Introduction-to-Computers/C2/Google-Drive-Options/Telugu
From Script | Spoken-Tutorial
|
|
00:01 | గూగుల్ డ్రైవ్ ఆప్షన్స్ పై స్పోకన్ టూటోరియల్కు స్వాగతం. |
00:06 | ఈ టుటోరియల్లో మనం గూగుల్ డ్రైవ్లో ఉన్న ఎంపికలను తెలుసుకుందాం, ఉదాహరణకు: |
00:12 | డాక్యుమెంట్, స్ప్రెడ్ షీట్ మరియు ప్రేసేన్టేషన్లను తయారు చేయుట. |
00:17 | ఫైల్ మరియు ఫోల్డర్లను అప్లోడ్ చేయుట మరియు |
00:20 | షేరింగ్ ఎంపికలు. |
00:22 | ఈ టుటోరియల్ కొరకు, మీకు ఇంటర్నెట్ కనెక్షన్ మరియు వెబ్ బ్రౌసర్ కావాల్సి ఉంటుంది. |
00:29 | నేను ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌసర్ ఉపయోగిస్తాను. |
00:33 | గూగుల్ డ్రైవ్ గూర్చి తెలుసుకొనుట జిమెయిల్ గురించిన ప్రాథమిక అవగాహన అవసరం. |
00:38 | లేదంటే, మా వెబ్ సైట్లో ఉన్న జిమెయిల్ టుటోరియల్ని చూడగలరు. |
00:43 | ప్రారంభిద్దామ్: |
00:45 | బ్రౌసర్ని తెరవండి మరియు జిమెయిల్లో లాగ్ఇన్ ఔవ్వండి. |
00:49 | నేను ముందే లాగ్ఇన్ చేసి ఉంచాను. |
00:51 | కుడి పై భాగంలో, మీ పేరు పక్కన ఒక గ్రిడ్ ఐకాన్ కనిపిస్తుంది. |
00:56 | దీని పై మౌస్ పాయింట్ చేస్తే, హెల్ప్ టెక్స్ట్ "యాప్స్"(Apps) అని చూపిస్తుంది. దీని పై క్లిక్ చేయ్యండి. |
01:02 | ఇక్కడ కొన్ని గూగుల్ యాప్లు కనిపిస్తాయి: గూగుల్ ప్లస్, సర్చ్, యూట్యూబ్, మ్యాప్స్
ప్లే స్టోర్, న్యూస్, మెయిల్, డ్రైవ్, క్యాలెండర్ మరియు, మోర్. |
01:18 | వీటిలో ఏ ఒక్కదాని పై క్లిక్ చేస్తే, ఆ ప్రత్యేక గూగుల్ యఫ్కు రిడైరెక్ట్ చేయబడుతాం. |
01:24 | మనం ఈ జాబితాన్ని మన ప్రాధాన్యతకు తగినట్టు, ఐకాన్లను డ్ర్యాగ్ చేసి మార్చుకోవచ్చు. |
01:32 | ఈ టుటోరియల్లో, ప్రత్యేకంగా డ్రైవ్ గురించి నేర్చుకుందాం. |
01:35 | కనుక, డ్రైవ్ పై క్లిక్ చేయ్యండి. |
01:39 | ఇది గూగుల్ డ్రైవ్ పేజీ కొత్త ట్యాబ్లో తెరుస్తుంది. |
01:43 | పేజీ పై భాగంలో సర్చ్ బార్ కనిపిస్తుంది. |
01:47 | ఎడమ వైపు, కొన్ని మేనులు ఉన్నాయి. |
01:51 | కుడి భాగంలో, కొన్ని ఐకాన్లు ఉన్నాయి. |
01:55 | మధ్యలో రెండు ఫైల్ల్లు కనిపిస్తున్నాయి. |
01:59 | మొదటిది అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు గూగుల్ టీం షేర్ చేసింది. |
02:05 | రెండో ఫైల్ మనము ఇంతక ముందు అప్లోడ్ చేసింది. |
02:10 | ఇప్పుడు, ఎడమ వైపు ఉన్న మెనులను చూద్దాం. |
