Drupal/C2/Creating-New-Content-Types/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | క్రియేటింగ్ న్యూ కంటెంట్ టైప్ పై ఈ స్పోకన్ టుటోరియల్ కి స్వాగతం. |
00:06 | ఈ టుటోరియల్ లో మనం నేర్చుకునే విషయాలు- కొత్త కంటెంట్ రకాలను శ్రుష్టించుట మరియు కంటెంట్ రకాలకు ఫీల్డ్ లను చేర్చుట. |
00:15 | ఈ టుటోరియల్ రికార్డు చేయుటకు, ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ ద్రుపల్ 8 మరియు ఫయర్ ఫాక్స్ వెబ్ బ్రౌసర్ వాడుతున్నాను. మీరు ఏ బ్రౌసర్ నైనా ఉపయోగించవచ్చు. |
00:29 | మనము ముందుగానే తయారు చేసిన వెబ్ సైట్లను తెరుద్దాం. |
00:34 | బిల్ట్ ఇన్ కంటెంట్ రకాల గురించి తెలుసు గనక కొన్ని కస్టమ్ కంటెంట్ టైప్ లని సృష్టిద్దాం. |
00:41 | కంటెంట్ టైప్ పరిచయాన్ని గుర్తుతెచ్చుకోండి. |
00:45 | మొత్తం అన్నిటిని బాడీ లో నింపవద్దని నేర్చుకున్నాం. |
00:49 | మనం కస్టమ్ కంటెంట్ టైప్ ను ఎలా సృష్టిటించాలో నేర్చుకుందాం. |
00:55 | ప్రపంచ వ్యాప్తంగా అన్ని ద్రుపల్ ఈవెంట్ లను ట్ర్యాక్ చేసే ఒక ఈవెంట్స్ కంటెంట్ టైప్ ని సృష్టిద్దాం. |
01:02 | ముందుగా, ఈ కంటెంట్ టైప్ కోసం ఏ ఫీల్డ్ లు కావాలో వాటి రూపకల్పన ఒక కాయితం పై గీద్దాం . |
01:09 | దృపల్ లో కొత్త కంటెంట్ టైప్ సృష్టించే సమయంలో ఇలా చేయడం చాలా మంచి అలవాటు. |
01:16 | ఫీల్డ్ పేరు, ఫీల్డ్ రకం మరియు పర్పస్ కాలామ్ లో వచ్చేతట్టు ఒక టేబల్ సృష్టించండి. |
01:23 | అన్ని దృపల్ నోడ్ లకు అప్రమేయంగా టైటాల్ మరియు బాడీ ఫీల్డ్ లు నిర్వచించ బడుతాయి. |
01:29 | ఈవెంట్ ను ప్రత్యేకంగా గుర్తించేందుకు ఈవెంట్ పేరే టైటల్ కావచ్చు. |
01:36 | ఈవెంట్ వివరణ బాడీ ఫీల్డ్ లో కొంత సాదా టెక్స్ట్ వివరణ అందించడానికి ఉంటుంది. |
01:43 | ఈవెంట్ లోగో ఒక ఇమేజ్, ఇది ఈవెంట్ యొక్క విశేష లోగోని ప్రదర్శిస్తుంది. |
01:50 | ఈవెంట్ ప్రారంభం మరియు ముగింపు తేదీని సంగ్రహించేదుకు, డేట్ రకం యొక్క ఈవెంట్ డేట్ కావాలి. |
01:58 | ఇది కంటెంట్ టైప్ లో యూఆర్ఎల్ లింక్ లా కనిపిచే ఒక ప్రత్యేక ఈవెంట్ వెబ్ సైట్ ఐయిఉండవచ్చు. |
02:07 | ఈ ఐదు ఫీల్డ్ లను మాత్రమే ఈ టుటోరియల్ లో చూద్దాం. ఇంకా రెండు ఫీల్డ్ లను చేర్చడం తర్వాత నేర్చుకుందాం. |
02:17 | ప్రతి ఈవెంట్ని ఒక యూసర్ గ్రూప్ ప్రాయోజిస్తుంది. యుసార్ గ్రూప్ మరొక్క కంటెంట్ టైప్, దానిని తరువాత టుటోరియల్లో సృష్టిద్దాం. |
