Health-and-Nutrition/C2/Importance-of-Calcium/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:00 కాల్షియం యొక్క ప్రాముఖ్యతను తెలిపే ఈ స్పోకన్ ట్యుటోరియల్‌కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్‌లో, మన్మ వీటిని గురించి నేర్చుకుంటాము:
00:09 కాల్షియం యొక్క పాత్ర మరియు మన శరీరంలో దాని యొక్క అవసరం,
00:13 దాని యొక్క లోపం వలన కలిగే లక్షణాలు
00:16 మరియు కాల్షియం అధికంగా లభించే ఆహార వనరులు.
00:20 కాల్షియం అనేది మన శరీరంలో అధికంగా లభించే ఒక ఖనిజము.
00:24 శరీరం యొక్క 99% కాల్షియం అనేది ఎముకలు మరియు దంతాలలో కనిపిస్తుంది.
00:31 మిగిలిన ఆ 1% అనేది మన రక్తంలో ఉంటుంది.
00:34 ఇది మలం, మూత్రం మరియు చెమట ద్వారా మన శరీరం నుండి విసర్జించబడుతుంది.
00:41 కాల్షియం మన శరీరంలో చాలా విధులను నిర్వహిస్తుంది.
00:45 ఎముకల యొక్క అభివృద్ధి మరియు నిర్వహణ అనేది ప్రధానమైన పని.
00:51 ఒకవేళ శరీరంలో కాల్షియం అధికంగా ఉన్నట్లయితే, అది ఎముకలలో పేరుకుపోతుంది.
00:58 ఒకవేళ లోపం ఉంటే, అది ఎముకల నుండి తీసుకోవచ్చు.
01:03 మన శరీరంలో నరాల సంకేతాల యొక్క బదిలీ కోసం కాల్షియం అవసరం.
01:09 ఇది కండరాలు సంకోచించడంలో మరియు వాటియొక్క కదలికలో సహాయపడుతుంది.
01:14 గాయం తర్వాత రక్త ప్రవాహాన్నిఆపడంలో కూడా ఇది సహాయపడుతుంది.
01:18 insulin మరియు adrenaline వంటి హార్మోన్లు స్రవించడం కొరకు కాల్షియం అనేది అవసరం.
01:27 ఇంకా శరీర బరువు, రక్తపోటు మరియు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేవి ఇతర ప్రయోజనాలు.
01:34 సిఫార్సు చేయబడిన రోజువారీ తీసుకోవాల్సిన కాల్షియం అనేది వివిధ వయసుల వారికి మారుతూ ఉంటుంది.
01:41 ఇది బాల్యం మరియు కౌమారదశ వంటి వేగంగా వృద్ధి చెందుతున్న కాలంలో ఎక్కువగా కావాల్సి ఉంటుంది.
01:49 12 నెలల వరకు శిశువులకు, రోజుకు 500 మిల్లీగ్రాముల కాల్షియం కావాలి అని సిఫార్సు చేయబడింది.
01:57 9 సంవత్సరాల వరకు పిల్లలకు, రోజుకు 600 మిల్లీగ్రాములను సిఫార్సు చేస్తారు.
02:03 కౌమారదశలో అయితే రోజుకు 800 మిల్లీగ్రాముల వరకు అవసరాలు పెరుగుతాయి.
02:10 పెద్దల కొరకు అయితే, ఇది రోజుకు 600 మిల్లీగ్రాములు.
02:15 గర్భధారణ మరియు చనుబాలిచ్చే సమయంలో కాల్షియం అవసరాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
02:21 గర్భధారణ మరియు చనుబాలిచ్చే సమయంలో, 1,200 మిల్లీగ్రాములను సిఫార్సు చేస్తారు.
02:29 కాల్షియం లోపం వలన కలిగే ప్రభావాలను ఇప్పుడు మనం చర్చిద్దాం.
02:34 గర్భధారణ సమయంలో కాల్షియం యొక్క లోపం ఫలితంగా రక్తపోటు లో పెరుగుదల రావొచ్చు.
02:42 చేతులు మరియు కాళ్ళలో వాపు కనిపించవచ్చు.
02:46 తల్లులు సరిపడినంత కాల్షియం తీసుకోకపోవడం అనేది శిశువును కూడా ప్రభావితం చేయవచ్చు.
02:53 వారి జనన బరువు తక్కువగా ఉండవచ్చు మరియు వారి యొక్క పెరుగుదల మందగించవచ్చు.
02:58 వారి శారీరక మరియు అభిజ్ఞా వికాస అభివృద్ధి దెబ్బతినవచ్చు.
03:03 పిల్లలలో అయితే, కాల్షియం లోపం అనేది రికెట్స్ కు కారణం కావచ్చు.
03:08 రికెట్స్ అనేది అస్థిపంజర వ్యవస్థ యొక్క ఒక రుగ్మత.
03:12 పెరుగుదల కుంటుపడుతుంది మరియు వెన్నెముక యొక్క ఆకారంలో మార్పులు వస్తాయి.
03:18 క్రుంగిపోయిన పక్కటెముకలు, పొడుచుకు వచ్చిన నుదురు మరియు విల్లు ఆకారంలో వంగిన కాళ్ళు అనేవి ఇతర సంకేతాలు.
03:26 తక్కువ ఎత్తు, మణికట్టు, మోచేయి, మోకాలి యొక్క మరియు చీలమండ కీళ్ళు విస్తరించడం అనేది చూడవచ్చు.
03:34 పెద్దవారిలో అయితే, కాల్షియం లోపం యొక్క ప్రారంభ సంకేతాలు అనేవి కండరాల తిమ్మిరి.
03:40 వేళ్ల యొక్క తిమ్మిరి లేదా జలదరించినట్టు అవ్వడం కూడా కనిపిస్తుంది.
03:46 మానసిక గందరగోళం,

