Drupal/C2/Creating-Dummy-Content/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 క్రియేటింగ్ డమ్మి కంటెంట్(Creating Dummy Content) పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో, డెవెల్ మోడ్యూల్(Devel module)వాడి డమ్మి కంటెంట్ సృష్టించడం నేర్చుకుంటాం.
00:12 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి- ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్(Ubuntu Operating System) ద్రుపల్(Drupal) 8 మరియు

ఫైర్ ఫాక్స్ (Firefox) వెబ్ బ్రౌజర్ వాడుతున్నాను. మీ ఎంపిక ప్రకారం ఏ వెబ్ బ్రౌజర్ అయినా వాడవచ్చు.

00:25 ద్రుపల్ సైట్ ని నిర్మించే ముందు మన వద్ద చాలా కంటెంట్ ఉండాలి. ఇది లేఔట్స్, వ్యూస్ మరియు డిజైన్స్ ను అర్థం చేసుకోవడానికి సహాయ పడుతుంది.
00:36 కానీ నిజమైన కంటెంట్ వాడరాదు. ఒక కంటెంట్ టైప్(Content type) లేదా ఒక ఫీల్డ్(field) మార్చాల్సి ఉంటుంది.
00:44 సమస్య ఏంటంటే నిజమైన కంటెంట్ సవరించాల్సి ఉంటుంది. దాని వల్ల సమయం వృధా ఔతుంది.
00:50 కానీ ఈ సోపానం చాలా ముఖ్యం. కంటెంట్ టైప్ మనకు కావలసిన విధంగా పని చేస్తున్నాయో లేదో పరీక్షించాలి.
00:57 ఇప్పటి వరకు కొన్ని రకాల ఫీల్డ్స్(fields)ను మాత్రమే తెలుసుకున్నాము.
01:01 ఇది సిన్సినాటి నోడ్(Cincinnati node). సిన్సినాటి గ్రూప్(Cincinnati group), వారి సమావేశాల కోసం ఒక రుసుము వసూలు చేయాలనుకుంటున్నారు.
01:07 సైట్(site) పై దీన్ని పెడుదామనుకుంటున్నారు.
01:10 డబ్బు కోసం ఒక డెసిమల్(decimal) లేదా పుర్ణాంకం వాడవచ్చు.
01:15 మీరు ఒక ఇంటీజర్(integer)ని ఎంచుకున్నారు, ఎందుకంటే వాళ్ళు 10 డాలర్లు మాత్రమే వసూలు చేశారు కానీ తర్వాత 10.99 డాలర్లు వసూలు చేయడానికి నిర్ణయించుకున్నారు.
01:24 ఇప్పుడు మనం ఇబ్బందుల్లో ఉన్నాo.
01:26 ఇదివరకే కంటెంట్ను జోడించిచాకా, ఒక ఇంటీజర్(integer)ను డెసిమల్(decimal)లోకి మార్చడం సాధ్యం కాదు.
01:32 కాబట్టి ఈ విషయాలకు ముందే ప్రణాళిక అవసరం.
01:37 కొంత నకిలీ కంటెంట్ వాడి దీనిని పరీక్షించవచ్చు. పరీక్షలతో వీటిని సులభంగా చేర్చ వచ్చు మరియు సులభంగా తొలగించవచ్చు.
01:48 గుర్తుంచుకోoడి -వందల కొద్ది నిజమైన కంటెంట్లు అవసరం లేదు. కొంత నకిలీ కంటెంట్ మాత్రమే కావాలి.
01:54 ఈ సమస్యకు పరిష్కారం డెవెల్ మాడ్యూల్(Devel module). "drupal.org/project/devel" వద్దకు వెళ్ళండి.
02:02 ఇప్పటిదాకా, మోడ్యూల్స్(Modules)గురించి చేర్చించ లేదు మరియు ఇంకా ద్రుపల్(Drupal) వెబ్సైట్ విస్తరించలేదు. రాబోయే ట్యుటోరియల్స్ లో వీటిని చూద్దాం.
02:11 కానీ ఇక్కడ డెవెల్ మాడ్యూల్(Devel Module) ఎలా ఇన్స్టాల్ చేయాలో మరియు వాడాలో నేర్చుకుందాం. ఇది డెవెల్ మాడ్యూల్(Devel Module) యొక్క శక్తి గురించి కొంత అవగాహన ఇస్తుంది.
02:21 క్రిందికి స్క్రోల్ చేసి డౌన్లోడ్(Download)సెక్షన్ ని లొకేట్ చేయండి. ఈ స్క్రీన్ చాలా భిన్నంగా ఉండవచ్చు.
