Blender/C2/Types-of-Windows-Properties-Part-3/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:05 Blender tutorials సిరీస్ కు స్వాగతం.
00:09 ఈ ట్యుటోరియల్ Blender 2.59 నందు Properties window గురించి వివరిస్తుంది.
00:16 ఈ స్క్రిప్ట్ Sneha Deorukhkar మరియు Bhanu Prakash చే అందించబడినది మరియు Monisha Banerjee చేత సవరించబడింది.
00:28 ఈ ట్యుటోరియల్ చూసిన తరువాత మనకు Properties window అంటే ఏమిటి?
00:35 Properties window లోని Object constraints panel, Modifiers Panel మరియు Object Data Panel అంటే ఏమిటి?
00:44 Properties window లోని Object constraints panel, Modifiers Panel మరియు Object Data Panel యొక్క వివిధ settings ఏమిటి అనే దాని పై అవగాహన వస్తుంది.
00:57 మీకు Blender interface గురుంచి ప్రాధమిక అంశాలను తెలుసు అని నేను అనుకుంటాను.
01:01 లేకపోతే మా పూర్వపు ట్యుటోరియల్, Basic Description of the Blender Interface ను చూడండి.
01:10 Properties window మన స్క్రీన్ కు కుడి వైపున ఉంటుంది.
01:16 మునుపటి ట్యుటోరియల్ లో ప్రాపర్టీస్ విండో యొక్క మొదటి నాలుగు ప్యానెల్ లు మరియు వాటి సెట్టింగులను మనము ఇప్పటికే నేర్చుకున్నాము.
01:23 ప్రాపర్టీస్ విండోస్ లోని తదుపరి ప్యానెల్ లను చూద్దాము. ముందుగా మెరుగైన వ్యూ కోసం మరియు అవగాహన కొరకు ప్రాపర్టీస్ విండోస్ ను పునఃపరిమాణం చేయాలి.
01:33 ఎడమ అంచుపై లెఫ్ట్ చేయండి ప్రాపర్టీస్ విండోస్ ను పట్టుకొని ఎడమవైపుకు లాగండి.
01:43 ఇప్పుడు, ప్రోపర్టీస్ విండోలో ఉన్న ఎంపికలను మనం మరింత స్పష్టంగా చూడవచ్చు.
01:47 బ్లెండర్ విండోలను ఎలా పునః పరిమానం చేయాలో తెలుసుకోవడానికి మా ట్యుటోరియల్, How to Change Window Types in Blender ను చూడండి.
01:57 ప్రోపర్టీస్ విండో యొక్క పై వరుసకు వెళ్ళండి.
02:03 chain చిహ్నం పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇది Object Constraints ప్యానెల్.
02:12 Add constraint పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఈ మెను వివిధ ఆబ్జెక్ట్ constraintల జాబితాను చూపిస్తుంది.
02:19 ఇక్కడ - Transform, Tracking and Relationship అను మూడు ప్రధాన పరిమితులు ఉన్నాయి.
02:31 Copy Location పరిమితి ఒక object యొక్క స్థానాన్ని కాపీ చేసి, దానిని ఇతర object గా సెట్ చేసేందుకు ఉపయోగించబడుతుంది.
02:38 3D view కు వెళ్ళండి. Lamp ను ఎంచుకోవడానికి దానిపై రైట్ క్లిక్ చేయండి.
02:45 Object Constraints Panel కు తిరిగి రండి.
02:49 Add Constraint పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
02:52 Transform నందు గల Copy Location ను సెలెక్ట్ చెయ్యండి.
02:57 Add constraint మెను బార్ కింద ఒక కొత్త panel కనిపిస్తుంది.
03:05 ఈ ప్యానెల్ Copy Location పరిమితి కోసం సెట్టింగులు కలిగి ఉంటుంది.
03:06 copy location panel ఎడమవైపు ఉన్న, orange cubeను కలిగిన తెల్లని బార్ కలిగి ఉండడం మీరు చేశారా?
03:12 ఇది Target బార్. ఇక్కడ మన target objectకు పేరుని చేర్చుదుము.
03:21 Target బార్ పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
03:24 జాబితా నుండి Cube ను ఎంచుకోండి.
03:29 copy location constraint, cube యొక్క ప్రదేశ అక్షాంశాలను కాపీ చేసి, lamp కి వర్తింపచేస్తుంది.
03:37 ఫలితంగా, lamp, cube యొక్క స్థానానికి కదులుతుంది.
03:42 Copy location ప్యానెల్ యొక్క కుడి ఎగువ మూలలో ఉన్న cross ఐకాన్ ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి.
03:50 పరిమితి తొలగించబడుతుంది. లాంప్ తిరిగి దాని అసలు స్థానానికి వెళుతుంది.
03:58 కాబట్టి, ఇది object constraint పనిచేసే విధానం.
04:02 మనము object constraintsను తరువాత ట్యుటోరియల్లో చాలా సార్లు ఉపయోగిస్తాము.
04:07 ఇప్పుడు కోసం, ప్రాపర్టీస్ విండోలో, తదుపరి ప్యానెల్కు వెళ్దాము. 3D viewకు వెళ్ళండి.
04:16 cubeని రైట్ క్లిక్ చేసి, దానిని ఎంచుకొనండి.
04:19 Properties window ఎగువ వరుసలోని తదుపరి చిహ్నం పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
04:26 ఇది Modifiers ప్యానెల్.
04:29 ఒక Modifier అసలైన లక్షణాలను మార్చకుండా objectను విరూపణ చేస్తుంది. నన్ను ప్రదర్శించనివ్వండి.
04:36 Modifiers ప్యానెల్ కు తిరిగి వెళ్ళండి.
04:40 ADD modifier పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ Generate, Deform and Simulate అను మూడు ప్రధాన రకాల మోడిఫైర్స్ ఉన్నాయి.
04:54 మెను యొక్క దిగువ ఎడమ మూలలో ఉన్న Subdivision Surface పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
05:02 cube వక్రీకృత బంతిని విరూపణం చేస్తుంది. Add modifier menu bar నందు కొత్త panel కనిపించింది.
05:10 ఈ ప్యానెల్ Subdivision Surface modifier యొక్క సెట్టింగులను చూపుతుంది.
05:16 View 1 పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. మీ కీబోర్డ్ పై 3 అని టైప్ చేసి Enter కీని నొక్కండి.
05:25 ఇప్పుడు క్యూబ్ ఒక బంతి లేదా గోళం వలె కనిపిస్తోంది.
05:28 మనం subdivision surface Modifiers గురించి తరువాత ట్యుటోరియల్ లలో వివరంగా నేర్చుకుంటాం.
05:35 Subdivision surface panelకు కుడి ఎగువ మూలలో ఉన్న cross ఐకాన్ పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి.
05:43 modifier తీసివేయబడింది. క్యూబ్ దాని అసలు రూపంలోకి మారుతుంది.
05:49 కాబట్టి, మాడిఫైయర్ క్యూబ్ యొక్క అసలైన లక్షణాలను మార్చలేదు.
05:54 ఇతర మోడెఫైర్స్ గురించి మనం, తదుపరి ట్యుటోరియల్లో తెలుసుకోవచ్చు.
05:59 ప్రాపర్టీస్ విండో ఎగువ వరుసలో ఉన్న inverted triangle ఐకాన్ పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి.
06:07 ఇది Object Data ప్యానెల్.
06:10 Vertex groups శీర్షాలను ని సమూహం పరచడానికి ఉపయోగిస్తారు.
06:15 Vertex Groups ను ఎలా ఉపయోగించాలో బ్లెండర్ లో యానిమేషన్ పై గల అధునాతన ట్యుటోరియల్లో చూద్దాం.
06:22 edit మోడ్లో వస్తువును యానిమేట్ చేయడానికి Shape Keysను ఉపయోగిస్తారు.
06:28 మీరు Shape Keys బాక్స్ యొక్క కుడి వైపున plus గుర్తును చూశారా?
06:34 object కు క్రొత్త shape keyని చేర్చడానికి ఇది ఉపయోగించబడుతుంది.