చిరాకు,

03:49 పొడి బారిన చర్మం,

పెళుసైన గోర్లు

03:51 మరియు దంత క్షయం కూడా సంభవించవచ్చు.
03:55 కాల్షియం యొక్క దీర్ఘకాలిక లోపం ఫలితంగా బోలు ఎముకల వ్యాధి రావొచ్చు.
04:01 బోలు ఎముకల వ్యాధి లో, ఎముక సాంద్రత అనేది తగ్గుతుంది.
04:06 ఎముకలు పెళుసుగా మారి పగుళ్లకు గురవుతాయి.
04:10 ఇతర లక్షణాలు అనేవి వంగిపోయినట్టున్నశరీర భంగిమ, ఎత్తు కోల్పోవడం మరియు వెన్నునొప్పి.
04:18 పురుషులతో పోలిస్తే మహిళల్లో బోలు ఎముకల వ్యాధి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
04:23 రుతుక్రమం ఆగిన తర్వాత మహిళల్లో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం అనేది దీనికి కారణం.
04:29 ఆ కారణంగా, కాల్షియం శోషణ అనేది తగ్గుతుంది మరియు మూత్రం ద్వారా దాని విసర్జన పెరుగుతుంది.
04:37 కాల్షియం లోపాన్ని నివారించడానికి, కాల్షియం సమృద్ధిగా ఉండే ఆహారాన్నితగినంత తీసుకోవడం చాలా అవసరం.
04:44 దీనికి ఉత్తమ వనరులు అనేవి పాలు మరియు పాల ఉత్పత్తులు.
04:48 ఇందులో పెరుగు, పన్నీర్ (ఉప్పు లేని భారతీయ జున్ను), జున్ను మరియు ఖోవా (చిక్కగా ఉన్న మొత్తం పాలు) ఉన్నాయి.
04:55 వాటి నుండి పొందిన కాల్షియం అనేది మన శరీరంలో సులభంగా కలిసిపోతుంది.
05:00 200 మిల్లీలీటర్ ల ఆవు పాలు 236 మిల్లీగ్రాముల కాల్షియం ను అందిస్తాయి.
05:07 ఆవు పాలతో చేసిన 100 గ్రాముల పెరుగు 150 మిల్లీగ్రాముల కాల్షియం ను కలిగి ఉంటుంది.
05:14 ఆవు పాలతో చేసిన 30 గ్రాముల పన్నీర్ 142 మిల్లీగ్రాముల కాల్షియం ను కలిగి ఉంటుంది.
05:21 కొన్ని మాంసాహార ఆహారాల్లో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది.
05:25 ఉదాహరణకు: ఎండిన రొయ్యలు, వనమట్టాల చేప, పెద్ద రొయ్యలు, ఎండ్రకాయలు మరియు ఎండిన అస్థి చేపలు.
05:34 100 గ్రాముల పెద్ద రొయ్యలు 67 మిల్లీగ్రాముల కాల్షియం ను ఇస్తాయి.
05:40 20 గ్రాముల ఎండు రొయ్యలు 73 మిల్లీగ్రాముల కాల్షియం కలిగిఉంటాయి.
05:46 15 గ్రాముల ఎండిన వనమట్టాల చేప 208 మిల్లీగ్రాముల కాల్షియం ను కలిగిఉంటుంది.
05:54 విత్తనాలు అనేవి కాల్షియం యొక్క ఒక అద్భుతమైన వనరు.
05:58 ఉదాహరణకు: నువ్వుల విత్తనాలు, వెర్రి నువ్వులు/ఒలిసలు, అవిసె గింజలు, మెంతులు మరియు గసగసాలు.
06:05 1 టేబుల్ స్పూన్ లేదా 5 గ్రా నువ్వుల గింజల్లో 64 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది.
06:14 ఇవి కాకుండా బాదం, వాల్‌నట్ వంటి గింజల్లో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది.
06:21 చాలారకాల పచ్చని ఆకు కూరలలో మంచి మొత్తంలో కాల్షియం ఉంటుంది.
