Health-and-Nutrition/C2/Importance-of-Protein/Telugu
From Script | Spoken-Tutorial
|
|
00:00 | ప్రోటీన్ యొక్క ప్రాముఖ్యతను తెలిపే ఈ స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని గురించి నేర్చుకుంటాము: |
00:08 | మన శరీరం కొరకు ప్రోటీన్ యొక్క ప్రయోజనాలు. |
00:11 | దాని యొక్క లోపం వలన కలిగే ప్రభావాలు. |
00:15 | వివిధ వయసుల వారికి దాని అవసరాలు. |
00:18 | ఆహార వనరులు. |
00:21 | ప్రోటీన్ అనేది మన శరీరానికి అవసరమైన ఓక ముఖ్యమైన సూక్ష్మపోషకం. |
00:27 | ఇది 22 అమైనో ఆమ్లాలతో తయారవుతుంది. |
00:31 | ఈ 22 లో, తొమ్మిది అమైనో ఆమ్లాలు అనేవి అవసరం. |
00:36 | ఇవి మన శరీరం చేత తయారు చేయబడవు, అందువల్ల వాటిని ఆహారం ద్వారా తీసుకోవాలి. |
00:43 | మిగిలిన 13 శరీరం చేత తయారు చేయబడతాయి. |
00:47 | అమైనో ఆమ్లాల గురించి క్లుప్తంగా నేను మీకు చెప్తాను. |
00:51 | అమైనో ఆమ్లాలు అనేవి సేంద్రీయ సమ్మేళనాలు, ప్రోటీన్లను ఏర్పరచడానికి అవి కలుస్తాయి. |
00:58 | లైసిన్, లూసిన్, హిస్టిడిన్, మెథియోనిన్, ట్రిప్టోఫాన్ అనేవి కొన్ని అమైనో యాసిడ్స్. |
01:09 | ప్రోటీన్లు అనేవి 2 రకాలుగా విభజించబడ్డాయి. |
01:12 | అవి సంపూర్ణ ప్రోటీన్లు మరియు అసంపూర్ణ ప్రోటీన్లు. |
01:18 | వాటి మధ్య తేడా అనేది ప్రస్తుతం ఆహారంలో ఉన్న అమైనో యాసిడ్స్ యొక్క రకంపై ఆధారపడి ఉంటుంది. |
01:27 | సంపూర్ణ ప్రోటీన్లు అనేవి వాటిలో ఆ మొత్తం 9 ముఖ్యమైన అమైనో యాసిడ్స్ ను కలిగిఉంటాయి. |
01:34 | మాంసాహార ఆహారాలు అన్నీ కూడా సంపూర్ణ ప్రోటీన్లు. |
01:39 | ఉదాహరణకు: చికెన్, |
01:41 | గుడ్లు, |
01:43 | చేప మరియు మాంసం. |
01:46 | అదేవిధంగా, పాలు మరియు పాల ఉత్పత్తులు అనేవి కూడా సంపూర్ణ ప్రోటీన్ల యొక్క వనరులు. |
01:53 | అసంపూర్ణ ప్రోటీన్లు అనేవి 1 లేదా ఒకటికంటే ఎక్కువ ముఖ్యమైన అమైనో యాసిడ్స్ ను తక్కువ మొత్తంలో కలిగిఉంటాయి. |
02:02 | చాలా రకాల శాఖాహార ఆహారాలు అనేవి అసంపూర్ణ ప్రోటీన్లు. |
02:06 | ఉదాహరణకు: పప్పుధాన్యాలు, |
02:09 | ధాన్యాలు,
కాయలు |
02:12 | మరియు విత్తనాలు. |
02:14 | వీటన్నిటిలో, ప్రోటీన్ యొక్క ఉత్తమ శాఖాహార వనరులలో సోయాబీన్ అనేది ఒకటి. |
02:21 | కండరాల కణజాలాల యొక్క పెరుగుదల, మరమ్మత్తు మరియు నిర్వహణ అనేవి ప్రోటీన్ యొక్క ప్రయోజనాలు. |
02:30 | ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. |
02:33 | మరియు ఒక బలమైన రోగనిరోధక శక్తిని నిర్మిస్తుంది. |
