్ ను వదిలి వేసినట్లు మీరు చూడగలరు.
04:40 మనం ఇప్పుడు మరొక అంశానికి వెళదాం.
04:43 చివరి రెండు లైన్లను తొలగించండి. దీనిని కంపైల్ చేయండి.
04:50 మనం టెక్స్ట్ నుండి గణిత నమూనాకు వెళ్ళినప్పుడు ఫాంట్ ఏమౌతుంది?
04:56 దీనిని అర్థం చేసుకోవటానికి,“Product of $\alpha and a is” అని వ్రాద్దాం.
05:04 దీనిని కంపైల్ చేయండి.
05:07 ఈ రెండు a ల యొక్క ఫాంట్ భిన్నమైనదని మీరు చూడవచ్చు.
05:14 ఇది a లోపల డాలర్ సంకేతాలు వ్రాయడం ద్వారా పరిష్కరించబడుతుంది.
05:25 దీనిని కంపైల్ చేద్దాం.
05:27 ఇప్పుడు ఈ రెండు a ల యొక్క ఫాంట్లు ఒకేలా ఉన్నాయి.
05:32 భిన్నమైన ఫాంట్స్ ఉంచడం అనేది ఒక సాధారణ తప్పు.
05:37 దీనిని తొలగిద్దాం.
05:40 దీనిని కంపైల్ చేద్దాం.
05:43 ఇప్పుడు మైనస్ సంకేతాలను రూపొందించడం గురుంచి ఒక నియమాన్ని చర్చిద్దాం.
05:48 మనం minus alpha ను సృష్టించి క్రియేట చేసి, కంపైల్ చేయాలి అని అనుకుందాం.
05:58 దీనిని కంపైల్ చేద్దాం.
06:01 మైనస్ గుర్తు ఇక్కడ ఒక చిన్న డాష్ వలే కనిపించటం గమనించండి.
06:07 డాలర్ సంకేతం లోపల మైనస్ గుర్తుతో కాపీ చేద్దాం.
06:15 దీనిని మళ్ళీ కంపైల్ చేద్దాం.
06:18 ఇప్పుడు మైనస్ గుర్తులో వ్యత్యాసాన్ని చూడండి. రెండోది మనకు కావలసినది. డాష్ వలన ఉపయోగం లేదు
06:27 డాలర్ల లోపల మైనస్ గుర్తును పెట్టడం ప్రారంభ దశలో వున్న వారు చేసే సాధారణ తప్పు.
06:33 వీటన్నింటినీ తొలగించండి.
06:36 తదుపరి మనము భిన్నాలను రూపొందించడానికి ఉపయోగించే frac కమాండ్ గురించి వివరించాలనుకుంటున్నాము.
06:43 frac a b కంపైల్ చేయండి.
06:50 ఇది a by b ను క్రియేట్ చేస్తుంది. frac కమాండ్ స్పేస్ ద్వారా రద్దు చేయబడుతుంది. ఇది రెండు ఆర్గ్యుమెంట్ల కోసం చూస్తుంది.
07:00 మొదటి అక్షరం aను మొదటి ఆర్గుమెంట్ గా తీసుకుటుంది. ఇది లవము అవుతుంది.
07:07 రెండవ అక్షరం b ను, రెండవ ఆర్గుమెంట్ గా తీసుకుటుంది. అది హారం అవుతుంది.
07:13 a మరియు b ల పరిమాణాలు స్వయంచాలకంగా తగ్గాయని గమనించండి.
07:20 ఎక్కువ అక్షరాలు కలిగి ఉంటే మనం ఏమి చేయాలి?
07:24 cd by ab ను సృష్టించాలనుకుంటే, మీరు దీనిని ప్రయత్నించండి.
07:31 LaTeX లో ఒకటి కంటే ఎక్కువ అక్షరాలను గల arguments braces లలో ఉంచుతారు.
07:37 ఉదాహరణకు, ఇక్కడ braces లను ఉంచుదాం.
07:41 మనం దీనిని కంపైల్ చేసినప్పుడు, మనకు కావలసిన output ను పొందుతాము.
07:47 బ్రెసెస్ లోని అన్ని ఎంట్రీలు ఒకే ఆర్గ్యుమెంట్ గా పరిగణించబడతాయి.
07:52 దీని ఫలితంగా ఒక బ్రెసెస్ లోపల ఎంత క్లిష్టమైన వ్యక్తీకరణను అయినా నమోదు చేయవచ్చు. ఇప్పడు వీటన్నింటిని తొలగించండి.
08:01 ఇప్పుడు మనం సబ్ స్క్రిప్ట్స్ మరియు సూపర్ స్క్రిప్ట్స్ లను పరిశీలిద్దాం.
08:05 x underscore a , x sub a ను సృష్టింస్తుంది.
08:14 a యొక్క పరిమాణం స్వయంచాలకంగా సరైన స్థాయికి తగ్గించబడింది.
08:19 మనం ab ను సబ్ స్క్రిప్ట్ గా ఉంచాలనుకుంటే, మీరు బ్రెసెస్ లను ఉపయోగించాలి. అది మీరే ప్రయత్నించండి.
08:28 సూపర్ స్క్రిప్ట్లు caret లేదా up arrow తో సృష్టించబడతాయి.
08:33 ఉదాహరణకు, మీరు ఎక్స్ పవర్ త్రి ను సృష్టించాలని అనుకుంటే, మీరు x up arrow 3 అని వ్రాయాలి.
08:43 మనం సబ్ స్క్రిప్ట్ లను మరియు సూపర్ స్క్రిప్ట్ లను కూడా ఒకే సారి ఉంచవచ్చు.
08:48 ఇప్పుడు x sub a superscript b అని వ్రాద్దాం. దీనిని కంపైల్ చేద్దాం.
08:58 మరలా బ్రెసెస్ లను ఉపయోగించడం ద్వారా, మనం సంక్లిష్టమైన సబ్ స్క్రిప్ట్ మరియు సూపర్ స్క్రిప్ట్ లను తయారు చేయవచ్చు. ఇప్పుడు దీనిని తొలగిద్దాం.
09:08 తరువాత మనం Matrices (మాత్రికల) కు వెళదాం.
09:12 a m s math ప్యాకేజీ లో నేను ఇష్టపడే కొన్ని మాత్రిక నిర్వచనాలు ఉన్నాయి.
09:19 usepackage కమాండ్ ద్వారా దీనిని చేర్చండి.
09:26 ampersand చిహ్నం; ఇది కోలమ్ లను వేరు చేయడానికి ఉపయోగించే సంకేతం.
09:31 మనం ఇప్పుడు మ్యాట్రిక్స్ క్రియేట్ చేద్దాము.
09:34 మనం begin matrix a and b , end matrix అని వ్రాద్దాం. డాలర్ సంకేతాలు మర్చిపోవద్దు.
09:44 మ్యాట్రిక్స్ ని కంపైల్ చేయండి మరియు చూడండి. ఇది ఊహించిన విధంగా ఉంది.
09:49 ఇప్పుడు మనం రెండో వరుసను చేర్చాలనుకుందాం, రెండు బ్యాక్ స్లాష్ లను ఉంచుదాం. దీని అర్థం, తరువాత లైన్ కి వెళ్ళమని.
09:59 మనకు రెండవ వరుసలో, c, d, e అనే మూడు ఎంట్రీలు కావాలనుకుందాం. దీనిని కంపైల్ చేయండి, రెండో వరుస కూడా ఇప్పుడు చేర్చబడింది.
10:11 మనం begin and end వద్ద matrix ను pmatrix గా మార్చమనుకుందాం.
10:17 కంపైల్ చేసి దీనిని పొందండి.
10:21 మీరు అన్వేషించడం ప్రారంభించాల్సిన సమయం ఇది. ఇప్పుడు స్లైడ్స్ కు వెళ్ళండి.
10:28 ఈ ట్యుటోరియల్ లో మనం తెలుసుకున్న దాన్ని సంగ్రహించుదాం.
10:31 గణిత నమూనాలోకి ప్రవేశించడం మరియు నిష్క్రమించడం. స్పేస్ లు ఉపయోగించటం మరియు వాటిని సృష్టించడం.
10:37 భిన్నాలు, సబ్ స్క్రిప్ట్ మరియు సూపర్ స్క్రిప్ట్. బ్రాకెట్లలో ఒక ఆర్గ్యుమెంట్ ను నిర్వచించడం.
