LibreOffice-Suite-Writer/C3/Using-search-replace-auto-correct/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 13:40, 27 January 2015 by Madhurig (Talk | contribs)

Jump to: navigation, search
TIME NARRATION
00:00 లిబ్రేఆఫీస్ రైటర్- ఫైండ్ మరియు రీప్లేస్ లక్షణం ఉపయోగించడం మరియు రైటర్ లో ఆటో కరెక్ట్ ఫీచర్ గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:09 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది,
00:12 ఫైండ్ మరియు రీప్లేస్,
00:14 స్పెల్ తనిఖీ మరియు
00:15 ఆటో కరెక్ట్.
00:17 మనం ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ గా ఉబుంటు లైనక్స్ వర్షన్ 10.04 మరియు లిబ్రేఆఫీస్ సూట్ వర్షన్ 3.3.4ను ఉపయోగిస్తున్నాము.
00:26 రైటర్ లో “Find and Replace” బటన్ తో మొదలుపెడదాం.
00:32 ఇది డాక్యుమెంట్ మొత్తంలోటెక్స్ట్ కోసం వెతుకుతుంది లేదా వెతికిటెక్స్ట్ ను రీప్లేస్ చేస్తుంది.
00:36 ఒక ఉదాహరణతో దీని గురించి నేర్చుకుందాం.
00:40 ముందుగా “resume.odt” ఫైల్ ను తెరుద్దాం.
00:44 “Edit” ఎంపిక పై క్లిక్ చేసి “Find and Replace” పై క్లిక్ చేద్దాం
00:51 ప్రత్యామ్నాయంగా, "స్టాండర్డ్ టూల్ బార్" లోని బటన్ పై క్లిక్ చేద్దాం.
00:56 “Search for” మరియు “Replace with” ఫీల్డ్ లతో ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
01:01 మీరు వెతకాలనుకున్న టెక్స్ట్ ను “Search for” ఫీల్డ్ లో ప్రవేశ పెట్టండి .
01:06 ఉదాహరణకు, మీరు “Ramesh” కోసం డాక్యుమెంట్ మొత్తం లో వేదకాలంటే,
01:12 “Search For” ఫీల్డ్ లో “Ramesh” అని టైపు చేయండి.
01:15 ఇప్పుడు “Find All” పై క్లిక్ చేయండి.
01:19 డాక్యుమెంట్లో “Ramesh” అని వ్రాసి వున్న ప్రదేశాలు హైలైట్ కావడం గమనించండి.
01:25 మీరు ఏ టెక్స్ట్ తో రీప్లేస్ చేయాలో ఆ టెక్స్ట్ ను “Replace with” ఫీల్డ్ లో ఎంటర్ చేయండి.
01:31 ఉదాహరణకు డాక్యుమెంట్ లో “Ramesh” ను "MANISH" తో రీప్లేస్ చేయాలంటే.
01:37 “Replace with” ట్యాబ్ లో “Manish” అని టైపు చేద్దాం.
01:41 “Replace All “పై క్లిక్ చేద్దాం.
01:44 డాక్యుమెంట్ మొత్తంలో “Ramesh”, “Manish” తో రీప్లేస్ కావడం గమనించండి.
01:51 డైలాగ్ బాక్స్ దిగువన వున్న “More Options” బటన్ పై క్లిక్ చేయండి.
01:57 “More Options” బటన్, నిర్దిష్టమైన "Find and Replace" ఎంపికల జాబితాను కలిగి వుంటుంది.
02:03 “Backwards” ఎంపిక టెక్స్ట్ కోసం కింది నుండి వరకు వెతుకుతుంది. “Current selection only” అనేది ఎంచుకున్న టెక్స్ట్ భాగం లో కావాల్సిన టెక్స్ట్ కోసం వెతుకుతుంది.
02:15 “Regular expressions”, “Search for Styles” మరియు మరికొన్ని ఇతర అడ్వాన్స్డ్ ఎంపికలను

కుడా కలిగి వుంది.

02:26 డైలాగ్ బాక్స్ కుడి భాగం లో ఇంకా మూడు ఎంపికలు వున్నవి.
02:31 అవి,“Attributes”, ”Format” మరియు “No Format”.
