FrontAccounting-2.4.7/C2/Installation-of-FrontAccounting-on-Windows-OS/Telugu
Time | Narration |
00:01 | విండోస్ OS పై FrontAccounting యొక్క ఇన్స్టాలేషన్ అను స్పోకన్ ట్యుటోరియల్‌కు మీకు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్‌లో, మనం XAMPP ని ఇన్స్టాల్ చేయడం |
00:12 | ఫ్రంట్ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేయడం |
00:15 | డేటాబేస్ సెటప్ ను చేయడం మరియు
విండోస్ OS లో ఫ్రంట్ అకౌంటింగ్ ను ఇన్స్టాల్ చేయడం. |
00:21 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నవి:
విండోస్ OS వర్షన్ 10 |
00:26 | XAMPP 5.5.19 ద్వారా పొందిన Apache, MySQL మరియు PHP |
00:32 | ఫ్రంట్ అకౌంటింగ్ వర్షన్ 2.4.7 |
00:36 | Firefox వెబ్ బ్రౌజర్ మరియు పనిచేస్తున్న ఒక ఇంటర్నెట్ కనెక్షన్. |
00:41 | మీరు మీకు నచ్చిన ఏ ఇతర వెబ్ బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు. |
00:44 | ఫ్రంట్ అకౌంటింగ్ అనేది ఒక సర్వర్ ఆధారిత అకౌంటింగ్ సిస్టమ్ (వ్యవస్థ).
కనుక మనం మన మెషీన్లో వెబ్ సర్వర్ ను సెటప్ చేయడానికి XAMPP ను ఉపయోగిస్తాము. |
00:52 | ఒక వెబ్ బ్రౌజర్ ను తెరవండి.
అడ్రస్ బార్ లో, ఈ URL ను టైప్ చేసి, Enter నొక్కండి. |
00:59 | ఇది మనల్ని XAMPP డౌన్లోడ్ పేజీకి తీసుకెళుతుంది. |
01:03 | ఇక్కడ అన్ని ఆపరేటింగ్ సిస్టమ్‌ల కొరకు డౌన్లోడ్ చేయడానికి XAMPP అందుబాటులో ఉంటుంది. |
01:08 | ఈ ఆకుపచ్చ బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా XAMPP యొక్క లేటెస్ట్ (తాజా) వర్షన్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. |
01:13 | ఏదేమైనా, మీ సాఫ్ట్వేర్ అవసరాన్ని బట్టి, మీకు XAMPP యొక్క వేరే వర్షన్ అవసరం కావచ్చు. |
01:19 | నా విషయంలో నాకు XAMPP వర్షన్ 5.5.19 అవసరం. |
01:24 | XAMPP విండోస్ లింక్ పై క్లిక్ చేయండి. |
01:28 | తిరిగి మళ్లించబడిన పేజీ ఇప్పటి వరకు ఉన్న అన్ని XAMPP వర్షన్ లను ప్రదర్శిస్తుంది. |
01:32 | ఈ ఇన్స్టాలేషన్ కొరకు, నేను 'XAMPP వర్షన్ 5.5.19 ను ఎంచుకుంటాను. |
01:39 | డౌన్ లోడ్ చేయడానికి లింక్ పై క్లిక్ చేయండి. |
01:43 | ఇప్పుడు, Savefile బటన్ పై క్లిక్ చేయండి.
Exe ఫైల్ మన మెషీన్లో డౌన్లోడ్ అవుతుంది. |
01:51 | మీరు ఫైల్‌ను డౌన్లోడ్ చేసిన ఫోల్డర్‌ను తెరవండి. |
01:55 | ఇన్స్టాలేషన్ ను ప్రారంభించడానికి ఫైల్‌పై డబుల్ క్లిక్ చేయండి. |
01:59 | ఒక User Account Control డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
Yes బటన్ పై క్లిక్ చేయండి. |
02:06 | ఒకవేళ మీరు మీ మెషీన్లో ఏదైనా antivirus సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేసి ఉంటే, మీకు మరొక పాపప్ విండో రావొచ్చు.