02:28 ద్రుపల్ 8 డాట్ x(Drupal 8 dot x)వర్షన్ ఆకుపచ్చ క్షేత్రం లో ఉండవచ్చు కనుక దానిని క్లిక్ చేయడం నిర్ధారించుకోండి.
02:34 లేకపోతే, డెవలప్మెంట్ రిలీజ్(Development release) క్లిక్ చేయండి.
02:38 ఇందుకోసం రెండు మార్గాలున్నాయి. దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ అది మన డెస్క్టాప్ పై చాలా అనవసరమైన ఫైల్స్ సృష్టిస్తుంది
02:44 లేదా, రైట్ క్లిక్ చేయవచ్చు. మన బ్రౌజర్ పై ఆధారపడి, కాపీ లింక్(Copy Link) లేదా కాపీ లింక్ లొకేషన్ (Copy Link Location)ని చూస్తారు.
02:53 రెండు మార్గాలలో, .tar ఫైల్ లేదా .zip ఫైల్ క్లిక్ చేయండి. కానీ ఈ డేవ్(dev) ఫైల్ పై క్లిక్ చెయ్యకండి. ఎందుకంటే అది పని చేయదు.
03:01 ఇవి అసలు ఫైళ్ళకు లింకులు.
03:04 అవి మీకు దొరకగానే, సైట్(site)వద్దకు రండి. ఎక్స్టెండ్(Extend) క్లిక్ చేసి ఆపై ఇన్స్టాల్ న్యూ మాడ్యూల్(Install new module) క్లిక్ చేయండి.
03:11 URLని Install from a URL ఫీల్డ్ లో పేస్ట్ చేయండి. ఇంటర్నెట్ కనెక్షన్ బాగా ఉంటే URL నుండి ఇన్స్టాల్ చేయవచ్చు.
03:22 లేకపోతే, మీ సౌలభ్యం కోసం, డెవెల్(devel) ప్యాకేజీ ఈ పేజీలో కోడ్ ఫైల్స్(Code Files) లింక్లో ఇవ్వబడింది.
03:31 చూజ్ ఫైల్(Choose File)ఎంపికను వాడి దానిని డౌన్లోడ్ మరియు అప్లోడ్ చేయండి. చివరగా ఇన్స్టాల్ క్లిక్ చేయండి.
03:41 ఎనేబుల్ న్యూలీ యాడెడ్ మోడ్యూల్స్(Enable newly added modules)క్లిక్ చేయండి.
03:45 కోర్(CORE) పదాన్ని తగ్గించడానికి దాని పై క్లిక్ చేసి, తర్వాత కిందికి స్క్రోల్ చేయండి.
03:50 డెవలప్మెంట్ బ్లాక్(DEVELOPMENT block) కింద డెవెల్(Devel) మరియు డెవెల్ జెనెరేట్ (Devel generate)కనిపిస్తుంది. ప్రస్తుతం వేరే వాటిని పట్టించుకోకండి.
03:57 డెవెల్(Devel) మరియు డెవెల్ జెనెరేట్ (Devel generate)కు చెక్ మార్క్ పెట్టి ఆపై క్రిందికి స్క్రోల్ చేసి ఇన్స్టాల్ క్లిక్ చేయండి.
04:05 ద్రుపల్(Drupal)లో ఎల్లప్పుడూ సేవ్, ఇన్స్టాల్ (Save, Install)మొదలైన వాటిని క్లిక్ చేయడం నిర్ధారించుకోండి.
04:12 2 మోడ్యూల్స్ హావ్ బీన్ ఎనేబుల్డ్(2 modules have been enabled)- అనే ఒక ఆకుపచ్చ సందేశo రావాలి.
04:17 ఎరుపు రంగు జాగ్రత్త సందేశాన్ని చూసి ఆందోళన చెంద కంది అది ఒక తీవ్రమైన లోపం కానంత వరకు పర్వాలేదు.
04:23 మొత్తం కంటెంట్ యొక్క గుత్తిని ఉత్పత్తి చేయడానికి, కాన్ఫిగరేషన్(Configuration)క్లిక్ చేయండి. ఆ పై ఎడమ వైపు ఉన్న జెనెరేట్ కంటెంట్(Generate content) లింక్ పై క్లిక్ చేయండి.
04:34 అవసరమైన టెస్టింగ్ చేయడానికి మనకు కావాల్సిన చాలా కంటెంట్ ఉత్పత్తి చేయగలం.
04:41 ఈవెంట్స్(Events) మరియు యూజర్ గ్రూప్ లు (User Groups) ఎన్నుకుందాం. ఎందుకంటే, ఈ 2 కంటెంట్ రకాలు పరీక్షించాలి.
