Advanced-Cpp/C2/Static-Members/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 స్పోకెన్ ట్యుటోరియల్ నందు స్టాటిక్ మెంబర్స్ ఇన్ c++ కు స్వాగతం
00:06 ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకునేది-
00:09 static కీవర్డ్, స్టాటిక్ వేరియబుల్.
00:12 స్టాటిక్ ఫంక్షన్.
00:14 ఇది మనం ఒక ఉదాహరణ ను ఉపయోగించి చేద్దాం.
00:17 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు నేను ఉపయోగిస్తుంది,
00:20 ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10
00:24 g++కంపైలర్ వర్షన్ 4.6.1
00:29 మనము static యొక్క పరిచయంతో మొదలు పెడదాం
00:33 స్టాటిక్ వేరియబుల్ మొదటి ఆబ్జక్ట్ సృష్టించబడక ముందే 0 ను ప్రారంభ విలువ గా కలిగి ఉంటుంది.
00:39 ప్రోగ్రాం మొత్తం లో స్టాటిక్ వేరియబుల్ కు ఒకేఒక కాపీ కలిగి ఉంటుంది.
00:44 అన్ని ఆబ్జక్ట్స్ ఆ ఒక్క వేరియబుల్ నే పంచుకొంటాయి.
00:47 అది ప్రోగ్రాం ఎగ్జిక్యూషన్ పూర్తి అయ్యేవరకు మెమొరీ నందే ఉంటుంది.
00:52 స్టాటిక్ ఫంక్షన్స్
00:54 ఒక స్టాటిక్ ఫంక్షన్ ఆబ్జక్ట్ అవసరం లేకుండా పిలువబడుతుంది.
01:00 స్టాటిక్ ఫంక్షన్ ను పొందుటకు మనం
01:03 క్లాస్ పేరు ::(స్కోప్ రెసొల్యూషణ్ ఆపరేటర్ ) మరియు స్టాటిక్ ఫంక్షన్() అని ఉపయోగిస్తాము.
01:09 స్టాటిక్ మెంబెర్స్ ను ఒక ఉదాహరణ తో చూద్దాం.
01:13 నేను ఇప్పటికే ఒక ఎడిటర్ నందు నా కోడ్ ను టైప్ చేసి ఉంచాను.
01:17 మన ఫైల్ పేరు Static dot cpp అని గమనించండి.
01:21 ముందుగా కోడ్-ను వివరిస్తాను.
01:24 iostream , ఇది మన headerfile
01:27 ఇక్కడ మనం std namespace ను ఉపయోగిస్తున్నాం.
01:31 తరువాత మనకు statex అనే క్లాస్ ఉన్నది.
01:34 ఇందులో మనకు private గా డిక్లేర్ చేయబడ్డ ఒక non-static మెంబర్ ఉన్నది.
01:40 తరువాత మనకు public గా డిక్లేర్ చేయబడ్డ sum అనే ఒక స్టాటిక్ వేరియబుల్ ఉన్నది.
01:45 ఇది మన statex కన్స్ట్రక్టర్.
01:48 దీని యందు మనము sum విలువ ను ఇదిపెంచుతున్నాము.
01:52 తరువాత sum యొక్క విలువ X నందు నిల్వ చేయబడుతుంది.
01:55 ఇక్కడ మనకు స్టాటిక్ ఫంక్షన్ stat ఉన్నది.
01:58 దీని యందు మనం sum విలువ ను ప్రింట్ చేయుదుము.
02:01 తరువాత మనకు number() అనే ఫంక్షన్ ఉన్నది.
02:04 ఇక్కడ మనం x విలువ ప్రింట్ చేస్తున్నాం.
02:07 ఇక్కడ క్లాస్ ను ముగిస్తున్నాం.
02:10 ఒక static వేరియబుల్ ను గ్లోబల్ గా డిక్లేర్ చేయుటకు మనం స్కోప్ రిసొల్యూషన్ ఆపరేటర్ను ఉపయోగిస్తాము.
02:15 ఒక స్టాటిక్ వేరియబుల్ ను పొందుటకు మనం
02:19 datatype క్లాస్ పేరు స్కోప్ రిసొల్యూషన్ ఆపరేటర్ మరియు స్టాటిక్ వేరియబుల్ పేరు గా వ్రాస్తాము.
02:26 ఇప్పుడు వెరియేబుల్ sum కు మెమొరీ కేటాయించబడినది.
02:31 అది 0 ను ప్రారంభ విలువ గా కలిగి ఉన్నది.
02:33 ఇది మన main ఫంక్షన్
02:35 ఇక్కడ, మనం Statex క్లాస్ కు ఆబ్జక్ట్స్
02:39 o1, o2 మరియు o3లు సృష్టించాం.
02:42 తరువాత మనం o1,o2,o3, లను ఉపయోగించి number() ఫంక్షన్ ను పిలుస్తాము.
02:49 ఇక్కడ స్టాటిక్ ఫంక్షన్ stat()
02:52 క్లాస్ పేరు మరియు scope resolution operator ఉపయోగించి access చేయబడుతుంది.
02:56 ఇక్కడ మనం స్టాటిక్ వేరియబుల్ sum ను ప్రింట్ చేస్తున్నాం.
03:00 ఇది మన రిటర్న్ స్టేట్మెంట్
03:03 మనం ప్రోగ్రాంను అమలు చేద్దాం.
03:05 Ctrl , Alt మరియు T లు కలిపి ఒకేసారి నొక్కి టెర్మినల్ విండో తెరుద్దాం.
03:13 కంపైల్ చేయుటకు
03:15 g++ space static dot cpp space hyphen o space stat అని టైప్ చెయ్యండి.
03:24 ./stat (dot slash stat) అని టైప్ చేసి, ఎంటర్ ను నొక్కండి.
03:28 అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును.
03:30 Number is: 0, 1, 2
03:33 Result is: 3
03:35 ఇప్పుడు static var sum is 3
03:38 ఇప్పుడు నేను అవుట్-ఫుట్ ను వివరిస్తాను. నన్ను విండో సైజు మార్చనివ్వండి.
03:42 ఇక్కడ ముందుగా నంబర్ విలువ 0 అనగా x విలువ 0
03:49 మొదటి ఆబ్జక్ట్ , ఆ విలువ ను 0 గా ఇస్తుంది.
03:53 తరువాత దాని విలువ 1 అనగా x=1
03:58 రెండవ ఆబ్జక్ట్ ఆ విలువ ను 1 గా ఇస్తుంది.
04:01 మరియు మూడవ ఆబ్జక్ట్ విలువ ను 2 గా ఇస్తుంది.
04:05 తరువాత మనం stat() అనే ఫంక్షన్ ను కాల్ చేసి sum విలువను పొందుతాము.
04:10 Result is : sum.
04:13 ఇక్కడ sum విలువ పెరిగి x నందు నిలువ చేయబడుతుంది.
04:18 కాబట్టి అది మనకు 3 విలువను ఇస్తుంది.
04:22 అందువలన చివరగా మనకు వచ్చే విలువ
04:25 Static var sum is 3.
04:28 ఇప్పుడు మనం మరొక ఆబ్జక్ట్ o4 ను ను సృష్టిద్దాం.
04:34 నేను o4 ను ఉపయోగించి number() ఫంక్షన్ ను కాల్ చేస్తాను.
04:43 save పై క్లిక్ చేద్దాం.
04:45 ఎగ్జిక్యూట్ చేద్దాం.
04:48 అప్ యారో కీను రెండు సార్లు నొక్కండి.
04:51 మళ్ళీ అప్ యారో కీను రెండు సార్లు నొక్కండి.
04:54 Result is 4 అని మనం చూడవచ్చు.
04:57 ఇప్పుడు static var sum is 4
05:00 ఎందువలనంటే మనం o4 ను సృష్టించాము కాబట్టి.
05:03 ఇది మనలను ట్యుటోరియల్ చివరకు తీసుకొని వెళ్తుంది.
05:06 ఇప్పుడు మన స్లైడ్స్ కు తిరిగి వెళ్దాం.
05:08 సంగ్రహంగా,
05:10 ఇప్పటి వరకు మనం నేర్చుకొన్నవి
05:12 static కీవర్డ్ స్టాటిక్ వేరియబుల్
05:15 ఉదా- static int sum;
05:18 స్టాటిక్ ఫంక్షన్ ఉదా - static void stat()
05:22 అస్సైన్మెంట్ గా static వేరియబుల్స్ కలిగినటువంటి ఒక క్లాస్ సృష్టించండి.
05:26 దాని విలువ ను తగ్గించండి.
05:29 మరియు దాని విలువను ప్రింట్ చెయ్యండి.
05:31 ఈ లింక్ వద్ద అందుబాటులో వున్న వీడియో చూడండి.
05:34 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
05:37 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
05:41 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం-
05:44 స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
05:47 ఆన్ లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది.
05:51 మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చెయ్యండి.
05:58 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
06:02 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
06:08 ఈ మిషన్ గురించి మరింత సమాచారము ఈ లింక్ లో అందుబాటులో ఉంది.
06:13 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Pratik kamble, Yogananda.india