02:27 | ఎంటిటీ రెఫరెన్స్ ఫీల్డ్ ఉపయోగించి దృపల్ లో రెండు వేరే కంటెంట్ టైప్ ల నోడ్ లను లింక్ చేస్తుంది. |
02:35 | ఈవెంట్ టాపిక్ ఒక ట్యాక్సానమి ఫీల్డ్, దానిని విభిన్నమైన కీలక పదాల అనుసారంగా వర్గీకరించేదుకు ఉపయోగిస్తాము. |
02:44 | ఇప్పుడు, స్ట్రక్చర్ పై క్లిక్ చేసి కంటెంట్ టైప్ పై క్లిక్ చేద్దాం. |
02:50 | ఇవి మన రెండు బేసిక్ కంటెంట్ రకాలు. |
02:53 | నీలం రంగు యాడ్ కంటెంట్ టైప్ బటన్ పై క్లిక్ చేయండి. |
02:57 | మన కొత్త కంటెంట్ రకాన్ని ఈవెంట్ అని పిలుద్దాం. |
03:02 | మరియు వివరణ లో "దిస్ ఇస్ వేర్ వి ట్ర్యక్ ఆల్ దృపల్ ఈవెంట్ ఫ్రమ్ అరౌండ్ ద వరల్డ్" అని టైప్ చేద్దాం. |
03:11 | ఇక్కడ మీరు ఏమైనా టైప్ చేయగలరు. |
03:15 | ఈ వివరణ కంటెంట్ టైప్ పేజీ పై కనిపిస్తుంది. |
03:20 | దీనికి దృపల్ ఒక మషిన్ పేరుని(యాంత్రిక పేరు) ఇచ్చిందని గమనించండి. ఇక్కడ ఈవెంట్స్ అనే పేరు కనిపిస్తుంది. |
03:28 | మెషిన్ పేరు ప్రధానంగా డేటాబేస్ లోని టేబుల్ పేరు దేనికైతే ద్రుపల్ కంటెంట్ని కేటాయిస్తుంది. |
03:36 | సబ్మిషన్ ఫార్మ్ సెట్టింగ్స్ లో టైటల్ పదాన్ని ఈవెంట్ నేమ్ తో మార్చండి. |
03:43 | పబ్లిషింగ్ అప్షన్స్ పై క్రియేట్ న్యూ రివిషన్కి చెక్ గుర్తు వేద్దామ్. |
03:49 | అంటే ప్రతి సారి ఒక నోడ్ని ఎడిట్ చేసినప్పుడు కొత్త వర్షన్ సృష్టింపబడుతుంది. |
03:55 | మిగతా సెట్టింగ్ లను అలాగే వదిలేద్దాం. డిస్ప్లే ఆథర్ అండ్ డేట్ ఇన్ఫర్మేషన్ ని ఆఫ్ చేద్దాం. |
04:02 | దీనికి అది అవసరం లేదు. ప్రతి కంటెంట్ టైప్ కి ఏదైనా సిఫారసు చేసేది క్రింద చప్పబడినది. |
04:09 | మెను సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. అవైలబల్ మెనుల కింద, చెక్ చేయబడిన అన్ని మెనుల చెక్ గుర్తు లను తొలగించండి. |
04:17 | ఇందువల్ల మన స్ట్రక్చర్ మెను కి కంటెంట్ ఎడిటర్ నుండి వేల్ల కొద్ది ఈవెంట్లు జోడించకుండా నిరోధిస్తుంది. |
04:24 | వేరే యూసర్లకు మన మెను ఐటంలలో ఈవెంట్ చేర్చే అనుమతి ఉండకుండా ఖచ్చిత పరుస్తుంది. |
04:31 | ఈవెంట్ చేర్చాలంటే తరువాత మ్యానువల్ గా మనమే జోడించవచ్చు. |
04:37 | సేవ్ అండ్ మ్యానేజ్ ఫీల్డ్స్ పై క్లిక్ చేయండి. |
04:40 | ఒక్క సారి ఈవెంట్స్ కంటెంట్ టైప్ సేవ్ అవ్వగానే బాడీ ఫీల్డ్ కనిప్సితుంది. |
