Java-Business-Application/C2/Creating-and-viewing-inventories/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | Creating and viewing inventories పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనము |
00:09 | login page ను admin page కు రీడైరెక్ట్ చేయడానికి సవరించడం. |
00:14 | అన్ని పుస్తక వివరాలు పొందడం. |
00:17 | తీసుకోబడిన పుస్తక వివరాలను పొందడం |
00:20 | లాగ్ ఇన్ యూజర్ ద్వారా తీసుకోబడిన పుస్తకాలను ప్రదర్శించడం గురించి నేర్చుకుందాం. |
00:25 | ఇక్కడ మనము |
00:27 | Ubuntu వర్షన్ 12.04 |
00:29 | Netbeans IDE 7.3 |
00:32 | JDK 1.7 |
00:34 | Firefox వెబ్ -బ్రౌజర్ 21.0 ను ఉపయోగిస్తున్నాము. |
00:38 | మీరు, మీకు నచ్చిన ఏ వెబ్-బ్రౌజర్ ను అయినా మీరు ఉపయోగించవచ్చు. |
00:42 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు |
00:45 | Java Servlets మరియు JSPs యొక్క ప్రాథమిక అంశాలు, |
00:50 | డేటాబేస్ మరియు fields యొక్క దృవీకరణ గురించి తెలిసి ఉండాలి. |
00:53 | లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:57 | ఇప్పుడు, మనం NetBeans IDE కు మారదాం. |
01:01 | నేను Books table ను సృష్టించాను. |
01:04 | మీరు ఈ table లో వివిధ fields ను చూడవచ్చు. |
01:08 | నేను ఈ table లో 10 books ను చేర్చాను. |
01:12 | నేను Checkout టేబుల్ ను తీసుకోబడిన పుస్తకాలను నిల్వ చేయడానికి సృష్టించాను. |
01:18 | నేను Checkout టేబుల్ లోనికి 5 ఎంట్రీలను చేర్చాను. |
01:24 | నేను Book మరియు Checkout ల కోసం ఒక model ను కూడా సృష్టించాను. |
01:29 | Book.java అనేది పుస్తక నమూనా. |
01:32 | Checkout.java అనేది checkout నమూనా. |
01:37 | ఇప్పుడు బ్రౌజర్ కు రండి. |
01:40 | మనం admin గా లాగిన్ అవుదాం. |
01:43 | కాబట్టి, నేను username మరియు password లను admin గా టైప్ చేసి, Sign In పై క్లిక్ చేస్తాను. |
01:51 | మనం Admin Section Page కు వెళ్ళుటను చూడవచ్చు. |
01:55 | మనం ఈ పేజీ కి తిరిగి వద్దాం. ఇప్పుడు మనం Netbeans IDEకు మారదాం. |
02:02 | మనం Admin Pageకు రీడైరెక్ట్ చేయుటకు GreetingServlet ను ఎలా సవరించాలో చూద్దాం. |
02:08 | మనం GreetingServlet.java ను చూద్దాం. |
02:13 | ఇక్కడ మనం username మరియు password లు adminకు సమానంగా ఉన్నాయా అని తనిఖీ చేద్దాము. |
02:19 | ఒకవేళ yes అయితే, అప్పుడు మనం adminsection.jsp కు రీడైరెక్ట్ చేద్దాం. |
02:25 | మనం ఇప్పటికే RequestDispatcherను ఉపయోగించి వేరొక పేజీ కి ఫార్వర్డ్ చేయడం ఎలానో చూసాము. |
02:32 | ఇప్పుడు browser కు తిరిగి వెళ్ళండి. |
02:35 | ఇక్కడ మనకు రెండు ఎంపికలు ఉన్నాయి. |
02:37 | List Books, radio button పై క్లిక్ చేద్దాం. |
02:41 | తరువాత Submit button పై క్లిక్ చేయండి. |
02:44 | ఇక్కడ, మనం అన్ని Books యొక్క list కలిగి ఉండడాన్ని చూడవచ్చు. |
02:49 | ఇది Book Id, Book Name, Author Name, ISBN, Publisher, Total Copies మరియు Available copies వంటి అన్ని వివరాలను కలిగి ఉంది. |
02:59 | ఇప్పుడు, ఇది ఎలా జరిగిందో, నేను మీకు చూపుతాను. |
03:03 | IDE కు తిరిగి మారండి. |
03:05 | ఇప్పుడు, మనం adminsection dot jsp కు వద్దాం. |
03:10 | ఇక్కడ మనం రెండు radio buttonsను కలిగి ఉన్నాము. |