02:14 | ఇక్కడ క్రింద మెనులు ఉన్నవి: న్యూ, మై డ్రైవ్, షేర్డ్ విత్ మి , గూగుల్ ఫోటోస్, రీసెంట్, స్టార్డ్ మరియు , ట్రాష్ |
02:27 | అప్రమేయంగా, మై డ్రైవ్(My Drive) మేను ఎంచుకోబడి, దాని లోపల ఉన్నవి మధ్యలో కనిపిస్తాయి. |
02:34 | అన్ని ఫైల్లు మరియు ఫొల్డర్లు ఈ మధ్య భాగంలో కనిపిస్తాయి. |
02:38 | అందుకే, వెనకటి టుటోరియల్లో అప్ లోడ్ చేసిన పిడిఎఫ్ మరియు జిప్(zip) ఫైల్ల్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. |
02:47 | మనము అప్లోడ్ లేదా క్రియేట్ చేసిన ఫైల్ల్లు “మై డ్రైవ్”లో కూడా నిల్వ ఉంటాయి. |
02:53 | తదుపరి మెను "షేర్డ్ విత్ మి". దీని పై క్లిక్ చేద్దాం. |
02:58 | ఎవరైనా నాతో ఫైల్ లేదా డాక్యుమెంట్ పంచితే, అది ఇక్కడ కనిపిస్తుంది. |
03:03 | ఇప్పటిదాకా, ఎవరూ నాకు ఏ ఫైల్ షేర్ చెయ్యలేదు. అందుకే, ఇది ఖాలిగా ఉంది. |
03:09 | ఇటీవల, "గూగుల్", గూగుల్ ఫోటోలను అందుకొనేందుకు డ్రైవ్ లోనే ఒక షార్ట్ కట్ని కల్పించింది. |
03:15 | ఈ టుటోరియల్లో మనం ఈ ఎంపికను స్కిప్ చేద్దాం. |
03:19 | రిసెంట్ మెనులో ఇటీవల తెరచిన ఫైళ్ళ జాబిత ఉంటుంది. |
03:25 | ఇక్కడ మై డ్రైవ్ మరియు షేర్డ్ విత్ మి(Shared with me) కంటెంట్లు కనిపిస్తాయి. |
03:30 | అందుకే, ఇంతక ముందు తెరచిన పిడిఎఫ్ మరియు జిప్(zip) ఫైల్ ఇక్కడ కనిపిస్తున్నాయి. |
03:37 | Starred- ఏదైనా ఒక ఫైల్ లేదా డాక్యుమెంట్ ముఖ్యమైనడైతే దానికి స్టార్ గుర్తు వేస్తాం. ఆ ఫైల్ ఈ మెను క్రింద ప్రదర్శించబడుతుంది. |
03:45 | మై డ్రైవ్ మెనూకి వెళ్ళి పిడిఎఫ్ ఫైల్ పై రైట్ క్లిక్ చేద్దాం. |
03:51 | ఇప్పుడు, యాడ్ స్టార్ ఎంపికను ఎంచుకుందాం. |
03:55 | తరువాత, స్టార్డ్ మెను పై క్లిక్ చేస్తే మన ఫైల్ ఉంటుంది. |
04:00 | ఈ ఫైల్ను కాపి చేద్దాం. |
04:03 | మరొక్క సారి, రైట్ క్లిక్ చేసి “మెక్ ఎ కాపీ”ను ఎంచుకోండి. |
04:10 | ఇప్పుడు మన వద్ద రెండు ఫైల్లు ఉన్నాయి. |
04:13 | ఒక ఫైల్ని తొలగిద్దాం. ఫైల్ని ఎంచుకోని కీబోర్డ్ పై డిలీట్ కీని నొక్కండి. |
04:20 | తొలగించిన ఫైల్ల్లు లేదా డాక్యుమెంట్లు ట్రాష్ మెనూ క్రింద కనిపిస్తుంది. |
04:25 | తొలగించడం తాత్కాలికం మాత్రమే. |
04:28 | ఎంప్టి ట్రాష్ ఎంపికతో ఫైల్లను ట్రాష్ మెను నుండి శాశ్వతంగా తొలగించవచ్చు. |
04:36 | ట్రాష్ మెనులో ఉన్న ఫైల్లు గూగుల్ సర్వర్ నుండి 30 రోజుల తరువాత శాశ్వతంగా తొలగించబడును. |
04:44 | ఇప్పుడు, ఫైల్ మరియు ఫోల్డర్లను ఎలా క్రియేట్ మరియు అప్లోడ్ చేసేది నేర్చుకుందాం. |
04:49 | వీటిని చేసేందుకు 4 మార్గాలు ఉన్నవి: మొదటి మార్గం : ఎడమ వైపు ఉన్న ఎరపు రంగు “న్యూ” బటన్ క్లిక్ చేసి. |
04:56 | రెండవ మార్గం: మై డ్రైవ్ ఎంపిక పై రైట్ క్లిక్ చేసి. |
05:00 | ఇప్పుడు, మై డ్రైవ్కు తిరిగివచ్చి.మై డ్రైవ్ ఎంపికలలో, మద్య భాగం లో రైట్ క్లిక్ చెయ్యవచ్చు. |
05:09 | చివరికి, పైన ఉన్న మై డ్రైవ్ డ్రాప్ డౌన్ మెను క్లిక్ చేయ్యండి. |
05:14 | న్యూ ఎంపికను అన్వేషిద్దాం. న్యూ పై క్లిక్ చేయ్యండి. |
05:19 | క్రింద ఎంపికలు కనిపిస్తాయి:
ఫోల్డర్, ఫైల్ అప్లోడ్, గూగుల్ డాక్స్, షీట్స్, స్లయిడ్స్ మరియు మోర్. |
05:28 | ప్రతీ యొక్క ఎంపికను ఒకొక్కటిగా చూద్దాం. |
05:31 | ఫోల్డర్ ఎంపికతో కొత్త ఫోల్డర్ను క్రియేట్ చేయగలరు. |
05:34 | దిని పై క్లిక్ చెయ్యగానే, వెంటనే పేరు కోసం ప్రేరేపిస్తుంది. |
05:40 | ఫోల్డర్ పేరు స్పోకన్ టుటోరియల్ అని టైప్ చేసి క్రియేట్ క్లిక్ చెయ్యండి. |
05:48 | ఈ ఫోల్డర్ అప్రమేయంగా మై డ్రైవ్ క్రింద కనిపిస్తుంది. |
05:52 | ఫోల్డర్, ఇక్కడ మధ్యలో కనిపిస్తుంది. |
05:56 | ఫోల్డర్లు మన ఫైల్లను సరిగ్గా ఏర్పర్చుటకు సహాయపడతాయి. |
06:00 | కాబట్టి భిన్నమైన ఫోల్డర్లను క్రియేట్ చేయగలరు. ఉదాహరణకు: “పర్సనల్, వర్క్” మొదలైనవి. |
06:07 | ఒక ఫైల్ను అప్లోడ్ చేసేందుకు న్యూ బటన్ క్లిక్ చేసి ఫైల్ అప్లోడ్ పై క్లిక్ చేయ్యండి. |
06:13 | ఇప్పుడు, ఫైల్ బ్రౌసర్ విండో తెరుచుకుంటుంది. |
06:16 | బ్రౌస్ చేసి అప్లోడ్ చేయవలసిన ఫైల్ను ఎంచుకోండి. |
06:19 | నేను డెస్క్ టాప్ పై ఉన్న “xyz.odt” ఫైల్ని ఎంచుకొని ఓపన్ బటన్ క్లిక్ చెస్తాను. |
06:26 | కింద కుడి వైపు, అప్లోడ్ పురోగతి కనిపిస్తుంది. |
06:30 | అప్లోడ్ కావడానికి ఫైలు యొక్క పరిమాణం మరియు ఇంటర్నెట్ వేగం ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు. |
06:35 | అప్లోడ్ పూర్తయిన తరువాత, ఆ ఫైల్ మధ్య భాగంలో కనిపిస్తుంది. |
06:41 | ఇప్పుడు, కింద ఉన్న ప్రోగ్రెస్ విండో మూసివేయండి. |
06:45 | ఇదే విధంగా, ఫోల్డర్ అప్లోడ్ ఎంపోకతో డ్రైవ్లో ఒక ఫోల్డర్ని అప్లోడ్ చేయగలరు. |
06:52 | ఈ ఎంపిక కొన్ని బ్రౌజర్లకు మాత్రమే సీమితం ఉదాహరణకు: గూగుల్ క్రోమ్. |
06:59 | అప్లోడ్ చేసిన ఫైల్ను స్పోకన్ టుటోరియల్ ఫోల్డర్కు ఎలా చేర్చగలమ్? |
07:04 | ఇలా ఫైల్ని డ్ర్యాగ్ చేసి ఫోల్డర్ లో డ్రాప్ చేయ్యండి. |
07:09 | ఇప్పుడు, ఎడమ వైపు, మై డ్రైవ్ ఎంపికను జాగ్రతగా చూడండి. |
07:14 | ఎడమ వైపు ఒక చిన్న త్రికోణం కనిపిస్తుంది. |
07:18 | దీని పై క్లిక్ చేస్తే మై డ్రైవ్ లో ఉన్న సబ్ ఫోల్డర్లు కనిపిస్తాయి. |
07:22 | ఇక్కడ మన స్పోకన్ టుటోరియల్ ఫోల్డర్ ఉంది మరియు అందులో 'xyz.odt' ఫైల్ కనిపిస్తుంది. |
07:31 | మన దైనందిన కార్యక్రమాలకు, డాక్యుమెంట్స్, స్ప్రెడ్ షీట్ మరియు ప్రసేన్టేషన్లను ఉపయోగిస్తాం. |
07:36 | వీటన్నిటిని డ్రైవ్ తో క్రియేట్ మరియు నిర్వహహించవచ్చా? |
07:39 | అవును చెయ్యవచ్చు. గూగుల్ డ్రైవ్లో మనం డాక్యుమెంట్లు, స్ప్రెడ్ షీట్లు మరియు ప్రెజెంటేషన్లు ఆఫీస్ సూట్ లాగనే సృష్టించవచ్చు |
07:50 | డాక్యుమెంట్లను క్రియేట్ చేసేందుకు గూగుల్ డాక్స్ ఉంది. |
07:54 | గూగుల్ షీట్స్ స్ప్రెడ్ షీట్ల కొరకు మరియు |
07:57 | గూగుల్ స్లైడ్స్ ప్రెజెంటేషన్లు క్రియేట్ చేసేందుకు ఉన్నవి. |
08:01 | ఉదాహరణగా నేను గూగుల్ డాక్స్తో డాక్యుమెంట్ ఎలా సృష్టించాలో చూపిస్తాను. |
08:08 | ఒక కొత్త డాక్యుమెంట్ను తయారు చేసేందుకు, న్యూ పై క్లిక్ చేసి, గూగుల్ డాక్స్ ఎంపికను ఎంచుకోండి. |
08:14 | ఇది ఒక ఖాళి డాక్యుమెంట్ కొత్త ట్యాబ్లో తెరుస్తుంది. |
08:19 | మెను మరియు ఫార్మాటింగ్ ఎంపికలు ఏవైన ఆఫిస్ సూట్ లాగానే ఉన్నాయని గమనించండి. |
08:26 | పైన "ఆన్ టైటల్డ డాక్యుమెంట్" అనె టైటల్ కనిపిస్తుంది. |
08:31 | దీనిని మార్చుకోవచ్చు. మార్చడానికి టెక్స్ట్ పై క్లిక్ చెయండి. |
08:38 | రినేం డాక్యుమెంట్ విండో తెరుచుకొంటుంది. |
08:41 | ఇక్కడ మనం కావల్సిన పేరును టైప్ చేయగలం. |
08:46 | నేను మై ఫస్ట్ గూగుల్ డాక్ అని టైప్ చేసి ఓకే క్లిక్ చెస్తాను. |
08:53 | టైటిల్ మారిపోయిందని గమనించండి. |
08:56 | ఇందులో కొంత కంటెంట్ ను టైప్ చేద్దాం. "వెల్ కం టు గూగుల్ డాక్స్". |
09:02 | దీనికి ఏదైనా మార్పులు చెర్పులు లెదా తొలగించడాలు చేస్తే డాక్యుమెంట్ ఆటో సేవ్ ఔతుంది. |
09:08 | "All changes saved in Drive", అనే సూచన "Help" మెనూ పక్కన కనిపిస్తుంది. |
09:14 | దాని పై క్లిక్ చేస్తే, కుడి వైపు రివిజన్ హిస్టరి కనిపిస్తుది. |
09:19 | ఇందులో చివరికి మార్పు చేసిన తేదీ, సమయం మరియు ఎవరు చేశారు, ఈ వివరాలు ఉంటాయి. |
09:26 | ఇప్పటిదాక, ఈ డాక్యుమెంట్ ను ఎవరికీ షేర్ చేయలేదు. |
09:30 | అందుకే, మనకు "Rebecca Raymond" అనె యూసర్ మరియు ఈనాటి తేది మాత్రమే కనిపిస్తుంది. |
09:37 | ఈ గూగుల్ డాక్ కనుక బహుళ వ్యక్తులతో షేర్ చేయబడినట్టైతే, "revision history"లో యూసర్లు చెసె మార్పుల జాబిత ఉంటుంది. ప్రతి యూసర్కు వేరే ప్రత్యెక రంగు ఉంటుంది. |
09:48 | ఈ ఫీచర్ను తరువాత చూద్దాం. |
09:53 | "రివిషన్ హిస్టరి"ని మూసివేయండి. |
09:56 | ఈ ట్యాబ్ను ముసివేద్దాం. గూగుల్ డాక్ దీన్ని సేవ్ చేస్తుంది. |
10:02 | మరల మనం, మై డ్రైవ్ లో ఉన్నాం, అందులో ఉన్నమన ఫైల్ కనిపిస్తుంది. |
10:07 | ఫైల్ తెరవడానికి, దాని పై డబల్ క్లిక్ చేయ్యండి. |
10:10 | ఇప్పుడు, "Welcome to Google Docs" వాక్యాన్ని రెండు సార్లు కాపి, పెస్ట్ చెసి, ట్యాబ్ను మూసివవేద్దాం. |
10:17 | ఫైల్ని తెరుచుటకు దాని పై మరల డబల్ క్లిక్ చేయ్యండి. |
10:20 | మరొక్క సారి "Welcome to Google Docs" వాక్యాన్ని కాపీ-పెస్ట్ చేయ్యండి. |
10:26 | ఇప్పుడు, "Revision History"పై క్లిక్ చేస్తే, ఫైల్ రివిషన్ తోపాటు మార్పు చెందిన తెది, సమయం మరియు యూసర్ వివరాలు కనిపిస్తాయి. |
10:36 | మల్టిపల్ రివిజన్ లు కనిపించకపొతే, కింద ఉన్న "Show more detailed revisions" పై క్లిక్ చేయగలరు. |
10:44 | తాజా రివిజన్ అన్నిటి కన్న పైన ఉండేట్లు రివిజన్లు కాలక్రమానుసారం అమర్చబడ్డాయి. |
10:50 | ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందని చూసెందుకు, ప్రతి ఒక్క రివిజన్ పై క్లిక్ చేయ్యండి. |
10:55 | ఇప్పుడు ఈ ఫైల్ ని ఇద్దరు యూసర్లకు షెర్ చెస్తాను. |
10:59 | దీని కొరకు, కుడి పై భాగంలో ఉన్న షేర్ బటన్ పై క్లిక్ చేయ్యండి. |
11:03 | "Share with others" డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
11:07 | పీపల్ టెక్స్ట్ బాక్స్లో, ఈ డాక్యుమెంట్ను ఎవరికి షేర్ చేస్తున్నామో వారి ఈమైల్ ఐడిలు ఇవ్వాలి. |
11:15 | నేను 0808iambecky@gmail.com అని టైప్ చేస్తాను. |
11:23 | ఇక్కడ ఆటొఫిల్ ఫీచర్ మనం ముందుగా పంపిన ఈ మెయిల్ ఐడిలతో కనిపిస్తుంది |
11:31 | డాక్యుమెంట్లను ఇతర యూసర్లతో షేర్ చేసే ఇంకా మూడు విధానాలు ఉన్నాయి. |
11:36 | ఈ బటన్ పై క్లిక్ చేస్తే మూడూ విధానాలను చూడవచ్చు:
కెన్ ఎడిట్, కెన్ కామెంట్, కెన్ వ్యూ |
11:44 | కెన్ ఎడిట్ ఎంపిక యూసర్కు డాక్యుమెంట్లో మార్పులు చేసే అనుమతి ఇస్తుంది. |
11:51 | కెన్ కామెంట్ ఎంపిక యూసర్కు మార్పుల సలహ వివ్వడానికి అనుమతి ఇస్తుంది. |
11:56 | కెన్ వ్యూ ఎంపిక యూసర్కు డాక్యుమెంట్ ని చూడడానికి మాత్రం అనుమతి ఇస్తుంది. |
12:00 | వారు మార్పులు లేదా సలహాలు ఇవ్వలేరు. |
12:04 | 0808iambeckyకు కెన్ ఎడిట్ ఎంపిక ఇద్దాం. |
12:09 | stlibreoffice@gmail.comని కూడా యాడ్ చేస్తాను. |
12:16 | రెండు ఈమైల్ ఐడి మధ్య కామా ఉండాలని గమనించండి. |
12:21 | ఈమైల్ ఐడి ఎంటర్ చెసిన వెంటనే, విండో మారుతుంది. |
12:25 | "Add a note" టెక్స్ట్ ఏరియా కనిపిస్తుంది. |
12:28 | ఇతర యూసర్లకు డాక్యుమెంట్ గురించి పంపించాల్సిన కొన్ని వివరాలు ఇక్కడ టైప్ చేయగలం. |
12:36 | నేను “Please find attached a document for testing purpose. Kindly modify or suggest as per the permission given to you.
Thanks Ray.Becky” అని టైప్ చెస్తాను. |
12:47 | చివరికి, సెండ్ బటన్ పై క్లిక్ చేసి షేరింగ్ ప్రక్రియ పూర్తి చేస్తాను. |
12:52 | ఇప్పుడు యూసర్లకు మన వివరాలతో ఒక ఈమెయిల్ గమనిక మరియు డాక్యుమెంట్ షేర్ర్ చెసిన లింక్ వెళ్తుంది. |
12:59 | ఇంకొక సారి షేర్ బటన్ పై క్లిక్ చెయండి. |
13:02 | తరువాత అడ్వాంస్డ్ పై క్లిక్ చేయ్యండి. |
13:05 | ఇప్పుడు, stlibreoffice యూసర్ని కెన్ కామెంట్ షేరింగ్ మోడ్కు మారుద్దాం. |
13:12 | చివరిగా సేవ్ చేంజెస్ పై క్లిక్ చేసి Done(డన్) పై క్లిక్ చే య్యండి . |
13:18 | మరియు డాక్యుమెంట్ను మూసివేయండి. |
13:21 | ఇప్పుడు, ఇద్దరూ యూసర్లు డాక్యుమెంట్లో మార్పులు చేశారనుకోండి. |
13:27 | డాక్యుమెంట్ తరువాత తెరచి చూస్తే, ఇతర యూసర్లు చేసిన మార్పులు గమనించవచ్చు. |
13:34 | stlibreoffice@gmail.com యూసర్ సలహను మాత్రమే ఇవ్వగలరు కనుక వారు ఇచ్చిన సలహ కనిపిస్తుంది. |
13:43 | మౌస్ పాయింటర్ను సజేషన్ బాక్స్ వద్ద ఉన్న చెక్ మరియు క్రాస్ గుర్తులున్న చోటికి తీసుకెళ్ళండి. |
13:49 | చెక్ గుర్తు సలహా అంగీకారాన్ని మరియు క్రాస్ గుర్తు తిరస్కారాన్ని సూచిస్తుంది. |
13:56 | ఒక సలహని అంగీకరించి మిగతావి తిరస్కరిస్తాను. |
14:02 | ఇక్కడ 0808iambecky నుండి ఒక కామెంట్ కనిపిస్తుంది. |
14:07 | మరియు ఇక్కడ, రిసాల్వ్ బటన్ కనిపిస్తుంది. |