04:45 | కుడి వైపున్న ఎడిట్ పై క్లిక్ చేసి లేబల్ ని ఈవెంట్ డిస్క్రిప్షన్ తో మార్చండి. |
04:55 | క్రింద ఉన్న సేవ్ సెట్టింగ్స్ బటన్ పై క్లిక్ చేయండి. |
04:59 | దృపల్ లో మన మొదటి కస్టమ్ కంటెంట్ టైప్ సృష్టిoచాము. |
05:04 | ఇది ప్రస్తుతం చాలా సీమితంగా ఉంది. టైటల్ మరియు బాడీతో ఒక బేసిక్ పేజీ లాగే ఉంటుంది. |
05:13 | తరువాత, మన కాయితంలో చేసిన డిసైన్ బట్టి మరిన్ని ఫీల్డ్ లను చేర్చి ఇంకా అనుకూలంగా చేయవచ్చు. |
05:23 | పైన ఉన్న యాడ్ ఫీల్డ్ బటన్ పై క్లిక్ చేయండి. |
05:27 | సెలెక్ట్ ఏ ఫీల్డ్ టైప్ డ్రాప్ డౌన్ లో ఇమేజ్ ఎంపిక చేసుకొండి. లేబల్ ఫీల్డ్ లో ఈవెంట్ లోగో టైప్ చేయండి. |
05:36 | సేవ్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేయండి. |
05:39 | కావాలంటే, చూజ్ ఫైల్ బటన్ పై క్లిక్ చేసి ఇక్కడ డీఫాల్ట్ ఇమేజ్ ని అప్ లోడ్ చేయగలరు. |
05:48 | ఇక్కడ డీఫాల్ట్ ప్రత్యమ్న్యాయ టెక్స్ట్ అనగా ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ని కూడా చేర్చవచ్చు. |
05:54 | ప్రతి ఈవెంట్ కు ఒక లోగో ను పరిమితం చేద్దాం. సేవ్ ఫీల్డ్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. |
06:02 | ఇప్పుడు,ఈవెంట్ లోగో ఫీల్డ్ కోసం అన్ని సెట్టింగ్లు ఏర్పాటు చేసే అవకాశం కలుగుతుంది. |
06:07 | ఇవి చాలావరకు సందర్భానుసారంగా మరియు ఫీల్డ్ టైప్ పై ఆధారపడి ఉంటాయి. |
06:11 | ఇక్కడ మన కంటెంట్ ఎడిటర్కు కొంచం సహాయ టెక్స్ట్ లేదా సూచనలను చేర్చవచ్చు. |
06:18 | మనకు కావల్సిన ఫీల్డ్ చెక్ బాక్స్ లో గుర్తు చేయవచ్చు, అంటే గుర్తు చేసిన కంటెంట్ ఐటం లేదా నోడ్ కి ఈవెంట్ లోగో చేర్చేవరకు సేవ్ చేయలేము అని అర్థం. |
06:30 | ఇక్కడ అనుమతి ఉన్న ఫైల్ ఎక్స్టెంషన్లను మార్చవచ్చు. ఇచ్చట బిట్ మ్యాప్ చేర్చవద్దని సిఫారస్సు చేయబడినది. |
06:38 | అప్రమేయంగా ఈ ఫైల్ డైరెక్టరీలో సంవత్సరం మరియు మాసం నింపి ఉంది. ఐతే దీనిని మనం కావాలంటే మార్చవచ్చు. |
06:47 | ఉదాహరణకు ఇమేజ్ల తోపాటు చాలా కంటెంట్ టైప్ లు ఉండవచ్చు. |
06:53 | మీరు ఒక ఈవెంట్ కంటెంట్ టైప్ యొక్క అన్ని ఇమేజ్ లు ఒకే డైరెక్టరీ లో ఉండేట్టు ఒక ఈవెంట్ ప్రిఫిక్స్ ని చేర్చవచ్చు. |
07:04 | ద్రుపల్ దానికి ఏ పేరు నైనా ఇవ్వడానికి అనుమతిస్తుంది ఐతే జాగ్రతగా ఉండాలి, ఎందుకంటే తరువాత మార్చడం సులభం కాదు. |
07:14 | మనం గరిష్ట మరియు కనిష్ట ఇమేజ్ రేసల్యూషన్ మరియు గరిష్ట అప్ లోడ్ సైజు కూడా సెట్ చేయవచ్చు. |
07:21 | ఇక్కడ మార్పులు చేసే ముందు బాగా ఆలోచించి చేయాలి. 2 లేదా 3 మెగా పిక్సెల్ ఇమేజ్ ని అప్ లోడ్ చేశారనుకోండి. |
07:28 | మి wysiwyg ఎడిటర్ ఉపయోగించి కొన్ని వందల పిక్సెల్స్ వరకు కుదించగలరు. |
07:35 | దృపల్ ఇప్పటికీ 2 మెగా పిక్సెల్ ఇమేజ్ ని లోడ్ చేస్తుంది. ఐతే అది విసుగు పుట్టిస్తుంది. |
07:41 | మొబైల్ పై ఉపయోగిస్తుంటే ఇంకా చికాకుగా ఉంటుంది. మరియు డాటా ప్లాన్ పై, అవసరం లేకుండా 2 ఎంబి డోన్ లోడ్ చేయిస్తారు. |
07:51 | మన ఇమేజ్ సరిగ్గా సెట్ అయిన తరువాతే అప్ లోడ్ చేయాలి. |
07:57 | గరిష్ట ఇమేజ్ పరిమాణం ఎంతుండాలి? మరియు కనిష్ట ఇమేజ్ పరిమాణం ఎంతుండాలి? అనే ముందే సూచించాలి. |
08:03 | కనిష్ట ఇమేజ్ స్పష్టత చాలా ముఖ్యం. |
08:08 | ఈ ఫీల్డ్ డిస్ప్లే చేయాలనుకుంటె గరిష్ట ఇమేజ్ పరిమాణం కన్నా తక్కువ ఉండకూడదు. |
08:14 | దృపల్ అసలు పరిమాణం కన్నా ఎక్కువ ఇమేజ్ స్కేలింగ్ చేయకుండా, ఫిక్స్ లేటెడ్ ఔవడం నివారిస్తుంది. |
08:21 | మీ ఇమేజ్ గరిష్ట రేసల్యూషన్ని 1000 x 1000కి సెట్ చేసుకోండి. |
08:26 | మరియు ఇమేజ్ కనిష్ట రేసల్యూషన్ని 100 x 100 కి సెట్ చేసుకోండి. |
08:31 | గరిష్ట అప్ లోడ్ పరిమాణాన్ని 80 కెబి చేయండి. |
08:36 | దృపల్ ఇమేజ్ ని 1000 x 1000 కి కుదించి దానిని 80 కిలో బైట్కి చేస్తుంది. |
08:44 | ఇలా చేయక పోతే దృపల్ ఇమేజ్ ని నిరాకరిస్తుంది. |
08:48 | 600 x 600 పిక్సెల్ తగిన రేసలూషన్ పరిమాణం. ఈ రేసలుషన్ సెట్ చేస్తే మంచిది. |
08:56 | ఎనేబల్ ఆల్ట్ ఫిలెడ్ మరియు ఆల్ట్ ఫిలెడ్ రెక్వైరేడ్ చెక్ బాక్స్ల ని చూద్దాం. |
09:02 | సేవ్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. |
09:05 | ఇప్పుడు మన కంటెంట్ టైప్ కి ఒక ఈవెంట్ లోగో ఫీల్డ్ ఉంది. |
09:09 | యాడ్ ఫీల్డ్ క్లిక్ చేసి ఇంకొక ఫీల్డ్ ని చేరుద్దామ్. |
09:12 | యాడ్ న్యూ ఫీల్డ్ డ్రాప్ డౌన్ మెను లో లింక్ ఎంచుకోండి. లేబల్ ఫీల్డ్ లో “ఈవెంట్ వెబ్ సైట్” టైప్ చేయండి. |
09:22 | సేవ్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేయండి. |
09:25 | తక్షణం ఎన్ని విలువలను అంగీకరిoచాలో అని ప్రశ్నిస్తుంది. ఒక్క విలువ మాత్రమే ఇద్దాం. |
09:34 | సేవ్ ఫీల్డ్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. మరల మన లింక్ కు ఈ స్క్రీన్ కంటెక్ష్తూయల్ సెట్టింగ్స్ ఇస్తుంది. |
09:43 | అలోడ్ లింక్ టైప్ క్రింద ఈ ఎంపికలు కనిపిస్తాయి. ఇంటర్నల్ లింక్స్ ఓన్లీ. ఎక్స్ టర్నల్ లింక్స్ ఓన్లీ. బోథ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్ టర్నల్ లింక్స్. |
09:54 | తదుపరి, మనం అలో లింక్ టెక్స్ట్ ని డీసెబల్, ఆప్షనల్ లేదా రిక్వైర్డ్ చేస్తామా అని పేర్కొనవచ్చు. |
10:04 | మనం దీన్ని ప్రస్తుతం ఆప్షనల్ గా ఉంచి ఎలా పని చేస్తుందో చూద్దాం. |
10:09 | సేవ్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. మరల యాడ్ ఫీల్డ్ పై క్లిక్ చేయండి. |
10:15 | ఈ సారి డేట్ ఫీల్డ్ ఎంచుకోండి. |
10:20 | లేబల్ కోసం ఈవెంట్ డేట్ టైప్ చేయండి. |
10:24 | సేవ్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేయండి. |
10:26 | ప్రస్తుతం విలువ 1 ని అలాగే ఉంచి, డేట్ టైప్ డ్రాప్ డౌన్ లో డేట్ ఓన్లీ ఎంపిక ఎంచుకుందాం. |
10:34 | సేవ్ ఫీల్డ్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. మరలా సందర్భోచిత సెట్టింగుల పేజీ తెరచుకుంటుంది. |
10:43 | ఇక్కడ, డీఫాల్ట్ డేట్ ని ప్రస్తుత డేట్ తో మారుద్దామ్. ` |
10:47 | సేవ్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. |
10:49 | ఇప్పుడు ఇంకా రెండు ఫీల్డ్ లను చేర్చాలి ఐతే ప్రస్తుతo చేర్చలేము. |
10:55 | వాటిని రాబోయే టుటోరియల్ లలో పూర్తిచేద్దాం. ఇంతటితో ఈ టుటోరియల్ చివరికి వచ్చాం. |
11:03 | ఈ టుటోరియల్ లో మనం కొత్త కంటెంట్ రకాలను సృష్టించుట మరియు కంటెంట్ రకాలకు ఫీల్డ్ లను చేర్చుట నేర్చుకున్నాం. |
11:28 | ఈ వీడియోని Acquia మరియు OS Training నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే, వీరు రివైస్ చేశారు. |
11:39 | ఈ లింక్ లో ఉన్న వీడియొ స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్ట్ సారాంశం. దయచేసి, దీనిని డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
11:46 | స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ వర్క్ షాప్ లు నిర్వహిoచి సర్టిఫికేట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు మమల్ని సంప్రదించగలరు. |
11:55 | స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది. |
12:09 | ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. ధన్యవాదములు. |