Drupal/C3/People-Management/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 ద్రుపల్ పీపుల్ మానేజ్మెంట్ పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది- పీపుల్ మానేజ్మెంట్ మరియు నిర్దిష్ట విధి-ఆధారిత పాత్రలని సెట్ చేయుట.
00:14 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను వాడుతున్నావి- ఉబుంటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, దృపల్ 8 మరియు ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్. మీరు ఏ వెబ్ బ్రౌజర్ నైనా ఉపయోగించవచ్చు.
00:29 పీపుల్ మానేజ్మెంట్ గూర్చి నేర్చుకుందాం.
00:31 నేను ZIRCON థీమ్ కి తిరిగి వెళ్ళాను, మనము ఈ ట్యుటోరియల్ యొక్క చివరి వరకు ఈ థీమ్ ని ఉంచుదాం.
00:39 పీపుల్ మానేజ్మెంట్ చాలా ముఖ్యమైనది.
00:42 నిజానికి దీనిని సరి చేయుట చాలా సంక్లిష్టమైనది.
00:46 దానిని ఒకే సారి సరిగ్గా చెయ్యాలి.
00:50 People పై క్లిక్ చేయండి.
00:53 ద్రుపల్ లో పీపుల్ కి అనుమతులు ఉన్న పత్రాలు ఇవ్వబడినవి.
00:58 పర్మిషన్ స్ట్రక్చర్ ద్వారా ద్రుపల్ మనకు, వ్యక్తులు ఏమి చూడ గలరు మరియు ఏమి చేయగలరు అనేది నియంత్రించుటకు అనుమతిస్తుంది.
01:06 ఇక్కడ కొన్ని విషయాలు జ్ఞపకం పెట్టుకోవడం చాలా అవసరం.
01:10 మీరు యూసర్ నంబర్ వన్ అనగా సూపర్ యూసర్ అని గుర్తుంచుకోండి.
01:15 మీ అనుమతులను ఎవ్వరు మార్చలేరు.
01:18 మీ క్రింద ఒక యూసర్ అనగా ఆడ్మినిస్ట్రేటర్ ఉన్నారు.
01:23 నిర్వాహకులకు సాధారణంగా మొత్తం సైట్ నిర్వహించడానికి అనుమతులు ఇవ్వబడతాయి.
01:29 అయినప్పటికీ వారు యూసర్ నంబర్ వన్ కన్న ఎక్కువ కారు.
01:33 Authenticated Users, అనగా కొన్ని హక్కుల తో మాత్రమే లాగ్ ఇన్ చేసినవారు.
01:39 చివరిగా Anonymous Users లాగిన్ చెయ్యని సందర్శకులు.
01:45 సాధారణంగా, Anonymous Users కేవలం అసురక్షితమైన కంటెంట్ను వీక్షించడం తప్ప వేరే ఏమీ చేయలేరు.
01:53 గుర్తుంచుకోనుటకు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, సైట్ పై నిర్దిష్ట మైన టాస్క్ ల కోసం రోల్స్ని సెట్ చేయుట.
02:01 మన వద్ద ఒక వేసవి ఇంటర్న్ ఉన్నారు ఎవరికైతే ఇవెంట్ల అప్డేట్ అనుమతిఉంది కానీ ఆర్టికల్లు, పేజీ లు లేదా యూసర్ గ్రూప్ లను మార్చేఅనుమతి లేదనుకుందాం.
02:11 ఈ వేసవి ఇంటర్న్ కి అతని/ఆమె సొంత రోల్ అవసరం అయితే మీరు దానికి పర్మిషన్ లు నిర్వహించగలరు.
02:19 దానిని త్వరలో ఏర్పాటు చేద్దాం.
02:22 Permissions ట్యాబ్ పై క్లిక్ చేయండి.
02:26 నెమ్మదిగా క్రిందికి స్క్రోల్ చేసి అందుబాటులో ఉన్న దానిని చూడండి.
02:30 జాబిత చాల పొడువు అవుతుంది మరియు పెరుగుతూనే ఉంటుంది- మనము జోడించే ప్రతి కంటెంట్ టైప్ కోసం, చేర్చే ప్రతి మాడ్యూల్ కోసం మరియు
02:39 నిర్మించే ప్రతి వ్యూ కోసం.
02:42 ద్రుపల్ లో పీపుల్ మానేజ్మెంట్ అంటే, వ్యక్తులు ఏమి చేయగలరు.
02:46 తదుపరి ఒక కొత్త రోల్ ని చేర్చి దానికి కొన్ని అనుమతులు ఇచ్చి, దాన్ని పరీక్షిద్దాం.
02:52 Roles పై క్లిక్ చేయండి.
02:54 Summer Intern అనే ఒక కొత్త రోల్ ని జోడిద్దాం.
02:59 ఎప్పటిలాగే ద్రుపల్ దానికి ఒక మెషిన్ పేరు ఇస్తుంది.
03:03 సేవ్ క్లిక్ చేయండి.
03:05 మన వద్ద ఒక కొత్త రోల్ Summer Intern ఉంది, దేనికైతే ఇంకా ఏ అనుమతులు లేవు.