Yes బటన్ పై క్లిక్ చేయండి. |
02:15 | తరువాతి విండోలో, వార్నింగ్ మెసెజ్ ను విస్మరించడానికి OK బటన్ పై క్లిక్ చేయండి. |
02:21 | ఇప్పుడు Setup wizard డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
02:25 | ప్రాంప్ట్ చేయబడినపుడల్లా Next బటన్ పై క్లిక్ చేసి, చూపిన విధంగా ఇన్స్టాలేషన్ దశలను అనుసరించండి. |
02:31 | Learn more about Bitnami for XAMPP చెక్ బాక్స్ ను అన్ చెక్ చేయండి.
తరువాత Next బటన్ పై క్లిక్ చేయడం ద్వారా కొనసాగించండి. |
02:40 | ఒకసారి ఇన్స్టాలేషన్ పూర్తయిన తర్వాత, want to start the Control Panel now? చెక్ బాక్స్‌ను అన్ చెక్ చేయండి. |
02:47 | చివరగా, Finish బటన్ పై క్లిక్ చేయండి. |
02:51 | ఇప్పుడు మనం మన మెషీన్ లో XAMPP విజయవంతంగా ఇన్స్టాల్ చేయబడిందా లేదా అని తనిఖీ చేయాలి. |
02:56 | స్క్రీన్ యొక్క దిగువ ఎడమ వైపున ఉన్నWindows search bar పై క్లిక్ చేసి, xampp అని టైప్ చేయండి. |
03:02 | మనము సర్చ్ లిస్ట్ లో XAMPP Control Panel ను చూడవచ్చు. |
03:06 | XAMPP Control Panel పై రైట్ క్లిక్ చేసి, Run as administrator ను ఎంచుకోండి. |
03:12 | XAMPP Control Panel లో, Apache మరియు MySQL సర్వీస్ లు రన్ అవుతున్నాయని నిర్ధారించుకోండి. |
03:18 | ఒకవేళ లేకపోతే, సంబంధిత services యొక్క బటన్ పై క్లిక్ చేసి ఈ సర్వీస్ లను ప్రారంభించండి. |
03:24 | మీరు ఇటువంటి కొన్ని ఎర్రర్ మెసేజ్ లను పొందవచ్చు:
Apache shutdown unexpectedly |
03:30 | Port 80 in use for Apache Server |
03:34 | Unable to connect to any of the specified MySQL hosts for MySQL database. |
03:41 | ఇలా జరగటానికి కారణం ఏంటంటే, Apache మరియు MySQL కు కేటాయించిన డిఫాల్ట్ port అనేది మరొక సాఫ్ట్వేర్ ద్వారా తీసుకోబడ్డాయి. |
03:47 | Apache కొరకు port డిఫాల్ట్ నంబర్ అనేది 80 మరియు MySQL కొరకు అది 3306. |
03:55 | ఈ ports ను మార్చడానికి, ఈ ట్యుటోరియల్ యొక్క Additional Reading Material ను చూడండి. |
04:00 | ఇంకా ముందుకు కొనసాగే ముందు సరైన port సంఖ్యలను కేటాయించండి. ఉదాహరణకు: 8080 |
04:07 | ఇప్పుడు, Firefox web browser ను తెరవండి. |
04:11 | address bar లో,localhost అని టైప్ చేసి, Enter ను నొక్కండి.
మనం XAMPP స్క్రీన్ ను చూడగలగాలి. |
04:19 | ఒకవేళ భాషా ఎంపిక కోసం ప్రాంప్ట్ చేయబడితే, English ను ఎంచుకోండి.
ఇప్పు మనం XAMPP homepage లో ఉన్నాము. |
04:27 | మనం FrontAccounting ను డౌన్లోడ్ చేయడం ప్రారంభిద్దాం. |
04:30 | వెబ్ బ్రౌజర్ లో మరొక టాబ్ ను తెరిచి, ఈ URL కి వెళ్ళండి. |
04:37 | frontaccounting-2.4.7.zip పై క్లిక్ చేయండి. |
04:42 | వెంటనే, డౌన్లోడ్ ప్రారంభమవుతుంది.
