Introduction-to-Computers/C2/Introduction-to-Gmail/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 "ఇంట్రోడక్షన్ టు జీమేల్" అనే విషయం పై స్పోకన్ టూటోరియల్కు స్వాగతం.
00:06 ఈ టుటోరియల్లో మనం నేర్చుకునేది-
00:09 కొత్త గూగుల్ అకౌంట్ సృష్టించుట.
00:12 గూగుల్ అకౌంట్ని ఉపయోగించి జీమెయిల్లోకి లాగిన్ అవడం
00:16 ఇమెయిల్ ఎలా రాయాలి
00:18 ఇమెయిల్ ఎలా పంపాలి
00:20 వచ్చిన ఇమెయిల్ను ఎలా తెరవాలి
00:22 జి మెయిల్ నుండి లాగ్అవుట్ ఎలా ఔవ్వాలి.
00:24 ఇన్ బాక్స్ లాంటి ప్రముఖమైన మెయిల్ బాక్స్ల గురించి కూడా తెలుసుకుంటాము.
00:30 ఈ టూటోరియల్ కొరకు సక్రియంగా ఉన్న ఇంటర్ నెట్ కనెక్షన్ కావాలి.
00:35 మరియు ఒక వెబ్ బ్రౌజర్ కావాలి.
00:37 నేను ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్ను ఉపయోగిస్తాను.
00:42 గూగుల్ తన అన్నీ గూగుల్ ప్రాడక్ట్ లను వినియోగుదారులకు ఒకే అకౌంట్ ద్వారా అందిస్తుంది, ఉదాహరణకు:
00:48 జీమెయిల్. యూ ట్యూబ్
00:50 గూగుల్ ప్లే, గూగుల్ డాక్స్ / డ్రైవ్.
00:53 గూగుల్ క్యాలెండర్... మరియు మర్రెన్నో.
00:57 అందుకే, ఒకే లాగిన్ తో వీటన్నిటిని ఉపయోగించగలం.
01:02 ఒక కొత్త గూగుల్ అకౌంట్ సృష్టిద్దాం.
01:06 మీ వెబ్ బ్రౌజర్ తెరచి http colon స్లాష్ స్లాష్ gmail డాట్ com (http://gmail.com) అని టైప్ చేయ్యండి.
01:16 ఇప్పుడు కనిపించే పేజీ కుడి ఎగువ భాగంలో లో రెండు ఎంపికలు చూడవచ్చు. అవి:
01:22 "క్రియేట్ యన్ అకౌంట్" మరియు "సైన్ ఇన్"
01:25 మీ మెషీన్ నుండి మొదటిసారి ఈ పేజీని తెరచినట్లయితే, అది ఇలా కనిపిస్తుంది.
01:32 ఇదివరకే మీ మిషన్ నుండి ఈ పేజీని యాక్సస్స్ చేసి ఉంటే , అప్పుడు పేజీ ఇలా కనిపిస్తుంది.
01:39 email username మరియు password ప్రవేశ పెట్టుటకు రెండు టెక్స్ ట్ బాక్స్ లు కనిపిస్తాయి.
01:46 మరియు Sign Inఅనే ఒక పెద్ద బటన్ ఉంటుంది.
01:50 దీని కింద Create an account అనే ఒక లింక్ కనిపిస్తుంది.
01:55 Create an account లింక్ పై క్లిక్ చేయ్యండి.
01:59 ఇప్పుడు మనం గూగుల్ అకౌంట్ క్రియేషన్ పేజీ లో ఉన్నము.
02:03 కుడి భాగం లో ఒక ఫాం కనిపిస్తుంది , ఇందులో మన వివరాలను ఇవ్వాలి.
02:11 ఇప్పుడు నా పేరు మరియు నా ఇంటిపేరుని ఈ టెక్స్ట బాక్స్ లో టైప్ చేస్తాను ,
02:17 నా పెరు "రెబెకా రేమండ్" అని టైప్ చెస్తాను.