06:26 ఉదాహరణకు: తోటకూర ఆకులు, అగిస్తి ఆకు, మునగాకు మరియు మెంతికూర.
06:33 ముల్లంగి ఆకులు, కొలోకాసియా (చామ) ఆకులు మరియు ఆవాల ఆకులు కూడా మంచి వనరులే.
06:39 100 గ్రాముల తోటకూర ఆకులు 330 మిల్లీగ్రాముల కాల్షియం ను కలిగి ఉంటాయి.
06:46 100 గ్రాముల మెంతి ఆకులు 274 మిల్లీగ్రాముల కాల్షియం ను కలిగి ఉంటాయి.
06:52 సోయాబీన్స్, ఉలవలు మరియు మోటు పెసలు వంటి కొన్ని బీన్స్‌లోనూ కాల్షియం ఉంటుంది.
07:00 50 గ్రాముల ఉలవలు 135 మిల్లీగ్రాముల కాల్షియం ను ఇస్తాయి.
07:07 రాగులు కూడా కాల్షియం పుష్కలంగా గల ఒక గొప్ప వనరు.
07:11 30 గ్రాముల రాగులు 110 మిల్లీగ్రాముల కాల్షియం ను అందిస్తాయి.
07:18 ఆహారం తీసుకోవడంతో పాటు, కాల్షియం ను గ్రహించడం అనేది కూడా అంతే ముఖ్యం.
07:24 ఆక్సలేట్స్, ఫైటేట్స్ మరియు ఫైబర్ లు కాల్షియం యొక్క శోషణను ప్రభావితం చేస్తాయి.
07:30 గింజలు, విత్తనాలు, బీన్స్ మరియు పచ్చని ఆకుకూరలలో ఇవి ఉంటాయి.
07:38 ఒక దృఢమైన సంక్లిష్ట సమ్మేళనాన్ని ఏర్పరచడానికి ఈ పదార్థాలు కాల్షియం తో బంధాన్ని ఏర్పరుచుకోవచ్చు.
07:45 దీని ఫలితంగా, శరీరంలో కాల్షియం శోషణ అనేది నిరోధించబడుతుంది.
07:50 వివిధ వంట పద్ధతులను ఉపయోగించడం ద్వారా శోషణను పెంచుకోవచ్చు.
07:56 ఉదాహరణకు: నానబెట్టడం, మొలకెత్తించడం, ఉడకబెట్టడం, వేయించడం మరియు (కిణ్వ ప్రక్రియ) పులియబెట్టడం.
08:05 కాల్షియం ను గ్రహించడం కోసం, టీ, కాఫీ మరియు కోలా లను కాల్షియం అధికంగా ఉండే ఆహారంతో పాటు తీసుకోవద్దు.
08:13 వాటిలో కెఫిన్ ఉంటుంది, ఇది మూత్రం ద్వారా కాల్షియం విసర్జనను పెంచుతుంది.
08:20 గరిష్టంగా కాల్షియం ను శోషించడం కోసం, మరికొన్నిఇతర పోషకాలు అనేవి అవసరం.
08:25 ఉదాహరణకు: విటమిన్ D, మెగ్నీషియం, పొటాషియం మరియు పాస్ఫరస్.
08:32 పోషకాలే కాకుండా, తగినంత శారీరక శ్రమ మరియు వ్యాయామం కూడా అవసరం.
08:39 ఇది ఎముక ద్రవ్యరాశి మరియు ఎముక బలాన్ని పెంచుతుంది.
08:44 వీటన్నిటితో పాటు చేరి, వయస్సు కూడా కాల్షియం శోషణను ప్రభావితం చేస్తుంది.
08:50 పసితనంలో మరియు బాల్యంలో ఇది అత్యధికం.
08:55 యుక్తవయస్సులో ఉన్నపుడు, శోషణ అనేది మితంగా ఉంటుంది ఇంకా ఆ తరువాత వయస్సుతో పాటు తగ్గుతుంది.
09:02 అందువలన, చిన్న వయస్సు నుండే కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తగినంత తీసుకోవడం చాలా అవసరం.
09:09 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది.

మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Simhadriudaya