Health-and-Nutrition/C2/Complementary-food-for-6-to-24-month-old-babies/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:00 6 నుండి 24 నెలల వయస్సు ఉన్న పిల్లల కొరకు పరిపూరకమైన ఆహారం పై స్పోకన్ ట్యుటోరియల్‌కు స్వాగతం.
00:09 ఈ ట్యుటోరియల్‌లో, మనం ఇంట్లో తయారుచేసిన పౌష్టికమైన (బలవర్ధకమైన) పరిపూరక ఆహారం గురించి నేర్చుకుంటాము.
00:16 మనం దాని పరిమాణం,
00:18 రకం
00:20 మరియు ఎంత తరచుగా ఇవ్వాలి అనేది చర్చిస్తాము.
00:23 6 నెలల శిశువు కొరకు పరిపూరకమైన ఆహారంతో మనం ప్రారంభిద్దాం.
00:29 గుర్తుంచుకోండి, శిశువుకు 6 నెలలు పూర్తయిన తర్వాత పరిపూరకమైన ఆహారాన్ని ప్రారంభించాలి.
00:38 బేబీ యొక్క మొదటి భోజనం అనేది ఒకే ఒక ఆహార పదార్ధంతో తయారుచేసిన చిక్కటి ప్యూరీ లేదా పేస్ట్ అయి ఉండాలి.
00:46 ఈ భోజనానికి ఉపయోగపడే ఆహార పదార్ధాల యొక్క కొన్ని ఉదాహరణలు చూద్దాం.
00:52 మొలకెత్తిన, వండిన మరియు ప్యూరీ చేసిన శనగలు వంటి మొత్తం బీన్స్ ను (పూర్తి గింజలను) ఉపయోగించవచ్చు.
01:00 మొలకెత్తిన, వండిన మరియు ప్యూరీ చేసిన రాగులు (ఫింగర్ మిల్లెట్) వంటి ధాన్యాలను కూడా ఎంచుకోవచ్చు.
01:07 నానబెట్టిన, వండిన మరియు ప్యూరీ చేసిన పచ్చపెసర గింజల పప్పు వంటి బద్ద పప్పులను కూడాఉపయోగించవచ్చు.
01:16 వండిన మరియు ప్యూరీ చేసిన గుడ్డు, చికెన్, ఫిష్ (చేప) వంటి మాంసాహార ఆహారాలను కూడా ఉపయోగించవచ్చు.
01:25 ఒక చిక్కటి పేస్ట్ ను తయారు చేయడానికి వాటిలో దేనినైనా ఎంచుకోండి.
01:30 ఇక్కడ, మొలకెత్తిన, వండిన మరియు ప్యూరీ చేసిన ఎరుపు రాజ్మా గింజలను 1వ ఆహారంగా ఎంచుకుంటాము.
01:38 ఒకవేళ అవసరమైతే, పేస్ట్ తయారు చేయడానికి ఆహారంలో కొద్దిగా తల్లి పాలను జోడించండి.
01:45 తల్లి పాలు అందుబాటులో లేనప్పుడు మాత్రమే మరిగించి చల్లార్చిన నీటిని ఉపయోగించండి.
01:53 ప్యూరీ లేదా పేస్ట్ యొక్క చిక్కదనం అనేది చాలా ముఖ్యమైనది.
01:59 ఇది, చెంచా (స్పూన్) ని వంచినప్పుడు కూడా చెంచా పైన సులభంగా ఉండిపోయేంత చిక్కగా ఉండాలి.
02:06 మొదటిరోజు శిశువు యొక్క మొదటిసారి భోజనం కోసం మొదటి రకం ఆహరం నుండి 1 టేబుల్ స్పూన్ తినిపించండి.
02:14 అదే రోజు రెండవసారి భోజనం కోసం మొదటి రకం ఆహారం యొక్క మరొక టేబుల్ స్పూన్ ఇవ్వండి.
02:21 మొదటి రోజు ఈ రెండు భోజనాలతో పాటుగా, శిశువుకు తగినంతగా తల్లిపాలు ఇవ్వండి.
02:29 దయచేసి గమనించండి, ఈ ట్యుటోరియల్‌లో ఉపయోగించిన టేబుల్‌స్పూన్‌లో 15 గ్రాముల ఆహారం ఉంటుంది.
02:37 2వ రోజు భోజనం కోసం, 2 టేబుల్ స్పూన్ల అదే ఆహరాన్ని తినిపించండి.
02:44 తల్లి పాలివ్వడంతో పాటుగా ఆ రోజు అలాంటి భోజనం రెండుసార్లు పెట్టండి.
02:50 3వ రోజు, ప్రతి భోజనంలోను అదే ఆహరం యొక్క 3 టేబుల్ స్పూన్లు ఇవ్వండి.
02:57 తల్లి పాలివ్వడంతో పాటుగా ఆ రోజు అలాంటి భోజనం రెండుసార్లు పెట్టండి.
03:03 4వ రోజు, రెండో కొత్త రకం ఆహారాన్నిఇవ్వడం ప్రారంభించాల్సిన రోజు.
03:09 ఏదైనా ఆహార వర్గం నుండి ఒక కొత్త పౌష్టికమైన ఆహారాన్ని ఎంచుకోండి.
03:15 ఇదే సిరీస్ యొక్క మరొక ట్యుటోరియల్‌లో ఆహార వర్గాలు అనేవి వివరించబడ్డాయి.
03:22 ఇక్కడ, మొలకెత్తిన, వండిన మరియు ప్యూరీ చేసిన రాగులను 2 వ రకం ఆహారంగా ఎంపిక చేసుకుంటున్నాం.
03:30 తల్లిపాలతో లేదా మరిగించి చల్లార్చిన నీటితో ఈ ఆహారం యొక్క చిక్కటి పేస్ట్ తయారు చేయండి.
03:38 ప్రతి భోజనానికి ఈ రెండవ రకం ఆహార పేస్ట్ ని 1 టేబుల్ స్పూన్ తో ప్రారంభించండి.
03:44 దీనితోపాటు మొదటి రకం ఆహారపు పేస్ట్ ని కూడా 3 టేబుల్ స్పూన్లు ఇవ్వండి.
03:50 ఈ రెండూ కలిపి ప్రతి భోజనంలోను మొత్తం 4 టేబుల్ స్పూన్ల పేస్ట్ చేసిన ఆహారాన్నిఇవ్వాలి.
03:57 4వ రోజు తల్లి పాలివ్వడంతో పాటు ఇలాంటి భోజనాన్ని రెండుసార్లు ఇవ్వండి.
04:03 5వ రోజున, ప్రతి భోజనంలోనూ రెండవ రకం ఆహార పేస్ట్ ని, 2 టేబుల్ స్పూన్లకు పెంచండి.
04:11 దీనితోపాటు ప్రతి భోజనంలోను మొదటి ఆహార పేస్ట్ ను కూడా 2 టేబుల్ స్పూన్లు ఇవ్వండి.
04:18 5వ రోజు తల్లి పాలివ్వడంతో పాటుగా అలాంటి భోజనాన్నిరెండుసార్లు ఇవ్వండి.
04:24 6వ రోజున, ప్రతీ భోజనానికి రెండవ రకపు ఆహార పేస్ట్ ని 3 టేబుల్ స్పూన్లకు పెంచండి.
04:32 దీనితోపాటు ప్రతి భోజనంలోను మొదటి ఆహార పేస్ట్ ను కూడా 1 టేబుల్ స్పూన్ ఇవ్వండి.
04:39 6వ రోజు తల్లి పాలివ్వడంతో పాటుగా అలాంటి భోజనాన్నిరెండుసార్లు ఇవ్వండి.
04:45 7వ రోజు, మూడవ కొత్త పౌష్టికమైన ఆహార పేస్ట్ ని ఇవ్వడం ప్రారంభించండి.
04:53 ఈ చిత్రంలో, 3 వ కొత్త ఆహార పేస్ట్ చేయడానికి గుడ్డు ఎంపిక చేయబడింది.
04:59 ప్రతి భోజనానికి ఈ మూడవ ఆహార పేస్ట్ ని 1 టేబుల్ స్పూన్ తో ప్రారంభించండి.
05:05 దీనితోపాటు మొదటి మరియు రెండవ ఆహార పేస్ట్ లను కూడా 3 టేబుల్ స్పూన్లు ఇవ్వండి.
05:12 ఇవన్నీ కలిపి ప్రతి భోజనంలోను మొత్తం 4 టేబుల్ స్పూన్ల పేస్ట్ చేసిన ఆహారాన్నిఇవ్వాలి.
05:19 7వ రోజు తల్లి పాలివ్వడంతో పాటుగా అలాంటి భోజనాన్నిరెండుసార్లు ఇవ్వండి.
05:25 మూడవ రకం ఆహార పేస్ట్ మొత్తాన్ని, ప్రతీ భోజనానికి క్రమంగా 3 టేబుల్ స్పూన్లకు పెంచుకుంటూ వెళ్ళండి.
05:33 దీనిని ఎల్లప్పుడూ, ఇంతకు ముందు ఇచ్చిన ఆహార పేస్ట్‌లతో పాటుగా ఇవ్వండి.
05:38 ప్రతి భోజనంలోను మొత్తం 4 టేబుల్ స్పూన్ల పేస్ట్ చేసిన ఆహారాన్ని తినిపించాలి.
05:45 6నెలల వయస్సున్నశిశువుకు తల్లి పాలివ్వడంతో పాటు రోజుకు రెండుసార్లు అలాంటి భోజనం ఇవ్వండి.
05:53 అదేవిధంగా, 10వ రోజున నాల్గవ కొత్త పౌష్టికమైన ఆహార పేస్ట్ ని ఇవ్వండి.
06:00 ఈ చిత్రంలో, 4వ కొత్త ఆహార పేస్ట్ ను చేయడానికి చేపలను ఉపయోగించారు.
06:07 తరువాత, 13వ రోజు 5 వ కొత్త ఆహారాన్నిఇవ్వడం, ఈవిధంగా కొనసాగించండి.
06:14 ప్రతి 4వ రోజున ఒక కొత్త ఆహారాన్ని జోడించడాన్ని కొనసాగించండి.
06:19 శిశువు అన్నిరకాల ఆహార వర్గాల నుండి అనేక రకాలైన ఆహారాలను తినేంత వరకు ఈవిధంగా కొనసాగించండి.
06:26 కొత్త తృణధాన్యాలు మరియు పప్పుధాన్యాలను ప్రారంభించిన తర్వాత, పిల్లల భోజనంలో వాటిని ఎల్లప్పుడూ కలయికలో ఉపయోగించండి.
06:34 6నెలల వయస్సు తర్వాత వీలైనంత త్వరగా అలాంటి కలయికలను (కాంబినేషన్) ఇవ్వండి.
06:41 అవి శిశువుకు పూర్తి ప్రోటీన్ ను అందిస్తాయి.
06:46 ఆహారం నుండి ఎక్కువ పోషకాలను గ్రహించేలా వివిధ పద్ధతులను ఉపయోగించండి.
06:53 కొన్ని ఉదాహరణలు వేయించడం, నానబెట్టడం, మొలకెత్తించడం, పులియబెట్టడం మరియు వంట చేయడం.
07:02 ఈ పద్ధతులు అనేవి ఇదే సిరీస్‌లోని ఇతర ట్యుటోరియల్‌లలో వివరంగా చర్చించబడ్డాయి.
07:10 తాజాగా వండిన ఇంట్లో తయారుచేసిన ఆహారం, పరిశుభ్రంగా తయారుచేయడం, అనేది శిశువుకు ఉత్తమమైనది.
07:17 ఒకవేళ శిశువు ఆహారాన్ని నిల్వ చేయాలంటే, దయచేసి సిఫార్సు చేయబడిన భద్రతా మార్గదర్శకాలను అనుసరించండి.
07:25 శిశువు యొక్క ఆహారాన్ని సురక్షితంగా తయారుచేయడం మరియు నిల్వ చేయడం అనేది మరొక ట్యుటోరియల్‌లో వివరించబడింది.
07:32 శిశువుకు ఆహారాన్ని సురక్షితంగా అందించడం కూడా అదే ట్యుటోరియల్‌లో చర్చించబడింది.
07:39 మరిన్ని వివరాల కోసం దయచేసి మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
07:44 ఇప్పుడు, మనం 7 నెలల శిశువు కొరకు పరిపూరకమైన ఆహారం గురించి చర్చిద్దాం.
07:51 ఈ వయస్సులో, ప్రతీ భోజనానికి ఆహార పరిమాణాన్ని క్రమంగా సగం కప్పుకు పెంచండి.
07:58 తల్లి పాలివ్వడంతో పాటుగా ఒక రోజుకు భోజనాల సంఖ్యను కూడా 3 సార్లు కి పెంచండి.
08:06 దయచేసి గమనించండి, ఈ ట్యుటోరియల్‌లో ఉపయోగించిన కప్పు అనేది 250 మి.లీ పరిమాణం పట్టే సామర్ధ్యం గలది.
08:14 ఈ వయస్సులో, ఆహారం యొక్క చిక్కదనాన్నితప్పకుండా మార్చాలి.
08:21 7నెలల శిశువుకు ఇచ్చే ఆహారాన్ని మెత్తని గుజ్జులా లేదా ముద్దగా చేయాలి.
08:28 అటువంటి ఆహారానికి ఒక ఉదాహరణ పనస గింజలతో చేసే జావ (అంబలి).
08:33 బిడ్డకు 8 నెలల వయస్సు వచ్చినప్పుడు, ఒక రోజుకు భోజనాల సంఖ్యను 4 సార్లకి పెంచండి.
08:41 ప్రతీ భోజనంలోను అర కప్పు ఆహారం ఇవ్వడాన్ని కొనసాగించండి.
08:46 తల్లిపాలు ఇవ్వడాన్నీ కొనసాగించండి.
08:49 ఈ వయస్సులో, శిశువుకు ప్యూరీగా చేసినవి మరియు పేస్టులను ఇవ్వడం మానేయండి.
08:56 మృదువుగా చిన్న భాగాలుగా ఉన్న పౌష్టికమైన ఆహారాన్ని ఇవ్వడం ప్రారంభించండి.
09:01 అటువంటి ఆహారానికి ఒక ఉదాహరణ మొలకెత్తిన ఉడికించిన శనగలు.
09:08 శిశువు 9 నుండి 11 నెలల వయస్సుకు వచ్చినప్పుడు, మృదువైన వేలి ఆహారాలు ఇవ్వదాన్ని ప్రారంభించండి.
09:15 వేలి ఆహారాలు (ఫింగర్ ఫుడ్స్) అంటే నేరుగా చేతులతో తినడానికి ఉద్దేశించిన ఆహారాలు.
09:22 ఉడికించిన గుడ్డు మరియు వండిన కూరగాయల ముక్కలు అనేవి అటువంటి ఆహారాలకు ఉదాహరణలు.
09:29 ఈ వయస్సులో, ఒక రోజుకు భోజనాల సంఖ్యను 5 సార్లకి పెంచండి.
09:35 ప్రతీ భోజనంలోను అర కప్పు ఆహారం ఇవ్వడాన్ని కొనసాగించండి.
09:41 తల్లిపాలు ఇవ్వడాన్నీ కొనసాగించండి.
09:44 12 నెలలు నిండిన తరువాత, ఒక బిడ్డ కుటుంబ సభ్యులు తినే భోజనం యొక్క కొంత భాగాన్ని తినడం ప్రారంభించవచ్చు.
09:52 ఈ వయస్సులో, ప్రతీ భోజనానికి ఇచ్చే ఆహారం మొత్తాన్ని1 కప్పుకు పెంచండి.
09:59 తల్లిపాలు ఇవ్వడంతో పాటు ఒక రోజుకు 5 సార్లు భోజనం ఇవ్వడాన్ని కొనసాగించండి.
10:05 ఒక రోజుకు 5 భోజనాలు, ప్రధాన భోజనంగా 3 సార్లు మరియు 2 సార్లు స్నాక్స్ (అల్పాహారం) గా కూడా ఇవ్వవచ్చు.
10:12 ఒకసారి స్నాక్ (అల్పాహారం) కోసం, 1 కప్పు పౌష్టికమైన ఆహారం ఇవ్వాలి.
10:19 పండ్లు, పెరుగు, వండిన కాటేజ్ చీజ్ మరియు వండిన కూరగాయలు అనేవి స్నాక్స్ కి ఉదాహరణలు.
10:28 వంట చేసేటప్పుడు ఈ స్నాక్స్‌లో పౌష్టికమైన గింజలు, విత్తనాలు మరియు ఆకు పొడులను జోడించండి.
10:36 పౌష్టికమైన పొడుల తయారీని ఇదే సిరీస్ యొక్క మరొక ట్యుటోరియల్‌లో చర్చించాం.
10:44 గుర్తుంచుకోండి, తల్లిపాలు ఇవ్వడాన్ని కనీసం 2 సంవత్సరాల వరకు కొనసాగించాలి.
10:51 శిశువు యొక్క మొదటి పుట్టినరోజుకు ముందు, రొయ్యలు మరియు గుల్లచేపలను ఆహారంలో ఇవ్వవద్దు.
10:58 అలాగే, శిశువు కోసం తయారుచేసిన ఆహారంలో ఉప్పు వేయవద్దు.
11:05 2 సంవత్సరాల వయస్సు నిండక ముందు, శిశువుకు ఏ రకమైన చక్కెర ఇవ్వకండి.
11:13 బెల్లం, తేనె, పండ్ల రసాలు కూడా ఇందులోకే వస్తాయి.
11:19 అలాగే, టీ, కాఫీ, పేకెట్ లలోని ఆహరం లేదా డ్రింక్స్ కూడా ఇవ్వకండి.
11:25 మరియు ఎలాంటి బయటి ఆహారం కూడా ఇవ్వకండి.
11:29 ఇవన్నీశిశువు వయస్సు ప్రకారం నిర్దిష్టమైన పరిపూరక ఆహార మార్గదర్శకాలు.
11:36 ఇక్కడ అన్ని వయసుల పిల్లల కొరకు ఇంకా చాలా ముఖ్యమైన ఆహార మార్గదర్శకాలు ఉన్నాయి.
11:43 ఇదే సిరీస్‌లోని మరొక ట్యుటోరియల్‌లో అవన్నీ వివరంగా చర్చించబడ్డాయి.
11:50 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది.

మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Simhadriudaya