Koha-Library-Management-System/C2/Create-a-SuperLibrarian/Telugu
From Script | Spoken-Tutorial
|
|
00:01 | సూపర్ లైబ్రేరియన్ ఎలా సృష్టించాలో అనే దానిపై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనము - Patron క్యాటగిరీ ని జోడించుట. |
00:11 | ఒక Patron సృష్టించుట |
00:14 | ఒక సూపర్ లైబ్రేరియన్ ని సృష్టించుట మరియు |
00:17 | ఒక నిర్దిష్ట మాడ్యూల్ కోసం స్టాఫ్ కు యాక్సెస్ ఇవ్వడం నేర్చుకుంటాము. |
00:22 | ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేసేందుకు,
ఉబుంటు లైనక్స్ OS 16.04 మరియు కోహ వర్షన్ 16.05 లను ఉపయోగిస్తున్నాను. |
00:35 | ఈ ట్యుటోరియల్ను అనుసరించడానికి, అభ్యాసకులకు లైబ్రరీ సైన్స్ గురించి తెలుసు ఉండాలి. |
00:42 | ఈ ట్యుటోరియల్ సాధన కోసం, మీ సిస్టమ్లో కోహ ఇన్స్టాల్ చేసి ఉండాలి. |
00:48 | మరియు, మీకు కోహాలో లో అడ్మిన్ యాక్సెస్ కూడా ఉండాలి. |
00:53 | మరిన్ని వివరాల కోసం దయచేసి ఈ వెబ్సైట్లో కోహా స్పోకెన్ ట్యుటోరియల్ సిరీస్ను చూడండి. |
01:00 | Patron క్యాటగిరీ ని ఎలా జోడించాలో నేర్చుకోవడం ద్వారా ప్రారంభిద్దాం. |
01:05 | మీ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ యూసర్ నేమ్ మరియు పాస్ వర్డ్ ను ఉపయోగించి కోహ లోనికి లాగిన్ చేద్దాం. |
01:13 | కోహ అడ్మినిస్ట్రేషన్ పై క్లిక్ చేయండి. |
01:18 | Patrons and circulation కింద, Patron క్యాటగిరీస్ పై క్లిక్ చేయండి. |
01:24 | కొత్త పేజీ Patron క్యాటగిరీస్ తెరుచుకుంటుంది. |
01:28 | New Category పై క్లిక్ చేయండి. |
01:31 | క్రొత్త పేజీ, New Category తెరుచుకొని, అందులో కొన్ని వివరాలను నింపుటకు మనల్ని ప్రాంప్ట్ చేస్తుంది. |
01:38 | ఇంతకు ముందు చెప్పినట్లుగా, ఎరుపు రంగులో ఉన్న ఫీల్డ్స్ తప్పనిసరి అని గమనించండి. |
01:45 | నేను ఇక్కడ కొన్ని వివరాలను పూరించాను, దయచేసి అలాగే చేయండి. |
01:51 | Category type, కోసం డ్రాప్-డౌన్ జాబితా నుండి స్టాఫ్ను ఎంచుకోండి. |
01:57 | Branches limitation, కోసం అన్ని శాఖలు ఎంచుకోండి |
02:02 | తరువాత, పేజీ యొక్క దిగువ భాగంలోని సేవ్ పై క్లిక్ చేయండి. |
02:07 | ప్రవేశ పెట్టిన category యొక్క పేరు Patron క్యాటగిరీస్ పేజీ లో కనిపిస్తుంది. |
02:14 | నా విషయంలో, ఇది లైబ్రరీ స్టాఫ్. |
02:19 | దీనితో, Patron క్యాటగిరీ సృష్టించబడింది. |
02:23 | తరువాత, మనము Patron ను ఎలా జోడించాలో నేర్చుకుంటాము. |
02:28 | ఎగువ ఎడమ మూలలో ఉన్న హోమ్ పై క్లిక్ చేయండి. |
02:32 | కోహా హోమ్పేజ్ ఒక డైలాగ్ బాక్స్ తో ఒక Patron సృష్టించుటకు ప్రాంప్ట్ చేస్తూ తెరుచుకుంటుంది. |
02:39 | Patron ని సృష్టించడం తప్పనిసరి లేకపోతే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ పాత్రలో, కోహ యొక్క కొన్ని భాగాలు పనిచేయవు. |
02: 50 | డైలాగ్ పెట్టెలో ప్రాంప్ట్ చేయబడినట్లుగా, Create Patron పై క్లిక్ చేయండి. |
02:56 | ప్రత్యామ్నాయంగా, మీరు కోహ హోమ్ పేజీ లో Patrons పై క్లిక్ చేయవచ్చు. |
03:02 | నేను Create Patron పై క్లిక్ చేస్తాను. |
03:06 | ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది. New Patron పై క్లిక్ చేయండి. |
03:12 | డ్రాప్ డౌన్ నుండి, నేను లైబ్రరీ స్టాఫ్ను ఎంపిక చేస్తాను. |
03:17 | ఒక కొత్త పేజీ - Add patron (Library Staff), తెరుచుకుంటుంది. |
03:22 | ఇప్పుడు, వివిధ విభాగాల క్రింద అవసరమైన వివరాలను పూరించండి.
Patron identity, Main address, Contact మొదలైనవి. |
03:34 | ఇక్కడ చూపిన విధంగా నేను కొన్ని వివరాలు పూరించాను. |
03:39 | ఇక్కడ చూపిన ఏ ఫీల్డ్ కోసం మైన మీ వద్ద సమాచారం లేకపోతే, వాటిని ఖాళీగా వదిలి వేయండి. |
03:47 | వీడియోను పాజ్ చేసి, అన్ని వివరాలను నింపి, ఆపై వీడియోని పునఃప్రారంభించండి. |
03:53 | లైబ్రరీ మేనేజ్మెంట్ విభాగం క్రింద, కార్డ్ నెంబర్ ఫీల్డ్ను గుర్తించండి. |
04:01 | 1 అనేది కోహ ద్వారా స్వయంచాలకంగా ఉత్పత్తి చేయబడిందని గమనించండి. |
04:07 | అందువల్ల మీ కోహ ఇంటర్ఫేస్లో మీరు వేరొక సంఖ్యను చూస్తారు. |
04:13 | తరువాతది లైబ్రరీ. |
04:16 | డ్రాప్ డౌన్ నుండి, నేను స్పోకన్ ట్యుటోరియల్ లైబ్రరీని ఎన్నుకుంటాం. |
04:21 | స్పోకెన్ ట్యుటోరియల్ లైబ్రరీ ఈ సిరీస్లో ముందుగా సృష్టించబడింది గుర్తుతెచ్చుకోండి. |
04:28 | మీరు వేరొక పేరును ఇచ్చినట్లయితే, ఆ పేరుని ఇక్కడ ఎంచుకోండి. |
04:34 | క్యాటగిరీ కోసం, నేను డ్రాప్-డౌన్ నుండి లైబ్రరీ స్టాఫ్ ను ఎంపిక చేస్తాను. |
04:40 | OPAC / స్టాఫ్ లాగిన్ విభాగము కింద, యూసర్ నేమ్ మరియు పాస్వర్డ్ ప్రవేశ పెట్టండి. |
04:47 | ప్రతి క్రొత్త యూజర్ కొరకు, ఒక కొత్త యూసర్ నేమ్ మరియు పాస్వర్డ్ను సృష్టించాలి. |
04:53 | నేను యూసర్ నేమ్ బెల్లా గా ప్రవేశ పెడతాను. |
04:57 | పాస్వర్డ్ ని లైబ్రరీ గా. |
05:00 | మళ్ళీ, Confirm password ఫీల్డ్ లో అదే పాస్వర్డ్ను నమోదు చేయండి. |
05:06 | ఆ యూసర్ నేమ్ మరియు పాస్వర్డ్ ను గుర్తుంచుకోండి. |
05:10 | స్టాఫ్కు హక్కులు / అనుమతులు ఇవ్వడానికి కొంత సమయం తరువాత ఇది ఉపయోగపడుతుంది. |
05:17 | అన్ని వివరాలను పూరించిన తర్వాత, పేజి యొక్క పై భాగానికి వెళ్ళి సేవ్ పై క్లిక్ చేయండి. |
05:25 | Patron మరియు కార్డు నంబర్ పేరుతో కొత్త పేజీ తెరుచుకుంటుంది. |
05:31 | ఈ సందర్భంలో, ఇంతకుముందు నమోదు చేసిన విధంగా, పేజి లో Patron గా మిస్ బెల్లా టోనీ కార్డు సంఖ్య 1 తో ఉంది. |
05:41 | విభాగాలను సవరించడానికి, సంబంధిత విభాగాల దిగువన ఉన్న Edit టాబ్పై క్లిక్ చేయండి. |
05:49 | ఇప్పుడు Patronలకు అనుమతులు ఎలా ఇవ్వాలో నేర్చుకుందాం. |
05:55 | అదే పేజీలో, More అనే టాబ్ను గుర్తించి, Set Permissions పై క్లిక్ చేయండి. |
06:03 | ఒక కొత్త పేజీ Set permissions for Bella Tony, అనే శీర్షితో తెరుచుకుంటుంది. |
06:09 | (superlibrarian) Access to all librarian functions చెక్-బాక్స్ పై క్లిక్ చేయండి. |
06:16 | పేజి దిగువన సేవ్ పై క్లిక్ చేయండి. |
06:21 | ఇప్పుడు, అన్ని లైబ్రరీ ఫంక్షన్లకు యాక్సెస్ కలిగి ఉన్న సూపర్ లైబ్రేరియన్ Ms బెల్లా టోనీ, సృష్టించబడింది. |
06:30 | ఈ సూపర్ లైబ్రేరియన్ ఖాతాతో, మనము స్టాఫ్ కు హక్కులు /అనుమతులు ఇవ్వవచ్చు. |
06:37 | కాబట్టి, ఇది కోహ గ్రంథాలయ నిర్వహణ వ్యవస్థలో చాలా ముఖ్యమైన పాత్ర. |
06:43 | ఇప్పుడు ఒక ప్రత్యేక మాడ్యూల్ కోసం స్టాఫ్ కు ఎలా యాక్సిస్ ఇవ్వాలో నేర్చుకుందాం. |
06:50 | మీ ప్రస్తుత సెషన్ నుండి డేటాబేస్ అడ్మినిస్ట్రేటివ్ యూజర్ గా లాగ్ అవుట్ చేయండి. |
06:56 | అలా చేయటానికి, కుడి ఎగువ మూలలో ఉన్న No Library Set పై క్లిక్ చేయండి. |
07:03 | డ్రాప్-డౌన్ నుండి, లాగ్ అవుట్ పై క్లిక్ చేయండి. |
07:08 | ఇప్పుడు, సూపర్ లైబ్రేరియన్ ఎకౌంటు తో లాగిన్ అవ్వండి. |
07:13 | ఏదైనా ఒక మాడ్యూల్ను యాక్సిస్ చేయడానికి, సూపర్ లైబ్రేరియన్, మరొక స్టాఫ్ కు హక్కులు లేదా అనుమతులు ఇవ్వగలదు. |
07:22 | ఉదాహరణకు - కాటలాగింగ్ మాడ్యూల్, సర్క్యులేషన్ మాడ్యూల్, |
07:27 | సీరియల్ కంట్రోల్, అక్విజిషన్ మొదలైనవి. |
07:32 | ముందుగా వివరించినట్లు Patron సృష్టించండి. |
07:36 | New Patron పై క్లిక్ చేయండి. డ్రాప్-డౌన్ నుండి, లైబ్రరీ స్టాఫ్ ఎంచుకోండి. |
07:43 | సెల్యుటేషన్ Ms. గా ఎంచుకోండి. Surname గా Samruddhi ని ఎంటర్ చేయండి. |
07:51 | Category కోసం, డ్రాప్-డౌన్ నుండి లైబ్రరీ స్టాఫ్ ఎంచుకోండి. |
07:57 | ఏ ఇతర ఎంపికను ఎంచుకోవద్దు. |
08:01 | OPAC/స్టాఫ్ లాగిన్ విభాగం క్రింద,యూసర్ నేమ్ గా Samruddhi మరియు పాస్వర్డ్ గా patron అని నమోదు చేయండి. |
08:13 | మళ్ళీ, Confirm password ఫీల్డ్ లో అదే పాస్వర్డ్ ఎంటర్ చేయండి. |
08:19 | ఈ యూసర్ నేమ్ మరియు పాస్ వర్డ్ గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇది స్టాఫ్ లాగిన్ కొరకు తర్వాత పయోగించబడుతుంది. |
08:27 | అన్ని వివరాలను పూరించిన తర్వాత, పేజీ ఎగువన ఉన్న సేవ్ పై క్లిక్ చేయండి. |
08:34 | ఇప్పుడు, ఈ ప్రత్యేక Patronకు అనుమతులను ఇవ్వండి. |
08:39 | More టాబ్ కు వెళ్ళి, Set Permissions పై క్లిక్ చేయండి |
08:45 | ఒక క్రొత్త పేజీ Set permissions for Samruddhi అనే శీర్షిక తో తెరుచుకుంటుంది. |
08:52 | ఇది మనము సృష్టించిన Patron పేరు. |
08:57 | (circulate) Check out and check in items చెక్-బాక్స్ క్లిక్ చేయండి. |
09:04 | తరువాత, (catalogue) Required for staff login చెక్-బాక్స్ క్లిక్ చేయండి. |
09:12 | (borrowers) Add, modify and view patron information కూడా క్లిక్ చేయండి. |
09:19 | తరువాత, ఇక్కడ ప్లస్ సైన్ పై క్లిక్ చేయండి. |
09:24 | reserveforothers Place and modify holds for patrons పై క్లిక్ చేయండి. |
09:31 | తర్వాత, Edit catalog టాబ్కి రాండి. |
09:35 | ప్లస్ సైన్ పై క్లిక్ చేయండి.
మరియు (editcatalogue) Edit catalog (Modify bibliographic/holdings data) పై క్లిక్ చేయండి. |
09:46 | తరువాత, Acquisition టాబ్ వద్ద కు రండి. ప్లస్ సైన్ పై క్లిక్ చేయండి. మరియు (acquisition) Acquisition and/or suggestion management పై క్లిక్ చేయండి. |
09:59 | తరువాత, టాబ్ tools కోసం, ఇక్కడ ప్లస్ సైన్ పై క్లిక్ చేయండి. |
10:05 | మరియు,(batch_upload_patron_images) Upload patron images in a batch or one at a time పై క్లిక్ చేయండి. |
10:16 | తరువాత, (edit_patrons) Perform batch modification of patrons పై క్లిక్ చెయ్యండి. |
10:24 | (import_patrons) Import patron data కూడా, ఎంచుకోండి. |
10:30 | తరువాత, Edit authorities పై క్లిక్ చేయండి. |
10:36 | తరువాత, (reports), Allow access to the reports moduleటాబ్ వద్ద కు రాండి. |
10:43 | ప్లస్ సైన్ పై క్లిక్ చేసి, (execute _reports) Execute SQL reports ఎంచుకోండి. |
10:52 | పేజి దిగువన సేవ్ మీద క్లిక్ చేయండి. |
10:57 | దీనితో మనము అన్ని అవసరమైన హక్కులను Ms.Samruddhi అనే పేరు గల లైబ్రరీ స్టాఫ్ కు ఇచ్చాము. |
11:07 | సూపర్ లైబ్రేరియన్ ఖాతా నుంచి లాగ్ అవుట్ అవ్వండి. |
11:11 | అలా చేయటానికి, ఎగువ కుడి మూలలో వెళ్ళండి. స్పోకెన్ ట్యుటోరియల్ లైబ్రరీ పై క్లిక్ చేసి, డ్రాప్-డౌన్ నుండి లాగ్ అవుట్ క్లిక్ చేయండి. |
11:23 | దీనితో, మనము ఈ ట్యుటోరియల్ చివరకి వచ్చాము. |
11:27 | సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో, మనము |
11:33 | ఒక Patron category జోడించడం
ఒక Patron సృష్టించడం |
11:39 | ఒక సూపర్ లైబ్రేరియన్ సృష్టించడం.
ఒక నిర్దిష్ట మాడ్యూల్ కోసం ఒక స్టాఫ్ కు యాక్సెస్ ఇవ్వడం నేర్చుకున్నాము. |
11:47 | అసైన్మెంట్స్ - ఒక కొత్త Patron Category- రీసెర్చ్ స్కాలర్ చేర్చండి. |
11:54 | సూపర్ లైబ్రేరియన్ కోసం అసైన్మెంట్: కింది పాత్రల కోసం ఒక కొత్త స్టాఫ్ ను జోడించండి. |
12:01 | వారికీ అన్ని Cataloging rights మరియు అన్ని Acquisition rights కేటాయించండి. |
12:09 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
12:17 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.
మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
12:28 | దయచేసి ఈ ఫోరమ్లో మీ ప్రశ్నలను సమయం తో పోస్ట్ చేయండి. |
12:32 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
12:45 | ఈ రచనకు సహాయపడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి. మాతో చేరినందుకు ధన్యవాదాలు. |