Koha-Library-Management-System/C2/Create-MARC-framework/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | ఒక MARC ఫ్రేంవర్క్ క్రియేట్ చేయడం పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనము కోహ లో MARC ఫ్రేమ్ వర్క్ క్రియేట్ చేయడము నేర్చుకుంటాము. |
00:14 | ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేసేందుకు, నేను
ఉబుంటు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టం 16.04 మరియు కోహా వెర్షన్ 16.05 ఉపయోగిస్తున్నాను. |
00:27 | ఈ ట్యుటోరియల్ను అనుసరించడానికి, మీకు గ్రంథాలయ శాస్త్రం గురించి అవగాహన ఉండాలి. |
00:33 | ఈ ట్యుటోరియల్ సాధన చేసేందుకు, మీ సిస్టమ్లో కోహ ఇన్స్టాల్ చేసి ఉండాలి.
మరియు, మీకు కోహలో అడ్మిన్ యాక్సెస్ ఉండాలి. |
00:44 | లేకపోతే, దయచేసి ఈ వెబ్సైట్లో కోహా స్పోకెన్ ట్యుటోరియల్ సిరీస్ను చూడండి. |
00:50 | ప్రారంభించే ముందు ఒక గమనిక, ఫ్రేమ్వర్క్స్ ని సవరించవచ్చు లేదా తొలగించవచ్చు. |
00:57 | సూపర్లైబ్రియన్, తన గ్రంథాలయాల అవసరాల ప్రకారం, స్వంత ఫ్రేమ్వర్క్లను సృష్టించవచ్చు. |
01:05 | ప్రారంభిద్దాం. నన్ను కోహ ఇంటర్ఫేస్కు మారనివ్వండి. |
01:11 | సూపర్లైబ్రియన్ యూసర్ నేమ్ బెల్లా మరియు ఆమె పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి. |
01:17 | ఇప్పుడు మనము కోహ ఇంటర్ఫేస్ లోపల సూపర్లిబ్రియన్ బెల్లా గా ఉన్నాము. |
01:25 | Koha administration కి వెళ్ళండి. |
01:29 | Catalog విభాగం కింద, MARC bibliographic framework పై క్లిక్ చేయండి. |
01:36 | కొత్త పేజీ తెరుచుకుంటుంది. |
01:40 | ప్లస్ న్యూ ఫ్రేమ్వర్క్ పై క్లిక్ చేయండి. |
01:44 | వివరాలను పూరించడానికి మనకు ప్రాంప్ట్ చేస్తు, మరొక పేజీ తెరుచుకుంటుంది - Framework code మరియు Description. |
01:54 | ఫ్రేమ్వర్క్ కోడ్ ఫీల్డ్ కోసం నేను BK అని టైప్ చేస్తాను. |
02:01 | Description కొరకు, నేను BOOKS అని టైప్ చేస్తాను. |
02:06 | తరువాత, దిగువన Submit బటన్పై క్లిక్ చేయండి. |
02:11 | తెరుచుకునే కొత్త పేజీలో, కోడ్ BK అనగా బుక్స్ కి వెళ్ళండి. |
02:18 | Actions ట్యాబు నుండి MARC structure క్లిక్ చేయండి. |
02:25 | ఒక క్రొత్త పేజీ MARC Framework for BOOKS (BK) తెరుచుకుంటుంది.
ఈ శీర్షిక కింద, ఇక్కడ OK బటన్పై క్లిక్ చేయండి. |
02:35 | MARC Framework for BOOKS (BK) పేరుతో ఉన్న మరొక పేజీ తెరుచుకుంటుంది. |
02:40 | ఇది 1 to 20 of 342 tags వరకు ట్యాగ్స్ చూపిస్తుంది. |
02:48 | అయితే, మీరు మీ స్క్రీన్పై మరిన్ని ట్యాగ్లను చూడవచ్చు. |
02:53 | డిఫాల్గా మొత్తం 342 ట్యాగ్లు ఉన్నాయని గమనించండి.
నేను బుక్స్ కోసం కొన్ని టాగ్లను మాత్రమే ఎంచుకుంటాను. మీరు మీ అవసరానికి అనుగుణంగా ట్యాగ్లను ఎంచుకోవచ్చు. |
03:08 | ఒక ట్యాగ్ను సవరించుటకు లేదా తొలగించుటకు ఎంపికలు ఉన్నాయని గమనించండి. |
03:14 | నేను ఎలా తొలగించాలో చూపిస్తాను. |
03:17 | నేను ట్యాగ్ సంఖ్యా 010- Library of Congress Control Number ను ఎన్నుకుంటుంది. |
03:25 | కుడి వైపున Delete టాబ్ను క్లిక్ చేసిన తర్వాత, ఒక పాప్-అప్ విండో,
Confirm deletion of tag '010'? కనిపిస్తుంది. |
03:40 | Yes, delete this tag పై క్లిక్ చేయండి. |
03:44 | Tag deleted అనే మరొక విండో కనిపిస్తుంది. Ok క్లిక్ చేయండి. |
03:51 | MARC Framework for Books (BK) అనే పేజీ మళ్ళీ కనిపిస్తుంది. |
03:56 | ఈ పేజీలో, ట్యాగ్ నంబర్ 010 ఇకపై చూపబడదు. |
04:03 | అదేవిధంగా, ఒక నిర్దిష్ట item typeకు సంభంధం లేని ఇతర ట్యాగ్లను తొలగించండి. |
04:11 | ట్యాగ్లును సవరించడానికి, Actions కు వెళ్ళి Edit ఎంపికను ఎంచుకోండి. |
04:17 | నేను ట్యాగ్ నంబర్ 000, లీడర్ కు వెళ్తాను. |
04:24 | ఆపై Edit పై క్లిక్ చేస్తాను. |
04:27 | ఈ క్రింది ఫీల్డ్స్ కోహ చే డిఫాల్ట్ గా నింపబడుతాయి.