Save file బటన్ పై క్లిక్ చేసి, ఆపై OK బటన్ పై క్లిక్ చేయండి. |
04:49 | డౌన్లోడ్ పూర్తయిన తర్వాత, మీరు ఫైల్‌ను ఎక్కడ డౌన్లోడ్ చేసారో ఆ ఫోల్డర్‌ను తెరవండి. |
04:54 | నేను డౌన్లోడ్ చేసిన ఫైల్ ఇక్కడ ఉంది. |
04:57 | ఫైల్ పై రైట్ -క్లిక్ చేసి Extract Here ను ఎంచుకోండి. |
05:01 | ఒకసారి ఎక్స్ట్రాక్ట్ అయిన తరువాత, ఎక్స్ట్రాక్ట్ అయిన FrontAccounting ఫోల్డర్ కు నేను account గా పేరు ను మారుస్తాను. |
05:07 | ఫోల్డర్ పేరు ను మార్చడం అనేది ఐచ్ఛికం, అయితే
ఒక మెషీన్ పై ఇన్స్టాల్ చేయబడిన FrontAccounting యొక్క బహుళ సందర్భాలను గుర్తించడానికి ఇది సహాయపడుతుంది. |
05:17 | ఇప్పుడు మనం ఈ account ఫోల్డర్‌ను apache home directory లోకి తరలించాలి. |
05:22 | root directory కొరకు పాత్ అనేది c:\xampp\htdocs |
05:29 | account ఫోల్డర్ పై రైట్ -క్లిక్ చేసి Copy ను ఎంచుకోండి. |
05:33 | ఎడమవైపు పేన్‌లో, This PC పై క్లిక్ చేయండి, దీనిని My Computer అని కూడా పిలుస్తారు. |
05:39 | తరువాత Local Disk (C :) పై డబుల్ క్లిక్ చేయండి, అంటే C drive పైన
ఇంకా xampp మరియు htdocs కు వెళ్ళండి. |
05:47 | Htdocs లోపల, ఖాళీ స్థలంపై రైట్ -క్లిక్ చేసి, Paste ను ఎంచుకోండి. |
05:53 | మనం XAMPP సర్వర్‌ను విజయవంతంగా ఇన్స్టాల్ చేసాము. |
05:57 | FrontAccounting installer అనేది వెబ్ సర్వర్ యొక్క రూట్ డైరక్టరీ లో ఉందని నిర్ధారించుకోండి. |
06:02 | తరువాత ముందుకు కోనసాగడానికి మనం FrontAccounting కొరకు ఒక database ను సృష్టించాలి. |
06:07 | మనము దీన్ని phpmyadmin లో చేస్తాము, ఇది MySQL కొరకు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్.
ఇది XAMPP ఇన్స్టాలేషన్ తో పాటు వస్తుంది. |
06:17 | మనం వెబ్ బ్రౌజర్ లోని XAMPP పేజీకి తిరిగి వెళ్దాం. |
06:21 | XAMPP పేజీపై, ఎడమ వైపున ఉన్న మెనులో, phpMyadmin పై క్లిక్ చేయండి. |
06:27 | ఎగువ భాగంలో మెనూలోని Users పై క్లిక్ చేసి, ఆపై Add User పై క్లిక్ చేయండి. |
06:33 | తెరుచుకున్న క్రొత్త విండోలో మీకు నచ్చిన ఒక username ను ఎంటర్ చేయండి.
