Inkscape/C2/Create-and-Format-Text/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Inkscape ను ఉపయోగించి Create and format text పై Spoken Tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో,మనం నేర్చుకునేవి. టెక్స్ట్ ను ఇన్సర్ట్ చేయటం, టెక్స్ట్ ను ఫార్మట్టింగ్ మరియు అలైనింగ్ చేయటం, స్పేసింగ్ మరియు బులెట్.
00:15 మనం ఒక simple flyerని ఎలా సృష్టించాలో కూడా నేర్చుకుంటాము.
00:19 ఈ ట్యుటోరియల్ ను రికార్డు చేయటానికి, నేను Ubuntu Linux 12.04 OS, Inkscape వర్షన్ 0.48.4 ఉపయోగిస్తున్నాను.
00:29 నేను ఈ ట్యుటోరియల్ ని గరిష్ట రెజోల్యూషన్ మోడ్ లో రికార్డ్ చేస్తున్నాను.

ఇది అన్ని టూల్స్ ప్రదర్శించడానికి స్థానం కల్పిస్తుంది.

00:38 Inkscape ను తెరుద్దాం.
00:40 Tool box నుండి Text tool ఉపయోగించి టెక్స్ట్ ఇన్సర్ట్ చేయబడుతుంది.
00:45 మనం టెక్స్ట్ ని రెండు మార్గాలలో జోడించవచ్చు-Regular Text మరియు Flowed Text.
00:50 ముందుగా మనం Regular Text గూర్చి నేర్చుకుందాం. Text tool పై క్లిక్ చేసి తరువాత canvas పై క్లిక్ చేయండి.
00:57 Spoken అనే పదాన్ని టైప్ చేయండి.

టెక్స్ట్ కు స్థానాన్ని కల్పించటానికి టెక్స్ట్ బాక్స్ పెరుగుతుంది గమనించండి.

01:03 Line break లు మానవీయంగా కలపవలసి ఉంటుంది.

కనుక, తరువాత లైన్ కు వెళ్ళటానికి Enter నొక్కి, Tutorial అని టైప్ చేయండి.

01:11 మునుపటి లైన్ కు పదాన్ని తరలించడానికి, కర్సర్ ను T అక్షరం ముందు ఉంచండి.ఇప్పుడు backspace ను నొక్కండి మరియు రెండు పదాల మధ్య ఖాళీని జోడించండి.
01:22 ఇదే విధంగా, Spoken Tutorial క్రింద. ఒక కొత్త లైన్ పై http://spoken-tutorial.org/ అని టైప్ చేయండి.
01:33 తరువాత, మనం Flowed text ద్వారా టెక్స్ట్ ను చేర్చడం నేర్చుకుంటాం.
01:38 ఈ సారి,నేను టెక్స్ట్ ను ముందే భద్రపరచుకున్న ఒక LibreOffice Writer ఫైల్ నుండి కాపీ చేస్తాను.
01:45 మొత్తం టెక్స్ట్ ను ఎంచుకోవడానికి Ctrl + A ను నొక్కండి.

మరియు కాపీ చేయటానికి Ctrl + C ను నొక్కండి.

01:52 ఇప్పుడు, Inkscape కు తిరిగి వచ్చి Text toolఎంచుకోబడింది అని నిర్దారించుకోండి.
01:58 canvas పై క్లిక్ చేసి, ఒక దీర్ఘచతురస్ర లేదా చతురస్ర టెక్స్ట్ ఏరియా ఏర్పరుచుటకు దానిని డ్రాగ్ చేయండి.
02:03 mouse బటన్ ను వదిలిపెట్టగానే canvas పై ఒక నీలం దీర్ఘచతురస్రం బాక్స్ ఏర్పడింది గమనించండి.
02:10 ఇప్పుడు, టెక్స్ట్ బాక్స్ లోపల, చివరి ఎగువ ఎడమ మూలలో మెరుస్తున్న text prompt ను గమనించండి.
02:17 కాపీ చేసిన టెక్స్ట్ ను paste చేయటానికి Ctrl + V ని నొక్కండి.
02:22 టెక్స్ట్ బాక్స్ యొక్క రంగు ఎరుపుకు మారింది గమనించండి.
02:25 ఇలా ఎందుకు అయిందంటే ఇన్సర్ట్ చేసిన టెక్స్ట్ టెక్స్ట్ బాక్స్ యొక్క సరిహద్దులను మించి ఉంది కనుక.
02:31 దీనిని మనం టెక్స్ట్ బాక్స్ కుడి మూలలో ఉన్న చిన్న diamond handle ను ఉపయోగించి సరి చేయవచ్చు.
02:38 దీన్ని టెక్స్ట్ బాక్స్ రంగు నీలానికి మారే వరకు క్లిక్ చేసి లాగండి.
02:44 టెక్స్ట్ యొక్క చివరి వాక్యం మునుపటి వాక్యం తో కలగలిసి ఉంది.
02:48 చివరి వాక్యం యొక్క ప్రారంభం వద్ద దాన్ని విడదీయటానికి Enter ను రెండు సార్లు నొక్కండి.
02:53 తరువాత, టెక్స్ట్ ల కొరకు అందుబాటులో ఉన్న వివిధ ఫార్మట్టింగ్ ఎంపికలను నేర్చుకుందాం. Spoken Tutorialపదం పై క్లిక్ చేయండి.
03:01 Main menu కి వెళ్ళి, Text పై క్లిక్ చేసి తరువాత Text and Font ఎంపిక పై క్లిక్ చేయండి.
03:09 రెండు ఎంపికలతో ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది- Font మరియు Text.