02:36 ఇవి వినియోగదారులకు వివిధ రకాల అడ్వాన్స్డ్ ఫైండ్ మరియు రీప్లేస్ ఎంపికలు అందిస్తాయి.
02:41 దీనిని ముసివెద్దమ్.
02:44 మనం మరిన్ని ఆధునిక ట్యుటోరియల్స్ లో వీటిగురించి మరింతగా నేర్చుకుందాం.
02:48 “Find and Replace” లక్షణం గురించి నేర్చుకున్న తర్వాత, లిబ్రే ఆఫీస్ రైటర్ లో స్పెల్ చెక్ (“Spellcheck”)ను ఉపయోగించి స్పెల్లింగ్ లు ఎలా తనిఖీ చేయాలో చూద్దాం.
02:57 డాక్యుమెంట్ మొత్తంలో లేదా ఎంచుకున్న టెక్స్ట్ భాగం లో స్పెల్లింగ్ లో తప్పులను తనిఖీ చేయడానికి స్పెల్ చెక్ (“Spellcheck”) ఉపయోగపడుతుంది.
03:05 "స్పెల్ చెక్"(Spellcheck) ప్రస్తుత కర్సర్ స్థానం వద్ద మొదలై డాక్యుమెంట్ లేదా ఎంపిక చివర వరకు వెదుకుతుంది.
03:12 మీరు తర్వాత, డాక్యుమెంట్ మొదటి నుండి "స్పెల్ చెక్"(spellcheck) కొనసాగించడం ఎంచుకోవచ్చు.
03:17 "స్పెల్ చెక్", పదాలలో స్పెల్లింగ్ తప్పులను వెతికి తెలియని పదంను వినియోగదారుని నిఘంటువులో చేర్చడానికి ఎంపిక అందిస్తుంది.
03:26 ఇది ఎలా అమలు చేస్తారో చూద్దాం.
03:29 "స్పెల్ చెక్" (spellcheck) లక్షణం ప్రతి భాషాకు భిన్నముగా ఉంటుంది.
03:33 ఉదాహరణకు, మేను బార్ లోని “Tools” ఎంపిక పై క్లిక్ చేసి, “Options” పై క్లిక్ చేయండి.
03:39 డైలాగ్ బాక్స్ లో “Language Settings” ఎంపిక పై క్లిక్ చేసి, చివరగా “Languages” పై క్లిక్ చేయండి.
03:47 “User interface” ఎంపిక కింద, డిఫాల్ట్ ఎంపిక, “English USA” గా సెట్ చెయ్యబడిందని నిర్ధారించుకోండి.
03:56 దీని క్రింద “Locale setting” ఫీల్డ్ లోని డౌన్ యారో పై క్లిక్ చేసి, “English USA” ఎంపిక పై క్లిక్ చేయండి.
04:03 ఇప్పుడు “Default languages for Documents ” హెడ్డింగ్ క్రింద “Western” ఫీల్డ్ లో డిఫాల్ట్ భాషా “English India” అని సెట్ చేయండి.
04:12 “English India” లో స్పెల్ చెక్ కు కావాల్సిన నిఘంటువు లేనందువల్ల , భాషా ను “English USA”కు మార్చుద్దాం
04:21 “Western” ఫీల్డ్ లోని డౌన్ యారో పై క్లిక్ చేసి “English USA” ఎంపిక పై క్లిక్ చేద్దాం.
04:27 చివరగా “OK” బటన్ పై క్లిక్ చేద్దాం.
04:31 మనం ఇప్పుడు “English USA” భాషా కు స్పెల్ చెక్ లక్షణం ఎలా పని చేస్తుందో చూడడానికి సిద్దముగా వున్నాం.
04:38 “Spelling and Grammar” లక్షణాన్ని ఉపయోగించడానికి, "AutoSpellCheck" ఎంపిక ఎనేబుల్ చేయబడిందని నిర్ధారించుకోండి.
04:45 ఒకవేళ ఇది ఎనేబుల్అవ్వకపోతే టూల్ బార్ లోని “AutoSpellCheck” బటన్ పై క్లిక్ చేయండి.