10:44 మాత్రికలను రూపొందించడానికి amsmath ప్యాకేజీ.
10:48 ఇప్పుడు కొన్ని అసైన్మెంట్లు ఇస్తాను.
10:51 ఈ అసైన్మెంట్ స్పేసేస్ గురించి. పెద్దవి మరియు చిన్నవి. దయచేసి వీడియోను ఆపి, స్లయిడ్ చదివి అప్పగించిన పనిని చేయండి.
11:01 ఈ అసైన్మెంట్ బ్రెసెస్ ను ఉపయోగించి fractions ను గురించి.
11:06 ఈ అసైన్మెంట్ సబ్ స్క్రిప్ట్ మరియు సూపర్ స్క్రిప్ట్ గురించి.
11:11 ఈ అసైన్మెంట్ చే మనం మాత్రికలను సృష్టించడానికి మరికొన్ని పద్ధతులను నేర్చుకుంటాము.
11:17 ఈ అసైన్మెంట్ మరిన్ని గణిత చిహ్నాలను సృష్టిస్తుంది.
11:21 ఇది TUG India LaTeX గైడ్ పై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆ డాక్యుమెంట్ ను చూద్దాము.
11:29 ఈ పత్రాన్ని మా వెబ్ పేజీ నుండి డౌన్లోడ్ చేయమని నేను ఇప్పటికే మీకు చెప్పా.
11:34 ఈ డాక్యుమెంట్లో ఇచ్చిన కొన్ని చిహ్నాలు మళ్ళీ తయారు చేస్తాము.
11:39 మీరు తరువాత అసైన్మెంట్ ద్వారా మరిన్ని చిహ్నాలకు ప్రయత్నించండి.
11:43 ఈ అసైన్మెంట్ కుడా TUG India డాక్యుమెంట్ పై ఆధారపడి ఉంది.
11:48 మీరు ఈ అసైన్మెంట్ లో పేరాగ్రాఫ్ ఇండెంట్ పై ప్రయోగాలు చేస్తారు.
11:53 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తెస్తుంది.
11:56 ఈ వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని చూపిస్తుంది.
12:00 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
12:04 మనము స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ ను నిర్వహిస్తున్నాము. సర్టిఫికేట్లు ఇవ్వబడతాయి. దయచేసి మమ్మల్ని సంప్రదించండి.
12:11 మీకు ఈ స్పోకెన్ ట్యుటోరియల్ పై ప్రశ్నలు ఉన్నాయా? దయచేసి ఈ సైట్ను సందర్శించండి, ఈ ట్యుటోరియల్ లో మీరు ప్రశ్నను కలిగి వున్న నిమిషం మరియు సెకండ్ ను choose చేయండి.
12:20 మీ ప్రశ్నను క్లుప్తంగా వివరించండి. మా బృందం నుండి ఎవరైనా సమాధానం ఇస్తారు.
12:27 ఈ ట్యుటోరియల్ లో నిర్దిష్ట ప్రశ్నల కోసం స్పోకెన్ ట్యుటోరియల్ ఫోరమ్ వున్నది. దయచేసి సంబంధంలేని మరియు సాధారణ ప్రశ్నలను పోస్ట్ చేయవద్దు.
12:36 ఇది చిందరవందరను తగ్గిస్తుంది. తక్కువ అయోమయ తో, మనము ఈ చర్చలను బోధనా సామగ్రిగా ఉపయోగించవచ్చు.
12:44 స్పోకెన్ ట్యుటోరియల్స్లో కవర్ చేయని అంశాలకు ఈ చిరునామాలో stack exchange ను సందర్శించండి.
12:50 LaTeX పై సమాధానాలను పొందడానికి ఇది ఒక గొప్ప ప్రదేశం.
12:53 మీరు మా వర్క్ షాప్స్, సర్టిఫికేట్లు మొదలైన వాటిపై కూడా ప్రశ్నలు వేయవచ్చును. ఈ ఈ-మెయిల్ చిరునామాను ఉపయోగించి మాతో సన్నిహితంగా ఉండండి.
13:03 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, భారత ప్రభుత్వంచే నిధులు సమకూర్చుకుంటుంది.
13:09 Goodbye పాల్గొన్నందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Yogananda.india