Python/C2/Saving-plots/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 15:00, 13 March 2013 by Udaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:00 హలో, "Saving plots" పై ట్యుటోరియల్కు స్వాగతం
0:04 1 ఈ ట్యుటోరియల్ చివరికి మీరు ఈ క్రింది అంశములను చేయగలుగుతారు,

2 savefig() ఫంక్షన్ ఉపయోగించి ప్లాట్స్ సేవ్ చేయగలుగుతారు. 3 ప్లాట్లను వేరువేరు ఫార్మాట్లలో సేవ్ చేయగలుగుతారు 4

0:14 ఈ ట్యుటోరియల్ మొదలుపెట్టే ముందు, మీరు "Using plot interactively" అనే ట్యుటోరియల్ పూర్తి చేయాలని మేము సూచిస్తున్నాము.
0:19 ఇప్పుడు, మీ IPython ఇంటర్ప్రిటర్ను ipython -pylab<Pause> అనే కమాండ్తో ప్రారంభించండి.
0:31 మీ ప్లాట్స్ను ప్లాటింగ్ మరియు సేవింగ్ కొరకు అవసరము అయిన పైథాన్ మాడ్యూల్స్తో మీ IPython ఇంటర్ప్రిటర్ను ఇది ప్రారంభిస్తుంది అని మీకు తెలుసు.
0:37 ముందుగా, మనము మైనస్ 3 pi నుండి 3 pi వరకు ఒక సైన్ వేవ్ ప్లాట్ చేద్దాము.
0:43 ప్లాట్ కొరకు అవసరము అయిన పాయింట్లు లెక్కించడముతో మనము మొదలుపెడదాము.
0:45 దీనిని linspace ఉపయోగించి చేయవచ్చు.
0:59 మనము కావలసిన పాయింట్లను x లో స్టోర్ చేసాము.
1:03 ఇప్పుడు మనము ప్లాట్ స్టేట్మెంట్ ఉపయోగించి పాయింట్లను ప్లాట్ చేద్దాము.
1:18 చేసాము!
1:19 మనము చాలా ప్రాధమికమైన సైన్ ప్లాట్ చేసాము. ఇప్పుడు ఈ ప్లాట్ను భవిష్యత్ ఉపయోగము కొరకు మరియు దీనిని మీరు మీ రిపోర్ట్లలో పొందుపరచుకొనుటకు వీలుగా దీనిని ఎలా సేవ్ చేయాలో చూద్దాము.
1:32 ప్లాట్ను సేవ్ చేయుటకు, మనము savefig() ఫంక్షన్ ఉపయోగిస్తాము.
1:37 దీని కొరకు మనం టర్మినల్ వెంబడి ప్లాట్ విండో తెరచి ఉంచుతాము.
1:40 స్టేట్మెంట్ ఇది,
1:52 savefig ఫంక్షన్ ఫైల్ పేరుతో ఒక ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది, ఫైల్ పేరులో , తరువాత ఉన్న 3 అక్షరాలు ఎక్స్టెన్షన్ మరియు ఫైల్ రకము. ఇది మీరు సేవ్ చేయదలచిన ఫార్మాట్ను తెలుపుతుంది.
2:11 ఇంకా, మనము ఫైల్ సేవ్ చేయాలని అనుకున్న దానికి ఫుల్ల్ పాత్ లేక అబ్సొల్యూట్ పాత్ ఇచ్చామని గమనించండి.
2:18 ఇక్కడ మనము .png ఎక్స్టెన్షన్ ఉపయోగించాము. అంటే మనము ఇమేజ్ను PNG ఫైల్గా సేవ్ చేయాలని అనుకుంటున్నాము.
2:25 ఇప్పుడు మనము కొద్దిసేపటి క్రితము సేవ్ చేసిన sine.png ఫైల్ స్థానమును కనుగొందాము.
2:32 మనము ఫైల్ను /home/fossee కు సేవ్ చేసాము. కాబట్టి మనము ఫైల్ బ్రౌజర్ ఉపయోగించి /home/fossee కు వెళ్దాము
2:49 అవును, sine.png ఫైల్ ఇక్కడ ఉంది.
2:52 మనము దానిని ఓపెన్ చేసి చెక్ చేద్దాము.
2:57 కాబట్టి ఒక ప్లాట్ను సేవ్ చేయుటకు, మనము savefig ఫంక్షన్ ఉపయోగిస్తాము.
3:05 .savefig , ప్లాట్ను అనేక ఫార్మాట్లలో సేవ్ చేయగలదు. అవి pdf - పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్, ps - పోస్ట్ స్క్రిప్ట్, eps - ఎన్కాప్సులేటెడ్ పోస్ట్ స్క్రిప్ట్, svg - స్కేలబుల్ వెక్టర్ గ్రాఫిక్స్, ట్రాస్పరెన్సీకి సహకరించే png - పోర్టబుల్ నెట్వర్క్ గ్రాఫిక్స్ మొదలైనవి.
3:24 ఇక్కడ వీడియోకు విరామము ఇవ్వండి, ఈ క్రింద ఇచ్చిన అభ్యాసము ప్రయత్నించండి మరియు తరువాత వీడియో తిరిగి ప్రారంభించండి.
3:29 సైన్ ప్లాట్ను LaTeX డాక్యుమెంట్లలో పొందుపరచగలిగే విధంగా EPS ఫార్మాట్లో సేవ్ చేయండి.
3:37 మన వద్ద ఇంకా సైన్ ప్లాట్ ఉంది. దానిని మనము sine.eps గా ప్లాట్ను సేవ్ చేద్దాము.
3:49 ఇప్పుడు, మనము ప్లాట్ను savefig ఫంక్షన్ ఉపయోగించి సేవ్ చేస్తాము.
4:04 ఇప్పుడు మనము /home/fossee కు వెళ్ళి క్రియేట్ అయిన కొత్త ఫైల్ను చూద్దాము.
4:13 అవును! కొత్త ఫైల్ sine.eps ఇక్కడ ఉంది.
4:18 ఇక్కడ వీడియోకు విరామము ఇవ్వండి, ఈ క్రింద ఇచ్చిన అభ్యాసము ప్రయత్నించండి మరియు తరువాత వీడియో తిరిగి ప్రారంభించండి
4:23 సైన్ ప్లాట్ను PDF, PS మరియు SVG ఫార్మాట్లలో సేవ్ చేయండి.
4:31 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
4:34 ఈ ట్యుటోరియల్లో మనము savefig() ఫంక్షన్ ఉపయోగించి ప్లాట్లను సేవ్ చేయడము నేర్చుకున్నాము.
4:38 మరియు ప్లాట్లను pdf - ps - png - svg - eps వంటి వేరువేరు ఫార్మాట్లలో సేవ్ చేయడము నేర్చుకున్నాము.
4:45 ఇక్కడ మీరు సాధించుటకు కొన్ని స్వీయ అసెస్మెంట్ ప్రశ్నలు ఉన్నాయి.
4:48 1 ఒక ప్లాట్ను సేవ్ చేయుటకు ఏ కమాండ్ ఉపయోగించబడుతుంది, saveplot() savefig() savefigure() saveplt()

2

4:59 4 savefig ('sine.png') ప్లాట్ను ఎక్కడ సేవ్ చేస్తుంది.

5

5:04 రూట్ డైరెక్టరీ / (GNU/Linux Unix ఆధారిత సిస్టంల పై), c: \ (విండోల పై)
5:14 రెండవ ఆప్షన్. ఫుల్ పాత్ అందించబడలేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది.
5:18 మూడవది. ప్రస్తుతము పనిచేస్తున్న డైరెక్టరీ.
5:21 మరియు చివరి ఆప్షన్ ముందుగా నిర్ణయించబడిన డైరెక్టరీ - /documents వంటివి
5:26 ఇప్పుడు, జవాబులు.
5:28 ఒక ప్లాట్ సేవ్ చేయుటకు, మనము savefig() ఫంక్షన్ ఉపయోగిస్తాము.
5:33 మనము ఫైల్ను సేవ్ చేసినప్పుడు, అది ప్రస్తుతము పనిచేస్తున్న డైరెక్టరీలో సేవ్ అవుతుంది.
5:38 మీరు ఆనందించారని మరియు మీకు ఉపయోగకరముగా ఉందని ఆశిస్తున్నాము.

Contributors and Content Editors

Udaya