నేను నా username గా frontacc ను టైప్ చేస్తాను. |
06:42 | Host డ్రాప్-డౌన్ జాబితా నుండి, Local ను ఎంచుకోండి. |
06:46 | పాస్వర్డ్ టెక్స్ట్-బాక్స్‌లో మీకు నచ్చిన పాస్వర్డ్ ను ఎంటర్ చేయండి. |
06:50 | నేను నా పాస్ వర్డ్ గా admin123 ను టైప్ చేస్తాను. |
06:54 | Re-type టెక్స్ట్ బాక్స్ లో అదే పాస్ వర్డ్ ను టైప్ చేయండి. |
06:58 | ప్రస్తుతానికి Generate Password prompt పై క్లిక్ చేయవద్దు. |
07:02 | Database for user account క్రింద, మనం ఈ ఎంపికను చూడవచ్చు.
Create database with the same name and grant all privileges. |
07:10 | మనము ఆ ఎంపికను తనిఖీ చేసి స్క్రోల్ చేస్తాము. |
07:14 | తరివాత పేజీ యొక్క కుడి దిగువ కుడి వైపున ఉన్నGo బటన్ ను క్లిక్ చేయండి. |
07:18 | మనం You have added a new user అనే ఒక సందేశాన్ని చూస్తాము. |
07:22 | frontacc అనే పేరుతో మరియు ఒక user frontacc తో ఒక కొత్త database సృష్టించబడింది అని దీని అర్థం. |
07:29 | ఈ username మరియు password అనేవి డేటాబేస్ లాగిన్ ప్రయోజనం కొరకు మాత్రమే. |
07:34 | ఈ username, password మరియు database పేర్లను రాసిపెట్టుకోండి. |
07:38 | FrontAccounting ఇన్‌స్టాలేషన్‌ను పూర్తి చేయడానికి ఇవి తరువాత అవసరం అవుతాయి. |
07:43 | Database పేరు మరియు username ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు.
వేర్వేరు పేర్లను కలిగి ఉండటానికి, మొదట డేటాబేస్ ను సృష్టించండి, ఆపై ఆ డేటాబేస్ కోసం ఒక యూజర్ ను సృష్టించండి. |
07:53 | అలాగే, పేరును పెట్టే పద్దతి ప్రకారం, username అనేది మధ్యలో ఎటువంటి ఖాళీలను కలిగి ఉండకూడదు. |
07:59 | ఇప్పుడు మనకు రన్ అవుతున్న XAMPP ఉంది ఇంకా మన డేటాబేస్ సిద్ధంగా ఉంది. |
08:02 | ఇప్పుడు మనం Front Accounting ను ఇన్స్టాల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. |
08:07 | web browser లో ఒక కొత్త ట్యాబ్ ను తెరవండి.
అడ్రస్ బార్ లో localhost/account అని టైప్ చేసి Enter నొక్కండి. |
08:17 | Step 1: System Diagnostics అని చూపించే FrontAccounting వెబ్ పేజీని మనం చూడవచ్చు |
08:22 | Select install wizard language అనేది English అని నిర్ధారించుకోండి. |
08:26 | స్క్రోల్ చేసి పేజీ యొక్క దిగువభాగం వద్ద ఉన్న Continue బటన్ పై క్లిక్ చేయండి. |
08:31 | తదుపరి వెబ్ పేజీ యొక్క శీర్షిక అనేది Step 2: Database Server Settings |
08:37 | ఇక్కడ నేనుServer Host ను లోకల్ హోస్ట్‌గా ఉంచుతాను
నేను server port ను ఖాళీగా ఉంచుతాను. |
08:44 | ఒకవేళ మీరు MySQL డిఫాల్ట్ port సంఖ్యను 3306 కాకుండా మార్చినట్లయితే, అప్పుడు ఆ port సంఖ్యను ఇక్కడ ఎంటర్ చేయండి. |
08:52 | మనము ఇంతకుముందు సృష్టించిన కింది వివరాలను ఎంటర్ చేయండి
database Name ను frontacc గా |
09:00 | database user ను frontacc గా |
09:03 | database password ను admin123 గా |
09:07 | మిగిలిన ఎంపికలను విస్మరించి, దిగువభాగం వద్ద ఉన్న Continue బటన్ పై క్లిక్ చేయండి. |
09:12 | తరువాత, మీరు మీ స్వంత కంపెనీ వివరాలను ఉంచాలి.
అది ఎలా చేయాలో నేను ప్రదర్శిస్తాను. |
09:19 | Company Name ఫీల్డ్ లో, నేను ST Company Pvt Ltd అని టైప్ చేస్తాను |
09:24 | నేను Admin Login ను admin గా ఉంచుతాను.
తరువాత నేను Admin password గా spoken ను టైప్ చేస్తాను. |
09:31 | మీరు మీకు నచ్చిన ఏ పాస్ వర్డ్ ని అయినా ఇవ్వవచ్చు. |
09:34 | అదే పాస్వర్డ్ ను మళ్ళీ ఎంటర్ చేయండి.
ఇది లాగిన్ పాస్వర్డ్ అని గుర్తుంచుకోండి. |
09:40 | తరువాత మనం Charts of Accounts కొరకు రెండు ఎంపికలను చూస్తాము. |
09:44 | నేను Standard new company American COA ను ఎంచుకుంటాను. |
09:49 | Default Language గా English ను ఎంచుకోండి. |
09:52 | Install బటన్ పై క్లిక్ చేయండి. |
09:55 | మనం మన స్క్రీన్ పైన FrontAccounting ERP విజయవంతంగా ఇన్స్టాల్ చేయబడింది అనే చివరి సందేశాన్ని చూడవచ్చు.
ఇది మన ఇన్స్టాలేషన్ విజయవంతమైందని నిర్ధారిస్తుంది. |
10:06 | ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్కు లాగిన్ అవ్వడానికి Click here to start లింక్ పై క్లిక్ చేయండి. |
10:12 | లాగిన్ స్క్రీన్‌లో, కింది వివరాలను ఎంటర్ చేయండి:
User name గా admin Password గా spoken |
10:22 | Company గా ST Company Pvt. Ltd.
Login బటన్ పై క్లిక్ చేయండి. |
10:28 | మనం Front Accounting Administration పేజీకి తీసుకెళ్ళబడతాము.
|
10:32 | ఈ పేజీలో మనం వివిధ ట్యాబ్‌లను చూడవచ్చు.
వీటిల్లో చాలావాటిని ఎలా ఉపయోగించాలి అనేది ఈ సిరీస్‌లో తరువాత మనం నేర్చుకుంటాము. |
10:39 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది.
సారాంశం చూద్దాం. |
10:44 | ఈ ట్యుటోరియల్‌లో, మనం నేర్చుకున్నవి XAMPP ను డౌన్లోడ్ చేసి, ఇన్స్టాల్ చేయడం. |
10:50 | FrontAccounting సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేసి, ఇన్స్టాల్ చేయడం. |
10:53 | Windows 10 OS లో database setup ను చేయడం. |
10:57 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.
దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
11:05 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.
మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
11:13 | ఈ స్పోకెన్ ట్యుటోరియల్‌లో మీకు ఏవైనా సందేహాలు ఉన్నాయా?
దయచేసి ఈ సైట్‌ను సందర్శించండి. |
11:18 | మీకు ఎక్కడ సందేహం ఉందో ఆ నిమిషం మరియు క్షణాన్ని ఎంచుకోండి
మీ ప్రశ్నను క్లుప్తంగా వివరించండి మా టీం లోని వారు ఎవరైనా వాటికి సమాధానాలు ఇస్తారు. |
11:27 | ఈ ట్యుటోరియల్ పై నిర్దిష్ట ప్రశ్నల కొరకు స్పోకన్ ట్యుటోరియల్ ఫోరమ్ |
11:32 | దయచేసి వాటిపై సంబంధంలేని మరియు సాధారణ ప్రశ్నలను పోస్ట్ చేయవద్దు.
ఇది అనవసరమైన వాటిని తగ్గించడానికి సహాయపడుతుంది. |
11:39 | తక్కువ అయోమయంతో, మనం ఈ చర్చను బోధనా సమాచారంగా ఉపయోగించవచ్చు. |
11:44 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. |
11:49 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి నేను మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. |