02:23 తదుపరి, మన యూసర్ పేరు(username) ఎంచుకోవాలి
02:27 "యూసర్ నేమ్" ప్రత్యేకమైనది ఉండాలి మరియు అల్ల్ఫాబెట్స్ లేదా ఆల్ఫా-న్యూమరిక్ కలయిక ఉండవచ్చు.
02:37 నా యూసర్ నేమ్ “becky0808” అని టైప్ చెస్తాను.
02:43 ఈ యూసర్ నేమ్ ఇంకొక్కరు ఉపయోగిస్తున్నట్లైతే క్రింద మెసేజ్ కనిపిస్తుంది.
02:49 Someone already has that user name, Try another.
02:54 గూగుల్ కూడా కొన్ని యూజర్పేర్లు మనం ఇచ్చిన మొదటి మరియు చివరి పేర్ల ఆధారంగా సలహ ఇస్తుంది.
03:01 మనకు నచ్చిన యూసర్ నేమ్ ఇచ్చి, అందుబాటు కొరకు తనిఖీ చేయవచ్చు.
03:07 ఇప్పుడు నా యూసర్ నెమ్ ను ray.becky.0808 అని ఇస్తాను.
03:18 ఈ యూసర్ నెమ్ అందుబాటులో ఉంది, మరియు దానిని వాడవచ్చునని సూచిస్తుంది.
03:24 ఇప్పుడు, ఈ అకౌంట్కు పాస్వర్డ్ ఇవ్వాలి .
03:30 ఎడమ వైపు ఉన్న ఇన్ఫర్మేషన్ బాక్స్ పాస్ వర్డ్ ఎన్ని అక్షరాలు ఉండాలి అని చెప్పుతుంది .
03:36 మీకు నచ్చిన, అనుకూలమైన పాస్ వర్డ్ టైప్ చెయండి.
03:41 మరలా పాస్ వర్డ్ టైప్ చేసి దృవీకరించండి.
03:44 తదుపరి పుట్టిన తేది ఇవ్వాలి.
03:48 డ్రాప్ డౌన్ మెను లోనుండి నెలను ఎంచుకోండి.
03:51 తేది మరియు సంవత్సరాన్ని, తగిన టెక్స్ట్ బాక్స్ లో టైప్ చెయండి.
03:57 ఇప్పుడు లింగాన్ని(gender) ఎంచుకోండి.
04:00 నేను స్త్రీ కనుక Female ఎంచుకుంటాను.
04:03 తదుపరి మొబైల్ ఫోన్ నంబర్ ఇవ్వాలి.
04:06 దీన్ని ప్రస్తుతం స్కిప్ చేస్తాను.
04:08 తదుపరి, ఈ టెక్స్ట్ బాక్స్ మన ప్రస్తుత ఈమైల్ అడ్రస్ ను కోరుతుంది.
04:14 ఇప్పుడు ఇచ్చిన ఈమైల్ కాకుండా వేరే ఈమైల్ అడ్రస్ కనుక ఉంటే టైప్ చేయగలరు.
04:21 లేదంటే ఖాళి వదలగలరు.
04:23 మిగతా వివరాలను నింపుదాం .
04:26 తరువాయి భాగం మీరు రోబోట్ కాదు అని నిరూపించొకోండి Prove you're not a robotలో 2 వెరిఫికేషన్ స్టెప్ లు ఉన్నవి.
04:32 "ఫోన్ వెరిఫికేషన్", "పజల్ వెరిఫికేషన్"
04:36 ఇందులో ఏదైనా ఒక్క దానితో ముందుకు వెళ్ళగలం.
04:40 నేను పజల్ వెరిఫికేషన్ ఎంచుకుంటాను.
04:43 "టైప్ ద టెక్స్ట్" టెక్స్ట్ బాక్స్ లో చిత్రం కనిపించే నంబర్/టెక్స్ట్ను టైప్ చేయగలరు.