Font ట్యాబ్ కింద చాలా ఎంపికలు ఉన్నాయి.

03:17 Font family అందుబాటులో ఉన్న అన్ని ఫాంట్స్ జాబితాలను ఇస్తుంది.

అందుబాటులో ఉన్న వాటిలో నుండి మీరు మీకు నచ్చినవి ఎంచుకోవచ్చు.

03:25 ఇక్కడ మనం preview box లో ఎంచుకోబడిన ఫాంట్ని ప్రివ్యూ చేయవచ్చు.

నా ఎంపిక Bitstream Charter ఫాంట్.

03:33 అక్కడ నాలుగు Style ఎంపికలు - Normal, Italic, Bold మరియు Bold Italic.

మీ అవసరాన్ని బట్టి స్టైల్ ను ఎంచుకోండి. నేను Bold ని ఎంచుకుంటున్నాను.

03:46 Font size మార్చడానికి, డ్రాప్-డౌన్ బాణం క్లిక్ చేసి పరిమాణం ఎంచుకోండి.

ఇది శీర్షిక కనుక, నేను ఒక పెద్ద ఫాంట్ ఎంచుకోవచ్చు, 64 ఎంచుకోండి.

03:57 తరువాతది Layout.
03:59 మనం దాని గూర్చి కాసేపు తర్వాత నేర్చుకుందాం. ఈ ఎంపిక కొరకు preview కనిపించదు.
04:04 ఇప్పుడు, Font ట్యాబ్ కి తరువాత ఉన్న Text ట్యాబ్ పై క్లిక్ చేయండి.

ఇక్కడ, ఒక preview window దాని లోపల ఉన్న టెక్స్ట్ తో కనిపిస్తుంది.

04:12 టెక్స్ట్ కు ఎలాంటి మార్పులైన ఇక్కడ చేయవచ్చు.
04:16 Apply పై క్లిక్ చేసి డైలాగ్ బాక్స్ ను మూసివేయండి.

ఇప్పుడు టెక్స్ట్ ఫార్మాట్ చేయబడింది గమనించండి.

04:23 దిగువన ఉన్నcolor palette ను ఉపయోగించి మనం టెక్స్ట్ కలర్ ని మార్చవచ్చు.

నేను మెరూన్ కలర్ పై క్లిక్ చేస్తున్నాను.

04:30 తరువాత, ఈ URL http://spoken-tutorial.org కొరకు టెక్స్ట్ ను ఎంచుకోండి.
04:40 టెక్స్ట్ ఫార్మట్టింగ్ ఎంపికలు Tool controls bar లో కూడా అందుబాటులో ఉంటాయి.
04:44 నేను ఫాంట్ ను Bitstream charter కు, Font size ను 28 కు మరియు కలర్ ను బ్లూ కు మార్చుతున్నాను.
04:57 ఇప్పుడు,మనం పేరాగ్రాఫ్ టెక్స్ట్ ను ఎంచుకుందాం.
04:56 ఒకవేళ Text టూల్ ఇప్పటికే ఎంచుకోబడివుంటే, మీరు టెక్స్ట్ బాక్స్ లోపలకి వెళ్ళి కేవలం టెక్స్ట్ పై క్లిక్ చేయండి.
05:04 నేను టెక్స్ట్ యొక్క Font size ను 25 కు మార్చుతున్నాను.
05:08 టెక్స్ట్ ను కేన్వాస్ లోపలకి తరలించడానికి diamond handle ను క్లిక్ చేసి లాగండి.
05:15 తరువాత, టెక్స్ట్ లను అలైన్ చేద్దాం.
05:19 Tool controls bar పై Italic icon కు తరువాత ఉన్న నాలుగు ఐకాన్ లు టెక్స్ట్ ను, టెక్స్ట్ బాక్స్ యొక్క ఎడమ వైపు, మధ్యలో లేదా కుడి వైపు అలైన్ చేయటానికి సహాయం చేస్తాయి.
05:30 ఈ నాలుగో ఎంపిక టెక్స్ట్, టెక్స్ట్ బాక్స్ యొక్క సరిహద్దుల లోపలే ఉండేటట్లు న్యాయంచేస్తుంది.

