FrontAccounting-2.4.7/C2/Purchase-and-Reports-in-FrontAccounting/Telugu
From Script | Spoken-Tutorial
| |
|
| 00:01 | ఫ్రంట్‌అకౌంటింగ్‌లో Purchases and Reports పై ఈ స్పోకన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
| 00:08 | ఈ ట్యుటోరియల్‌లో, మనం నేర్చుకునేవి.
Suppliers ను జోడించడం |
| 00:13 | ఒక Purchase Order Entry ను చేయడం |
| 00:15 | Suppliers invoice ను సృష్టించడం మరియు transactions పైన వివిధ reports ను రూపొందించడం |
| 00:24 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నవి:
ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 16 .04 |
| 00:32 | మరియు ఫ్రంట్ అకౌంటింగ్ వర్షన్ 2.4.7 |
| 00:37 | ఈ ట్యుటోరియల్‌ని అభ్యసించడానికి, మీకు వీటిపై అవగాహన ఉండాలి: హయ్యర్ సెకండరీ కామర్స్ మరియు అకౌంటింగ్ ఇంకా
ప్రిన్సిపల్స్ ఆఫ్ బుక్కీపింగ్ |
| 00:47 | మరియు మీరు FrontAccounting లో ఇప్పటికే ఒక సంస్థను లేదా ఒక కంపెనీని ఏర్పాటు చేసి ఉండాలి. |
| 00:53 | ఒకవేళ లేకపోతే, సంబంధిత ఫ్రంట్ అకౌంటింగ్ ట్యుటోరియల్స్ కొరకు దయచేసి ఈ వెబ్‌సైట్‌ను సందర్శించండి. |
| 00:59 | మీరు ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ లో పనిచేయడాన్ని ప్రారంభించడానికి ముందు XAMPP సర్వీసెస్ ను ప్రారంభించండి. |
| 01:05 | Purchase యొక్క అర్ధాన్ని మనం అర్థం చేసుకుందాం. |
| 01:09 | Purchase అనేది ఒక వ్యక్తి లేదా వ్యాపారం చేత కొనుగోలుచేయబడిన ఒక ఉత్పత్తిని లేదా సేవను సూచిస్తుంది. |
| 01:17 | వ్యాపారం అనేది దాని యొక్క లక్ష్యాలను సాధించుకోవడానికి వస్తువులను లేదా సేవలను పొందటానికి ప్రయత్నిస్తుంది. |
| 01:24 | ఇప్పుడు, మనం ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ ను తెరుద్దాం. |
| 01:28 | బ్రౌజర్‌ను ను తెరవండి.localhost స్లాష్ account అని టైప్ చేసి, Enter ను నొక్కండి. |
| 01:36 | login పేజీ కనిపిస్తుంది. |
| 01:39 | యూజర్ నేమ్ గా admin ను మరియు పాస్ వర్డ్ ను టైప్ చేయండి.
తరువాత Login బటన్ పై క్లిక్ చేయండి. |
| 01:47 | ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ తెరుచుకుంటుంది.
Purchases టాబ్ పై క్లిక్ చేయండి. |
| 01:53 | ఫ్రంట్ అకౌంటింగ్‌లో Purchases కొరకు ఉన్న విధానాన్నిమనం చూద్దాం. |
| 01:58 | ఒక Purchase Entry కొరకు అనుసరించాల్సిన దశలు:
Suppliers ను జోడించడం |
| 02:04 | ఒక Purchase Order Entry ను చేయడం |
| 02:07 | Supplier మరియు Suppliers invoice నుండి Receivable note. |
| 02:13 | అయితే మొదట Supplier యొక్క అర్ధాన్ని మనం అర్థం చేసుకుందాం. |
| 02:18 | Supplier అంటే వస్తువులు లేదా సేవలను సప్లయ్ చేసే వ్యక్తి లేదా ఒక వ్యాపారం. |
| 02:24 | ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్‌ఫేస్‌కు తిరిగి మారండి. |
| 02:27 | Maintenance ప్యానెల్‌లో, Suppliers లింక్‌పై క్లిక్ చేయండి. |
| 02:32 | ఇక్కడ, మనం ఒక Supplier కు సంబంధించిన అవసరమైన సమాచారాన్నంతా నింపాలి.
ఇక్కడ చూపిన విధంగా నేను అవసరమైన వివరాలను నింపాను. |
| 02:42 | స్క్రోల్ చేయండి.
విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Add New Supplier Details బటన్ పై క్లిక్ చేయండి. |
| 02:50 | సేవ్ చేసిన entry కొరకు నిర్ధారణ సందేశాన్ని మనం చూడవచ్చు. |
| 02:55 | ఒక క్రొత్త Purchase Order Entry కొరకు మనం ఈ మార్పులను వర్తింపజేయాలి. |
| 03:00 | స్క్రోల్ చేసి విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్నUpdate Supplier బటన్ పై క్లిక్ చేయండి. |
| 03:06 | విజయ సందేశం మనం supplier ని అప్ డేట్ చేసినట్లు చూపిస్తుంది. |
| 03:11 | స్క్రోల్ చేయండి. విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్నBack లింక్ పై క్లిక్ చేయండి. |
| 03:17 | మనం ఒక Purchase Order Entry ను చేద్దాం.
సిస్టమ్‌లోని అన్ని Purchase Orders ను రిజిస్టర్ చేయడానికి ఇది ఉపయోగించబడుతుంది. |
| 03:25 | Transactions ప్యానెల్‌లో, Purchase Order Entry లింక్‌పై క్లిక్ చేయండి. |
| 03:30 | మనము Supplierపేరు మరియు ఇతర సంబంధిత సమాచారంతో వివరాలను చూడవచ్చు. |
| 03:36 | ఇది ఎందుకంటే మనం ఇంతకుముందు supplier వివరాలను అప్ డేట్ చేసాము కనుక. |
| 03:42 | Supplier’s reference ఇవ్వడం అనేది తప్పనిసరి. |
| 03:46 | కనుక, నేను Supplier’s reference ను S001 గా టైప్ చేస్తాను. |
| 03:53 | Item Description డ్రాప్-డౌన్ మెనులో, Item' గా Dell laptop ను ఎంచుకోండి. |
| 04:00 | Quantity ఫీల్డ్‌లో, నేను క్వాంటిటీ ని 2 గా టైప్ చేస్తాను. |
| 04:05 | తదనుగుణంగా Required Delivery Date ను ఎంచుకోండి. |
| 04:09 | డిఫాల్ట్ గా, ఇది ఆర్డర్ తేదీకి 10 రోజులు తర్వాత అవుతుంది.
నేను అలాగే ఉంచుతాను. |
| 04:15 | ఇప్పుడు, Price before Tax ఫీల్డ్‌లో, నేను Price ను 48,000 గా టైప్ చేస్తాను. |
| 04:22 | entry ను సేవ్ చేయడానికి, రో యొక్క కుడి చివర ఉన్న Add Item బటన్ పై క్లిక్ చేయండి. |
| 04:28 | GST తోపాటు Amount Total ని మనం చూడవచ్చు. |
| 04:32 | ఇప్పుడు, విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్నPlace Order బటన్ పై క్లిక్ చేయండి. |
| 04:37 | విజయ సందేశం Purchase Order ప్లేస్ చేయబడిందని చూపిస్తుంది. |
| 04:42 | ఇప్పుడు, మనం Purchase Order కొరకు items ను రిసీవ్ చేసుకోవాలి. |
| 04:47 | విండోలో, Receive Items on this Purchase Order లింక్‌పై క్లిక్ చేయండి. |
| 04:53 | మన Purchase Order కొరకు రిసీవ్ చేసుకున్న items యొక్క వివరాలను మనం చూడవచ్చు. |
| 04:58 | విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్నProcess Receive Items బటన్ పై క్లిక్ చేయండి. |
| 05:03 | మనం Purchase Order delivery ప్రాసెస్ చేయబడింది అనే ఒక సందేశాన్ని చూడవచ్చు. |
| 05:08 | దాని క్రింద, మనం మరికొన్ని ఎంపికలను చూడవచ్చు. |
| 05:12 | తరువాత మీరు మీ స్వంతంగా ఈ ఎంపికలను అన్వేషించవచ్చు. |
| 05:16 | దీని తరువాత, మనం ఒక Purchase invoice ను రిసీవ్ చేసుకోవాలి. |
| 05:21 | కనుక, Entry purchase invoice for this receival లింక్ పై క్లిక్ చేయండి. |
| 05:27 | ఇక్కడ, Supplier invoice ను ఎంటర్ చెయ్యడానికి వివరాలను మనం చూడవచ్చు. |
| 05:32 | Supplier’s reference గా S001 ను టైప్ చేయండి. |
| 05:37 | ఒకవేళ మీరు supplier reference ను ఇవ్వనట్లయితే అది ఒక ఎర్రర్ ను ఇస్తుంది. |
| 05:42 | రో యొక్క కుడి చివర ఉన్న Add బటన్ పై క్లిక్ చేయండి.
స్క్రోల్ చేయండి. |
| 05:47 | GST తో invoice కొరకు వివరాలను మనం చూడవచ్చు. |
| 05:52 | విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Enter Invoice బటన్ పై క్లిక్ చేయండి. |
| 05:56 | Supplier invoice ను విజయవంతంగా ప్రాసెస్ చేశామనే సందేశాన్ని మనం చూడవచ్చు. |
| 06:02 | తరువాత, మనం చేసిన invoice పైన Supplier కు పే చేయవలసి ఉంది. |
| 06:08 | Entry supplier payment for this invoice లింక్ పై క్లిక్ చేయండి. |
| 06:13 | మనం Supplier కుపే చేయవలసి ఉంది అని చూపించే Supplier Invoice వివరాలను మనం చూస్తాము. |
| 06:19 | అలాగే, అక్కడ Supplier కు చెల్లించడానికి కొంత Bank Balance కూడా ఉండాలి. |
| 06:24 | Memo ఫీల్డ్‌లో, Being payment made to the supplier - S001 అని టైప్ చేయండి. |
| 06:31 | తరువాత, విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Enter Payment బటన్ పై క్లిక్ చేయండి. |
| 06:36 | మనం విజయవంతంగా Payment చేశామని నిర్ధారణ సందేశం చూపిస్తుంది. |
| 06:41 | దాని క్రింద, మనం మరికొన్ని ఎంపికలను చూడవచ్చు.
తరువాత మీరు మీ స్వంతంగా ఈ ఎంపికలను అన్వేషించవచ్చు. |
| 06:48 | View the GL journal Entries for this Payment లింక్ పై క్లిక్ చేయండి. |
| 06:55 | విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న close లింక్ పై క్లిక్ చేయండి. |
| 06:59 | అసైన్మెంట్ గా, కింది వాటిని చేయండి:
Suppliers ఎంపికను ఉపయోగించి, Purchases కొరకు ఒక కొత్త Supplier ను జోడించండి |
| 07:07 | ఒక కొత్త Purchase Order Entry ను చేయండి |
| 07:10 | ఒక Supplier payment for this invoice ను చేయండి |
| 07:14 | మరియు వివరాల కొరకు ఈ ట్యుటోరియల్ యొక్క Assignment లింక్‌ను చూడండి. |
| 07:20 | ఇప్పటివరకు, మన కంపెనీ లో, మనం Sales మరియుPurchases కు సంబంధించిన కొన్ని transactions ను చేసాము. |
| 07:27 | ఇప్పుడు మనం ఈ transactions కు సంబంధించిన వివిధ reports ను చూద్దాం. |
| 07:33 | Banking and General Ledger టాబ్ పై క్లిక్ చేయండి. |
| 07:37 | Inquiries and Reports ప్యానెల్ కింద, Banking Reports లింక్‌పై క్లిక్ చేయండి. |
| 07:43 | కుడివైపు ప్యానెల్‌లోని Bank statement లింక్‌పై క్లిక్ చేయండి. |
| 07:47 | కుడివైపు పానెల్‌లో, Bank Accounts ఫీల్డ్‌ను Current account గా ఉంచండి. |
| 07:52 | report ను చూడటానికి transactions కొరకు Start Date మరియు End Date లను ఎంచుకోండి. |
| 07:58 | ఎగువ కుడి మూలలో ఉన్న Display:Bank statement బటన్ పై క్లిక్ చేయండి. |
| 08:04 | మనం ఏకీకృత (కన్సాలిడేటెడ్) Bank statement report ను చూడవచ్చు. |
| 08:08 | ఈ విండోను మూసివేయండి. |
| 08:10 | తరువాత, Sales టాబ్ పై క్లిక్ చేయండి. |
| 08:13 | Inquiries and Reports ప్యానెల్‌లో, Customer and Sales Reports లింక్‌పై క్లిక్ చేయండి. |
| 08:19 | తరువాతి విండోలో, Report Classes కింద, General Ledger లింక్‌పై క్లిక్ చేయండి. |
| 08:26 | తరువాత కుడివైపు ప్యానెల్‌లోని List of Journal Entries లింక్‌పై క్లిక్ చేయండి. |
| 08:31 | report ను చూడటానికి transactions కొరకు Start Date మరియు End Date లను ఎంచుకోండి. |
| 08:37 | ఎగువ కుడి మూలలో ఉన్న Display:List of journal entries బటన్ పై క్లిక్ చేయండి. |
| 08:44 | company లో ఎంటర్ చేసిన అన్ని Journal Entries ను మనం చూడవచ్చు. |
| 08:50 | మనం ఈ విండోను మూసివేద్దాం |
| 08:52 | Report classes కింద, General Ledger లింక్‌పై క్లిక్ చేయండి. |
| 08:57 | కుడివైపు ప్యానెల్‌లో, Trial Balance లింక్‌పై క్లిక్ చేయండి. |
| 09:01 | report ను చూడటానికి transactions కొరకు Start Date మరియు End Date లను ఎంచుకోండి. |
| 09:07 | ఎగువభాగం వద్ద కుడివైపునఉన్న Display:Trial balance బటన్ పై క్లిక్ చేయండి. |
| 09:12 | సంబంధిత report ను మనం చూడవచ్చు. |
| 09:15 | ఇది అన్ని General Ledger accounts యొక్క జాబితా పై ఆధారపడి ఉంటుంది. |
| 09:20 | విండో ను మూసివేయండి. |
| 09:22 | Report classes కింద, General Ledger లింక్‌పై క్లిక్ చేయండి. |
| 09:27 | కుడివైపు పానెల్‌లోని Balance Sheet లింక్‌పై క్లిక్ చేయండి. |
| 09:31 | report ను చూడటానికి transactions కొరకు Start Date మరియు End Date లను ఎంచుకోండి. |
| 09:37 | ఎగువభాగం వద్ద కుడివైపునఉన్నDisplay: Balance sheet బటన్ పై క్లిక్ చేయండి |
| 09:42 | Assets and Liabilities యొక్క సంబంధిత report ను మనం చూడవచ్చు. |
| 09:48 | విండో ను మూసివేయండి. |
| 09:50 | Report classes క్రింద, Customer లింక్ పై క్లిక్ చేయండి. |
| 09:55 | ఇక్కడ మనం Price listing, customer detail listing, Customer trial balance లను చూడవచ్చు. |
| 10:02 | ఈ reports ను మీ స్వంతంగా అన్వేషించండి. |
| 10:05 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది.
సారాంశం చూద్దాం. |
| 10:11 | ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని నేర్చుకున్నాము:
Suppliers ను జోడించడం |
| 10:16 | ఒక Purchase Order Entry ను చేయడం |
| 10:19 | Suppliers invoice ను సృష్టించడం |
| 10:22 | మరియు transactionsపై వివిధ reports ను సృష్టించడం. |
| 10:26 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.
దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
| 10:34 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.
మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
| 10:43 | దయచేసి మీ సమయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్.  లో పోస్ట్ చేయండి. |
| 10:47 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. |
| 10:53 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి నేను మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. |