04:49 అప్రమేయంగా మీరు నివసించే దేశం లొకేషన్ డ్రాప్ డౌన్లో కనిపిస్తుంది.
04:55 నేను భారత దేశంలో ఉనాను గనుక లొకేషన్ డ్రాప్ డౌన్లో ఇండియా కనిపిస్తుంది.
05:02 చివరికి, I agree to the Google Terms of service and Privacy Policy చెక్ బాక్స్ పై చెక్ పెట్టండి.
05:10 ఫార్మ్ లో అన్ని వివరాలు నింపినతరువాత, నెక్స్ట్ స్టెప్ బటన్ పై క్లిక్ చేయ్యండి.
05:17 ప్రస్తుతం అల చేయకుండా.
05:20 ఫోన్ వెరిఫికేషన్ ఎంచుకుంటే ఎమౌతుందో చూద్దాం .
05:25 Skip this verification (Phone Verification may be required) చెక్ బాక్స్ పై చెక్ పెట్టండి.
05:32 లొకేషన్ India (भारत) ఎంచుకోండి.
05:35 తదుపరి I agree to the Google Terms of service and Privacy Policy చెక్ బాక్స్ పై చెక్ పెట్టండి.
05:41 చివరికి Next Step. పై క్లిక్ చేయ్యండి.
05:45 ఇది ఫోన్ నంబర్ వెరిఫికేషన్ పేజ్ కు మరలిస్తుంది.
05:50 దేశ ధ్వజమును డ్రాప్ డౌన్ మేను నుండి ఎంచుకోండి. నేను భారత దేశను ఎంచుకుంటాను.
05:55 టెక్స్ట్ బాక్స్లో మొబైల్ నంబర్ టైప్ చేస్తాను.
06:00 Text message (SMS) ఎంపికను ఎంచుకోండి. అప్రమేయంగా ఇది ఎంపిక చెయ్యబడుతుంది.
06:07 Continue బటన్ను క్లిక్ చేయ్యండి.
06:10 మీ ఫోన్ కి ఒక ఎస్ ఎం ఎస్ వస్తుంది.
06:13 అది మిమల్ని వెరిఫికకేషన్లో తరువాత భాగానికి తీసుకెళ్తుంది.
06:17 గూగుల్ ఎస్ఎం ఎస్(SMS) నుండి వచ్చిన కోడ్ను టెస్ట్ బాక్స్లో టైప్ చేయ్యండి .
06:24 Continue క్లిక్ చేయ్యండి.
06:27 ఇప్పుడు మనం "క్రియేట్ యువర్ పబ్లిక్ గూగుల్ + ప్రొఫైల్"(Create your public Google+ profile ) పేజీ లో ఉన్నాం.
06:32 ఇక్కడ మీ పేరు కనిపిస్తుంది.
06:35 దీని కింద "యాడ్ ఎ ఫోటో" (add a photo) ఎంపిక కనిపిస్తుంది.
06:39 దీని పై క్లిక్ చేసి మీరు మీ గూగుల్ ప్రొఫైల్ కొరకు ఒక ఫోటోని జోడించగలరు.
06:44 క్రియేట్ యువర్ ప్రొఫైల్ అనే బటన్ కూడా కనిపిస్తుంది.
06:48 ప్రస్తుతం దీన్ని నేను స్కిప్ చేస్తాను.
06:51 బడలుగా, నొ థాంక్స్(No Thanks) బటన్ నొక్కి నా ఇమెయిల్ అకౌంట్ కు వెళ్తాను.
06:58 ఇప్పుడు, స్వాగత పేజీ (Welcome Page)లో ఉన్నాం.
07:02 నావిషయం లో, "Welcome, Rebecca" అని కనిపిస్తుంది.
07:06 నా కొత్త ఇమెయిల్ అడ్డ్రస్ ray.becky.0808@gmail.com కూడా కనిపిస్తుంది.
07:16 ఇప్పుడు, కంటిన్యూటు జీమెయిల్ (Continue to Gmail ) బట్టన్ నొక్కండి.
07:22 మీ మెయిల్ అకౌంట్ లోడ్ చేయబడుతుంది.
07:24 ఇది మీ ఇంటర్ నెట్ వేగానికనుగుణంగా సమయం తీసుకుంటుంది.
07:28 మీ ఇంటర్ నెట్ స్లో ఉంటే, Load basic HTML పై క్లిక్ చేయ్యండి.
07:33 ఇది స్క్రీన్ కుడి కింద భాగంలో కనిపిస్తుంది.
07:37 ఇది ఏ గ్రాఫికల్ లుక్ లేకుండా జీమెయిల్ లోడ్ చేస్తుంది.
07:41 కొన్ని ఇన్ఫర్మేషన్ బాక్స్ లు స్క్రీన్ పై పాప్-అప్ అవుతాయి.
07:46 వాటిని చదవండి లేదా next బటన్ నొక్కి మిగితా వివరాలు తెలుసుకొని క్లోసే చేయ్యండి.
07:53 ఇది అప్రమేయంగా కనిపించే స్టాన్ డర్డ్ జీమెయిల్ అకౌంట్.
07:58 మధ్య భాగం లో మన మెయిల్లు చూపబడును.
08:04 3 ట్యాబ్లు ఉన్నవని గమనించండి. వీటిగురించి మరో టుటోరియల్లో నేర్చుకుందాం.
08:12 ఎడమ వైపున, కొన్ని లేబుల్ చేసిఉన్న మెను ఐటమ్లు కనిపిస్తున్నవి.
08:16 Inbox, Starred, Sent Mail, Drafts మరియు More. ఇవి జిమెయిల్ లోని కొన్ని ముఖ్యమైన మెయిల్ బాక్స్లు.
08:29 అప్రమేయంగా, ఇన్బాక్స్ ఎంపిక చేయ్యబడి మరియు దాని కంటెంట్లు డిస్ ప్లే ఎరియా లో కనిపిస్తాయి.
08:36 ఇన్ బాక్స్ వద్ద బ్రాకెట్ లో 3 ఉందని గమనించండి.
08:41 ఇది మీకు వచ్చిన మెయిల్ల సంఖ్యను సూచిస్తుంది.
08:46 కొత్త గూగుల్ అకౌంట్ తెరచినప్పుడు జిమెయిల్ టీమ్ నుండి కొన్ని మెయిల్ లను అందుకుంటాం.
08:52 వాటిని చదివి జిమెయిల్ ఫీచర్ల గురించి మరింత అవగాహన పొందవచ్చు.
08:58 ఇప్పుడు, ఒక ఈమెయిల్ ఎలా రాయాలో చూద్దాం.
09:02 ఎడమ వైపు ఉన్న కాంపొస్ (COMPOSE) బటన్ పై క్లిక్ చేయ్యండి .
09:06 New Message పేరుతో ఒక విండో తెరుచుకుంటుంది .
09:10 ఇందులో 4 భాగాలు ఉన్నవి.
09:13 To – ఇక్కడ మీరు ఎవరికీ ఈమెయిల్ పంపాలో వారి మెయిల్ అడ్రస్ టైపు చెయ్యాలి .
09:21 ఇక్కడ, నేను ఇప్పుడు సృష్టించిన ray.becky.0808@gmail.com ఇమెయిల్ ఐడి టైప్ చేస్తాను.
09:35 అంటే నాకు నేనే ఇమెయిల్ పంపుకుంటాను.
09:39 తదుపరి భాగం "సబ్ జెక్ట్".
09:42 ఇక్కడ, మనము మెయిల్ గురించి క్లుప్తంగా సబ్జెక్టు లైన్ టైప్ చేయవచ్చు
09:46 Welcome mail అని టైప్ చేద్దాం.