Label for lib, Label for opac. |
04:38 | గమనించండి: Label for lib స్టాఫ్ క్లయింట్లో కనిపిస్తుంది.
Label for OPAC, MARAC దృక్పథంలో OPAC లో కనిపిస్తాయి. |
04:50 | మీ అవసరానికి అనుగుణంగా, Repeatable చెక్ బాక్స్ను క్లిక్ చేయండి. |
04:56 | డిఫాల్ట్ గా కొహ ఈ చెక్-బాక్స్ ను తప్పనిసరిగా తనిఖీ చేస్తుంది. |
5:02 | నేను Repeatable చెక్-బాక్స్ తనిఖీ చేస్తాను. |
05:06 | Cataloging లో మీరు Repeatableని క్లిక్ చేస్తే, ఆ ఫీల్డ్ పక్కన ప్లస్ గుర్తును ఉంటుందని గమనించండి. |
05:16 | ఇది ప్రాథమికంగా 3 కన్నా ఎక్కువ రచయితలు లేదా సంపాదకులకు అవసరం. అది ఆ ట్యాగ్ కు మరిన్ని వివరాలను జోడించడానికి అనుమతిస్తుంది. |
05:27 | Mandatory క్లిక్ లేదా కోహ ద్వారా స్వీయ-ఎంపిక చేయబడితే, ఒక రికార్డు కు ఈ నిర్దిష్ట ట్యాగ్ విలువను కేటాయించకపోతే సేవ్ చేయుటకు అనుమతించదు. |
05:43 | కోహ ఇంటర్ఫేస్కు తిరిగి వెళ్దాం. |
05:46 | అన్ని వివరాలు పూరించిన తర్వాత, Save changes పై క్లిక్ చేయండి. |
05:52 | తెరుచుకునే కొత్త పేజీలో, ట్యాగ్ నంబర్ 000, లీడర్, Repeatable మరియు Mandatory, Yes గా కనిపిస్తాయి. |
06:05 | తరువాత, అథారిటీ ఫైల్ని ఎనేబుల్ ఎలా చేయాలో నేర్చుకుందాం. |
06:10 | కోహ అడ్మినిస్ట్రేషన్కు వెళ్ళండి. |
06:13 | మరియు గ్లోబల్ సిస్టమ్ ప్రిఫరెన్సెస్ క్లిక్ చేయండి. |
06:18 | Acquisitions preferences పేజీ తెరుచుకుంటుంది. |
06:23 | ఎడమవైపు ఉన్న టాబ్ల జాబితా నుండి Authorities పై క్లిక్ చేయండి. |
06:30 | జనరల్ విభాగం కింద, ఈ క్రింది విధంగా Value of Preference మార్చడం ప్రారంభించండి. |
06:37 | AuthDisplayHierarchy కోసం, డ్రాప్-డౌన్ నుండి Displayఎంచుకోండి. |
06:44 | AutoCreateAuthorities కోసం, generate ఎంచుకోండి. |
06:50 | BiblioAdsdsAuthorities కొరకు, allow ఎంచుకోండి.
Dontmerge కోసం, Do ఎంచుకోండి. |
07:01 | MARCAuthorityControlField008 మరియు 'UNIMARCAuthorityField100 లను అలాగే వదిలివేయండి. |
07:11 | UseAuthoritiesForTracings, కొరకు కోహ అప్రమేయంగా, Use ఎంచుకుంటుంది. |
07:19 | లింకర్ విభాగంలో, CatalogModuleRelink కొరకు డిఫాల్ట్ విలువలు అలాగే ఉంచాలి. |
07:28 | LinkerKeepStale, LinkerModule, |
07:33 | LinkerOptions మరియు inkerRelink. |
07:38 | ఇప్పుడు, Save all Authorities preferences పై క్లిక్ చేయండి. |
07:43 | ఇప్పుడు మీరు కోహ సూపర్లిబ్రియన్ ఖాతా నుంచి లాగ్ అవుట్ అవ్వచ్చు. |
07:48 | అలా చేయటానికి, ఎగువ కుడి మూలకు వెళ్ళండి. |
07:52 | స్పోకెన్ ట్యుటోరియల్ లైబ్రరీ పై క్లిక్ చేసి, డ్రాప్-డౌన్ నుండి, లాగ్ అవుట్ ఎంచుకోండి. |
07:59 | దీనితో MARC ఫ్రేంవర్క్ కోసం అవసరమైన సెటప్ను పూర్తి అయింది. |
08:04 | సారంశం చూద్దాం.
ఈ ట్యుటోరియల్ లో, మనము కొహ లో MARC ఫ్రేంవర్క్ ను సృష్టించుట నేర్చుకున్నాము. |
08:13 | ఒక అసైన్మెంట్ గా సీరియల్స్ కోసం ఒక కొత్త MARC ఫ్రేమ్వర్క్ సృష్టించండి. |
08:20 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
08:28 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.
మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
08:38 | దయచేసి ఈ ఫోరమ్లో మీ ప్రశ్నలను సమయం తో పాటు పోస్ట్ చేయండి. |
08:42 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది |
08:54 | ఈ ట్యుటోరియల్ ని అనువదించింది మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి ధన్యవాదములు. |