C-and-Cpp/C2/Tokens/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | C మరియు C++ లోని టోకన్స్ పై స్పోకన్ టూటోరియల్కు స్వాగతం. |
00:06 | ఈ తరగతిలో మనం నేర్చుకోబోయేది, |
00:09 | టోకన్లను ఎలా నిర్వచించడం మరియు ఉపయోగించడం |
00:12 | ఉదాహరణల ద్వారా వీటిని చూద్దాం. |
00:15 | మనము సామాన్యంగా చేసే తప్పులు మరియు వాటి సవరణలను కూడా వివివరిస్తాను. |
00:20 | ఈ టూటోరియల్ రెకార్డ్ చేయుటకు, నేను ఉపయోగించినవి: ఉబంటు ఆపరేటింగ్ సీస్టం 11:10, |
00:26 | gcc మరియు g++ కంపైలర్ వర్షన్ 4.6.1. |
00:33 | టోకన్ల పరిచయంతో ప్రారంబిద్దాం. |
00:36 | టోకన్, డేటా టైప్లు , వేరియబుల్లు , స్థిరాంకాలు మరియు ఐడెంటిఫైఎర్ల తరగతికి చెందిన పదము. |
00:46 | ఒక ప్రోగ్రాంతో ప్రారంబిద్దాం. |
00:49 | నేను ప్రోగ్రాం ఎడిటర్లో టైప్ చేసి ఉంచాను. |
00:53 | దానిని తెరుస్తాను. |
00:56 | మన ఫైల్ పేరు టోకన్స్.సి (tokens.c) అని గమనించండి. |
01:04 | ఈ ప్రోరాం లో వేరియబల్లను ఇనిషియలైజ్ (initialize) చేసి వాటి విలువలను ముద్రిద్దాం. |
01:09 | ఇప్పుడు కోడ్ (code)ను వివరిస్తాను. |
01:12 | ఇది మన హెద్దర్ ఫైల్. |
01:16 | ఇది మన మెయిన్ ఫంక్షన్. |
01:20 | ఇక్కడ int ఒక కివర్డ్. |
01:22 | కంపైలర్ కు కీవర్డ్ ల అర్థం తెలిసి ఉంటుంది . |
01:26 | a ఒక పూర్ణాంక వేరియబల్. |
01:28 | దానికి 2 విలువను కేటాయించినాము. |
01:32 | దీన్నే ఇనీశ్యలైజేషన్(initialization ) అంటారు. |
01:35 | వేరియబల్ కు విలువను ఇవ్వక పోతే దాన్ని డిక్లరేషన్ (Declaration ) అంటారు. |
01:43 | ఇక్కడ b ఒక స్థిరంకం (constant). |
01:46 | b ని ఇనిష్యలైజ్ చేయుటకు దానికి 4 విలువను కేటాయించము. |
01:53 | const కివర్డ్ రీడ్ ఓన్లీ వేరియబల్ సృష్టించుటకు ఉపయోగిస్తారు. |
01:58 | కీవర్డ్స్ మరియు స్థిరాంకాల గురించి మరింత తెలుసుకోవడానికి మన స్లైడ్స్ వద్దకు వెళ్దాం . |
02:06 | కీవర్డ్ లకు మార్చలేని ఒక స్థిరమైన అర్థం ఉంటుంది. |
02:11 | కీవర్డ్ లను వేరియబల్ పేర్లు గా ఉపయోగించలేము. |
02:15 | C లో 32 కీ వర్డ్ లు ఉన్నవి. |
02:18 | auto,break,case,char,enum,extern మొదలైనవి. |
02:28 | స్థిరాంకాలు, స్థిరాంకాలకు స్థిర విలువలు ఉంటాయి. |
02:33 | అవి ఒక ప్రోగ్రాం అమలు అయేటప్పుడు మార్పులు చందవు. |
02:38 | న్యూమరిక్ మరియు క్యారెక్టర్ స్థిరాంకాలు అనబడే రెండు స్థిరాంకాలు ఉన్నవి. |
02:45 | మన ప్రోగ్రాం కు తిరిగి వద్దాం. |
02:47 | ఇక్కడ ఫ్లోట్ (float ) వేరియబుల్ C యొక్క డాటా టైప్. |
02:52 | మనం దానికి 1.5 విలువను కేటాయించాము . |
02:56 | డాటా టైప్ , నియమాల సెట్ తో కూడిన ఒక పరిమితమైన విలువల సెట్ |
03:04 | ఇక్కడ d ఒక వేరియబల్. |
03:07 | Char మరియు సింగల్ కొట్స్, మనం క్యారెక్టర్ తో వ్యవహరిస్తున్నాం అని సూచిస్తుంది. |
03:12 | ఫలితంగా, d,A విలువను నిల్వ చేసే ఒక క్యారెక్టర్ వేరియబుల్. |
03:20 | int,double,float and char అనేవి డేటా టైప్లు . |
03:30 | a , c మరియు d అనేవి వేరియబుల్స్. |
03:35 | ఇప్పుడు మన స్లయిడ్ లకు తిరిగి వద్దాం. |
03:37 | డాటా టైప్ మరియు వేరియబుల్స్ గురించి మరింత తెలుసుకుందాం. |
03:48 | డాటా టైప్లు - పూర్ణాంక డాటా టైప్ తో ప్రారంబిద్దాం. |
03:50 | ఇది int అని డిక్లేర్ చేయబడింది |
03:53 | పూర్ణాంక డేటా టైప్ని ముద్రించుటకు %d అనే ఫోర్మ్యట్ స్పెసిఫైయర్ ఉపయోగిస్తాం. |
04:01 | అదేవిధంగా, ఫ్లోటింగ్ పాయింట్ సంఖ్యల్లో ఫ్లోట్ మరియు %f ఉపయోగిస్తము. |
04:09 | క్యారెక్టర్ డాటా టైప్లకు %c ఉపయోగిస్తాం. |
04:15 | మరియు డబల్ డాటా టైప్ కొరకు , %lf ఫార్మాట్ స్పెసిఫైయర్ఉపయోగిస్తాం. |
04:24 | ఇప్పుడు మనం డాటా టైప్ల రేంజ్ చూద్దాం. |
04:29 | ఇంటీజర్ (Integer)డాటా టైప్ కు ఈ శ్రేణి ఉంటుంది . |
04:34 | ఫ్లోటింగ్ పాయింట్ (Floating Point) డాటా టైప్ కు ఈ శ్రేణి ఉంటుంది . |
04:39 | క్యారెక్టర్ డాటా టైప్ కు ఈ శ్రేణి ఉంటుంది. |
04:42 | మరియు డబల్ డాటా టైప్ కు ఈ శ్రేణి ఉంటుంది . |
04:47 | వేరియబుల్లో నిల్వ చేసిన విలువలు ఈ శ్రేణి కంటే అధికం లేకా తక్కువ ఉండకూడదు. |
04:56 | ఇప్పుడు వేరియబల్స్ ను చూద్దాం. |
05:00 | వేరియబల్ ఒక డాటా పేరు. |
05:02 | దీనిని డాటా విలువను నిలువ చేయుటకు ఉపయోగిస్తారు . |
05:06 | ప్రోగ్రాం రన్ అవుతుండగాఇందులోని విలువలు మార్పు మార్పు చెందవచ్చు. |
05:10 | వేరియబాల్ని ఉపయోగించే ముందు డిక్లేర్ చెయ్యాలి. |
05:14 | వేరియబల్ల పేరులు అర్థవంతంగా ఉండాలి. |
05:18 | ఉడాహరణకు john, marks, sum మొదలైనవి. |
05:24 | ఇప్పుడు మన ప్రోగ్రాంకు తిరిగి వెళ్దాం. |
05:27 | ఇక్కడ printf ఈ ఫంక్షన్ కు ఒక ఐడెంటిఫైయర్(identifier) పేరు. |
05:32 | మన స్లయిడ్ కు తిరిగి వెళ్దాం. |
05:35 | ఐడెంటిఫైయర్ల గురించి తెలుసుకుందాం. |
05:38 | ఐడెంటిఫైయర్స్ యూసర్ డిఫైన్ చేసిన పేర్లు. |
05:41 | ఐడెంటిఫైయర్స్ అక్షరాల మరియు అంకెల సమాహారం. |
05:46 | అప్పర్ కేస్ మరియు లోవర్ కేస్ అక్షరాలు ఉపయోగించవచ్చు. |
05:51 | మొదటి క్యారెక్టర్, అక్షరం లేక అండర్ స్కోర్ ఉండాలి. |
