Digital-Divide/D0/First-aid-measures-for-ChickenPox/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:07 అశోక్ పొలం నుండి ఇంటికి తిరిగి వచ్చి జ్వరం మరియు ఒంటి నొప్పులు అని తన బాధ చెప్పుకున్నాడు.
00:13 అతని భార్య, అనిత అతని చేతుల పై మరియు కాళ్ళ పై వున్న స్ఫోటనము లను గమనించిoది.
00:19 ఆమె భయపడి, తన భర్త పై అమ్మవారు ఆగ్రహించిoదని అంది.
00:25 ఆమె తన పిల్లలను తొందరగా ఇంట్లోంచి వేల్లిపోమoది.
00:30 ఆ తల్లి పిల్లలతో పాటు బయటికి వచ్చి బయట తాళం వేసిoది.
00:35 ఇంతలో, ఆ గ్రామంలోని వైద్యురాలు అటునుంచి వెళ్తూ అనితను పలకరించింది.
00:44 చిoతగా వున్న ఆ తల్లి మరియు పిల్లల ముఖవైకరిని గమనించి ఆ వైద్యురాలు ఏమి జరిగిoదని అడిగినది.
00:51 అమ్మ వారు తన భర్త పై ఆగ్రహం చుపించిoదని అనిత ఆ వైద్యురాలితో అంది.
00:57 ఆ వైద్యురాలు అనిత భర్తను చూస్తానని అంది.
01:02 కానీ అనిత తన భర్తను తను చూడడానికి నిరాకరించిoది.
01:08 కానీ వైద్యురాలు అనితను లెక్కచేయకుండా లోపటికి వెళ్ళింది . అనిత కూడా సంకోచిస్తూ లోపటికి వెళ్ళింది.
01:16 వైద్యురాలు అశోక్ ని పరీక్షించి అతనికి పొంగు వచ్చిoదని చెప్పింది .
01:22 కానీ అనిత కు మరియు అశోక్ కు పొంగు అంటే ఏoటో తెలియదు.
01:26 వాళ్ళు వైద్యురాలి వైపు సందేహముగా చూసారు.
01:30 డిజిటల్ డివైడ్ కు వారధి కట్టే స్పోకెన్ ట్యుటోరియల్ కి స్వాగతం .
01:34 ఇక్కడ మనం పొంగు గురించి, దాని లక్షణములను, కారణములను మరియు ఏమి చేయాలో, చేయకుడదో చూద్దాం.
01:43 ముందుగా పొంగు అంటే ఏంటో చూద్దాం.
01:47 పొంగు అనేది వైరస్ సంబంధిన అంటువ్యాధి.దీని వల్ల శరీరంపై దురదను పుట్టించే స్ఫోటనములు వస్తాయి.
01:53 ఈ వ్యాధిని నిరోదించడానికి పొంగు టీకామందు చక్కగా పని చేస్తుంది.
01:59 కానీ కొద్ది మంది కి ఈ టీకా మందు తీసుకున్న కూడా పొంగు వచ్చే అవకాశాలున్నవి.
02:03 కానీ ఇలాంటి వారికీ ఇది స్వల్పంగా వుంటుంది.
02:06 సాధారణముగా పొంగు అనేది స్వల్పమైనది మరియు మరణమ కలిగించేది కాదు.
02:10 కానీ కొన్ని సార్లు ఇది తీవ్రమైనది మరియు ఆస్పత్రి లో ఉండవలసి వస్తుంది లేకపోతే మరణం సంభవించును.
02:18 పొంగు అనేది
02:21 గర్భిని స్త్రీల కు,
02:23 అప్పుడే పుట్టిన పిల్లల కు,
02:26 మధ్య వయస్సు వారికి మరియు వయోజనులకు మరియు
02:29 రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి వస్తుంది.
02:32 ఒక్కసారి పొంగు వచ్చిన తర్వాత వైరస్ మళ్లీ కనిపించదు.
02:38 ఒకవేళ రెండో సరి పొంగు వస్తే దానిని పుండ్లు అంటారు.
02:45 పొంగు యొక్క మరిన్ని లక్షణములను మనo ఇప్పుడు చూద్దాం.
02:50 జ్వరం రెండు రోజుల కన్నా ఎక్కువగా వుంటుంది.
02:54 ఎర్రని, వేడిగా ఉన్న, గాయములైన చర్మం.
02:58 విపరీతమైన మరియు ఇంటి చికిత్స తో కూడా నయం కానీ దురద.
03:03 రెండు వరాల కన్నా ఎక్కువగా వున్న దద్దురులు.
03:08 ఇప్పుడు మనం పొంగు యొక్క వ్యవధి మరియు స్పర్శశక్తి ని చూద్దాం.
03:13 పొంగు యొక్క స్ఫోటనములు మూడు నుండి ఐదు రోజుల్లో ఏర్పడుతాయి మరియు ఏడు నుండి పది రోజుల్లో పక్కు కడుతాయి.
03:22 వచ్చిన ఒకటి లేదా రెండు రోజుల్లో స్పర్శవలన వ్యాపించె అవకాశాలున్నవి.
03:27 స్ఫోటనములు పక్కు వచ్చేంత వరకు అంటువ్యాధి వచ్చే అవకాశాలున్నవి.
03:33 ఇది అతిశయమైన అంటువ్యాధి మరియు చాల తొందరగా ఒకరినుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతుంది.
03:39 ఇప్పుడు పొంగు రావడానికి కారణములను చూద్దాం.
03:43 పొంగు
03:47 పొంగు యొక్క స్ఫోటనముల నుండి వచ్చే ధృవాన్ని తాకడం వల్ల ,
03:52 ఈ వ్యాధి సంభవించిన రోగి మీ దగ్గరలో తుమ్మడం లేక దగ్గడం వల్ల వస్తుంది.
03:57 ఇంతకు ముందెప్పుడూ పొంగు రాకపోతే
04:03 పొంగు టీకా మందు తీసుకోకపోతే అపాయము ఎక్కువగా వుంటుంది
04:08 ఇప్పుడు మనం పొంగు వస్తే తీసుకోవలసిన జాగ్రత్తలను చూద్దాం.
04:14 వెంటనే వైద్యురాలిని కలసి ఇది దోమ లేక పురుగు కుట్టినది కాదని పొంగని నిర్ధారించుకోండి.
04:20 ఆహరం తక్కువగా తీసుకోండి. ఇంటి భోజనం మంచిది.
04:26 కొన్ని రోజుల వరకు ప్రతి మూడు లేదా నలుగు గంటలకి ఒక సారి చల్లని లేదా గోరువేచ్చిని నీటితో స్నానం చేయాలి.
04:33 స్నానం చేసే నీటిలో వేప ఆకులను వేయండి. ఇది దురదను తగ్గిస్తుంది.
04:38 స్నానం చేసాక ఒంటిని తుడవాలి .
04:42 చాల వరకు నీళ్ళు , కొబ్బరి నీళ్ళు , యవలు లేదా చల్ల పరిచే దాన్ని తీసుకోవాలి.
04:49 వ్యాది వేరే వారికీ అంట కుండా వ్యాది సోకిన రోగి బట్టలు వేరేగా ఉతకాలి.
04:55 ఒకవేళ మీకు పొంగు రాకపోతే లేదా మీరు పొంగు టీకా మందు తీసుకోక పోతే వెంట నే టీకా మందు తీసుకోండి.
05:02 పొంగు వస్తే ఏమి చేయకుడదో చూద్దాం.
05:08 ఎర్రని దురద పుట్టించే స్ఫోటనములను గోకవద్దు.
05:10 ఇది బాక్టీరియా ను వ్యాపిస్తుంది మరియు మచ్చ లు ఏర్పడుతాయి.
05:15 వేరే వారికీ దురం గ వుండాలి లేకపోతే వాళ్ళకి కూడా వ్యాది సోకుతుంది.
05:22 ఇప్పుడు మనం మన ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. వైద్య సహాయం తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది
05:28 వింటున్నందుకు ధన్యవాదములు మరియు జాగ్రత్తగా వుండండి.
05:32 క్రింద వున్నా లింక్ లో లభించే వీడియో చుడండి.
05:35 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి సంగ్రహముగాచెప్పును.
05:39 ఒక వేల మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోయినట్టయితే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
05:44 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క బృందం స్పోకెన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి శిక్షణ శిభిరాలను నడిపిస్తుంది.
05:49 ఆన్లైన్ పరిక్ష లో ఉత్తీర్ణులైన వారికీ యోగ్యతాపత్రము లను ఇస్తుంది.
05:53 మరిన్ని వివరాలకు, contact@spoken-tutorial.org కు వ్రాయండి.
06:01 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
06:05 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
06:12 ఈ లక్ష్యం గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది.
06:22 ఈ స్క్రిప్ట్ కు అనిమేషన్ లో తోడ్పడిన వారు ఆర్తి మరియు బొమ్మలు గీసిన వారు శౌరభ్ గాడ్గిల్.
06:30 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య .
06:33 ధన్యవాదములు

Contributors and Content Editors

Chaithaya, Madhurig, Yogananda.india