03:14 | మొదటిది అన్ని books ను list చేస్తుంది. |
03:19 | మనం adminsection dot jsp లో form action ఈక్వల్ టు AdminSection ను చూడవచ్చు, |
03:28 | ఇప్పుడు, AdminSection dot java ను తెరవండి. |
03:32 | ఇక్కడ, ఇది మనము క్లిక్ చేసిన ఎంపికను తనిఖీ చేస్తుంది. |
03:36 | List Books పైన క్లిక్ చేసాము. |
03:39 | కాబట్టి, క్వరీ యొక్క ఈ భాగం అమలు అవుతుంది. |
03:44 | ఈ క్వరీ ని పుస్తకాలను Books table నుండి పొందటానికి అమలు చేస్తాము. |
03:49 | తరువాత, ArrayList ను పుస్తకాల వివరాలను నిల్వ చేయడానికి సృష్టించాము. |
03:55 | తరువాత result set ద్వారా ఇటరేట్ చేద్దాం. |
03:59 | Book objectను సృష్టించండి. |
04:03 | మనము BookId ను, Book objectలో సెట్ చేసాము. |
04:08 | అదేవిధంగా, మనము పుస్తకం యొక్క ఇతర లక్షణాలను Book object లోనికి సెట్ చేసాము. |
04:16 | తరువాత మనం book objectని books జాబితాలో జోడిద్దాము. |
04:21 | తరువాత మనం books ArrayListను request లో సెట్ చేస్తాము. |
04:26 | తరువాత మనం request ను listBooks.jsp కు RequestDispatcherను ఉపయోగించి పంపిస్తాము. |
04:33 | ఇప్పుడు, మనము listBooks.jsp కు వెళ్ళుదాము. |
04:38 | ఈ పేజీలో, admin పుస్తకాల యొక్క జాబితాను చూడవచ్చు. |
04:43 | ఇక్కడ, ముందుగా మనం request నుండి books ను పొందుతాము . |
04:48 | ఈ HTML table పుస్తకాల యొక్క వివరాలను ప్రదర్శిస్తుంది. |
04:54 | దీనిని book list వెంబడి ఇటరేట్ చేస్తాము. |
04:58 | ఇక్కడ మనము పుస్తకం యొక్క BookId ని ప్రదర్శిస్తాము. |
05:02 | అదేవిధంగా, మనము పుస్తకం యొక్క ఇతర attributesను ప్రదర్శిస్తాము. |
05:07 | ఈ విధంగా మనము పుస్తకాల జాబితాను ప్రదర్శిస్తాము. |
05:11 | ఇప్పుడు, browser కు తిరిగి వెళ్ళండి. |
05:14 | List Borrowed Books పై క్లిక్ చేసి, |
05:17 | Submit button పై క్లిక్ చేయండి. |
05:20 | అన్ని issued Books యొక్క listను చూస్తాము. |
05:24 | ఇది Transaction Id, Book Id మరియు Username లాంటి వివరాలను కలిగి ఉంటుంది. |
05:29 | నేను ఇప్పుడు, తిరిగి IDE కు మారి, |
05:32 | దాని కోడ్ ని మీకుచూపిస్తాను. |
05:35 | AdminSection.java కు వెళ్ళండి. |
05:38 | List Borrowed Books పై క్లిక్ చేసాము. |
05:42 | కాబట్టి menuSelection అనేది List Borrowed books కు సమానం. |
05:47 | దీనికి కూడా List Books లో గల దశలు మాదిరిగానే ఉంటాయి. |
05:53 | Checkout table నుండి అరువు తీసుకోబడిన పుస్తక వివరాలను పొందటానికి మనము క్వరీని అమలు చేస్తాము. |
05:59 | తరువాత borrowed books పై దీనిని ఇటరేట్ చేస్తాము. |
06:02 | దీనిని request లో checkout attributeగా సెట్ చెయ్యండి. |
06:07 | ఇప్పుడ,మనము listBorrowedBooks.jsp కు వెళదాం. |
06:12 | ఇక్కడ మనము checkout ను request నుండి పొందుతాము. |
06:17 | మనము Checkout జాబితా పై ఇటరేట్ చేస్తాము. |
06:20 | ఇక్కడ మనము Checkout యొక్క attributesను ప్రదర్శిస్తాము. |
06:25 | ఈ విధంగా మనము Borrowed Booksని ప్రదర్శిస్తాము. |
06:28 | ఇప్పుడు, తిరిగి బ్రౌజర్ కు మారండి. |
06:30 | borrowed books pageలో మనకు మరొక list ఉంది. |
06:36 | current date అనేది return date కంటే ఎక్కువ ఉంటుందో అటువంటి issued books యొక్క list ఇస్తుంది. |