05:55 | ఇప్పుడు ఆమన ప్రోగ్రాం కు వద్దాం. |
05:58 | ఇక్కడ వేరియబల్స్ మరియు స్థిరాంకాలను ఇనీశ్యలైజ్ చేశాం . |
06:02 | ఇక్కడ వాటిని ముద్రించాం. |
06:05 | ఇది మన రేటర్న్ వాక్యము. |
06:08 | ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి. |
06:10 | ప్రోగ్రాం ను ఎక్సిక్యూట్ చేయండి. |
06:12 | Ctrl, Alt మరియు T కీలను ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి. |
06:21 | కంపైల్ చేయుటకు, gcc space tokens dot c space hyphen o tok)gcc tokens.c -0 tok) టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
06:30 | ఎక్సిక్యూట్ చేయుటకు ./tok టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
06:35 | ఔట్ పుట్ ప్రదర్శిపబడును |
06:39 | ఇక్కడ దశాంశ బిందువు(డెసిమల్ పాయింట్) తర్వాత ఆరు విలువలు ఉన్నవని చూడగలరు. |
06:44 | మరియు ఇక్కడ రెండు విలువలు ఉన్నవి. |
06:48 | ఇది ఎలా అయిందో చూద్దాం. మన ప్రోగ్రాం కి వద్దాం. |
06:54 | ఇక్కడ % point 2f ఉన్నందుకు ఇలా జరిగింది. |
06:59 | ఇది డెసిమల్ తరువాత రెండు స్థానాలను ముద్రించవచ్చని సూచిస్తుంది. |
07:04 | డెసిమల్ తరువాత మూడుస్థానములు కావాలంటే. |
07:09 | % .2f ను % .3f తో మారుద్దాం. |
07:16 | సేవ్ పై క్లిక్ చేయండి. |
07:19 | టర్మినల్కు తిరిగి రండి. |
07:22 | ఇంతకముందు చేసినట్టు కంపైల్ చేద్దాం, |
07:28 | ఇక్కడ డెసిమల్ తరువాత మూడు స్థానాలు ఉన్నవని కనిపిస్తుంది. |
07:33 | ఇప్పుడు అదే ప్రోగ్రాంను C++ లో ఎక్సిక్యూట్ చేద్దాం. |
07:36 | మన ప్రోగ్రాం కు తిరిగి వద్దాం. |
07:40 | ఇక్కడ కొన్ని మార్పులు చేద్దాం. |
07:42 | ముందుగా shift+ctrl+s కీలను ఏకకాలంలో నొక్కండి. |
07:50 | ఇప్పుడు .cpp అనే ఎక్స్టెంషన్ తో సేవ్ చేయండి. |
07:58 | హెడర్ ఫైల్ను iostream కు మారుద్దాం. |
08:03 | ఇప్పుడు using వాక్యాన్ని చేర్చుద్దాం. |
08:08 | సేవ్ పై క్లిక్ చేయండి. |
08:11 | ఇప్పుడు printf వాక్యాన్ని cout వాక్యం తో మార్చండి. |
08:15 | ఎందుకంటే C++ లో cout<< ఫంక్షన్ ఒక వరసను ముద్రిస్తుంది. |
08:21 | సర్చ్ ఫార్ అండ్ రిప్లేస్ టెక్స్ట్(Search for and replace text) ఎంపిక పై క్లిక్ చేయండి. |
08:27 | ఇక్కడ printf ఓపనింగ్ బ్రాకెట్ ( టైప్ చేయండి. |
08:33 | మరియు ఈ కాలం లో cout మరియు రెండు యంగాల్ బ్రాకెట్స్ << టైప్ చేయండి.(cout<<) |
08:40 | ఇప్పుడు రీప్లేస్ ఆల్( Replace All) పై క్లిక్ చేసి క్లోజ్( Close) పై క్లిక్ చేయండి. |