04:47 ఇక్కడ, డిలీట్ ఆల్ కంటెంట్ ఇన్ దీజ్ కంటెంట్ టైప్స్ బిఫోర్ జెనరేటింగ్ న్యూ కంటెంట్(Delete all content in these content types before generating new content)ని గమనించండి. ఇది నకిలీ కంటెంట్ తొలగించుటకు.
04:56 ఒక చెక్ మార్క్ పెట్టి, 0 నోడ్స్( 0 nodes) ఉత్పత్తి చేద్దాం. అది అన్ని ఈవెంట్స్ (Events)మరియు యూజర్ గ్రూప్స్(User Groups)ను తొలగిస్తుంది.
05:05 మనం సృష్టించినవి కూడా ఇందులో ఉంటాయి. ఉదాహరణకు- దీని వలన సిన్సినాటి యూజర్ గ్రూప్(Cincinnati User Group) కూడా తొలగించబడేది.
05:15 దీనిని అన్చెక్ చేసి 50 నోడ్స్(nodes) జెనెరేట్ చేద్దాం.
05:20 ఒక సంవత్సరం(year)వెనక్కి వెళ్ళoడి.
05:22 నోడ్స్(nodes) లో కామెంట్స్(comments) లేవు.
05:25 మాక్సిమం నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఇన్ టైటిల్స్(Maximum number of words in titles)ని '2'కు మార్చండి. అలా చేయకపోతే, చాలా పొడవైన లోరెం ఇప్సమ్(Lorem Ipsum)టెక్స్ట్ ఉత్పత్తి అవుతుంది.
05:35 జెనెరేట్(Generate) క్లిక్ చేస్తే వెంటనే ఒక సక్సెస్ మెసేజ్ వస్తుంది. అది పని చేసినదని కనుగొనేందుకు కంటెంట్(Content) పై క్లిక్ చేయండి.
05:44 ఇక్కడ 50 కొత్త నోడ్స్(nodes) యొక్క జాబితా ఉంది- సగం ఈవెంట్స్(Events) మరియు సగం యూజర్ గ్రూప్స్(User groups).
05:50 ఏదైనా ఒక దాని పై క్లిక్ చేస్తే, డెవెల్(Devel) చాలా టెక్స్ట్ డిస్క్రిప్షన్(Description)రూపం లో మరియు ఒక ఈవెంట్ లోగో(Event Logo)ని జెనెరేట్ చేస్తుంది.
05:57 ఒక నకిలీ ఈవెంట్ వెబ్సైట్(Event Website) మరియు ఒక డేట్(Date), ఎదో ఒక యూజర్ గ్రూప్స్(User Groups) స్పాన్సర్ గా మరియు కొన్ని ఈవెంట్ టాపిక్స్(Event Topics) ఎంచుకోబడినవి.
06:08 మన సైట్ కు కావాల్సిన లేఔట్స్(layouts), వ్యూస్(views) మరియు ఇతరమైనవి అన్నీ మన సైట్ లో చేర్చవచ్చు.
06:15 డెవెల్(devel) నకిలీ కంటెంట్ ఉత్తపత్తి చేయడం ద్వారా చాలా సమయం వృధా కాకుండా సహాయ పడుతుంది.
06:20 ఇది ద్రుపల్(Drupal) యొక్క ఒక గొప్ప లక్షణం. దీనిని ద్రుపల్.ఆర్గ్(drupal.org) వద్ద మాడ్యూల్(Module) నుండి డౌన్లోడ్ చెయ్యవచ్చు. వీటిని కంట్రిబ్యూటెడ్ మోడ్యూల్స్(Contributed Modules)అంటారు. దీని గురించి తరువాత నేర్చుకుంటారు.
06:32 దీనితో ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
06:35 ఈ టుటోరియల్లో మనం నేర్చుకున్నది, డెవెల్(devel)మాడ్యూల్ వాడి నకిలీ కంటెంట్ సృష్టించడం.
06:48 ఈ వీడియోని Acquia మరియు OS Training నుండి స్వీకరించి, స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఐఐటి బాంబే సవరించినది.
06:57 ఈ లింక్ లో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ యొక్క సారాంశం. వీడియోని డౌన్లోడ్ చేసి చూడండి.
07:03 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.
07:11 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మరియు NVLI సాంస్కృతిక మంత్రిత్వ శాఖ భారత ప్రభుతం నిధులను సమకూరుస్తున్నాయి.
07:23 ఈ రచనకు సహాయపడిన వారు చైతన్య మరియు మాధురి. ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig