BASH/C2/String-and-File-attributes/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, String and File Attributes comparison in Bash పై spoken tutorial కు స్వాగతం.
00:10 ఈ ట్యుటోరియల్ లో మనం,
00:13 String మరియు File attributes పోల్చడం గురించి నేర్చుకుంటాము.
00:18 దీనిని, కొన్ని ఉదాహరణలను ఉపయోగించి చేద్దాము.
00:22 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:25 Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు
00:30 GNU BASH వర్షన్ 4.1.10ను ఉపయోగిస్తున్నాను.
00:34 GNU Bash వర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లను అభ్యాసానికి సిఫార్సు చేయబడినది.
00:42 మనము పరిచయంతో ప్రారంభిద్దాం.
00:45 Bash లో string ను పోల్చడానికి రెండు మార్గాలున్నాయి.
00:49 మొదటిది: == (equal to equal to) ఆపరేటర్ ను ఉపయోగించి,
00:53 రెండు equal strings లను పోల్చడం.
00:56 రెండవది: != (not equal to) ఆపరేటర్
00:59 రెండు not equal strings లను పోల్చుడం.
01:03 మనం ఒక ఉదాహరణ చూద్దాం.
01:06 ఇక్కడ user IDని తనిఖీ చేసే, ఒక సాధారణ ప్రోగ్రామ్ నా వద్ద కలదు.
01:11 మీ editor లో ఒక ఫైల్ ను తెరచి, strcompare dot sh గా save చేయండి.
01:19 ఇప్పుడు, ఇక్కడ చూపించిన విధంగా కోడ్ ని మీ ఫైల్ strcompare dot sh లో టైప్ చేయండి.
01:26 నన్ను code ను వివరించనివ్వండి.
01:28 ఇది shebang line.
01:31 Who am i కమాండ్ ప్రస్తుత user యొక్క username ను ఇస్తుంది.
01:36 if స్టేట్మెంట్ who am i వేరియబుల్ యొక్క output విలువ ను string root తో చెక్ చేస్తుంది.
01:44 స్ట్రింగ్ లను పోల్చడానికి, ఇక్కడ మనము not-equal to ఆపరేటర్ ను ఉపయోగించాము.
01:50 ప్రస్తుత యూజర్ root user కాకుంటే, అప్పుడు అది
01:57 You have no permission to run strcompare dot sh as non-root user అనే స్టేట్మెంట్ ను echo చేస్తుంది.
02:05 ఇక్కడ $0 (dollar zero) అనేది, అదే file-name ను కలిగి ఉండే, జీరోత్ argument.
02:13 ఒకవేళ యూజర్ root user అయితే, ఇది Welcome root! ను echo చేస్తుంది.
02:18 తరువాత మనము ప్రోగ్రామ్ ను ముగించుటకు, exit ప్రకటనను కలిగి ఉన్నాము.
02:23 ఇక్కడ fi తో మనము if statementను ముగిస్తాము.
02:28 exit statement గురించి మరింత తెలుసుకునేందుకు slides కు తిరిగి రండి.
02:34 ప్రతి ప్రోగ్రాం, ఒక exit status ను తిరిగి ఇస్తుంది.
02:38 కమాండ్ విజయవంతముగా ఎగ్జిక్యూట్ అయితే, 0 (సున్నా) ను తిరిగి ఇస్తుంది.
02:42 ఒక దోషపూరిత కమాండ్ సున్నా కానటువంటి ఒక value ను తిరిగి ఇస్తుంది.
02:47 దీనిని error code గా అన్వయించవచ్చు.
02:51 exit statement విలువని తిరిగి మనము అనుకూలీకరించవచ్చు.
02:56 ఇప్పుడు ప్రోగ్రాం ను execute చేద్దాం.
02:58 మీ కీబోర్డ్ లో, Ctrl + Alt మరియు T కీలను ఏకకాలంలో నొక్కడం ద్వారా, terminal windowను తెరవండి.
03:08 ముందుగా, సిస్టం యొక్క ప్రస్తుత యూసర్ ను తనిఖీ చేద్దాం.
03:12 who am i అని టైప్ చేయండి.
03:15 Enter నొక్కండి
03:17 ఇది ప్రస్తుత యూజర్ పేరును output గా ఇస్తుంది,
03:21 ఇప్పుడు మన స్క్రిప్ట్ ను executable చేద్దాం.
03:25 chmod +x strcompare dot sh అని టైప్ చేయండి.
03:32 dot slash strcompare dot sh అని టైప్ చేయండి.
03:37 output గా,
03:39 You have no permission to run dot slash strcompare dot sh as non-root user అని ప్రదర్శింపబడును.
03:47 ఇప్పుడు అదే ప్రోగ్రామ్ ను root user గా అమలు చేద్దాం.
03:52 sudo dot slash strcompare dot sh అని టైప్ చేయండి.
03:58 ఇది పాస్వర్డ్ కోసం ప్రాంప్ట్ చేస్తుంది.
04:01 ఇక్కడ మీ పాస్వర్డ్ ను ఎంటర్ చేయండి
04:04 అవుట్పుట్ గా Welcome root! అని ప్రదర్శించబడుతుంది.
04:08 ఇప్పుడు, file attributes పోలిక గురించి తెలుసుకుందాం.
04:13 నేను ఇప్పటికే కోడ్ ను అమలు చేసే ఉదాహరణని కలిగి ఉన్నాను.
04:17 ఈ ప్రోగ్రామ్ లో, మనం ఇచ్చిన ఫైల్ ఉందో లేదో తనిఖీ చేస్తాము.
04:23 file1 అనేది మనం path ను save చేసి, ఉంచిన వేరియబుల్.
04:29 -(hyphen) f కమాండ్ ఫైలు ఉందో లేదో అని, మరియు
04:33 అది ఒక సాధారణ ఫైల్ అవునా కాదా అని తనిఖీ చేస్తుంది.
04:37 ఒక వేళ కండిషన్ True అయితే, అది File exists and is a normal file ను echo చేస్తుంది.
04:44 లేదంటే, ఇది File does not exist ను echo చేస్తుంది.
04:48 terminal కు తిరిగి మారి, మన ఫైలు ను execute చేద్దాము.
04:53 chmod plus x fileattrib dot sh అని టైప్ చేయండి.
05:00 dot slash fileattrib dot sh అని టైప్ చేయండి.
05:05 అవుట్ పుట్ గా,
05:07 File exists and is a normal file అని ప్రదర్శించబడుతుంది.
05:11 ఇప్పుడు మనం ఫైల్ ఖాళీగా ఉందో లేదా లేదో తనిఖీ చేద్దాం.
05:16 మన ప్రోగ్రామ్ ను అమలు చేయడానికి ముందు, empty dot sh పేరుతో ఖాళీగా ఉన్న ఫైల్ ను క్రియేట్ చేస్తాను.
05:24 gedit empty dot sh ampersand sign అని టైప్ చేయండి
05:31 Save పై క్లిక్ చేసి, ఫైల్ ని మూసివేయండి.
05:35 మనం -(hyphen) f attribute ను -(hyphen) s attribute తో, భర్తీ చేద్దాం.
05:41 ఇక్కడ ఫైల్ పేరును కూడా భర్తీ చేయండి.
05:45 empty dot sh అని టైప్ చేయండి.
05:47 ఇప్పుడు, మొదటి echo statement ను
05:51 File exists and is not empty తో, మరియు,
05:54 రెండవ echo statement ను:
05:57 File is empty తో భర్తీ చేయండి.
05:59 Save పై క్లిక్ చేయండి.
06:01 terminal కు మారండి.
06:03 నేను prompt ను క్లియర్ చేస్తాను.
06:06 execute చేద్దాం.
06:08 dot slash fileattrib dot sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
06:13 అవుట్ పుట్ గా File is empty ను ఇస్తుంది.
06:17 ఇప్పుడు, మనం ఏదైనా ఫైల్ యొక్క write permission ను తనిఖీ చేసే, మరొక ఫైల్ attribute నిచూద్దాం.
06:24 ప్రోగ్రాం కు తిరిగి వెళ్ళండి.
06:26 మనం -(hyphen) s attribute ను -(hyphen) w attribute తో భర్తీ చేద్దాం.
06:32 ఇప్పుడు మొదట echo statement ను,
06:36 User has write permission to this file తో
06:40 రెండవ echo statement ను
06:43 User doesn t have write permission to this file తో భర్తీ చేద్దాం.
06:47 Save పై క్లిక్ చేయండి.
06:49 నేను ఈ ఉదాహరణ కోసం వేరే ఫైలు ను ఉపయోగిస్తాను.
06:53 నేను చదవలేని ఫైల్ లేదా write permission లేని ఒక ఫైల్ ను ఎంపిక చేస్తాను.