03:12 నాకు నా రోల్స్ యొక్క సామర్థ్యం లేదా అనుమతులు క్రమంలో తరలించడం ఇష్టం.
03:17 ఇది నాకు కేవలం ఒక తార్కిక క్రమంలో roles చూడటానికి సహాయపడుతుంది - అనగా ఎవ్వరికి ఏమి అనుమతులు ఉన్నాయో.
03:24 Save order క్లిక్ చేయండి.
03:27 మనం కొత్త రోల్ కి కొన్ని అనుమతులు ఇవ్వాల్సి ఉంది.
03:31 Permissions ట్యాబ్ పై క్లిక్ చేయండి.
03:34 ఈ పేజీ ప్రతి ఒక్కరి అనుమతుల యొక్క పర్యావలోకనం.
03:39 Roles ట్యాబ్ పై క్లిక్ చేసి ఒక క్షణం కోసం వెన్నకి వెళ్దాం.
03:44 Summer Intern క్లిక్ చేసి Edit permissions ఎంచుకోండి.
03:51 మనము వేసవి ఇంటర్న్ కోసం ఇచ్చిన అనుమతులు చూద్దాం, అది కొంచం సులభంగా ఉంది.
03:58 క్రిందికి స్క్రోల్ చేసి ఇవెంట్స్ అనబడే Content type టైప్ ని గుర్తించండి- అది సగం దూరం లో ఉంది.
04:06 ఇక్కడ, వేసవి ఇంటర్న్ ఈ పనులను చెయ్యవచ్చు- కొత్త ఈవెంట్స్ సృష్టించవచ్చు, సొంత ఇవెంట్ లను మాత్రమే తొలగించవచ్చు మరియు సొంత ఈవెంట్స్ ని మాత్రమే సవరించవచ్చు.
04:18 మనం వేసవి ఇంటర్న్ కు దేనికి అనుమతి ఇవ్వకూడదు- ఇతరుల కంటెంట్ని తొలగించుట, రివిజన్ లను తొలగించుట.

వారు సృష్టించని ఏ ఇతర ఇవెంట్ లను సవరించుట.

04:30 మరియు వారికీ ఒక ఇవెంట్ యొక్క పాత వర్షన్ కి రెవెర్ట్ చేసే అనుమతి కూడా ఇవ్వలేము.
04:37 మన ఎడిటర్ లకు మాత్రమే ఆ ప్రత్యేక అనుమతులు ఇవ్వాలి.
04:41 ఇది చాలా పరిమిత పాత్ర.
04:44 క్రిందకి స్క్రోల్ చేసి పేజీ దిగువన Save permissions క్లిక్ చేయండి.
04:50 మీరు మళ్ళి గమనించండి, వారు వ్యూస్ ని ఎడిట్ చేయలేరు.
04:54 వారు పుస్తకాలను సవరించ లేరు, ఇతరుల ఆమోదం లేకుంటే వారు కామెంట్ లను కుడా పోస్ట్ చెయ్యలేరు.
04:58 అయితే ఇది చాలా పరిమితమైన రోల్. మూడవ సోపానం ఒక వ్యక్తి ని జోడించుట.
05:06 మనము రోల్స్ ని సెట్ చేసి పెర్మిషన్ లను జోడించాము.
05:11 ఒక యూసర్ ని జోడిద్దాం. ఇక్కడ ఒక నకిలీ ఇమెయిల్ చిరునామా ఇవ్వవచ్చు.
05:18 అది చెల్లుబాటు అయ్యే ఫార్మట్ లో ఉంటె సరిపోతుంది.
05:22 ఉదాహరణకు intern@email.com కావచ్చు, ఎందుకంటే నిజానికి మనము వారికీ ఇమెయిల్ పంపడం లేదు.
05:31 యూసర్ నేమ్ లో శ్యామ్ టైప్ చేసి పాస్వర్డ్ ని కూడా శ్యాం టైప్ చేద్దాం.
05:38 అది ఒక అసురక్షితమైన పాస్వర్డ్, కానీ దానిని ఇప్పటికి స్థానిక మెషిన్ పై వాడుకోవచ్చు.
05:47 మనము స్టేటస్ ని ఆక్టివ్ కి మార్చవచ్చు.
05:51 అతనికి వేసవి ఇంటర్న్ పాత్ర ఉండాలి.
05:53 కావలిస్తే ఒక చిత్రాన్ని కూడా ఇక్కడ చేర్చవచ్చు.
05:56 ఇప్పటికి Personal contact formని టర్న్ ఆఫ్ చేద్దాం, ఎందుకంటే వేసవి ఇంటర్న్ లను సాంప్రదించే అవసరం లేదు.
06:06 చివరిగా Create new account క్లిక్ చేయండి.
06:10 సక్సెస్ సందేశం తో శ్యాం కు ఒక అకౌంట్ తెరువబడిందని తెలుస్తుంది మరియు ఏ ఇమెయిల్ పాపబడలేదు.
06:17 మన యూసర్ జాబిత పై శ్యాంని చూడవచ్చు.
