Health-and-Nutrition/C2/Magnesium-rich-vegetarian-recipes/Telugu
From Script | Spoken-Tutorial
|
|
00:00 | మెగ్నీషియం సమృద్ధిగా గల శాఖాహార వంటకాలపై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని గురించి నేర్చుకుంటాము: |
00:09 | మెగ్నీషియం యొక్క ప్రయోజనాలు, |
00:11 | మెగ్నీషియం యొక్క శాకాహార వనరులు |
00:13 | మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉండే శాఖాహార వంటకాలు. |
00:18 | మెగ్నీషియం అనేది ఒక మినరల్, ఇది శరీరానికి అవసరమైన ఒక ముఖ్యమైన పోషకం. |
00:24 | ఇది మరొక ట్యుటోరియల్‌లో వివరించబడిన టైప్ 2 పోషకాలలో ఒకటి. |
00:31 | ఈ ట్యుటోరియల్ కొరకు దయచేసి మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. |
00:35 | ఆరోగ్యకరమైన ఎముకలు మరియు దంతాల కొరకు మెగ్నీషియం అనేది అవసరం. |
00:40 | అలాగే శక్తి ఉత్పత్తి అవ్వడానికి కూడా మనకు మెగ్నీషియం అవసరం. |
00:44 | మరియు DNA సంయోగానికి కూడా. |
00:47 | మెగ్నీషియం యొక్క ప్రాముఖ్యత అనేది మరొక ట్యుటోరియల్‌లో వివరించబడింది. |
00:52 | ప్రస్తుతం మెగ్నీషియం వీటిల్లో ఉంది |
00:54 | బీన్స్,
కాయలు, |
00:56 | విత్తనాలు,
ఆకు కూరలు |
00:59 | మరియు ధాన్యాలు. |
01:01 | మెగ్నీషియం తీసుకోవడం మరియు శరీరంలో దాని శోషణ రెండూ సమానంగా ముఖ్యమైనవి. |
01:08 | పులియబెట్టడం (కిణ్వ ప్రక్రియ),
వేయించడం, |
01:10 | మొలకెత్తించడం
మరియు వంట అనేవి శోషణను మెరుగుపరుస్తాయి. |
01:15 | వంట చేయడానికి ముందు బీన్స్ నానబెట్టడం కూడా అదే చేస్తుంది. |
01:20 | ఇప్పుడు, మనం మన మొదటి రెసిపీ, మొలకెత్తిన మోటుపెసల కట్లెట్ యొక్క తయారీని చూద్దాం. |
01:27 | ఈ రెసిపీని తయారు చేయడానికి, మనకు కావాల్సినవి: |
01:31 | ¼ కప్పు మొలకెత్తిన మోటుపెసలు, |
01:34 | బాగా కడిగి తరిగిన పాలకూర 1 కప్పు, |
01:37 | 1 టేబుల్ స్పూన్ శనగపిండి, |
01:40 | 4 నుండి 5 వెల్లుల్లి రెబ్బలు, |
01:43 | 1 టీస్పూన్ నిమ్మరసం, |
01:45 | 1 టేబుల్ స్పూన్ వేయించిన నువ్వులు |
01:49 | మరియు రుచికి సరిపడా ఉప్పు. |
01:51 | మనకు ఇవి కూడా కావాలి: |
01:53 | 1 టీస్పూన్ ఎర్ర కారంపొడి |
01:55 | 3 టీస్పూన్ల నూనె |
01:58 | ఇప్పుడు నేను తయారీవిధానాన్ని వివరిస్తాను: |
02:00 | మొలకెత్తించడం కోసం, మోటు పెసలను రాత్రంతా నానబెట్టండి. |
02:05 | ఉదయాన్నే అందులోని నీళ్లన్నీ వంపేసి వాటిని శుభ్రమైన మస్లిన్ వస్త్రంలో మూటకట్టండి. |
02:10 | మొలకెత్తడం కోసం వాటిని వెచ్చని ప్రదేశంలో 2 రోజులు ఉంచండి. |
02:15 | మొలకెత్తడానికి వేర్వేరు రకాల చిక్కుళ్ళు వేర్వేరు సమయాలు తీసుకుంటాయని దయచేసి గమనించండి. |
02:20 | మొలకలు సిద్ధమైన తర్వాత అందులో వెల్లుల్లి వేసి ముతక పేస్ట్ గా రుబ్బుకోవాలి. |
02:27 | పేస్ట్ తయారు చేయడానికి మీరు మిక్సర్ ను లేదా రాతిరోలును ఉపయోగించవచ్చు. |
02:32 | ఒక పాన్ ను వేడి చేసి నువ్వులు లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. |
02:37 | వాటిని చల్లారనివ్వండి. |
02:39 | కట్లెట్స్ చేయడానికి, ఒక గిన్నెలో మొలకల పేస్ట్ ను తీసుకోండి. |
02:43 | అందులో వేయించిన నువ్వులు, పాలకూర, శనగపిండి, మసాలాలు, ఉప్పు మరియు నిమ్మరసం వేయండి. |
02:52 | వాటిని బాగా కలపండి. |
02:54 | ఒకవేళ పేస్ట్ పొడిగా ఉంటే, అందులో 1 టేబుల్ స్పూన్ నీటిని కలపండి. |
02:59 | ఈ పేస్ట్‌ను 4 భాగాలుగా విభజించండి |
03:01 | వాటిని కట్లెట్లు ఆకృతిలో చేయండి. |
03:04 | ఒక పాన్ లో నూనె వేసి వేడి చేయండి. |
03:06 | కట్లెట్లను రెండు వైపులా బంగారు గోధుమ రంగు వచ్చేవరకు మీడియం వేడి మీద షాలో ఫ్రై చేయండి. |
03:12 | మోటుపెసలు పాలకూర కట్లెట్లు సిద్ధంగా ఉన్నాయి. |
03:15 | 4 కట్లెట్స్‌లో దాదాపుగా 208 మి.గ్రా మెగ్నీషియం ఉంటుంది. |
03:22 | మన తరువాతి వంటకం పొద్దుతిరుగుడు విత్తనాలు పచ్చడి (అద్దుకునేది). |
03:26 | ఈ వంటకం కోసం, మనకు అవసరమైనవి: |
03:28 | 2 టేబుల్ స్పూన్ల పొద్దుతిరుగుడు విత్తనాలు |
03:32 | పచ్చిమిర్చి 1
4 నుండి 5 వెల్లుల్లి రెబ్బలు |
03:36 | 1 చిన్న తరిగిన టమోటా |
03:39 | రుచికి సరిపడా ఉప్పు |
03:41 | ½ టీస్పూన్ నూనె లేదా నెయ్యి |
03:44 | తయారీవిధానం:
పొద్దుతిరుగుడు విత్తనాలను మీడియం మంట మీద లేత గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించుకోవాలి. |
03:50 | తరువాత వాటిని చల్లారనివ్వండి. |
03:52 | ఒక పాన్ లో నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయాలి |
03:55 | అందులో తరిగిన టమోటాను వేసి వేయించండి. |
03:57 | చల్లారడానికి దాన్ని ఒక పక్కన ఉంచండి |
04:00 | ఈ రెండింటినీ వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉప్పు మరియు నీటితో పాటు పేస్ట్ గా రుబ్బుకోవాలి. |
04:07 | పొద్దుతిరుగుడు విత్తనాలు పచ్చడి సిద్ధంగా ఉంది. |
04:10 | ఈ పచ్చడి యొక్క 2 టేబుల్ స్పూన్ల లో దాదాపు 133 mg మెగ్నీషియం ఉంటుంది. |
04:17 | మన తరువాతి వంటకం బొబ్బర్ల మొలకలతో పరాటా (ఏదైనా నింపిచేసిన పల్చని బ్రెడ్ వంటిది). |
04:21 | మొలకలు తయారుచేసే విధానం ఈ ట్యుటోరియల్‌లో ఇంతకుముందే వివరించబడింది. |
04:27 | ఈ రెసిపీ కోసం, మనకు అవసరమైనవి: |
04:30 | 1/4 కప్పు గోధుమ పిండి |
04:32 | 2 టేబుల్ స్పూన్ల బొబ్బర్ల మొలకలు |
04:36 | 1 టేబుల్ స్పూన్ నువ్వులు |
04:39 | 1 పచ్చిమిర్చి |
04:40 | 1 టీస్పూన్ జీలకర్ర |
04:43 | ½ టీస్పూన్ పసుపు పొడి |
04:46 | మనకు ఇవి కూడా కావాలి,
రుచికి సరిపడా ఉప్పు |
04:49 | మరియు 2 టీస్పూన్ల నూనె లేదా నెయ్యి. |
04:53 | మొదట, ఒక మిక్సర్ ను ఉపయోగించి బొబ్బర్ల మొలకలు పచ్చిమిర్చి కలిపి ముతక పేస్ట్ ను తయారు చేయండి. |
05:00 | ఒకవేళ మిక్సర్ అందుబాటులో లేకపోతే మీరు రాతిరోలును ఉపయోగించవచ్చు. |
05:05 | ఒక పాన్ లో నూనె వేసి వేడి చేయండి, అందులో జీలకర్ర వేసి తరువాత నువ్వులు వేయండి. |
05:11 | అవి రంగు మారేవరకు వాటిని వేయించండి. |
05:13 | బొబ్బర్ల పేస్ట్ ను వేసి మరో 2 నిమిషాలు వేయించండి. |
05:19 | తరువాత ఉప్పు మరియు పసుపు పొడి వేసి దాన్ని 5 నిమిషాలు ఉడికించండి. |
05:24 | చల్లారడానికి దాన్ని ఒక పక్కన ఉంచండి. |
05:27 | పరాఠా చేయడానికి ఒక గిన్నెలో పిండిని తీసుకోండి. |
05:31 | తగినంత నీరు పోస్తూ పిండిని పిసికి మెత్తని ముద్దగా కలపండి. |
05:35 | రోలింగ్ పిన్ను (చపాతీ కర్ర) ను ఉపయోగించి పిండి ముద్దని సమానంగా వత్తండి. |
05:39 | వత్తిన పిండిపైన బొబ్బర్ల పేస్ట్ ను ఉంచండి. |
05:42 | అన్ని వైపుల నుండి దాన్ని కవర్ చేయండి. |
05:44 | కొంచెం పిండిని చల్లండి |
05:46 | ఇప్పుడు దాన్ని పరాఠా లాగ వత్తండి |
05:49 | ఒక పాన్ ను వేడి చేయండి, నెయ్యి లేదా నూనె వేసి పరాఠా ను రెండు వైపులా బాగా కాల్చండి. |
05:55 | బొబ్బర్ల మొలకల పరాఠా సిద్ధంగా ఉంది. |
05:59 | ఒక పరాటాలో సుమారు 173 మి.గ్రా మెగ్నీషియం ఉంటుంది. |
06:05 | తరువాతి వంటకం మొలకెత్తిన కొమ్ముశనగల పొడి కూర. |
06:09 | ఈ రెసిపీ కోసం, మనకు అవసరమైనవి: |
06:12 | ¼ కప్పు కొమ్ముశనగల మొలకలు |
06:15 | 1 కప్పు కడిగిన మెంతి ఆకులు |
06:19 | 1 తరిగిన టమోటా మీడియంది |
06:21 | మరియు 1 తరిగిన ఉల్లిపాయ మీడియంది |
06:25 | మనకు ఇవి కూడా కావాలి: |
06:27 | ½ టీస్పూన్ పసుపు పొడి, |
06:29 | ½ టీస్పూన్ ఎర్ర కారం పొడి, |
06:31 | 1 టేబుల్ స్పూన్ వేయించిన వేరుశెనగల పొడి, |
06:35 | 1 టీస్పూన్ నూనె |
06:37 | మరియు రుచికి సరిపడా ఉప్పు |
06:39 | తయారీ విధానం:
మొలకెత్తిన కొమ్ముశనగలను 2 విజిల్స్ వచ్చే వరకు ప్రెజర్ కుక్ చేయండి. |
06:45 | ప్రెజర్ అంతా పోయేవరకు వేచి ఉండండి. |
06:47 | ఒక పాన్ లో నూనె వేసి వేడి చేయండి, |
06:49 | అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారేవరకు వాటిని వేయించాలి. |
06:53 | టమోటా ముక్కలు వేసి అవి మెత్తబడే వరకు ఉడికించండి. |
06:57 | మెంతి ఆకులు కూడా వేసి 5 నిమిషాలు ఉడికించండి. |
07:02 | ఇప్పుడు మసాలాలు, ఉప్పు మరియు మొలకెత్తిన కొమ్ముశనగలు వేసి బాగా కలపాలి. |
07:08 | అందులో, వేరుశెనగ పొడి వేయండి |
07:11 | పాన్ పైన మూతపెట్టి 5 నుండి 10 నిమిషాలసేపు ఉడికించండి. |
07:15 | మొలకెత్తిన కొమ్ముశనగల పొడి కూర సిద్ధంగా ఉంది. |
07:19 | ½ కప్పు ఈ కూర లో 141 మి.గ్రా మెగ్నీషియం ఉంటుంది. |
07:26 | చివరి వంటకం తోటకూర ఆకుల వేపుడు. |
07:30 | ఈ రెసిపీ కోసం, మనకు అవసరమైనవి: |
07:33 | 100 గ్రాముల కడిగిన తోటకూర ఆకులు, |
07:36 | వెల్లుల్లి 4 రెబ్బలు, |
07:38 | 1 చిన్న ఉల్లిపాయ, |
07:40 | 2 టేబుల్ స్పూన్ల తురిమిన కొబ్బరి, |
07:43 | 2 పచ్చి మిరపకాయలు, |
07:45 | చిటికెడు పసుపు
మరియు రుచికి సరిపడా ఉప్పు. |
07:49 | మనకు 1 టీస్పూన్ నూనె కూడా కావాలి. |
07:53 | తయారీ విధానం:
ఒక పాన్ లో నూనె వేసి వేడి చేయండి. |
07:56 | అందులో వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేయండి |
08:01 | వాటిని రంగు మారేవరకు వేయించండి. |
08:03 | ఇప్పుడు తోటకూర ఆకులు వేసి బాగా కలపాలి. |
08:07 | దానిపైన మూత పెట్టేసి 5 నుండి 7 నిమిషాల సేపు ఉడికించండి. |
08:12 | ఉప్పు మరియు పసుపు వేసి 1 నిమిషం ఉడికించండి. |
08:16 | అందులో తురిమిన కొబ్బరి వేసి మరో 5 నిమిషాలు ఉడికించండి. |
08:21 | తోటకూర ఆకుల వేపుడు సిద్ధంగా ఉంది. |
08:25 | ఈ వేపుడు ½ కప్పులో 209 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది. |
08:31 | మంచి ఆరోగ్యం కోసం మీ రోజువారీ ఆహారంలో మెగ్నీషియం పుష్కలంగా ఉన్న ఈ వంటకాలను చేర్చండి. |
08:37 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది
మాతో చేరినందుకు ధన్యవాదములు |