02:37 | ప్రోటీన్ సమృద్ధిగా ఉన్న ఆహారం మన అతి ఆకలిని తగ్గించి మనకు ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచుతుంది. |
02:43 | ఇది బరువును అదుపులో ఉంచడానికి కూడా సహాయపడుతుంది. |
02:47 | జీర్ణక్రియలో సహాయపడటం మరియు విషాన్ని విచ్ఛిన్నం చేయడం అనేవి ఇతర రెండు విధులు. |
02:54 | ఇది మెదడుకు సిగ్నల్స్ ను తీసుకెళ్లడానికి కూడా సహాయపడుతుంది. |
03:00 | శరీరంలోని పోషకాలను రవాణా చేయడానికి మరియు నిల్వ చేయడానికి కూడా ప్రోటీన్ అనేది అవసరం. |
03:06 | ప్రోటీన్ లోపం యొక్క సంకేతాలను మరియు లక్షణాలను ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. |
03:13 | ప్రోటీన్ లోపం యొక్క సంకేతాలలో ఒకటి పిండం యొక్క పెరుగుదల అనేది తగ్గిపోపోవడం. |
03:20 | పిల్లలలోఈ లోపం అనేది వృధా మరియు ఎదుగుదల ఆగిపోవడానికి దారితీస్తుంది. |
03:26 | దీని ఫలితంగా శరీర బరువు తక్కువగా ఉండవచ్చు. |
03:30 | అటువంటి పరిస్థితులలో, పిల్లల్లో వివిధ అంటువ్యాధులు అభివృద్దిచెందే ప్రమాదం ఉంది. |
03:37 | పెరుగుదల తక్కువగా ఉన్న కారణంగా, ఒక పిల్లవాడి యొక్క మెదడు అభివృద్ధి కూడా ప్రభావితం కావొచ్చు. |
03:43 | ఇది దీర్ఘకాలికంగా ఉంటే, పెరుగుదల సరిగ్గా లేకుండా పెరిగిన పిల్లల్లో డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. |
03:51 | వారు పెద్దయ్యాక వారికి అధిక రక్తపోటు కూడా రావొచ్చు. |
03:56 | పెద్దవారిలో, ఈ ప్రోటీన్ లోపం అనేది కండరాల యొక్క ద్రవ్యరాశిని కోల్పోవడానికి దారితీస్తుంది. |
04:02 | వారికి అలసటగా అనిపించవచ్చు, |
04:05 | నీరసం
మరియు అంటువ్యాధుల బారిన కూడా పడవచ్చు. |
04:09 | చర్మం ముడతలు పడటం మరియు జుట్టు రాలడం అనేవి ఇతర ఉదాహరణలు. |
04:15 | వివిధ వయసుల వారు రోజువారీ అవసరాలను విభిన్నంగా కలిగి ఉంటారు. |
04:20 | క్షేత్ర పరిశీలనల ప్రకారం ఈ ట్యుటోరియల్‌లో సూచించిబడిన ప్రోటీన్ అవసరాలు అనేవి. |
04:28 | 0 నుండి 12 నెలల వయస్సు ఉన్న పిల్లల కొరకు ఇది శరీర బరువు ప్రకారం 1కేజీ కి 1 నుండి 2 గ్రాములు ఉండాలి. |
04:36 | 1 నుండి 3 సంవత్సరాల వయస్సు పిల్లలకు 16 గ్రాముల ప్రోటీన్ అనేది అవసరం. |
04:43 | 4 నుండి 6 సంవత్సరాల వయసు పిల్లలకు 20 గ్రాములు. |
04:48 | 7 నుండి 9 సంవత్సరాల వయస్సు పిల్లలకు 29 గ్రాములను సూచించారు. |
04:55 | 10 నుండి 12 సంవత్సరాల వయసు పిల్లల కొరకు 40 గ్రాములు. |
05:00 | కౌమారదశ వారి కొరకు 52 నుండి 62 గ్రాములు సూచించబడింది. |
05:06 | గర్భిణీ స్త్రీల కొరకు అయితే ఇది 78 గ్రాములు. |
05:11 | పాలిచ్చే తల్లుల కొరకు, 68 నుండి 74 గ్రాముల వరకు సూచించబడింది. |
05:18 | పెద్దవారి కొరకు, ప్రోటీన్ అవసరం అనేది వారియొక్క శారీరక శ్రమపైన కూడా ఆధారపడి ఉంటుంది. |
05:25 | కార్యాచరణ అనేది ఇలా వర్గీకరించబడింది నిశ్చలమైనది, |
05:30 | ఒక మోస్తరు
మరియు భారీ. |
05:33 | నిశ్చలమైన కార్యకలాపాలలో ఇవి ఉంటాయి బోధన, |
05:36 | టైలరింగ్, |
05:38 | డేటా ఎంట్రీ |
05:40 | మరియు కాల్ సెంటర్ ఉద్యోగాలు. |
05:44 | డెస్క్ ఉద్యోగాలు చేసే వ్యక్తులు కూడా నిశ్చల కార్యకలాపాల కిందకే వస్తారు. |
05:50 | ఒక మోస్తరు కార్యకలాపాలలో వీరు ఉన్నారు వ్యవసాయ కార్మికులు, |
05:55 | ఇంటిపని సహాయకులు,
తాపీపని చేసేవారు |
05:58 | మరియు డ్రైవర్. |
06:00 | వీరు భారీ కార్యాచరణలో ఉంటారు రాళ్లు కొట్టేవారు, |
06:04 | కట్టెలు కొట్టేవారు,
పరిగెత్తేవారు |
06:07 | మరియు గనిలో పనిచేసే కార్మికులు. |
06:10 | నిశ్చలంగా ఉండే కార్మికులకు ఆదర్శవంతమైన ఒక కేజీ శరీర బరువుకు 1 గ్రాము ప్రోటీన్ అవసరం. |
06:18 | ఆదర్శ శరీర బరువు అనేది ఉత్తమమైన బరువు ఒక వ్యక్తి కొరకు అది ఆరోగ్యకరమైనది. |
06:24 | ఒక మోస్తరు కార్మికులకు ఒక కిలో ఆదర్శ శరీర బరువుకు 1.2 గ్రాముల ప్రోటీన్ అవసరం. |
06:32 | భారీపనుల కార్మికులకు ఒక కిలో ఆదర్శ శరీర బరువుకు 1.5 గ్రాముల ప్రోటీన్ అవసరం. |
06:40 | దీన్ని మనం ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. |
06:44 | 55 కేజీలు శరీర బరువుండి మోస్తరు శ్రమ చేసే ఒక మహిళకు 66 గ్రాముల ప్రోటీన్ అవసరం ఉంటుంది. |
06:53 | ఒకవేళ అదే మహిళ భారీ పని చేస్తున్నట్లయితే అప్పుడు ఆమెకు 82 గ్రాములు అవసరం. |
07:00 | మీ రోజువారీ ఆహారంలో ప్రోటీన్ సమృద్ధిగా గల ఆహారాన్నిచేర్చాలని సూచించబడింది. |
07:06 | అటువంటి ఆహారాలను 6 నెలల వయస్సు నుండే ఇవ్వాలి. |
07:11 | కొన్ని ఆహార వనరుల యొక్క ప్రోటీన్ కంటెంట్‌ను మనం పరిశీలిద్దాం. |
07:17 | 1 మొత్తం గుడ్డులో దగ్గర దగ్గర 7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. |
07:22 | 100 గ్రాముల ఎముకలు లేని చికెన్ 19 గ్రాముల ప్రోటీన్ ను కలిగి ఉంటుంది. |
07:29 | అదేవిధంగా, 100 గ్రాముల చేపలు దగ్గర దగ్గర 20 గ్రాముల ప్రోటీన్ ను కలిగిఉంటాయి. |
07:36 | 250 మిల్లీలీటర్ల ఆవుల పాలలో సుమారుగా 8 గ్రాములు ఉంటుంది. |
07:43 | 250 మిల్లీలీటర్ల ఆవు పాలతో చేసిన పెరుగు దాదాపు 8 గ్రాములను కలిగిఉంటుంది. |
07:51 | ఆవు పాలతో తయారైన 45 గ్రాముల పన్నీర్ 8 గ్రాముల ప్రోటీన్ ను కలిగిఉంటుంది. |
07:59 | 20 గ్రాముల కాయలు మరియు విత్తనాలు దాదాపు 4 గ్రాములను కలిగిఉంటాయి. |
08:05 | 30 గ్రాముల వండని సోయాబీన్స్ లో సుమారుగా 11 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. |
08:14 | 30 గ్రాముల ఇతర ముడి బీన్స్‌లో దాదాపు 5 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. |
08:22 | 30 గ్రాముల వండని పప్పులు అనేవి సుమారు 4 గ్రాముల ప్రోటీన్ ను కలిగి ఉంటాయి. |
08:30 | 30 గ్రాముల మిల్లింగ్ ముడి బియ్యం సుమారుగా 2 గ్రాములు కలిగిఉంటుంది. |
08:36 | 30 గ్రాముల వండని కొర్రలు దాదాపు 4 గ్రాముల ప్రోటీన్ ను కలిగిఉంటాయి. |
08:43 | 30 గ్రాముల గోధుమ పిండితో తయారు చేసిన 1 చపాతీలో 3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. |
08:52 | జొన్నలు మరియు సజ్జలతో చేసిన చపాతీలో కూడా 3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. |
08:59 | ఒక మిస్సి రోటీలో 4 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. |
09:06 | మిస్సి రోటీ అనేది శనగ పిండి మరియు గోధుమ పిండిని సమాన నిష్పత్తిలో తీసుకుని తయారు చేస్తారు. |
09:13 | మాంసాహార ఆహారం నుండి వచ్చే ప్రోటీన్ అనేది శాఖాహార ఆహారం నుండి వచ్చే దానికంటే బాగా గ్రహించబడుతుంది. |
09:21 | ఇది ఎందుకంటే మాంసాహార ఆహారాలు సంపూర్ణ ప్రోటీన్లను కలిగి ఉంటాయి కనుక. |
09:27 | సంపూర్ణ ప్రోటీన్లు అనేవి అన్ని అవసరమైన అమైనో యాసిడ్ లను కలిగి ఉంటాయి. |
09:33 | అందువల్ల, మాంసాహార ఆహారంలోని ప్రోటీన్ యొక్క నాణ్యత అనేది శాఖాహారం లోనిది కంటే మెరుగైనది. |
09:40 | ప్రోటీన్ యొక్క నాణ్యత అనేది DIAAS పద్ధతి ద్వారా తనిఖీ చేయబడుతుంది. |
09:48 | DIAAS అంటే Digestible indispensable amino acid score. |
09:56 | ఇది ఆహారంలో జీర్ణమయ్యే అమైనో యాసిడ్ యొక్క మరియు అవసరమైన అమైనో యాసిడ్ యొక్క ఓక నిష్పత్తి. |
10:05 | స్కోరు అనేది 0 నుండి 1 వరకు ఇవ్వబడుతుంది. |
10:10 | 1 అనేది గరిష్టంగా ఉంటుంది మరియు 0 అనేది కనిష్టంగా ఉంటుంది. |
10:16 | కొన్ని ఆహార పదార్థాల కొరకు జీర్ణమయ్యే సామర్ధ్యపు స్కోర్‌ను మనం చూద్దాం. |
10:22 | గుడ్డు 1.18 డైజెస్టిబిలిటీ స్కోర్‌ను కలిగి ఉంటుంది. |
10:27 | పూర్తి పాలు 1.32 ను కలిగి ఉంటాయి. |
10:31 | బఠానీలు 0.64 ను కలిగి ఉంటాయి. |
10:35 | అదే కొమ్ము శనగలు అయితే 0.66 ను కలిగి ఉన్నాయి. |
10:41 | వండిన అన్నం 0.59 ను కలిగి ఉంటుంది. |
10:46 | గోధుమలు 0.43 ను కలిగి ఉన్నాయి. |
10:50 | వేయించిన వేరుశెనగలు కూడా 0.43 స్కోర్ ను కలిగిఉంటాయి. |
10:56 | ఇంతకు ముందు చర్చించినట్లుగా, శాఖాహార వనరులు అనేవి అసంపూర్ణ ప్రోటీన్లు. |
11:02 | తృణధాన్యాలలో లైసిన్ తక్కువగా ఉంటుంది అదే పప్పుధాన్యాలలో అయితే మిథియోనిన్ తక్కువగా ఉంటుంది. |
11:08 | వాటిని కలిసి తినడం వల్ల అవి అమైనో యాసిడ్స్ యొక్క లోటును భర్తీ చేస్తాయి. |
11:14 | తృణధాన్యాలు మరియు పప్పుధాన్యాలు కలపడం అనేది ప్రోటీన్ నాణ్యతను మెరుగుపరుస్తుంది. |
11:20 | దీనిని ప్రోటీన్స్ యొక్క పరిపూరకరమైన చర్య అంటారు. |
11:25 | వివిధ కాంబినేషన్లలో వేర్వేరు ఆహార వర్గాలను తినాలి అని సిఫార్సు చేయబడింది. |
11:31 | ఆహార వర్గాల యొక్క కలయిక అనేది వివిధ ముఖ్యమైన అమైనో యాసిడ్స్ ను పొందడానికి సహాయపడుతుంది. |
11:38 | పప్పుధాన్యాలను మరియు ధాన్యాలను పాల ఉత్పత్తులతో కలపడం అనేది ప్రోటీన్ నాణ్యతను మెరుగుపరుస్తుంది. |
11:46 | ధాన్యాలు మరియు పప్పుధాన్యాలలో లేని అమైనో యాసిడ్స్ అనేవి పాల ఉత్పత్తుల ద్వారా భర్తీ చేయబడతాయి. |
11:54 | ఈ కాంబినేషన్ లతో తయారుచేసిన కొన్ని ఆహార పదార్థాలను మనం చూద్దాం. |
12:00 | చిరుధాన్యాల ఖిచ్డి తో పెరుగుపచ్చడి, |
12:03 | మజ్జిగ పులుసు అన్నం (శనగపిండి పెరుగు కూర),
మరియు పన్నీర్ పారాథా (కాటేజ్ చీజ్ ని స్టఫ్ చేసిన టోర్టిల్లా) అనేవి కొన్ని ఉదాహరణలు. |
12:08 | పెరుగుతో ధాలీ పీట్ మరియు |
12:11 | రాజ్మా రైస్ తో పెరుగు అనేవి ఇతర ఉదాహరణలు. |
12:16 | మాంసాహార ఆహారం తో తృణధాన్యాలు లేదా మిల్లెట్ (చిరుధాన్యాలు) కలపడం అనేది కూడా ప్రోటీన్ నాణ్యతను మెరుగుపరుస్తుంది. |
12:24 | ఈ కలయికను ఉపయోగించి తయారుచేయగలిగే కొన్ని వంటకాలను నేను మీకు చెప్తాను. |
12:30 | అందులోకి వచ్చేవి చిరుధాన్యాలు చికెన్ తో పులావ్, |
12:34 | గుడ్డు తో దోశ మరియు |
12:36 | చికెన్ ను పెట్టి చుట్టిన చిరుధాన్యాల రోటీ. |
12:39 | గుడ్డుతో రైస్, |
12:41 | మాంసం స్టఫ్ చేసిన పరాటా, |
12:43 | రాగి ముద్ద
మరియు చికెన్ కూర అనేవి ఇతర ఉదాహరణలు. |
12:49 | ఈ కలయికలే కాకుండా, మనం ఇతర ఆహార వర్గాలను కూడా ఇలాగే కలపవచ్చు. |
12:55 | దధ్యోజనం, |
12:57 | పాలకూర పన్నీర్ తో కూర, |
12:59 | కొబ్బరి పెరుగు పచ్చడి అనేవి కొన్ని ఉదాహరణలు. |
13:04 | గింజలు మరియు విత్తనాల యొక్క పేస్ట్ ను కూరలలో ఉపయోగించడం వలన కూడా ప్రోటీన్ నాణ్యత మెరుగుపడుతుంది. |
13:11 | మంచి ఆరోగ్యం కొరకు మీ రోజువారీ ఆహారంలో ఈ ఆహార పదార్థాలను చేర్చండి. |
13:16 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది.
మాతో చేరినందుకు ధన్యవాదములు. |