Blender/C2/Types-of-Windows-Properties-Part-2/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:04 | Blender Tutorials సిరీస్ కు స్వాగతం |
00:08 | ఈ ట్యుటోరియల్, Blender 2.59 లోని properties window గురించి వివరిస్తుంది. |
00:15 | ఈ లిపి స్నేహ డియోరుఖర్ మరియు భాను ప్రకాష్ అందించారు మరియు మోనిషా బెనర్జీ చే సవరించబడింది. |
00:28 | ఈ ట్యుటోరియల్ చూసిన తరువాత, మనకు Properties విండో అంటే ఏమిటి, |
00:35 | Properties window క్రింద scene panel, world panel and Object panel అంటే ఏమిటి, |
00:42 | Properties window క్రింద scene panel, world panel and Object panel ఉన్న వివిధ setting ఏమిటి, అనే దాని పై అవగాహన వస్తుంది. |
00:52 | Blender interface యొక్క ప్రాధమిక అంశాలు గురించి మీకు తెలుసు అని, నేను అనుకుంటాను. |
00:57 | లేకపోతే, దయచేసి మా మునుపటి ట్యుటోరియల్ Basic Description of the Blender Interface ను చూడండి. |
01:05 | Properties విండో మన స్క్రీన్ కు కుడి వైపున ఉంటుంది. |
01:11 | మనము ఇప్పటికే, మన మునుపటి ట్యుటోరియల్ లో Properties window యొక్క మొదటి పానెల్ ను మరియు వాటి అమరికలను నేర్చుకున్నాము. |
01:17 | Properties window లోని తరువాత పానెల్స్ ను చూద్దాము. |
01:21 | ముందుగా మన Properties window ను మెరుగైన వ్యూ కోసం మరియు అర్థం చేసుకోవడం కోసం resize చేయాలి. |
01:27 | Properties window యొక్క ఎడమ అంచుపై లెఫ్ట్ క్లిక్ చేసి, ఎడమవైపుకి లాగండి. |
01:37 | Properties window లో ఎంపికలని ఇప్పుడు మనం మరింత స్పష్టంగా చూడవచ్చు. |
01:42 | Blender windows ఎలా resize చేయాలో తెలుసుకోవడానికి, మా How to Change Window Types in Blender ట్యుటోరియల్ ను చూడండి. |
01:51 | ప్రాపర్టీస్ విండోలో ఎగువ వరుసలో రెండవ icon పై క్లిక్ చేయండి. అది Scene ప్యానెల్. |
02:02 | Camera సన్నివేశం రెండరింగ్ కు ఉపయోగపడే క్రియాశీల కెమెరా. |
02:08 | సన్నివేశంలో objectల స్కేల్ ని Units నిర్ణయిస్తుంది. |
02:14 | ఇది బ్లెండర్లో యానిమేట్ చేయడానికి చాలా ఉపయోగకరం మరియు ముఖ్యమైనది. |
02:20 | డిఫాల్ట్ గా, Units, None మరియు Degrees కు అమర్చబడతాయి. |
02:26 | Metric పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. ఇప్పుడు మన సన్నివేశంలో అన్ని objects ను మీటర్లలో కొలుస్తారు. |
02:35 | Gravity ను పరిశీలించండి. |
02:38 | Gravity యొక్క X-Y-Z యూనిట్స్ metres per second square కు మారాయి అని గమనించండి |
02:46 | భౌతికశాస్త్రం ఉపయోగించి Blender లో వస్తువులు animate చేస్తున్నప్పుడు Gravity ఉపయోగపడును. |
02:52 | దీని గురించి మనము తరువాత ట్యుటోరియల్లలో చూస్తాము. |
02:56 | Properties window యొక్క ఎగువ వరుసలో మూడవ ఐకాన్ పై క్లిక్ చేయండి. |
03:03 | ఇది World panel ఇక్కడ, Blender యొక్క world సెట్టింగులు లేదా background setting లను మార్చవచ్చు. |
03:12 | Blend Sky ను క్లిక్ చెయ్యండి Preview gradient రంగుకు మారుతుంది |
03:21 | కానీ 3D view, అదే కనిపిస్తుంది. కాబట్టి, నేపథ్యం వాస్తవానికి మార్చిందని మనకు ఎలా తెలుస్తుంది. |
03:30 | క్రియాశీల కెమెరా వ్యూను రెండర్ చేయుటకు F12 ను నొక్కండి. |
03:36 | ఇప్పుడు, నేపథ్యంలో మార్పును మనము చూడవచ్చు. |
03:40 | Render Display మూసివేయండి. |
03:46 | Zenith colour పై లెఫ్ట్ క్లిక్ చేయండి మెను నుండి ఒక రంగు ఎంచుకోండి. నేను తెల్ల రంగు ఎంచుకుంటున్నాను. |
03:58 | ఇప్పుడు, నేపథ్య ఒక నలుపు మరియు తెలుపు ప్రవణత తో రెండర్ చేయబడును. |
04:03 | World panel లోని ఇతర సెట్టింగ్స్ Ambient Occlusion, Environment Lighting, Indirect Lighting, Gather, Mist, Stars. |
04:21 | ఈ సెట్టింగ్ ల గురించి ఆధునిక ట్యుటోరియల్స్ లోని లైటింగ్ ఇన్ బ్లెండర్ లో మరింత కవర్ చేయబడినది. |
04:29 | Properties window పై వరుస నాలుగవ చిహ్నం వద్ద లెఫ్ట్ క్లిక్ చేయండి |
04:37 | ఇది Object పానెల్. ఇక్కడ ఆక్టివ్ object కోసం సెట్టింగులు ఉన్నాయి. |
04:45 | అప్రమేయంగా, Cube క్రియాశీల object. కాబట్టి, ఇక్కడ క్యూబ్ కోసం అన్ని సెట్టింగ్లు ఉన్నాయి |