06:39 shape keys పెట్టెకు కుడి వైపున గల plus గుర్తును లెఫ్ట్ క్లిక్ చేయండి. మొదటి key Basis.
06:50 ఈ కీ మనము యానిమేట్ చేయబోయే ఆబ్జెక్ట్ యొక్క అసలు రూపాన్ని save చేస్తుంది.
06:55 అందువల్ల, మనం ఈ కీని సవరించలేము.
06:58 మరొక కీని జోడించడానికి plus పై మళ్ళీ లెఫ్ట్ క్లిక్ చేయండి. key1, మార్పు చేయగల మొదటి కీ.
07:10 3Dviewకు వెళ్ళండి.
07:13 Edit మోడ్ కు ప్రవేశించటానికి మీ కీబోర్డ్ పై tab ని ప్రెస్ చెయ్యండి.
07:18 cube ను scale చెయ్యడానికి S ను ప్రెస్ చెయ్యండి, మీ mouse ని లాగండి. స్కేల్ ను నిర్ధారించడానికి లెఫ్ట్ క్లిక్ చేయండి.
07:29 Object mode కు తిరిగి వెళ్ళడానికి tab ను నొక్కండి.
07:33 క్యూబ్ దాని అసలు పరిమాణం కు తిరిగి వచ్చింది. కాబట్టి, మనం edit mode లో చేసిన స్కేలింగ్ కు ఏమి జరిగింది?
07:40 Object Data panel లో Shape Keys box కు తిరిగి వెళ్ళండి.
07:45 కీ 1 క్రియాశీల కీ మరియు blue లో హైలైట్ చేయబడినది.
07:50 కుడి వైపున shape key యొక్క విలువ ఉంది. ఈ విలువ క్రింద సవరించబడును.
07:57 0.000 విలువను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి.
08:03 మీ కీ బోర్డ్ లో 1 అని టైప్ చేసి, Enter కీని నొక్కండి. క్యూబ్ ఇప్పుడు స్కేల్ చేయబడింది.
08:12 మనం మరిన్ని shape keysలను జోడించి మరియు క్యూబ్ ను సవరించగలము.
08:17 బ్లెండర్ ట్యుటోరియల్స్ లో ఈ సిరీస్ ని యానిమేట్ చేస్తున్నప్పుడు నేను చాలా తరచుగా shape keys ఉపయోగించడం మీరు చూస్తుంటారు.
08:26 తదుపరి అమరిక UV Texture. ఇది object కు జోడించిన texture ను సవరించడానికి ఉపయోగించబడుతుంది.
08:33 మనము తరువాత ట్యుటోరియల్లో ఈ వివరాలను చూస్తాము.
08:38 ఇప్పుడు మీరు ముందుకు వెళ్ళి క్రొత్త ఫైల్ ను సృష్టించండి.
08:42 Copy Location ని ఉపయోగించి, క్యూబ్ యొక్క స్థానాన్ని lampగా కాపీ చేయండి.
08:49 Subdivision Surface modifier ను ఉపయోగించి, క్యూబ్ ను ఒక గోళంలోనికి మార్చండి మరియు shape keys లను ఉపయోగించి క్యూబ్ ను యానిమేట్ చేయండి.
09:00 ఈ ట్యుటోరియల్ Project Oscar మరియు ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో సృష్టించబడింది.
09:09 దీని గురించి మరింత సమాచారం ఈ క్రింది లింకుల వద్ద అందుబాటులో ఉంది: oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.
09:30 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,
09:32 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్కుషాప్స్ నిర్వహిస్తుంది.
09:35 ఆన్ లైన్ పరీక్ష లో ఉతీర్ణులు అయిన వారికి సర్టిఫికేట్లు కూడా ఇస్తుంది.
09:40 మరిన్ని వివరాల కోసం దయచేసి మమ్మల్ని contact@spoken-tutorial.org కు సంప్రదించండి
09:47 మాతో సహకరించినందుకు ధన్యవాదాలు
09:49 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి, నేను ఉదయలక్ష్మి. మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india