Introduction-to-Computers/C2/Compose-Options-for-Email/Telugu
From Script | Spoken-Tutorial
|
|
00:01 | “కంపోజ్ ఆప్షన్ ఫర్ ఈమెయిల్” పై ఈ స్పోకన్ టుటోరియల్కు స్వాగతం. |
00:07 | ఈ టుటోరియల్లో మనం నేర్చుకునే అంశాలు: |
00:10 | ఈమెయిల్ స్వీకరించేవారు, అనగా, “టు, సిసి, బిసిసి”. |
00:16 | ఈమెయిల్ నిర్దిష్టరూపకల్పన. |
00:19 | ఫైల్ను అటాచ్ చేయడం. |
00:22 | గూగుల్ డ్రైవ్ ద్వారా ఫైల్ను పంచుట. |
00:25 | ఫోటో లేదా ఒక లింక్ను ఈమెయిల్లో చేర్చుట. |
00:29 | మరియు కంపోజ్ విండో ఎంపికలు. |
00:33 | ఇందుకోసం, మీ వద్ద ఇంటర్ నెట్ కనెక్షన్, |
00:38 | మరియు ఒక వెబ్ బ్రౌసర్ ఉండాలి. |
00:40 | నేను ఈ ప్రదర్శనకు, ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌసర్ వాడుతాను. |
00:45 | ప్రారంబిద్దాం. వెబ్ బ్రౌసర్ తెరిచి http://gmail.com టైప్ చేయగలరు. |
00:55 | లాగిన్ పేజీ కనిపిస్తుంది. |
00:58 | యూసర్ నేమ్ మరియు పాస్వర్డ్ను తగిన టెక్స్ బాక్స్లో ప్రవేశ పెట్టగలరు. |
01:04 | ఒక వేళ లాగిన్ పాజ్ యూసర్ నేమ్ తో తెరుచుకుంటే గనక, మీ మెషిన్ నుండి ఆ అకౌంట్ని ఇంతక ముందే తెరిచారని అర్థం. |
01:12 | పాస్ వర్డ్ ప్రవేశ పెట్టండి. |
01:15 | సైన్ ఇన్ బటన్ పై క్లిక్ చెయండి. |
01:18 | మనం జీమెయిల్ పేజీ లో ఉన్నాం. |
01:21 | ఇప్పుడు, ఈ-మెయిల్ రాయడానికి ఇందులో ఉన్న ఎంపికల గురించి చూద్దాం |
01:26 | కంపోజ్ బటన్ క్లిక్ చేద్దాం. |
01:31 | కంపోజ్ విండో తెరుచుకుంటుంది. |
01:34 | ‘టు’ భాగంలో ఈమెయిల్ స్వీకరించేవారిని సూచిస్తాం. |
01:38 | ఇందులో “టు(To), సిసి(Cc) మరియు బిసిసి(Bcc)” అనే మూడు ఎంపికలు ఉన్నవి. |
01:44 | సిసి(Cc) అనగా కార్బన్ కాపీ మరియు బిసిసి(Bcc) అనగా బ్లైండ్ కార్బన్ కాపీ. |
01:51 | టు(To) రంగం లో మనం ఈమెయిల్ను స్వీకరించే వారి ఈమెయిల్ అడ్రస్ టైప్ చేస్తాం. |
01:58 | ఈ స్క్రీన్ షాట్లో కనిపిస్తున్నట్టు. |
02:01 | ఇదే ఈమెయిల్ను చాలా వ్యక్తులకు పంపాలంటే, వారి ఈమెయిల్ ఐడీలను టు ఫీల్డ్ లో పొందుపరచవచ్చు. |
02:09 | ఈ స్క్రీన్ షాట్లో కనిపిస్తున్నట్టు. |
02:12 | సిసి (Cc)ఎంపిక ఉపయోగించి ఇతరులకు అదే ఈమెయిల్ని పంపవచ్చు. |
02:18 | టు(To) మరియు సిసి(Cc) జాబితలో ఉన్న యూసర్లకు, ఇతర రేసిపిఎంట్లు కనిపిస్తారు. |
02:25 | ఈ స్క్రీన్ షాట్లో కనిపిస్తున్నట్టు. |
02:28 | బిసిసి(Bcc) ఎంపికతో ఇమెయిల్ను బ్లైండ్ కాపీగా ఇతరులకు పంపించవచ్చు. |
02:34 | ఈ ఎంపికతో టు మరియు సిసి జాబితాలో ఉన్నవారికి బిసిసి(Bcc)లో ఉన్నవారు కనిపించరు. |
02:42 | బిసిసిలో ఉన్నవారికి సిసి మరియు టుల జాబితా కనిపిస్తుంది. |
02:47 | కానీ వేరే బిసిసి రేసిపిఎంట్లు కనిపించరు. |
02:51 | మెయిల్ని పంపినవారు అన్ని ఐడిలను చూడగలరు. |
02:55 | ఈ స్క్రీన్ షాట్లో కనిపిస్తున్నట్టు. |
02:58 | ముఖ్య గమనిక: |
03:00 | రిసిపియంట్ ఫీల్డ్ లో ‘టు’, ‘సిసి’ మరియు ‘బిసిసి’లో ఎన్నయినా ఈమెయిల్ ఐడిలు జోడించగలం. |
03:08 | ఐతే ఒక రోజుకి గరిష్టంగా 500 రేసిపిఎంట్లకు మాత్రమే మెయిల్ పంపగలం. |
03:13 | ప్రతీ ఒక్క మెయిల్ ఐడి స్పేస్, కామా లేదా కోలన్లతో వేరుచేయాలి. |
03:20 | జీమెయిల్ కంపోజ్ విండోకు వెళ్దాం. |
03:25 | అప్రమేయంగా కర్సర్ టు ఫీల్డ్ లో ఉంటుంది. |
03:29 | రెసిపెంట్ అడ్రెస్ను టైప్ చేద్దాం. |
03:33 | టు ఫీల్డ్ లో ray.becky.0808@gmail.com అని టైప్ చేద్దాం. |
03:46 | సిసి లో 0808iambecky@gmail.com టైప్ చేద్దాం. |
03:55 | మరియు బిసిసి ఫీల్డ్ లో stlibreoffice@gmail.com మరియు info@spoken-tutorial.org టైప్ చేద్దాం. |
04:10 | సబ్జెక్ట్ లైన్ పై క్లిక్ చేసి మీ ఈమెయిల్ విషయం సంక్షిప్తంగా రాయండి. |
04:15 | నేను Partner with us అని టైప్ చేస్తాను. |
04:19 | కంటెంట్ ఏరియాలో, సందేశాన్ని టైప్ చేయగలరు. |
04:24 | Spoken Tutorial Project is helping to bridge the digital divide. |
04:29 | జీమెయిల్, మన టెక్స్ట్ ను ప్రాథమిక ఫార్మాటింగ్ చేసేందుకు అనుమతిస్తుంది. |
04:35 | ఇది అప్రమేయంగ, కంపోజ్ విండోలో కనిపిస్తుంది. |
04:41 | లేదంటే, ఫార్మాటింగ్ ఆప్షన్స్ బటన్ను క్లిక్ చేసి, ఫార్మాటింగ్ టూల్ బార్ని ఉపయోగించ వచ్చు. |
04:47 | ఇక్కడ, ఫాంట్స్, సైజ్ , బొల్డ్, ఐటలిక్, అండర్ లైన్, టెక్స్ట్ కలర్, అలైన్, నంబర్డ్, బుల్లెటెడ్ లిస్ట్ మరియు ఇందెంటేషన్ ఎంపికలు ఉన్నవి. |
05:03 | ఈ ఎంపికలు ఒక వర్డ్ ప్రాససర్ అప్ప్లికేషన్లో ఎలా ఉంటాయో, అలాగే ఉంటాయి. |
05:08 | వీటిని మీరు, అన్వేషించగలరు. |
05:12 | నేను ఇలా నా టెక్స్ట్ను ఫార్మాట్ చేశాను. |
05:16 | ఫార్మాటింగ్ టూల్ బార్ను దాచడానికి, ఫార్మాటింగ్ ఆప్షన్స్ బటన్ క్లిక్ చేయగలరు. |
05:22 | కాంపొస్ విండోలో ఫైళ్ళు, ఫోటోలు, లింక్, మరియు ఇమొటికాన్లను అటాచ్ చేసేందుకు ఎంపికలు ఉన్నవి. |
05:32 | ఇతరులతో, ఫైల్ మరియు డాక్యుమెంట్లు పంచుకోడానికి, |
05:35 | అటాచ్ ఫైల్స్ లేదా ఇన్సర్ట్ ఫైల్స్ యూసింగ్ డ్రైవ్ ఎంపికను వాడగలరు. |
05:41 | మెయిల్ వినియోగుదారులకు అటాచ్మెంట్లను పంపేందుకు అనుమతిస్తుంది |
05:46 | మీరు గరిష్టంగా 25 మెగా బైటు(ఎంబి) సైజ్ వరకు అట్యచ్ చేయగలరు. |
05:51 | దీనికన్న ఎక్కువ పరిమాణం గల ఫైల్లను పంపేందుకు, ఇన్సర్ట్ ఫైల్ యుసింగ్ డ్రైవ్ ఎంపికను ఉపయోగించవచ్చు. |
05:59 | ఒక పిడిఎఫ్ ఫైల్ను అటాచ్ చేద్దాం, ఇది 1 ఎంబి కన్నా తక్కువ ఉంది. |
06:04 | అటాచ్ ఫైల్ ఐకాన్ పై క్లిక్ చేయండి ఇది ఒక పేపర్ క్లిప్లా కనిపిస్తుంది. |
06:09 | ఇప్పుడొక ఒక ఫైల్ బ్రౌసర్ తెరచుకుంటుంది. |
06:12 | బ్రౌస్ చేసి పంపించవలసిన ఫైల్ని ఎంచుకోండి. |
06:16 | డెస్క్ టాప్ నుండి, myscript.pdf ఫైల్ని ఎంచుకుని, ఓపెన్ పై క్లిక్ చేస్తాను. |
06:23 | మన ఫైల్ మెయిల్కు అటాచ్ అయినట్టు కనిపిస్తుంది. |
06:27 | అటాచ్ ఫైల్ ఎంపికతో, ఒకే ఈమెయిల్కి, ఒకటి కన్నా ఎక్కువ ఫైళ్లను అటాచ్ చేయవచ్చు. |
06:34 | అటాచ్ ఐన ఫైల్ను తీయడానికీ, ఫైల్ పేరు కుడి పక్క ఉన్న 'x' గుర్తుని క్లిక్ చేయగలరు. |
06:41 | ఇప్పుడు, 30ఎంబి కన్నా ఎక్కువ ఉన్న ఫైల్ని అటాచ్ చేద్దాం. |
06:46 | నా డెస్క్ టాప్ పై 30 ఎమ్ బికన్నా ఎక్కువ ఫైల్ సైజ్తో ఒక జిప్ ఫైల్ ఉంది. |
06:52 | అటాచ్ ఎంపిక ఫైల్ పై మరల క్లిక్ చేయండి. |
06:56 | బ్రౌస్ చేసి ఈ 30ఎంబి జిప్ ఫైల్ని ఎంచుకొని, ఓపెన్ క్లిక్ చేస్తాను. |
07:02 | ఒక పాప్ అప్ సందేశం కనిపిస్తుంది: |
07:04 | మీరు పంపించడానికి యత్నిస్తున్న ఫైల్ 25 ఎంబి కన్నా ఎక్కువ ఉందని. |
07:09 | మరియు ఇది గూగుల్ డ్రైవ్కు పంపడానికి ఎంపికను ఇస్తుంది. |
07:14 | “ సెండ్ యూసింగ్ గూగుల్ డ్రైవ్“ బటన్ని క్లిక్ చేయండి. |
07:18 | ప్రస్తుతం దీన్ని మూసివేస్తాను. |
07:21 | "ఇన్సర్ట్ ఫైల్స్ యూసింగ్ డ్రైవ్ “ ఎంపిక ఇంతకు ముందు మనం చూసిన విండోకే తీసుకెళుతుంది. |
07:28 | ఇక్కడ, 3 ట్యాబ్స్ కనిపిస్తాయి: |
07:31 | “మై డ్రైవ్, షేర్డ్ విత్ మీ” మరియు “అప్లోడ్” . |
07:36 | అప్రమేయంగా, ఇంతకు ముందు అప్లోడ్ చేసిన ఫైల్, మై డ్రైవ్లో ఉంటుంది. |
07:43 | ఇక్కడొక ఫైల్ ఉన్నది. |
07:46 | ఇది గూగుల్ టీం అకౌంట్ తెరచేంటప్పుడు, షేర్ చేసినది. |
07:51 | "షేర్డ్ విత్ మీ" ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
07:55 | ఇక్కడ "No one's shared any files with you yet!" అనే సందేశం కనిపిస్తుంది. |
08:00 | ఎవరైన మీతో ఫైల్ షేర్ చేస్తే, అవి షేర్డ్ విత్ మీ క్రింద ఉంటుంది. |
08:06 | ఇప్పుడు, "అప్లోడ్" టాబ్ పై క్లిక్ చేసి కొత్త ఫైల్ని అప్లోడ్ చేయగలరు. |
08:12 | “సెలెక్ట్ ఫైల్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్“ బటన్ పై క్లిక్ చేయండి. |
08:16 | బ్రౌస్ చేసి మీ కంప్యూటర్ నుండి అప్లోడ్ చేయవలసిన ఫైల్ ఎంచుకోని ఓపెన్ పై క్లిక్ చెయండి. |
08:23 | మీరు మరిన్ని ఫైల్స్ని జోడించుటకు "యాడ్ మోర్ ఫైల్స్" బటన్ పై క్లిక్ చేయండి. |
08:27 | ప్రస్తుతం నేను స్కిప్ చేస్తాను మరియు ఒక ఫైల్ అప్లోడ్ చేస్తాను. |
08:33 | ఫైల్ అప్లోడ్ ఐనా తరువాత , దానిని మెయిల్ కు ఎలా చేర్చాలో సూచించాలి. |
08:40 | కింద కుడి వైపు 2 బటన్లు ఉన్నవి అని గమనించండి: |
08:44 | “ఇన్ సార్ట్ ఆస్ డ్రైవ్ లింక్ ” మరియు |
08:46 | “అట్యాచ్ మెంట్” |
08:48 | అప్రమేయంగా, “ఇన్ సార్ట్ ఎస్ డ్రైవ్ లింక్ ” ఎంచుకోబడుతుంది. |
08:52 | అటాచ్మెంట్ ఎంపిక చేస్తేకుంటే ఫైల్ అటాచ్మెంట్గా ఇన్సర్ట్ ఔతుంది. |
08:57 | మనం ప్రస్తుతం దీన్ని అలాగే వదలేద్దాం. |
09:00 | ఎడమ వైపు కింద మూలలో ఉన్న అప్ లోడ్ పై క్లిక్ చేయగలరు. |
09:05 | ఇప్పుడు అప్లోడ్ ప్రారంభం ఔతుంది, అప్లోడ్కు ఇంటర్నెట్ వేగం ఆధారంగ, సమయం పడుతుంది. |
09:11 | అప్ లోడ్ పూర్తయిన తరువాత, కంటెంట్ ఏరియాలో , మనం అప్లోడ్ చేసిన ఫైల్ లింక్ కనిపిస్తింది. |
09:17 | ఇప్పుడు ఇమేజెస్ ఇన్సర్ట్ చేసేందుకు “ఇన్సర్ట్ ఫోటో” పై క్లిక్ చేయగలరు. |
09:24 | అప్లోడ్ ఫోటోస్ విండో తెరుచుకుంటుంది. |
09:27 | మన కంప్యూటర్తో ఫోటోలను అప్లోడ్ చేయగలం లేదా ఇమేజ్ యొక్క వెబ్ సైట్ అడ్రెస్ ఇవ్వడం ద్వారా కూడా చేయగలం. |
09:34 | ఇప్పటికీ, నేను ఫోటోలను అప్ లోడ్ చేయదలచుకోలేదు. |
09:38 | అందుకే, నేను క్యాన్సల్ బటన్ నొక్కుతాను. |
09:41 | మీరు ఈ ఎంపికను మీ సొంతంగా అన్వేషనించవచ్చు. |
09:44 | తదుపరి, "ఇన్సర్ట్ లింక్" ఎంపిక, దీని పై క్లిక్ చేద్దాం. |
09:49 | "ఎడిట్ లింక్" డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
09:53 | “ టెక్స్ట్ టు డిస్ ప్లే” ఫీల్డ్ లో లింక్ లో కావల్సిన టెక్స్ట్ను టైప్ చేయండి. |
09:58 | నేను స్పోకన్ టుటోరియల్ అని టైప్ చేస్తాను. |
10:02 | “లింక్ టు ” భాగం లో, అప్రమేయంగా, “వెబ్ అడ్రస్” ఎంపిక ఎంపికచేయబడిఉంటుంది. |
10:08 | టెక్స్ట్ ఫీల్డ్ లో, http://spoken-tutorial.org అని టైప్ చేస్తాను. |
10:20 | మరియు Ok పై క్లిక్ చేస్తాను. |
10:23 | ఇప్పుడు, కంటెంట్ ఏరియాలో స్పోకన్ టుటోరియల్ అనే టెక్స్ట్ హైపర్ లింక్లా కనిపిస్తుంది. |
10:29 | హైపర్ లింక్ టెక్స్ట్ పై క్లిక్ చేయండి. |
10:32 | ఒక చిన్న పాప్ విండో టెక్స్ట్ కింద తెరుచుకుంటుంది. |
10:35 | ఇది Go to link: అని |
10:38 | కనిపించిన యూ ఆర్ ఎల్ పై క్లిక్ చేస్తే, స్పోకన్ టుటోరియల్ వెబ్ సైట్ హోమ్ పేజ్ వెళ్తాం. |
10:45 | యూఆర్ ఎల్ మార్చాలన్న లేదా లింక్ తీయాలన్న, “ఛేంజ్”(change) లేదా “రిమోవ్” (Remove) ఎంపికల పై క్లిక్ చేస్తాము. |
10:53 | ఇమొటికాన్లు ఉపయోగించి చాలా చిత్ర భావాలను ప్రవేశ పెట్టవచ్చు. |
10:59 | మీ ఇమెయిల్లలో వీటిని కావాలసినప్పుడు వాడుకోవచ్చు. |
11:04 | ట్రాష్ ఐకాన్కు ముందు “saved” అనే టెక్స్ట్ని గమనించండి. |
11:08 | కంటెంట్ని చేర్చినప్పుడు మరియు తీసివేసినప్పుడు, మన ఇమెయిల్ దానంతటదే డ్రాఫ్ట్ ఫోల్డర్ లో సేవ్ ఔతుంది. |
11:16 | ఇది పవర్ కట్ లేదా ఇంటర్నెట్ పోయినప్పుడు, చాలా ఉపయోగపడుతుంది. |
11:24 | ఈ మెసేజ్ను రద్దు చేయాలంటే, ట్రాష్ ఐకాన్ పై క్లిక్ చేయండి. |
11:28 | ఇది ఇమెయిల్ను డిలీట్ చేయడంతోపాటు డ్రాఫ్ట్ ఫోల్డర్ నుండి తీసివేస్తుంది. |
11:34 | ట్రాష్ ఐకాన్ తరువాత కనిపించే "మోర్ఆప్షన్స్" పై క్లిక్ చేయండి. |
11:39 | "డీఫాల్ట్ టు ఫుల్-స్క్రీన్" ఎంపిక కంపొస్ విండోని పెద్దదిగా చేస్తుంది. |
11:44 | “ లేబల్ ”- ఈ ఎంపిక గురించి వేరొక తరగతిలో నేర్చుకుందాం. |
11:49 | “ప్లేన్ టెక్స్ట్ మోడ్” ఎంపిక అన్నీ ఫార్మాట్లను మెయిల్ నుండి తీసివేసి, ప్లెయిన్ టెక్స్ట్లా మారుస్తుంది. |
11:57 | “ప్రింట్” ఎంపిక కాంపొస్ చేసిన మెయిల్ను అప్రమేయంగా కాన్ఫిగర్ చేసిన ప్రింటర్కు పంపుతుంది. |
12:03 | “చెక్ స్పెల్లింగ్” టైప్ చేసిన కంటెంట్ యొక్క స్పెలింగ్లను దిద్దుతుంది. |
12:07 | ఇప్పుడు ఒక చిన్న ఇమెయిల్ సిద్దం అయింది. |
12:09 | సెండ్ బటన్ క్లిక్ చేయగలరు. |
12:12 | ఇలా ఒక సూచిక స్క్రీన్ పై కనిపిస్తుంది. |
12:15 | This Drive file isn't shared with all recipients. |
12:19 | ఎందుకంటే ఈ ఫైల్ ను ఈ ఈమెయిల్లో ఉన్న వ్యక్తులకు గుర్తు చేయబడలేదు. |
12:25 | “షేర్ మరియు సెండ్ ” పై క్లిక్ చేయండి. |
12:29 | స్క్రీన్ పై, ఇవి రెండిట్లో ఒక సందేశం కనిపిస్తుంది. |
12:32 | మీ సందేశం పంపించబడుతుంది. |
12:34 | లేదా “మీ సందేశం పంపించబడినది ” |
12:38 | పంపించిన మెయిల్, చూసేందుకు, వ్యూ మెసేజ్ లింక్ పై క్లిక్ చేయండి. |
12:43 | పంపించిన ఈమెయిల్ కంటెంట్ చూడగలం. |
12:47 | ఒక్కొకటి ఒకసారి పరీక్షిస్తాం. |
12:50 | అట్యాచ్ మెంట్లు ఇక్కడ ఉన్నవి. |
12:52 | మరియు ఇక్కడ యుఆర్ఎల్ లింక్ ఉన్నది. |
12:55 | క్రింద మెయిల్ అడ్రస్ వద్ద, ఒక విపరీత త్రికోణం హెడ్డర్ వివరాలు సూచిస్తుంది. |
13:00 | దీని పై క్లిక్ చేద్దాం. |
13:03 | “టు", "సిసి" మరియు "బిసిస్” ఫీల్డ్ లో ఉన్న అన్నీ రెసిపియంట్లు కనిపిస్తున్నారు. |
13:11 | రెసిపియంట్లకు ఇమెయిల్ ఎలా కనిపిస్తుందో చూద్దాం. |
13:16 | ఇది ఒక సిసి రెసిపియంట్లో ఉన్న మెయిల్ ఐడి. |
13:21 | పంపిన సందేశం ఇక్కడ కనిపిస్తుంది. తెరచి చదువుదాం. |
13:27 | షో డీటైల్స్ పై క్లిక్ చేయగలరు. |
13:29 | ఇక్కడ “టు" మరియు "సిసి” రెసిపియంట్లు మాత్రమే కనిపిస్తారు, "బిసిసి" కనిపించరు. |
13:35 | ఇది బిసిసిలో ఉన్న ఒక మెయిల్ ఐడి. |
13:41 | ఇప్పుడు పంపిన సందేశం చూడవచ్చు. |
13:43 | దీన్ని తెరచి చూద్దాం. |
13:46 | షో డీటేల్స్ పై క్లిక్ చేయండి. |
13:49 | “టు", "సిసి", మరియు "బిసిసి” రెసిపిఎంట్లను మీరు చూడగలరు. |
13:55 | పంపించిన ఇమెయిల్ ఐడికి తిరిగి వద్దాం. |
13:59 | ఇక్కడ చూడండి, బిసిసి లో 2 రెసిపిఎంట్లను వేశాము. |
14:04 | ఐతే, ఇక్కడ ఒకే మెయిల్ ఐడి కనిపిస్తుంది. ఇంకొకటి కనిపించదు. |
14:10 | బిసిసి ఇలా పని చేస్తుంది. |
14:13 | మీకు వీటి వ్యత్యాసం స్పష్టoగా అర్థమైదని అనుకుంటాను. |
14:17 | ఇంతటితో టుటోరియల్ ముగింపుకు వచ్చాము. |
14:20 | సారాంశం చూద్దాం: |
14:22 | ఈ టుటోరియల్లో మనం నేర్చుకున్నవి: |
14:25 | ఇమెయిల్ రేసిపిఎంట్లు “టు", "సిసి", "బిసిసి” |
14:30 | ఇమెయిల్ ఫార్మాటింగ్ |
14:33 | ఫైల్ న్ను ఈమెయిల్కు అటాచ్ చేయుట. |
14:36 | గూగుల్ డ్రైవ్కు ఎలా షేర్ చేయాలి. |
14:39 | ఫోటో మరియు లింక్ ఎలా ఇన్సర్ట్ చేయాలి. |
14:43 | కంపోజ్ విండో ఎంపికలు. |
14:47 | ఈ లింక్లోని విడియో స్పోకన్ టుటోరియల్ సారాంశం |
14:52 | దయచేసి డౌన్ లోడ్ చేసి చూడండి. |
14:55 | మేము వర్క్ షాప్లు నిర్వహించి ఆన్ లైన్ పరీక్షలో పాస్ ఐతే సర్టిఫికట్ ఇస్తాం. |
15:01 | వివరాలకు, మమ్మల్ని సంప్రదించగలరు. |
15:04 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజక్టు NMEICT, MHRD, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది. |
15:11 | ఈ మిషన్ గురించి మరిన్ని వివరాలు ఈ లింక్లో ఉన్నవి. |
15:16 | ఈ టుటోరియల్ ని తెలుగులోకి అనువదించినది శ్రీహర్ష ఏ.ఎన్. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను . |
15:24 | ధన్యవాదములు |