09:50 తదుపరి కంటెంట్ భాగం.
09:53 ఇక్కడ పంపవలసిన సందేశాన్ని వివరంగా టైప్ చేయగలం.
09:57 Greetings to all from the Spoken Tutorial Project అని టైప్ చేద్దాం.
10:03 చివరి భాగంలో, "send" అనే నీలం రంగు బటన్ కనిపిస్తుంది.
10:08 ఇమెయిల్ పంపేందుకు దీన్ని క్లిక్ చేయ్యండి .
10:11 ఇన్ బాక్స్లో 4 మెయిల్లు ఉన్నాయని గమనించండి.
10:16 ఏ మెయిల్ చదువాలో దాని పై క్లిక్ చేయ్యండి.
10:20 ఇది నాకు నేను పంపుకున్న మెయిల్.
10:23 దాన్ని ఇప్పుడు చూద్దాం.
10:26 Show Details యారో పై క్లిక్ చేయ్యండి.
10:29 పంపించిన మరియు స్వీకరించిన ఇమెయిల్ వివరాలు కనిపిస్తాయి.
10:34 ఇక్కడ, ఇమెయిల్ పంపిన తేది మరియు సమయం కనిపిస్తుంది.
10:39 ఇక్కడ, ఇమెయిల్ యొక్క సబ్ జక్ట్ లైన్ కనిపిస్తుంది.
10:43 మరియు కంటెంట్ ఇక్కడ ఉంది.
10:47 ఇప్పుడు, ఇన్ బాక్స్ లో చదవని మెయిల్లు మూడు అని సూచిస్తుంది.
10:54 ఇప్పుడు, జిమెయిల్ నుండి సైన్ ఔట్ ఎలా కావాలో చూద్దాం.
10:58 మీ ఇమెయిల్ ఐడి పై కుడి భాగంలో కనిపిస్తుంది.
11:03 అకౌంట్ క్రియేట్ చేస్తుండగా మీ ఫోటో గనుక అప్ లోడ్ చెసిఉంటే ఐడి బదులుగా, ఫోటో కనిపిస్తుంది.
11:08 దాని పై క్లిక్ చెయండి.
11:10 ఇక్కడ సైన్ ఔట్ బటన్ కనిపిస్తుంది. దీని పై క్లిక్ చేసి సైన్ ఔట్ చేయగలరు.
11:17 జీమెయిల్ నుండి సైన్ ఔట్ ఐయారు.
11:21 ఇంతటితో ఈ టూటోరియల్ సమాప్తి.
11:25 సారాంశం చూస్తే: ఇందులో మనం నేర్చుకున్నది:
11:28 కొత్త గూగుల్ అకౌంట్ క్రియేట్ చేయడం.
11:31 గూగుల్ అకౌంట్ ఉపయోగించి జీమెయిల్లో లాగ్ ఇన్ కావడం.
11:34 ఇమెయిల్ రాయడం.
11:36 ఇమెయిల్ పంపడం. ఇమెయిల్ చూడడం మరియు
11:39 లాగ్ ఔట్ కావడం.
11:41 ఈ లింక్ లోని విడియో స్పోకన్ టూటోరియల్ సారాంశం
11:45 దయచేసి డౌన్ లోడ్ చెసి చూడండి.
11:49 మేము వర్క్ షాప్ నిర్వహించి ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికెట్ ఇస్తాం.
11:55 మరిన్ని వివరాలకు మమల్ని సంప్రదించండి.
11:58 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజక్టు NMEICT, MHRD, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది.
12:05 ఈ మిషన్ గురించి మరిన్ని వివరాలు ఈ లింక్ లో ఉన్నవి.
12:10 ఈ రచనకు సహాయ పడినవారు శ్రీహర్ష ఏ.ఎన్ మరియు మాధురిగణపతి.
12:12 ధన్యవాదములు

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya