FrontAccounting-2.4.7/C2/Journal-Entry-and-Balance-Sheet-in-FrontAccounting/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 ఫ్రంట్ అకౌంటింగ్‌లో Journal Entry and Balance sheet పై ఈ స్పోకన్ ట్యుటోరియల్‌కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని నేర్చుకుంటాము

ఒక Journal Entry ను ఎలా పాస్ చేయాలి

00:12 Balance Sheet మరియు Void a transaction లలోఅది ఎలా ప్రతిబింబిస్తుందో చూడటం.
00:18 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నవి:

ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 16 .04

00:26 ఫ్రంట్ అకౌంటింగ్ వర్షన్ 2.4.7
00:30 ఈ ట్యుటోరియల్‌ని అభ్యసించడానికి, మీకు వీటిపై అవగాహన ఉండాలి: హయ్యర్ సెకండరీ కామర్స్ మరియు అకౌంటింగ్
00:37 ప్రిన్సిపల్స్ ఆఫ్ బుక్కీపింగ్ (జమ ఖర్చుల లెక్కలు వ్రాసే విధానం)


00:40 మరియు మీరు FrontAccounting లో ఇప్పటికే ఒక సంస్థను లేదా ఒక కంపెనీని ఏర్పాటు చేసి ఉండాలి.
00:46 ఒకవేళ లేకపోతే, సంబంధిత ఫ్రంట్ అకౌంటింగ్ ట్యుటోరియల్స్ కొరకు దయచేసి ఈ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
00:52 మీరు ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ లో పనిచేయడాన్ని ప్రారంభించడానికి ముందు XAMPP సర్వీసెస్ ను ప్రారంభించండి.
00:58 మనం ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ ను తెరుద్దాం.
01:02 బ్రౌజర్‌ను తెరిచి, localhost స్లాష్ account అని టైప్ చేసి, Enter ను నొక్కండి.
01:10 login పేజీ కనిపిస్తుంది.
01:12 యూజర్ నేమ్ గా admin ను మరియు పాస్ వర్డ్ ను టైప్ చేయండి.

తరువాత Login బటన్ పై క్లిక్ చేయండి.

01:20 ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ తెరుచుకుంటుంది.
01:23 మనం వ్యాపారంలో capital (మూలధనాన్ని) ను ఎలా వాడుకలో పెట్టాలో చూస్తాము.
01:27 Journal Entry అనేది 5,00,000 రూపాయల capital (మూలధనం)తో ప్రారంభమైన వ్యాపారం.
01:32 Entry అనేది Cash account debit ( డెబిట్ నగదు ఖాతా) 5,00,000, To Capital Account (మూలధన ఖాతాకు) 5,00,000

(Being Capital introduced in the business) (వ్యాపారంలో వాడుకలో పెట్టబడుతున్న capital (మూలధనం))

01:41 దీని కొరకు మనం ఒక Journal Entry ను పాస్ చేస్తాము.
01:45 Banking and General Ledger ట్యాబ్ పై క్లిక్ చేసి ఆపై Journal Entry లింక్ పై క్లిక్ చేయండి.
01:52 Journal date ఫీల్డ్‌లో, డిఫాల్ట్ తేదీని ఈ రోజు గా సెట్ చేసినట్లు మీరు చూడవచ్చు.
01:57 transaction (లావాదేవీ) కొరకు మనం reference number ను కూడా చూడవచ్చు.

ఇది auto-generated (స్వయంచాలకంగా ఉత్పత్తి చేయబడినది).

02:05 Account Description డ్రాప్-డౌన్ బాక్స్ పై క్లిక్ చేసి, Cash ఎంపికను ఎంచుకోండి.
02:11 Debit టెక్స్ట్‌బాక్స్‌పై క్లిక్ చేసి, మొత్తాన్ని (అమౌంట్ ను) Five lakhs గాటైప్ చేయండి.
02:17 Debit entry ను సేవ్ చేయడానికి, ఆ వరుసలోని Add Item బటన్ పై క్లిక్ చేయండి.
02:23 మళ్ళీ, Account Description డ్రాప్-డౌన్ బాక్స్ పై క్లిక్ చేసి, Capital ఎంపికను ఎంచుకోండి.
02:30 తరువాత, Credit టెక్స్ట్‌బాక్స్‌పై క్లిక్ చేసి, మొత్తాన్ని (అమౌంట్ ను) Five lakhs గా టైప్ చేయండి.
02:38 Credit entry ను సేవ్ చేయడానికి, ఆ వరుసలోని Add Item బటన్ పై క్లిక్ చేయండి.
02:44 ఇప్పుడు, ఈ Journal Entry యొక్క నేరేషన్ (కథనం) కోసం Memo ఫీల్డ్ పై క్లిక్ చేయండి.
02:49 ఇక్కడ, ఈ టెక్స్ట్ Being capital introduced in the business ను టైప్ చేయండి.
02:54 entry ను సేవ్ చేయడానికి, విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Process Journal Entry బటన్ పై క్లిక్ చేయండి.
03:01 ఎగువభాగం వద్ద మీరు Journal entry has been entered అని చెప్పే ఒక సందేశాన్ని (మెసేజ్) ను చూడవచ్చు.
03:07 మీరు ఈ అప్షన్స్ (ఎంపికల)ను కూడా చూడవచ్చు: View this Journal Entry ,Enter New Journal Entry
03:12 Add an Attachment మరియు Back
03:17 మనం వీటిని ఒకదాని తర్వాత ఒకటి అన్వేషిద్దాం.
03:20 View this Journal Entry లింక్ పై క్లిక్ చేయండి.
03:24 ఒక క్రొత్త popup విండో తెరుచుకుంటుంది.
03:27 ఇది మనం ఇప్పుడే ఎంటర్ చేసిన General Ledger Transaction Details ను చూపిస్తుంది.
03:33 Print లింక్ అనేది మన భవిష్యత్ సూచనల కొరకు ఈ transaction యొక్క ప్రింట్-అవుట్ ను పొందడానికి.
03:39 ఈ విండోను మూసివేయడానికి Close లింక్‌పై క్లిక్ చేయండి.
03:43 ఇప్పుడు, Enter New Journal Entry ఎంపికపై క్లిక్ చేయండి.
03:48 తరువాతి కొత్త Journal Entry కొరకు ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది.
03:52 ట్యుటోరియల్ పాజ్ చేసి, కింది అసైన్‌మెంట్ ను చేయండి.
03:56 Goods Purchased for Rs 50,000 కొరకు ఒక Journal Entry ను పాస్ చేయండి.
04:01 ఈ Entry అనేది Office furniture and Equipments Account debit

To cash Account for Rs 50,000

04:09 Memo: Purchased Office furniture and Equipments for Rs 50,000
04:15 Process the journal entry పై క్లిక్ చేయండి.
04:19 ఇప్పుడు, Add an Attachment లింక్ పై క్లిక్ చేయండి.
04:23 మనం ఈ fields ను చూడవచ్చు

Transaction

04:27 Description మరియు Attached file
04:31 Attached file అంటే పాస్ చేయబడిన Journal entry కు సంబంధించి ఏదైనా డాక్యుమెంట్ (పత్రాన్ని) ను జతపరచడం.
04:38 నేను ఇప్పటికే సృష్టించి నా కంప్యూటర్‌లో సేవ్ చేసిన sample voucher ను నన్ను అటాచ్ చేయనివ్వండి.
04:44 Browse బటన్ పై క్లిక్ చేసి, ఆ ఫైల్ సేవ్ చేయబడిన ఫోల్డర్‌ను గుర్తించండి.
04:51 నేను నా Desktop ఫోల్డర్ నుండి Sample-Voucher.pdfఫైల్‌ను

ఎంచుకుంటాను.

04:57 ఇప్పుడు మీరు ఇక్కడ ఫైల్ అటాచ్మెంట్ ను చూడవచ్చు.
05:01 ఈ voucher ఈ ట్యుటోరియల్ యొక్క Code files లింక్‌లో అందించబడింది.
05:06 దయచేసి ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఉపయోగించుకోండి.
05:11 తరువాత Add new బటన్ పై క్లిక్ చేయండి.
05:14 Attachment has been inserted: అని చెప్పే ఒక సందేశం కనిపిస్తుంది.
05:19 అలాగే, అప్‌లోడ్ చేసిన ఫైల్ టేబుల్‌కు జోడించబడిందని మీరు చూడవచ్చు.
05:25 తిరిగి వెళ్ళడానికి Back ఎంపికపై క్లిక్ చేయండి.
05:28 తరువాత, ఈ Journal Entry యొక్క ప్రతిబింబాన్నిBalance Sheet లో చూద్దాం.
05:34 అలా చేయడానికి, Banking and General Ledger టాబ్ పై క్లిక్ చేయండి.
05:39 తరువాత Balance Sheet Drilldown లింక్‌పై క్లిక్ చేయండి.
05:43 transaction ఇక్కడ ప్రతిబింబిస్తుందని మనం చూడవచ్చు.
05:47 భవిష్యత్తులో, మనకు ఇంకా చాలా ఎక్కువ జర్నల్ఎం ట్రీలు ఉన్నప్పుడు, ప్రదర్శించబడిన జాబితా అనేది ఎక్కువ కాలం ఉంటుంది.
05:54 తరువాత, మనం ఒక transaction ను ఎలా void (రద్దు) చేయాలో చూద్దాం.
05:58 Setup టాబ్ పై క్లిక్ చేయండి.

Maintenance ప్యానెల్‌లో, Void a transaction లింక్‌పై క్లిక్ చేయండి.

06:06 ఈ ఎంపిక అనేది ఒక ఎంట్రీని delete/remove (తొలగించడం/తీసివేయడం) చేయడానికి ఉపయోగించబడుతుంది.
06:11 మనము రిఫరెన్స్ నంబర్‌ను చూడవచ్చు, ఇది ఆ entry ని చూపిస్తుంది.
06:15 మనము void transaction చేయడానికి reference 002/2019 ను ఎంచుకుందాం.
06:23 entryను తొలగించే ముందు వివరాలను ధృవీకరించడానికి GL కాలమ్‌లోని ఐకాన్ పై క్లిక్ చేయండి.
06:30 ఆఫీస్ ఫర్నిచర్ మరియు ఎక్విప్మెంట్ ల కోసం 50 వేల రూపాయలకు కొనుగోలు చేసిన వస్తువుల కొరకు మనం ఈ ఎంట్రీని చూడవచ్చు.
06:38 విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Close లింక్ పై క్లిక్ చేయండి.
06:42 ఇప్పుడు, Select కాలమ్‌లోని ఐకాన్ పై క్లిక్ చేయండి.
06:46 ఐకాన్ ని ఎంచుకున్నప్పుడు, transaction సంఖ్య మరియు voiding తేదీ కనిపిస్తుంది.
06:52 Void Transaction బటన్ పై క్లిక్ చేయండి.
06:55 ఇది Are you sure you want to void this transaction? This action cannot be undone అనే ఒక సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
07:03 నేను Proceed బటన్ పై క్లిక్ చేస్తాను.
07:07 వెంటనే ఇలా చెప్తున్నమరొక సందేశం కనిపిస్తుంది:

Selected transaction has been voided.

07:14 అవసరమైనప్పుడు ఈ విధంగా మనం ఒక transaction ను void చేయగలము.
07:19 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది.

సారాంశం చూద్దాం.

07:25 ఈ ట్యుటోరియల్‌లో, మనం నేర్చుకున్నవి

ఒక Journal Entry ను ఎలా పాస్ చేయాలి

07:30 Balance Sheet మరియు Void a transaction లలో ఎలా ప్రతిబింబిస్తుందో చూడటం.
07:35 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.

దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.

07:43 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.

మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.

07:51 దయచేసి మీ సమయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్‌లో పోస్ట్ చేయండి.
07:55 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
08:00 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి నేను మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Simhadriudaya