06:21 ఇలా కొత్త యూసర్ లను మనము సెట్ చేస్తే, ఒక ముఖ్యమైన విషయం దానిని పరీక్షించడం.
06:29 దానిని పరీక్షించుటకు శ్యాంలా లాగ్ ఇన్ మరియు లాగ్ అవుట్ చేద్దాం.
06:33 అయితే సమస్య ఏంటంటే శ్యాం ఒక నిజమైన యూజర్ అయివుంటే మరియు అతను తన పాస్వర్డ్ను మార్చుటకు నిర్ణయించుకుంటే ఏమవుతుంది.
06:41 మనము కేవలం ఖాతాలను పరీక్షించుటకు ఇతరుల పాస్వర్డ్ లను యాదృచ్చికంగా మార్చలేము.అది సమంజసం కాదు.
06:49 ఒక అద్భుతమైన మాడ్యూల్ drupal.org/project/masquerade వద్ద ఉంది.
06:55 Masquerade module మనకు అది చెప్పినట్టే చేయుటకు అనుమతిస్తుంది మాస్క్వెరేడ్ అనగా వేరే వారిల నటించుట.
07:03 మనము వేసవి ఇంటర్న్లా మాస్క్వెరేడ్ చేసి వారి అనుమతులు సరిగ్గా సెట్ చేశామో లేదో అనేది తనిఖీ చేయవచ్చు.
07:10 నేను నా మెషిన్ పై Masquerade moduleని ఇన్స్టాల్ చేసి ఉంచాను.
07:14 దయచేసి మీ మెషిన్ పై దానిని ఇన్స్టాల్ చేయండి.
07:18 కొత్త మాడ్యూల్స్ ని ఇన్స్టాల్ చేయుట కు Adding functionalities using Modules అనే ట్యుటోరియల్ ని చూడండి.
07:26 మీ సౌకర్యం కోసం Masquerade module ఈ ట్యుటోరియల్ వెబ్ పేజీ యొక్క కోడ్ ఫైల్స్ లింక్ లో ఇవ్వబడింది.
07:34 దయచేసి డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేయండి.
07:37 ఇన్స్టాల్ అయినా తర్వాత మీరు Unmasquerade అనే ఒక కొత్త లింక్ని లాగిన్ ప్రాంతం లో చూస్తారు.
07:43 Masquerade ని వాడుటకు పీపుల్ పేజీ కి వెళ్ళండి.
07:48 యూసర్ శ్యాం యొక్క ఎడిట్ డ్రాప్ డౌన్ పై క్లిక్ చేసి Masquerade as ఎంచుకోండి.
07:55 మనము శ్యాం లా Masquerade అవ్వగానే టూల్ బార్ లు కనిపించకుండా పోతాయని గమనించండి.
08:01 ఎందుకంటే యూసర్ శ్యాం కు ఇచ్చిన అనుమతుల ప్రకారం తను అడ్మినిస్ట్రేటర్ టూల్ బార్ లను వాడలేడు.
08:08 యాడ్ కంటెంట్ పై క్లిక్ చేస్తే మనము ఒక్క ఇవెంట్ ని మాత్రమే సృష్టించగలం, ఇంతవరకు అంతా బాగనే ఉంది.
08:17 ఒక వేళా Our Drupal Manual పై క్లిక్ చేసి ఆ పై Installing Drupal పై క్లిక్ చేస్తే మనం సవరించలేము.
08:23 అక్కడ ట్యాబ్లు లేవు.
08:25 ఫోరమ్ లకు వెళ్తే కూడా అలానే ఉంటుంది.
08:29 మళ్ళి మనము ఎడిట్ చేయలేము.
08:32 మనం ఒక కామెంట్ ని మాత్రమే ఇవ్వగలం కానీ అది స్వయం చాలకంగా ఆమోదించబడదు.
08:38 మళ్ళీ ఇవెంట్ పై క్లిక్ చేస్తే, దానిని సవరించుట లేదా తొలగించుట చేయలేము.
08:45 మన అనుమతులు సరిగ్గానే ఉన్నాయనిపిస్తుంది.
08:47 ఇప్పుడు Unmasquerade లింక్ పై క్లిక్ చేసి అడ్మిస్ట్రేటర్ రోల్ కి తిరిగి వెళ్ళండి.
08:54 ఇంతటితో ఈ టుటోరియల్ చివరికి వచ్చాం.
08:57 సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది, పీపుల్ మానేజ్మెంట్ మరియు కొత్త యూసర్ ని జోడించుట.
09:15 ఈ వీడియో ను Acquia మరియు OS Training నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే వీరు సవరించారు.
09:25 ఈ లింక్ లో ఉన్న వీడియొ స్పోకన్ టూటోరియల్ ప్రొజెక్ట్ సారాంశం.
09:29 దీనిని డౌన్ లోడ్ చేసి చూడగలరు.
09:32 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట టీమ్ వర్క్ షాప్లను నిర్వహిచి సర్టిఫికేట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు మమల్ని సంప్రదించగలరు.
09:40 స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది.
09:52 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి. మాతో చేరినందుకు ధన్యవాదములు

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya