GChemPaint/C3/Charts-in-GChemTable/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 అందరికి నమస్కారం.చార్ట్స్ ఇన్ జికెంటేబుల్(Charts in GChemTable)ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకునేది-
00:09 ఎలెమెంటల్ ఛార్ట్స్(Elemental Charts)మరియు
00:11 కస్టమ్ ఛార్ట్స్ సృష్టించడం ఎలా?
00:15 ఈ ట్యుటోరియల్ కోసం నేను
00:18 ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 12.04,
00:21 జికెంపెయింట్ (GchemPaint) వర్షన్ 0.12.10
00:25 జికెంటేబుల్ (GChemTable) వర్షన్ 0.12.10 వాడుతున్నాను.
00:31 ఈ ట్యుటోరియల్ కోసం తెలిసి ఉండాలసినవి-
00:35 ఎలిమెంట్స్ యొక్క పీరియాడిక్ టేబుల్ మరియు
00:37 జికెంపెయింట్ (GchemPaint)
00:40 జికెంపెయింట్ (GchemPaint)యొక్క సంబంధిత ట్యుటోరియల్స్ కోసం,మా వెబ్సైట్ ను సందర్శించండి.
00:44 ఒక కొత్త జికెంటేబుల్(GChemTable) విండో తెరుద్దాం.
00:49 డాష్ హోం(Dash home) పై క్లిక్ చేయండి.
00:51 కనిపించే సెర్చ్ బార్ లో జికెంటేబుల్(GChemTable) అని టైపు చేయండి.
00:55 పీరియాడిక్ టేబుల్ ఆఫ్ ఎలిమెంట్స్ (Periodic table of the elements)ఐకాన్ పై క్లిక్ చేయండి.
01:00 వ్యూ (View)మెను పై క్లిక్ చేసి,ఎలిమెంట్స్ చార్ట్స్(Elements Charts)ను ఎంచుకోండి.
01:05 ఎంపికల జాబితాతో సబ్ మెను తెరుచుకుంటుంది.
01:10 ఎలక్ట్రో-నెగటివిటీ (Electro-negativity) పై క్లిక్ చేయండి.
01:13 పాలింగ్ ఎలక్ట్రో-నెగటివిటీ (Pauling Electro-negativity)వర్సెస్ అటామిక్ నంబర్ (Atomic number)(Z) యొక్క చార్ట్ కనిపిస్తుంది.
01:18 ఈ చార్ట్ లో ఎలక్ట్రో-నెగటివిటీ (Electro-negativity) అత్యధిక విలువ 4.
01:23 నేను ఎలక్ట్రో-నెగటివిటీ (Electro-negativity) చార్ట్ మూసివేస్తాను.
01:26 అదేవిధంగా, వ్యూ మెను కింద వివిధ చార్ట్స్ అందుబాటులో ఉన్నాయి.
01:29 ఎలిమెంట్ చార్ట్స్ (Element charts),
01:32 నేను మెల్టింగ్ టెంపరేచర్ (Melting Temperature)చార్ట్ ను ఎంచుకొంటాను.
01:35 మెల్టింగ్ పాయింట్(Melting point) వర్సెస్ అటామిక్ నంబర్(Atomic number) చార్ట్ కనిపిస్తుంది.
01:41 ఈ చార్ట్ లో ,కార్బన్(Carbon) అత్యధిక ద్రవీభవన స్థానం కలిగి ఉంది.
01:46 నేను మెల్టింగ్ పాయింట్(Melting point) చార్ట్ మూసివేస్తాను.
01:50 ఇప్పుడు, ఒక కస్టమ్(Custom) చార్ట్ ను ఎలా సృష్టించాలో తెలుసుకుందాం.
01:54 వ్యూ(View)వద్దకు వెళ్ళి, ఎలిమెంట్ చార్ట్స్ (Element charts) ఎంచుకోండి మరియు కస్టమ్(Custom) పై క్లిక్ చేయండి.
02:01 తెరపై కస్టమైజ్ చార్ట్ (Customized Chart)విండో మరియు జికెంటేబుల్ గ్రాఫ్(GChemTable Graph)విండోలు కనిపిస్తాయి.
02:07 కస్టమైజ్ చార్ట్ (Customized Chart)విండో ఎడమ వైపు గ్రాఫ్ హైరార్కీ ట్రీ (Graph hierarchy tree) మరియు
02:11 కుడి వైపు గ్రాఫ్ ప్రివ్యూ (Graph preview) కలిగి ఉంటుంది.
02:13 గ్రాఫ్ హైరార్కీ ట్రీ (Graph hierarchy tree), ప్రస్తుత గ్రాఫ్ భాగాలు మరియు వాటి సోపానక్రమం చూపిస్తుంది.
02:20 ప్యానెల్ నందు ఇచ్చిన బటన్లు ఉపయోగించి హైరార్కీ సవరించవచ్చు.
02:25 గ్రాఫ్ ప్రివ్యూ (Graph preview),
02:26 గ్రాఫ్ లో స్కేల్ వెర్షన్ లో మార్పులు చూపిస్తుంది.
02:31 గ్రాఫ్ హైరార్కీ ట్రీ (Graph hierarchy tree) లో,
02:32 మీరు గ్రాఫ్(Graph)మరియు చార్ట్1(Chart1)లను చూడవచ్చు.
02:36 అప్రమేయంగా, గ్రాఫ్(Graph) ఎంచుకోబడిఉంటుంది.
02:39 ఇప్పుడు ప్యానెల్ క్రింది కి వెళ్దాం.
02:42 ఇక్కడ,రెండు టాబ్లు ఉన్నాయి. స్టైల్(Style) మరియు థీమ్(Theme).
02:46 అప్రమేయంగా, స్టైల్(Style)టాబ్ ఎంచుకోబడిఉంటుంది.
02:51 ఇక్కడ మనకు అవుట్లైన్(Outline) మరియు ఫిల్(Fill)అను రెండు శీర్షికలు ఉన్నాయి
02:55 అవుట్లైన్(Outline)శీర్షిక లో 3 డ్రాప్ డౌన్స్ ఉన్నాయి,
02:59 స్టయిల్,కలర్(Style, Color) మరియు సైజ్(Size).
03:04 ఈ డ్రాప్ డౌన్స్, గ్రాఫ్(Graph)అవుట్లైన్ ప్రాపర్టీస్ మార్చడంలో సహాయపడుతాయి.
03:09 స్టైల్(Style) డ్రాప్ డౌన్ పై క్లిక్ చేసి చూపిన లైన్ స్టైల్స్ నుండి ఏదో ఒకటి ఎంచుకోండి.
03:15 ఉదా- నేను లాంగ్ డాష్(Long dash)ఎంచుకుంటాను.
03:20 అందుబాటులో ఉన్న అన్ని రంగులు చూడడానికి కలర్ (Color) డ్రాప్ డౌన్ బాణం పై క్లిక్ చేయండి.
03:25 నేను ఆకుపచ్చ (green) రంగు ఎంచుకుంటాను.
03:28 సైజ్(Size)స్క్రోల్ర్ బాణం పై క్లిక్ చేసి పరిమాణంను 3.0 పాయింట్లు కు పెంచండి.
03:34 మార్పులన్నీ గ్రాఫ్ ప్రివ్యూ ఏరియా (Graph preview area) లో చూడవచ్చు.
03:38 తదుపరి, ఫిల్(Fill)గురించి చూద్దాం.
03:41 ఫిల్(Fill) నందు మనము టైప్ (Type) డ్రాప్-డౌన్ బటన్ చూడవచ్చు.
03:45 టైప్(Type) డ్రాప్-డౌన్ బటన్ పై క్లిక్ చేసి పాటర్న్(Pattern) ను ఎంచుకోండి.