ముందుకు కొనసాగేముందు నేను left align పై క్లిక్ చేస్తాను.

05:39 మనం టెక్స్ట్ ని Align and distribute ఎంపిక ఉపయోగించి కూడా అలైన్ చేయవచ్చు.
05:43 Main menu కి వెళ్ళి తరువాత Object మెనూ పై క్లిక్ చేయండి.

ఆపై Align and Distribute ఎంపిక పై క్లిక్ చేయండి.

05:51 ఇప్పుడు, మనం Spoken Tutorial పదాన్ని మధ్యలోకి తరలిస్తాము.కనుక దానిపై క్లిక్ చేయండి.
05:57 ఒకవేళ Relative to పారామీటర్, Page కు సెట్ చేయబడిందో లేదో చెక్ చేయండి.
06:01 కనుక, Centre on vertical axis పై క్లిక్ చేయండి.

టెక్స్ట్ ఇప్పుడు మధ్యలోకి అలైన్ చేయబడింది గమనించండి.

06:10 దిగువన ఉన్న ఖాళీ ప్రదేశంలో మరి కొంత టెక్స్ట్ ను జోడిద్దాం.
06:13 FOSS Categories అని టైప్ చేయండి.

ఇప్పుడు, Centre on vertical axis పై క్లిక్ చేయటం చేత పేజీ యొక్క మధ్యలోకి దానిని అలైన్ చేయండి.

06:25 కొన్నిFOSS పేర్లు Linux, LaTeX, Scilab, Python వంటివి విడిగా మరియు యాదృచ్చికంగా canvas పైన టైప్ చేయండి.
06:39 ఇప్పుడు, ఈ టెక్స్ట్ లను ఒకే వరుసలో సమానమైన దూరం లో అలైన్ చేద్దాం.
06:44 Shift కీ ని ఉపయోగించి నాలుగు టెక్స్ట్ లు ఎంచుకోండి.

Align baseline of text పై క్లిక్ చేసి Distribute baseline of text horizontally పై క్లిక్ చేయండి.

06:58 పదాల మధ్య దూరం సమానంగా లేదు గమనించండి.
07:02 మొదటి పదం యొక్క మొదటి అక్షరం మరియు రెండవ పదం లోని మొదటి అక్షరం సమానదూరం లో ఉన్నాయి.

కానీ పదాలు తమలో తాము సమాన దూరాల్లో లేవు.

07:10 ఇది వర్టికల్ టెక్స్ట్ ల కొరకు కూడా ఇదే పద్దతిలో పనిచేస్తుంది.
07:15 ఈ ఎంపికలు కొన్ని పరిస్థితుల్లో ఉపయోగపడవచ్చు.
07:20 మనము పదాల మధ్య దూరం సమానం చేద్దాం.
07:23 ఆలా చేయటానికి, మొదటి వరుసలో Distribute కింద నాల్గవ ఐకాన్ పై క్లిక్ చేయండి.

ఇప్పుడు పదాల మధ్యలోని దూరం సమానంగా ఉంటుంది.

07:32 తరువాత, మనం పేరాగ్రాఫ్ టెక్స్ట్ యొక్క వరుసల మధ్యలోని దూరాన్ని సర్దుబాటు చేయడం నేర్చుకుందాం.
07:38 టెక్స్ట్ బాక్స్ లోపలకి వెళ్ళడానికి పేరాగ్రాఫ్ టెక్స్ట్ పై డబల్ -క్లిక్ చేయండి.
07:44 Tool controls bar పై ఉన్నSpacing between lines ఐకాన్ వరుసల మధ్యలోని దూరాన్ని పెంచటానికి లేక తగ్గించటానికి సహాయం చేస్తుంది.
07:50 నేను దూరాన్ని పెంచినపుడు ఏమి జరుగుతుందో గమనించండి.
07:55 నేను లైన్ దూరాన్ని 1.50 గా ఉంచుతాను.
07:59 తరువాత ఐకాన్ అక్షరాల మధ్య దూరాన్ని సర్దుబాటు చేయటానికి సహాయం చేస్తుంది.

పైకి మరియు కిందికి ఉన్న బాణాలపై క్లిక్ చేయండి ఇంకా మార్పులను గమనించండి.

08:07 నేను space parameter ను 0 గా ఉంచుతాను.
08:12 అక్కడ కేన్వాస్ యొక్క నిలువు మూలల మధ్యలో ఒక ఖాళీ స్థలం ఉంది గమనించండి.

మనం కొంత టెక్స్ట్ తో దాన్ని నింపవచ్చు.

08:19 కేన్వాస్ బయట ఎక్కడైనా ఒక వాక్యం Learn Open Source Software for free టైప్ చేయండి.
08:24 ఫాంట్ ను ఉబుంటు కు,ఫాంట్ సైజును 22 కు మార్చండి. మరియు దానిని Bold గా చేయండి.
08:34 ఇప్పుడు,Tool controls bar పై ఉన్న చివరి ఐకాన్, Vertical text పై క్లిక్ చేయండి.
08:39 టెక్స్ట్ ఇప్పుడు నిలువు దిశలో అలైన్ అయింది అని గమనించండి.
08:43 Selector toolఉపయోగించి టెక్స్ట్ పై క్లిక్ చేయండి మరియు దానిని కేన్వాస్ యొక్క ఎడమ మూలలోకి తరలించండి.
08:49 దాని డూప్లికేట్ చేయటానికి Ctrl + D నొక్కి, ఆ కాపీ ని పేజీ యొక్క ఇంకొక మూలకు తరలించడానికి Ctrl key ని ఉపయోగించండి.
08:59 ఇప్పుడు, మనం పేరాగ్రాఫ్ లోని టెక్స్ట్ కు bullet points ను జోడిద్దాం.
09:03 Inkscape టెక్స్ట్ కొరకు బులెట్ లేదా సంఖ్య జాబితాలు అందించడంలేదు.

కనుక ఎవరైనా బులెట్ పాయింట్స్ మానవీయంగా సృష్టించుకోవల్సి ఉంటుంది.

09:11 ellipse tool పై క్లిక్ చేయండి. ఎరుపు రంగులో ఒక చిన్న వృత్తాన్ని గీయండి.
09:17 ఇప్పుడు ఈ బుల్లెట్ ను పేరాగ్రాఫ్ యొక్క మొదటి వరుసకు తరలించండి.

దాని డూప్లికేట్ చేయండి మరియు దాని కాపీ ని తరువాత వాక్యానికి తరలించండి.

09:27 అన్ని వాక్యాలకు దీన్ని పునరావృతం చేయండి.
09:32 ఇప్పుడు, మన టెక్స్ట్ అంతా మన అవసరానికి తగినట్టు ఉంది.
09:36 చివరగా, ఇది ఒక flyer లా కనిపించేలా చేయటానికి దానికి కొంచెం సుందరీకరణ చేద్దాం.
09:41 ఇక్కడ పూర్తి అయిన flyer ఉంది.
09:45 నేను ఎగువ మరియు దిగువలకు బోర్డర్స్ జోడించాను.

మరియు టెక్స్ట్ లను ఒక గుండ్రని దీర్ఘచతురస్రం ఇంకా దీర్ఘవృతం అకారాలతో నింపాను.

09:51 మీరు మీ ఫ్లైయర్ కోసం వివిధ లేఔట్స్ మరియు డిజైన్స్ సృష్టించడానికి మీ సృజనాత్మకత ఉపయోగించవచ్చు.
09:57 సారాంశం చూద్దాం.
09:59 ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నవి,

టెక్స్ట్ ఇన్సర్ట్ చేయడం, టెక్స్ట్ ను ఫార్మాట్ మరియు అలైన్ చేయడం.

స్పేసింగ్ మరియు బులెట్ జాబితాలు.

10:06 మనం ఒక సింపుల్ flyerను సృష్టించడం కూడా నేర్చుకున్నాం.
10:09 మీకోసం ఇక్కడొక అసైన్మెంట్-
10:11 ఇలా కనపడే ఒక ఫ్లయర్ ను సృష్టించండి.

టెక్స్ట్ లను టైప్ చేయడానికి టెక్స్ట్ టూల్ ను ఉపయోగించండి.

rectangle tool ఉపయోగించి బుల్లెట్స్ మరియు బాక్సస్ సృష్టించండి.

10:19 స్టార్ టూల్ ఉపయోగించి 10 మూలలతో ఒక నక్షత్రాన్ని సృష్టించండి.

రంగులను మార్చడానికి color palette మరియు Fill and stroke ఉపయోగించండి.

Align and distribute ఉపయోగించి టెక్స్ట్ ను అలైన్ చేయండి.

10:31 ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చుడండి.

ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది.

మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.

10:39 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.

ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.

10:47 మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి: contact@spoken-tutorial.org. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.

దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.

10:57 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro.
11:01 మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
11:03 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya, Yogananda.india