06:43 | కోడ్ చూడడానికి తిరిగి IDE కు మారండి. |
06:46 | Borrowed Books కొరకు చేసిన విధంగానే దీనికి కూడా చేసాము. |
06:50 | తేడా SQL query లో మాత్రమే ఉంటుంది. |
06:56 | క్వరీ లో, మనం return_date less than now() order by transaction_Id అనే కండిషన్ ఇస్తాము. |
07:05 | ఇప్పుడు, నేను మీకు సాధారణ యూజర్ యొక్క interface ను చూపుతాను. |
07:10 | browser కు మారండి. |
07:12 | login pageకు తిరిగి రండి. |
07:15 | నేను mdhusein గా లాగిన్ అవుతాను. |
07:20 | welcome ను పాస్ వర్డ్ గా టైప్ చేసి, |
07:22 | Sign In పై క్లిక్ చేయండి. |
07:25 | మనకు Success Greeting Page వస్తుంది. |
07:28 | ఇది ప్రస్తుతం user చే తీసుకోబడిన పుస్తకాలను కలిగి ఉంటుంది. |
07:32 | ఇది Transaction Id, User Name, Book Id and Return Date వంటి వివరాలను కలిగి ఉంది. |
07:39 | ఇప్పుడు, తిరిగి IDEకు రండి. |
07:43 | ఇప్పుడు మనం GreetingServlet.javaకు వెళ్తాము. |
07:47 | మనం admin కొరకు చేసిన విధంగానే, ఇచ్చిన పుస్తకాలను ప్రదర్శిస్తాము. |
07:53 | ఇక్కడ ఉన్న వ్యత్యాసం ఏమిటి అంటే, మనము లాగ్ ఇన్ యూజర్ కోసం పుస్తకాలను ప్రదర్శించవలసి ఉంటుంది. |
08:02 | కాబట్టి, నేను ఈ లైన్ నుండి usernameను పొందుతాను. |
08:05 | తరువాత username, logged-in యూజర్ కు సమానమయిన కండిషన్ తో |
08:10 | తీసుకున్న పుస్తకాల వివరాలను పొందుతాము. |
08:14 | కాబట్టి, సంబంధిత యూజర్ కు జారీ చేసిన పుస్తకాల జాబితాను పొందుతాము. |
08:20 | తరువాత, successGreeting dot jsp లో జాబితాను ప్రదర్శిస్తాము. |
08:27 | మీ successGreeting dot jsp ఈ విధంగా కనిపిస్తుంది. |
08:32 | ఈ ట్యుటోరియల్ లో మనము |
08:35 | login page ను admin pageకు దారి మళ్ళించడానికి సవరించడం, |
08:39 | పుస్తకం వివరాలు పొందడం, |
08:42 | తీసుకోబడిన పుస్తక వివరాలు పొందడం మరియు |
08:45 | లాగిన్ చేసిన యూజర్ చే తీసుకోబడిన పుస్తకాలను ప్రదర్శించడం నేర్చుకున్నాము. |
08:50 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి మరింత తెలుసుకునేందుకు, క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
08:56 | ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సారాంశంను ఇస్తుంది. |
08:59 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
09:0 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం |
09:06 | స్పోకన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
09:09 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
09:13 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి |
09:20 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
09:24 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
09:30 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
09:40 | ప్రముఖ software MNC వారి Corporate Social Responsibility program ద్వారా Library Management System ఈ ప్రాజెక్ట్ కు దోహదపడింది. |
09:49 | వారు ఈ స్పోకన్ ట్యుటోరియల్ కోసం కంటెంట్ ను ధృవీకరించారు. |
09:53 | ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. |
09:57 | మాతో చేరినందుకు ధన్యవాదాలు. |