03:50 పాటర్న్(Pattern) యొక్క ఆట్రిబ్యూట్స్ (Attributes) క్రిందన కనిపిస్తాయి.
03:52 వీటిలో పాటర్న్ (Pattern), ఫోర్ గ్రౌండ్ (Foreground)మరియు బాక్ గ్రౌండ్(Background)లు వున్నవి.
03:58 ప్రతి ఆట్రిబ్యూట్ నుండి ఎంచుకోవడానికి ఎంపికలు చూపే ఒక డ్రాప్ డౌన్ కలిగి ఉంది.
04:03 మీకు కావలసిన ఒక పాటర్న్ ఎంచుకోవడానికి,
04:05 పాటర్న్(pattern) డ్రాప్-డౌన్ పై క్లిక్ చేయండి,
04:08 ఆరెంజ్(orange)రంగు ఎంచుకోవడానికి ఫోర్ గ్రౌండ్(Foreground)డ్రాప్-డౌన్ పై క్లిక్ చేయండి.
04:13 నలుపు (black) రంగు ఎంచుకోవడానికి బాక్ గ్రౌండ్(Background) డ్రాప్-డౌన్ పై క్లిక్ చేయండి.
04:18 గ్రాఫ్ ప్రివ్యూ ఏరియా (Graph preview area) లో అన్ని మార్పులు గమనించండి.
04:22 థీమ్(Theme)టాబ్ ఆప్షన్లను మీ స్వంతంగా అన్వేషించవచ్చు.
04:27 మనము ఇప్పుడు గ్రాఫ్ హైరార్కీ ట్రీ(Graph hierarchy tree) లోని చార్ట్1(Chart1) ను ఎంచుకొందాం.
04:31 ఆడ్(Add)బటన్ పై క్లిక్ చేయండి.
04:34 ఎంపికల జాబితా నుండి టైటిల్ టు చార్ట్1(Title to Chart1)ను ఎంచుకోండి.
04:39 క్రిందన ఒక క్రొత్త ట్యాబు ల సెట్ తెరుచుకొంటుంది.
04:42 అప్రమేయంగా, డేటా(Data)టాబ్ ఎంచుకోబడుతుంది.
04:46 టెక్స్ట్(Text) క్షేత్రంలో, చార్ట్ యొక్క టైటిల్ టైప్ చేయండి.
04:49 నేనుఅటామిక్ మాస్ – ఫ్యూషన్ టెంపరేచర్(Atomic mass – Fusion Temperature)అని టైప్ చేస్తాను.
04:55 ఫాంట్(Font)టాబ్ పై క్లిక్ చేయండి.
04:58 ఇక్కడ ఫాంట్ టైప్ (Font type), ఫాంట్ స్టయిల్ (Font style), ఫాంట్ సైజ్(Font Size)మరియు ఫాంట్ కలర్ (Font Color)మార్చవచ్చు.
05:05 నేను ఫాంట్ సైజ్(Font Size) 14 కు పెంచి మరియు ఫాంట్ కలర్ (Font Color) మెరూన్(maroon)కు మారుస్తాను.
05:13 తదుపరి టెక్స్ట్(Text)టాబ్ పై క్లిక్ చేయండి.
05:15 ఇక్కడ మీరు టెక్స్ట్ ఓరియెంటేషన్(Orientation) మార్చవచ్చు.
05:19 ఇది రెండు విధాలుగా చేయవచ్చు-
05:21 ఒకటి ప్రివ్యూ ఏరియా లో నేరుగా క్లిక్ చేయడం ద్వారా.
05:24 రెండు స్క్రోల్ర్ వాడి యాంగిల్ (Angle) క్షేత్రంలో మార్చడం ద్వారా.
05:31 పొజిషన్ (Position)టాబ్ పై క్లిక్ చేయండి.
05:34 నేను డిఫాల్ట్ విలువలను అలాగే వదిలి వేస్తాను.
05:38 గ్రాఫ్ హైరార్కీ ట్రీ (Graph hierarchy tree)లో, తిరిగి వెళ్ళి మరియు
05:41 చార్ట్ 1(Chart1) పై క్లిక్ చేయండి.
05:43 పానెల్ క్రింద , స్టయిల్(Style), పొజిషన్ (Position) మరియు ప్లాట్ ఏరియా (Plot area).
05:46 అను మూడు టాబ్లు చూడవచ్చు.
05:50 డిఫాల్ట్ గా స్టైల్(Style) టాబ్ ఎంచుకోబడుతుంది.
05:54 మనం ఫిల్(Fill) వద్దకు వెళ్దాం.
05:56 టైప్(Type) డ్రాప్ డౌన్ లో, యూనికలర్ గ్రేడియెంట్(Unicolor gradient)ఎంచుకోండి.
06:01 డైరెక్షన్(Direction)డ్రాప్ డౌన్ ఎంచుకోండి మరియు
06:04 మీకిష్టమైన ఒక డైరెక్షన్ ఎంచుకోండి.
06:08 ఎండ్(End)డ్రాప్ డౌన్ ఎంచుకోండి మరియు మీకిష్టమైన కలర్ ఎంచుకోండి.
06:14 బ్రైట్-నెస్ (Brightness) గ్రేడియెన్స్ పెంచడానికి,
06:16 బ్రైట్-నెస్ (Brightness)స్లయిడర్ ను లాగండి.
06:19 పొజిషన్(Position)లో ఉన్న ఎంపికల గురించి అన్వేషించండి మరియు
06:21 ప్లాట్ ఏరియా (Plot area) టాబ్స్ ఎంపికలు మీ సొంతగా అన్వేషించండి.
06:25 ఇప్పుడు యాడ్ (Add)బటన్ పై క్లిక్ చేయండి.
06:28 ప్లాట్ టు చార్ట్1(Plot to Chart1)ను ఎంచుకోండి.
06:31 వివిధ రకాల ఛార్ట్స్ తో సబ్ మెను తెరుచుకుంటుంది, అవి,
06:34 XY, బబుల్(Bubble),కలర్డ్ XY(ColoredXY)మరియు డ్రాప్-బార్ (DropBar).
06:40 ప్రతి చార్ట్ రకంలో వివిధ ఉప చార్ట్ ఎంపికలు ఉన్నాయి.
06:45 మనం XY మరియు XY లైన్స్ చార్ట్ ఎంపికను ఎంచుకొందాం.
06:51 క్రిందన ఒక కొత్త టాబ్ల సెట్ తెరవబడింది. అప్రమేయంగా, స్టైల్(Style) టాబ్ ఎంచుకోబడుతుంది.
06:58 ఇంటర్పోలేషన్(Interpolation) వద్దకు వెళ్ళండి.
07:00 టైప్(Type) స్క్రోలర్ పై క్లిక్ చేసి మరియు బేజియర్ క్యూబిక్ స్ప్లైన్ (Bezier cubic spline)ను ఎంచుకోండి.
07:06 ఫిల్(Fill)వద్దకు వెళ్ళండి.టైప్ స్క్రోలర్ లో,బైకలర్ గ్రేడియెంట్(Bicolor gradient)ను ఎంచుకోండి.
07:12 డేటా(Data)టాబ్ పై క్లిక్ చేయండి.చార్ట్ పేరు,
07:15 అటామిక్ మాస్ Vs ఫ్యూషన్ టెంపరేచర్(Atomic-mass Vs Fusion temperature)గా టైప్ చేయండి.
07:20 X- నేను X అక్షంపై అటామిక్ మాస్ (Atomic mass)ను ఎంచుకుంటాను.
07:25 Y- నేను Yఅక్షంపై ఫ్యూషన్ టెంపరేచర్ (Fusion temperature)ను ఎంచుకుంటాను.
07:30 మార్కర్స్ (Markers) టాబ్ పై క్లిక్ చేయండి.
07:33 చార్టులో పాయింట్లు గుర్తించడానికి మార్కర్స్(Markers)ఉపయోగిస్తారు.
07:37 మార్కర్ (Marker), శీర్షిక క్రింద
07:40 షేప్(Shape), ఫీల్(Fill), అవుట్లైన్(Outline) మరియు సైజ్(Size)లు వున్నవి.
07:44 షేప్ గా సర్కిల్(circle)ను ఎంచుకోండి.
07:48 ఫిల్ (Fill)కలర్ గా బ్రౌన్(brown)ను ఎంచుకోండి మరియు
07:51 మిగిలిన వాటిని డిఫాల్ట్ గా వదిలి వేయండి.
07:54 ఇప్పుడు అప్ప్లై(Apply)బటన్ పై క్లిక్ చేద్దాం.
07:57 అవసరమైన చార్ట్.
08:00 జికెంటేబుల్ గ్రాఫ్(GChemTable Graph) విండో లో కనిపిస్తుంది.
08:03 మనం ఇప్పుడు ఈ చార్ట్ ను ఇమేజ్ గా సేవ్ చేద్దాం.
08:06 మొదట జికెంటేబుల్ గ్రాఫ్(GChemTable Graph) విండో పై క్లిక్ చేయండి.
08:10 ఫైల్(File)ను ఎంచుకోండి మరియు సేవ్ యాస్ ఇమేజ్(Save As Image)ఎంపిక పై క్లిక్ చేయండి.
08:14 సేవ్ యాస్ ఇమేజ్(Save As Image) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
08:18 ఫైల్ టైప్(File type)గా PS డాక్యూమెంట్(PS document)ను ఎంచుకోండి.
08:22 మీకు కావలసిన ఫైల్ పేరు టైప్ చెయ్యండి.
08:24 నేను మై-కస్టమ్-చార్ట్(my-custom-chart)అని టైప్ చేస్తాను.
08:27 నేను నా ఫైలు సేవ్ చేయడానికి డెస్క్టాప్(Desktop) ను locationగా ఎంచుకుంటాను.
08:32 సేవ్(Save) బటన్పై క్లిక్ చేయండి.
08:35 ఇక్కడ నేను సేవ్ చేసిన డాక్యూమెంట్ ఉంది.
08:38 ఫైలు పై రైట్-క్లిక్ చేయండి మరియు
08:40 ఓపెన్ విత్ డాక్యుమెంట్ వ్యూయర్(Open with Document Viewer)ఎంపిక ను ఎంచుకోండి.
08:44 ఇది నా గ్రాఫ్.
08:47 క్లుప్తంగా,ఈ ట్యుటోరియల్లో నేర్చుకొన్నది-
08:51 ఎలిమెంటల్ ఛార్ట్స్ యొక్క ఎలక్ట్రో-నెగటివిటీ (Electro-negativity)
08:53 మెల్టింగ్ పాయింట్(Melting point) మరియు
08:55 కస్టమ్ చార్ట్స్(Custom Charts) సృష్టించడం ఎలా?
08:58 అసైన్‌మెంట్ గా, క్రిందివి అన్వేషించండి-
09:01 వివిధ ఎలిమెంట్ ఛార్ట్స్. ఇతర XY చార్ట్ టైప్స్.
09:05 బబుల్(Bubble), కలర్డ్ XY(ColoredXY) మరియు డ్రాప్ బార్(DropBar) చార్ట్ రకాలు మరియు
09:10 SVG మరియు పిడిఎఫ్(PDF) ఫైల్ ఫార్మాట్లలో ఛార్ట్స్ సేవ్ చేయండి.
09:16 ఈ లింక్ వద్ద అందుబాటులో వున్నవీడియో చూడండి.
09:20 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
09:23 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపొతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
09:28 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం-
09:30 స్పోకెన్ ట్యూటోరియల్స్ ని వాడి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
09:33 ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది.
09:36 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgను సంప్రదించండి.
09:44 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
09:48 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
09:55 ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
10:01 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి, ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Pratik kamble, Yogananda.india