07:01 నన్ను file path ను
07:04 slash etc slash mysql slash debian dot cnf కు మార్చనివ్వండి.
07:10 Save పై క్లిక్ చేయండి.
07:12 ప్రోగ్రాం ను execute చేద్దాం.
07:15 up-arrow key కీ ని నొక్కండి. Enter నొక్కండి.
07:19 అవుట్ పుట్,
07:21 User doesn t have write permission to this file గా ప్రదర్శింప బడును.
07:26 ఇప్పుడు, మనం file attribute పై ఆధారిత మరొక ఉదాహరణను చూద్దాము.
07:31 ఈ ఉదాహరణలో, మనము file1, file2 కన్నా కొత్తదా అని, తనిఖీ చేస్తాము.
07:38 మనము ప్రోగ్రాం ను చూద్దాం.
07:40 మన ఫైల్ పేరు fileattrib2 dot sh అని గమనించండి.
07:46 codeను చూడండి.
07:48 ఇక్కడ మనకు రెండు వేరియబుల్స్ file1 మరియు file2 లు ఉన్నాయి.
07:53 రెండు ఫైళ్ళు, ఇప్పటికే సృష్టించబడి, ఖాళీగా ఉన్నాయి.
07:58 ఇక్కడ మనము file1, file2 కంటే కొత్తదా, అని తనిఖీ చేసాం.
08:04 ఒకవేళ condition True అయితే, మనము file1 is newer than file2 అని
08:09 లేదంటే file2 is newer than file1 ను ముద్రిస్తాము.
08:14 ఇది మరొక if statement.
08:16 ఇక్కడ మనము file1, file2 కంటే పాతదా అని తనిఖీ చేద్దాం.
08:21 ఒక వేళ condition True అయితే, మనం file1 is older than file2 అని ముద్రిస్తాము.
08:27 లేదంటే మనం file2 is older than file1 అని ముద్రిస్తాము.
08:32 terminal కు తిరిగి మారండి.
08:35 ముందుగా empty1 dot sh ఫైల్ ను సవరించుదాం.
08:39 నేను ఇందులో echo statementను జోడిస్తాను.
08:42 echo డబుల్ కోట్స్ లోపల hiii డబుల్ కోట్స్ తరువాత greater than గుర్తు empty one dot sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
08:53 ఇప్పుడు మనం మన scriptను అమలు చేద్దాం.
08:57 chmod plus x fileattrib2 dot sh అని టైప్ చేయండి.
09:03 ఇప్పుడు dot slash fileattrib2 dot sh అని టైప్ చేయండి.
09:09 మనము అవుట్ పుట్ ని ఈ విధంగా చూడవచ్చు,
09:11 file1 is newer than file2.
09:15 file2 is older than file1.
09:19 ఇప్పుడు empty2 dot sh ఫైల్ ను సవరిద్దాం.
09:23 ఇక్కడ కూడా, నేను ఒక echo statement ను జోడిస్తాను.
09:27 echo డబుల్ కోట్స్ లో How are you కోట్స్ తరువాత greater than గుర్తు (>) empty2 dot sh అని టైప్ చేయండి.
09:38 నేను prompt ను క్లియర్ చేస్తాను.
09:41 ఇప్పుడు మనం మన script ను మళ్ళీ execute చేద్దాం.
09:45 up-arrow కీ ను నొక్కండి.
09:47 dot slash fileattrib2 dot sh కు వెళ్ళి, Enter నొక్కండి.
09:53 ఇప్పుడు output ఈ విధంగా ప్రదర్శింపబడుతుంది.
09:55 file2 is newer than file1.
09:59 file1 is older than file2.
10:03 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
10:06 సారాంశం చూద్దాం.
10:08 ఈ ట్యుటోరియల్ లో మనం,
10:11 String comparison file attributes లను గూర్చి నేర్చుకున్నాము.
10:14 ==(equal to equal to)
10:16  != (not equal to) * -f (hyphen f)
10:18 -s (hyphen s)* -w (hyphen w)
10:21 -nt(hyphen nt) మరియు -ot(hyphen ot) attributes.
10:25 ఒక అసైన్మెంట్ గా మరిన్ని లక్షణాలను అన్వేషించండి.
10:29 ఉదాహరణ -r , -x మరియు -o.
10:33 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
10:36 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
10:40 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
10:45 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
10:47 స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
10:51 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
10:55 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
11:02 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
11:06 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
11:14 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
11:19 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
11:25 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య.
11:29 నేను ఉదయలక్ష్మి. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india