04:54 | Transform, active object యొక్క location, rotation మరియు scale ను నిర్ణయిస్తుంది. |
05:04 | Location క్రింద గల X0 పై లెఫ్ట్ క్లిక్ చేయండి. మీ కీబోర్డ్ లో 1 టైపు చేసి, ఎంటర్ ప్రెస్ చేయండి. |
05:14 | cube X అక్షం మీద 1 unit ముందుకు కదులుతుంది. |
05:20 | కాబట్టి, ఇది మనము క్రియాశీల object ని కదపడానికి, రొటేట్ మరియు స్కేల్ ల కోసం Object panelను ఉపయోగించే పద్దతి. |
05:28 | ఇది బ్లెండర్ లో కీ-ఫ్రేమ్స్ ను యానిమేట్ చేయుటకు బాగా ఉపయోగపడును. |
05:35 | 3D-వ్యూ లో Camera పై రైట్ క్లిక్ చేయండి. |
05:40 | Object Panel లోని Transform పై Location, Rotation మరియు Scale యొక్క యూనిట్లు ఎలా మారాయో గమనించండి. |
05:50 | ఇవి ఎంచుకున్న కెమెరా కోసం సెట్టింగులు. |
05:55 | తరువాత అమరిక Relations. ఇక్కడ, మనం క్రియాశీల object కోసం Layer మరియు Parentలను పేర్కొనవచ్చు. |
06:07 | Layers నందు గల రెండవ square పై లెఫ్ట్ క్లిక్ చేయండి. కెమెరా ఇప్పుడు దాచబడింది. |
06:13 | వాస్తవానికి ఇది రెండవ layer కు తరలించబడింది. layer దాగి ఉన్నందున, కెమెరా కూడా దాచబడుతుంది. |
06:23 | 3D-వ్యూ యొక్క దిగువ ఎడమ మూలలో ఉన్న View కు వెళ్ళండి. menu తెరవడానికి లెఫ్ట్ క్లిక్ చేయండి. |
06:32 | Show All Layers ను ఎంచుకోండి. 3D-వ్యూ లో కెమెరా మళ్ళీ కనిపిస్తుంది. |
06:42 | ఒక scene లో బహుళ objectలతో పని చేసేటప్పుడు Layers చాలా ఉపయోగకరంగా ఉంటాయి. |
06:50 | Object Panel లోని Relations నందుగల Parent పై ఎడమ క్లిక్ చేయండి. |
06:55 | Parent, అన్నీ 3D animation సాఫ్ట్ వేర్లలో ఉపయోగపడు అతి ముఖ్యమైన animation tool. |
07:03 | దీనిని Blender Animation tutorials లో చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. |
07:10 | Cube ను ఎంచుకోండి. |
07:13 | Cube కు కెమెరా పేరెంట్ గా -చెయ్యబడింది. |
07:16 | క్యూబ్ parent object మరియు కెమెరా child object ఈ అర్థం ఏమితో చూద్దాం. |
07:24 | 3D-View లో cube ఎంచుకోవడానికి రైట్ క్లిక్ చెయ్యండి. |
07:28 | blue handle పై లెఫ్ట్ క్లిక్ చేసి, మీ మౌస్ పైకి క్రిందికి తరలించండి. |
07:36 | క్యూబ్ తో పాటు కెమెరా పైకి కిందికి జరుగుతుంది. |
07:44 | ఒక కొత్త క్యూబ్ నిర్ధారించండరిం కోసం తెరపై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
07:51 | 3D-వ్యూ లో Camera పై రైట్ క్లిక్ చేసి, Object Panel లో Parentకు తిరిగి వెళ్ళండి. |
08:02 | Parent పై లెఫ్ట్ క్లిక్ చేయండి. మీ కీబోర్డ్ లో Backspace ప్రెస్ చేసి, Enter కీ నొక్కండి. |
08:11 | ఇకపై కెమెరా క్యూబ్ కు పేరెంటెడ్ కాదు. |
08:15 | క్యూబ్ కొత్త స్థానంలో ఉంటుంది. కానీ 3d వ్యూ లో దాని అసలు స్థానానికి తిరిగి స్నాప్ అవుతుంది. |
08:22 | దీనర్థం పేరెంటింగ్ వల్ల, చైల్డ్ object యొక్క అసలు ట్రాన్సఫార్మ్ సెట్టింగులు మారవు అని అర్థం. |
08:29 | ఈ ట్యుటోరియల్ లో మనం ప్రాపర్టీస్ విండో నందు గల Scene panel, World panel మరియు Object panel లను కవర్ చేసాము. |
08:39 | మిగిలిన panels తరువాత ట్యుటోరియల్ లో కవర్ చేయబడతాయి. |
08:45 | ఇప్పుడు, ముందుకు వెళ్ళి ఒక కొత్త Blend file సృష్టించండి. Scene units ను Metricను కు మార్చండి. |
08:52 | World రంగు Blend sky, Red మరియు black కు మార్చండి. |
08:58 | ఈ ట్యుటోరియల్ Project Oscar ద్వారా సృష్టించబడింది మరియు NMEICT ద్వారా మద్దత్తు చేయబడింది. |
09:08 | దీని గురించి మరింత సమాచారం కింది లింకుల వద్ద అందుబాటులో ఉంది: oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro. |
09:28 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, |
09:30 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లు నిర్వహిస్తుంది. |
09:33 | ఆన్లైన్ పరీక్షను పాస్ చేసేవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
09:38 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org కు మమ్మల్ని సంప్రదించండి. |
09:45 | మాతో చేరినంతుకు ధన్యవాదాలు. |
09:47 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి. మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. |