14:11 | క్యాన్ ఎడిట్ ఎంపికతో ఉన్న యూసర్, కామెంట్ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఈ కామెంట్ కు జవాబు ఇవ్వగలరు. |
14:18 | కామెంట్ సరణీను తొలగించుటకు, రిసాల్వ్ బటన్ క్లిక్ చెయండి. |
14:22 | 0808iambecky యూసర్ డాక్యుమెంట్కి చేసిన ఏ మార్పులని మనం చూడలేము. |
14:29 | ఈ యూసర్కు ఎడిట్ అనుమతి ఇవ్వబడినది. గుర్తుందా. |
14:34 | ఆ యూసర్ ఏ మార్పులు చేశారో అని తెలిసేదెలా? |
14:39 | అందుకు, రివిజన్ హిస్టరిని చూడగలరు. |
14:43 | దిన్ని తెరచుటకు, ఫైల్ పై క్లిక్ చెసి See revision history ఎంపికను క్లిక్ చేయ్యండి |
14:50 | 0808iambecky చేసిన మార్పులు వేరే రంగులో కనిపిస్తాయి. |
14:58 | stlibreoffice@gmail.com ఇచ్చిన సలహలు కూడా వవేరే రంగులో కనిపిస్తుంది. |
15:05 | మరియు మనం అంటే ఓనర్ చేసిన పని వేరే రంగులో కనిపిస్తుంది. |
15:11 | రివిజన్ హిస్టరి విండో మూసివేద్దాం. |
15:14 | షేర్ చేసే ఇంకొక విధానం ఉన్నది. షేర్ర్ బటన్ పై క్లిక్ చేయ్యండి. |
15:20 | షెర్ విత్ ఆదర్స్ విండో కుడి పై భాగంలో "గెట్ షెర్ ఎబల్ లింక్"( Get shareable link) కనిపిస్తుంది, దాని పై క్లిక్ చేయ్యండి. |
15:29 | "Anyone with the link can view" అని సూచిస్తుంది. |
15:32 | ఈ డాక్యుమెంట్కు లింక్ నిర్మిస్తుంది. |
15:35 | ఇప్పుడు ఈ లింక్ను మనం ఏ ఈమైల్ ఐడికైనా పంపిస్తే, వారు ఈ డాక్యుమెంట్ను చూడగలరు. |
15:44 | ఇంతటితో ఈ టుటోరియల్ సమాప్తం. |
15:47 | తరగతి సారాంశం. |
15:49 | ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్నది:
గూగుల్ డ్రైవ్ వాడుకోవడం , ఫైల్ క్రియేట్ మరియు అప్ లోడ్ చేయుట గూగుల్ డాక్స్ క్రియేట్ చేయుట మరియు, షేర్ ఎంపిక ను ఉపయోగించుట. |
16:00 | ఈ లింక్ లోని వీడియో స్పోకన్ టుటోరియల్ సారాంశం. దయచేసి డౌన్ లోడ్ చెసి చూడగలరు. |
16:07 | మేము వర్క్ షాప్ నిర్వహించి ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికెట్ ఇస్తాం. మరిన్ని వివరాలకు మమ్మల్ని సంప్రదించగలరు. |
16:16 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజక్టు NMEICT, MHRD , భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది.
స్పోకెన్ టుటోరియల్ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో ఉంది |
16:27 | ఈ టుటోరియల్ని అనువదించినవారు శ్రీహర్ష ఎ. ఎన్. నేను మధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు. |