08:45 | మనకు ఫార్మ్యట్ స్పెసిఫైయర్ మరియు \n అక్కరలేదు. |
08:50 | వీటిని తొలగిద్దాం. |
08:52 | ఇప్పుడు కామా తొలగించి రెండు యాంగాల్ బ్రాకెట్లను టైప్ చేయండి. |
09:01 | సేవ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు క్లోసింగ్ బ్రాకెట్ తొలగించండి. |
09:04 | రెండు యాంగాల్ బ్రాకెట్లు టైప్ చేయండి. |
09:09 | మరియు డబల్ కొట్స్ లో \n టైప్ చేయండి. |
09:16 | ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి. |
09:20 | ఇప్పుడు ప్రోగ్రాంను ఎక్సిక్యూట్ చేయండి. మన టర్మినల్ కు తిరిగి వద్దామ్. |
09:24 | g++ space tokens dot cpp space hyphen o space tok1 టైప్ చేసి కంపైల్ చేయండి. |
09:35 | ఇక్కడ మన వద్ద tok1ఉంది ఎందుకంటే, tokens.c ఫైల్ అవుట్ పుట్ పారామీటర్ tok ను ఓవర్ రైట్ చెయ్యకూడదని |
09:46 | ఇప్పుడు ఎంటర్ నొక్కండి. |
09:48 | ఎక్సిక్యూట్ చేయటకు ./tok1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
09:55 | ఔట్ పుట్ ప్రదర్శింపబడును. |
09:59 | ఇప్పుడు మనం సామాన్యంగా చేసే తప్పుల గురించి చూద్దాం. |
10:03 | మన ప్రోగ్రాం కు తిరిగొద్దాం. |
10:05 | ఇక్కడ b కి 8 అనే ఒక నూతన విలువను కేటాయించాననుకోండి. |
10:12 | సేవ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఎమౌతుందో చూద్దాం. |
10:15 | మన టర్మినల్ కు తిరిగి వద్దాం. |
10:17 | ప్రాంప్ట్ క్లియర్ చేస్తాను. |
10:22 | ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేయండి |
10:26 | tokens.cpp (టోకన్స్.సిపిపి) ఫైల్ లో ఏడవ వరసలో తప్పు ఉందని కనిపిస్తుంది. |
10:32 | Assignment of read only variable b . |
10:36 | మన ప్రోగ్రాం కు తిరిగి వద్దాం. |
10:39 | ఎందుకంటె, b ఒక స్థిరాంకం మరియు స్థిరాంకాలకు స్థిరమైన విలువలు ఉంటాయి కాబట్టి. |
10:45 | వీటి విలువలు ప్రోగ్రాం ఎక్సిక్యూట్ అయేటప్పుడు మార్పు చెందవు . |
10:49 | అందుకే ఇక్కడ తప్పు ఉందని సూచిస్తుంది. తప్పునీ సారి దిద్దుదాం. |
10:54 | ఈ వరసను తొలగింది సేవ్ పై క్లిక్ చేయండి. |
10:57 | మరోసారి ఎక్సిక్యూట్ చేద్దాం. మన టర్మినల్ కు తిరిగి వద్దాం. |
11:01 | ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేద్దాం. |
11:03 | ఇంతక ముందు చేసినట్టు ఎక్సిక్యూట్ చేద్దాం. ఇదిగో సరిపోయింది. |
11:09 | ఇప్పుడు ఇంకో సామాన్యమైన తప్పుని చూద్దాం. |
11:12 | మన ప్రోగ్రాం కు తిరిగి వద్దాం. |
11:15 | ఇక్కడ నేను సింగల్ కోట్ పెట్ట లేదనుకోండి. సేవ్ పై క్లిక్ చేయండి. |
11:21 | ఎక్సిక్యూట్ చేసేందుకు టర్మినల్కు వద్దాం. |
11:25 | ఇంతకముందు చేసినట్టు కంపైల్ చేద్దాం. |
11:28 | టోకన్ డాట్ సిపిపి(.cpp) ఫైల్ లో తొమ్మిదో వరస తప్పు అని చూపిస్తుంది. |
11:34 | A ను స్కోప్ లో డిక్లేర్ చేయలేదు. మన ప్రోగ్రాం కు వద్దాం. |
11:40 | దీనికి కారణం సింగల్ కొట్లో ఏమైనా క్య్రెక్టర్ విలువ అని పరిగణిస్తుంది. |
11:47 | మరియు ఇక్కడ d ను క్యారెక్టర్ వేరియబల్ గా డిక్లేర్ చేశాం. |
11:53 | తప్పునీ సరిదిద్దుదాం. తోమిదో వరసలో సింగల్ కోట్ టైప్ చెద్దాం. |
11:59 | సేవ్ పై క్లిక్ చేయండి. ఎక్సిక్యూట్ చెద్దాం. |
12:02 | టర్మినల్ కు తిరిగి వద్దాం. |
12:04 | ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేద్దాం. |
12:06 | ఎక్సిక్యూట్ చెద్డాం. చూసారా సరిపోయింది. |
12:13 | ఇప్పుడు స్లైడ్స్ కు తిరిగి వద్దాం. |
12:15 | తరగతి సారాంశం. ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకున్నది. |
12:18 | డాటా టైప్ ఉదాహరణ int,double,float మొదలైనవి . |
12:24 | వేరియబల్స్ ఉదా int a=2; |
12:29 | ఐడెంటిఫైయర్స్ ఉదా printf() మరియు |
12:34 | స్థిరాంకాలు ఉదా double const b=4; |
12:40 | ఒక అసైన్మెంట్ గా, సాదారణ వడ్డీ గణించే ప్రోగ్రాం రాయండి. |
12:45 | సూచన: principal * rate * time upon 100 . |
12:50 | ఈ లింక్ లోఉన్న వీడియో(video) చూడగలరు. |
12:54 | ఇది స్పోకన్ టుటోరియల్ యొక్క సారాంశం. |
12:56 | మీవద్ద మంచి బ్యాండ్ విడ్త్ (bandwidth)లేనిచో, మీరు డౌన్ లోడ్ (download) చేసి చూడగలరు. |
13:01 | స్పోకెన్ టుటోరియల్ ప్రొజెక్ట్ టీం. |
13:03 | స్పోకన్ టూటోరియల్స్ ద్వారావర్క్ షాప్స్ (workshops) నిర్వహించును. |
13:07 | ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం(certificates)ఇవ్వబడును. |
13:10 | మరిన్నివివరాలుకు, దయచేసిcontact@spoken-tutorial.org ను సంప్రదించండి. |
13:19 | స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
13:24 | ఐ సి టి (ICT) , ఎమ్ హెచ్ ఆర్ డి (MHRD), భారత ప్రభుత్వము, ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్( National Mission on Education) వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహించపడినది . |
13:30 | ఈ మిషన్ గురించి మరిన్ని వివరాలు ఈ లింక్ లో చూడ గలరు . |
13:35 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష, నేను మాధురి మీ సెలవు తీసుకుంటున్నాను . |