04:52 “resume.odt” ఫైల్ లో “Mother’s Occupation” దిగువన, “housewife” బదులుగా “husewife” అని తప్పుగా స్పెల్ చేసి "స్పేస్ బార్" నొక్కుద్దము.
05:05 తప్పుగా వున్న పదం క్రింద ఎర్ర రేఖ రావడం గమనించండి.
05:10 ఇప్పుడు “husewife” పదం పై కర్సర్ ను పెట్టి స్టాండర్డ్ టూల్ బార్ లో “స్పెల్లింగ్ అండ్ గ్ర్యామర్” (Spelling and Grammar”)ఐకాన్ పై క్లిక్ చేయండి.
05:18 మనం ఇప్పుడు “Not in dictionary” ఫీల్డ్ లో ఈ పదం ను చూడవచ్చు.
05:22 తప్పుగా స్పెల్ చేయబడిన పదం ఎర్ర రంగు లో హైలైట్ చేయబడి, సరైన పదం కోసం “Suggestions” బాక్స్ లో విభిన్న సలహాలు సుచిన్చాబడుతాయి. ఇందులో నుండి సరైన పదం ఎంచుకోవచ్చు.
05:34 “suggestion” బాక్స్ లో “housewife” పదం పై క్లిక్ చేసి తర్వాత “Change” బటన్ పై క్లిక్ చేయండి.
05:40 కనిపించే చిన్న డైలాగ్ బాక్స్ లో "OK" పైన క్లిక్ చేయండి.
05:44 ఇప్పుడు డాక్యుమెంట్లో సరైన స్పెల్లింగ్ రావడం గమనించండి.
05:48 మార్పులను అన్ డు చేద్దాం.
05:50 ఇప్పుడు “AutoCorrect” అనే మరొక స్టాండర్డ్ టూల్ బార్ ఎంపిక గురించి నేర్చుకుందాం.
05:56 “AutoCorrect” లక్షణం అనేది "స్పెల్ చెక్" యొక్క విస్తరణ.
06:00 మేను బార్ పైన “Format” ఎంపిక లోని డ్రాప్ డౌన్ మేను లో "AutoCorrect" ఎంపిక ఉంటుంది.
06:06 మీరు ఇచ్చిన ఎంపిక కు అనుగుణంగా "AutoCorrect" స్వయంచాలకంగా ఫైల్ ను "ఫార్మ్యాట్" చేస్తుంది.
06:12 “AutoCorrect Options” ను క్లిక్ చేయడం ద్వారా ఈ ఎంపికలు ను ఎంచుకోవచ్చు.
06:18 "AutoCorrect" డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
06:21 "AutoCorrect" లక్షణం మీరు టెక్స్ట్ ను వ్రాస్తున్నప్పుడు స్వయంచాలకంగా సరి చేస్తుంది.
06:26 “Options” ట్యాబ్ లో మీరు ఎంచుకున్న ఎంపిక ను బట్టి దిద్దుబాట్లు జరుగుతాయి.
06:32 ఇక్కడ చాలా AutoCorrect ఎంపిక లు వున్నవి.

ఉదాహరణకు “Delete spaces at the end and beginning of paragraph”, “Ignore double spaces మొదలైనవి.

06:44 అవి ఎలా పని చేస్తాయో మనం ఒక ఉదాహరణతో చూద్దాం.
06:48 మన "resume" ఫైల్ లో, కొన్ని ప్రదేశాలలో పదాల మధ్య ఒక ఖాలి స్థానాని మరియు ఇతర పదాల మధ్య రెండు మరియు మూడు ఖాలీ స్థానాలను వదిలి, కొంత టెక్స్ట్ను టైప్ చేద్దాం.
07:02 ఇప్పుడు టెక్స్ట్ మొత్తంను ఎంచుకుందాం.
07:05 మేను బార్ లో “ఫార్మ్యాట్” బటన్ పై క్లిక్ చేద్దాం.
07:09 తర్వాత డ్రాప్ డౌన్ మేను లో నుండి “AutoCorrect” పై క్లిక్ చేసి చివరగా సబ్ మేను లో నుండి “AutoCorrect Options” పై క్లిక్ చేద్దాం.
07:17 “Options” ట్యాబ్ పై క్లిక్ చేద్దాం.
07:20 “Ignore double spaces” పై చెక్ పెట్టి “OK” బటన్ పై క్లిక్ చేద్దాం.
07:26 తదుపరి మీరు ఏ టెక్స్ట్ ను టైప్ చేసిన, పదాల మధ్య రెండు ఖాలీ స్థానాలను స్వయంచాలకంగా అనుమతించదు.
07:34 ”MANISH” పేరు తర్వాత కర్సర్ ను పెడదాం. కీబోర్డ్ పై "స్పేస్ బార్" ను రెండు సార్లు నొకూద్దామ్
07:41 కర్సర్ ఒకే స్థానం కదలడం మరియు టెక్స్ట్ మధ్య రెండు ఖాళీల ను అనుమతించకపోవడం గమనించండి.
07:48 "Surname" ఒక ఖాళీ తర్వాత “KUMAR” అని టైపు చేయండి.
07:53 "AutoCorrect" కు ఒక పదం లేదా సంకేతాక్షరమును ఇంకా ఎక్కువ భావముగల పెద్దదైన టెక్స్ట్ తో బదిలీ చేసే సామర్థ్యము వుంది.
08:02 పెద్ద పదాల కు షార్ట్కట్స్ ను సృష్టించడం ద్వారా టైపు చేయాల్సిన ప్రయాసను తగ్గిస్తుంది.
08:09 ఉదాహరణకు, "resume.odt" ఫైల్ లో కొన్ని పదాల సమూహాన్ని లేదా పదాన్ని మాటిమాటికి డాక్యుమెంట్లో ఉపయోగించవలసి వుంటుంది.
08:19 ఈ పదాలను లేదా వాక్యాలను మళ్ళి మళ్ళి టైపు చేయడం అసౌకర్యంగా ఉంటుంది.
08:24 ఉదాహరణకు, “This is a Spoken Tutorial Project” టెక్స్ట్ ను మన డాక్యుమెంట్ లో మాటిమాటికి టైపు చేయాలంటే,
08:31 ఒక సంకేతాక్షరమును తయారు చేసి తర్వాత దీనిని నేరుగా మనకు కావాల్సిన టెక్స్ట్ లోకి మార్చవచ్చు.
08:38 ఇప్పుడు మనం “stp” అనే సంకేతాక్షరము స్వయంచాలకంగా “Spoken Tutorial Project”గా ఎలా మర్చబడుతుందో చూద్దాం.
08:46 మేను బార్ లోని “Format” ఎంపిక పై క్లిక్ చేసి తర్వాత “AutoCorrect” ఎంపిక వద్దకు వెళ్ళి “AutoCorrect Options” పై క్లిక్ చేద్దాం.
08:57 కనిపించే డైలాగ్ బాక్స్ లో “Replace” ట్యాబ్ పై క్లిక్ చేద్దాం.
09:02 “English USA” మన భాష ఎంపికగా ఉందని తనిఖీ చేయండి.
09:06 . ఇప్పుడు “Replace” ఫీల్డ్ లో మనం బదిలీ చేయాలనుకున్న సంకేతాక్షరము “stp” అని టైపు చేద్దాం.
09:14 “With” ఫీల్డ్ లో బదిలీ చేయబడిన టెక్స్ట్ “Spoken Tutorial Project” అని టైపు చేద్దాం.
09:20 డైలాగ్ బాక్స్ లో “New” బటన్ పై క్లిక్ చేద్దాం.
09:24 “Replacement table” లో నమోదు కావడం గమనించండి.
09:28 ఇప్పుడు “OK” బటన్ పై క్లిక్ చేద్దాం.
09:31 “This is a stp” అని టెక్స్ట్ చేసి స్పేస్ బార్ నొక్కిన వెంటనే “stp” సంకేతాక్షరము “Spoken Tutorial Project” గా మారడం గమనించవచ్చు.
09:43 ఒకడాక్యుమెంట్ లో కొంత టెక్స్ట్ అనేక సార్లు పునరావృతం అయితే, ఈ లక్షణం చాలా సహాయపడుతుంది.
09:49 మార్పులను అన్ డు చేద్దాం.
09:52 ఇప్పుడు మనం "లిబ్రే ఆఫీస్ రైటర్" పై స్పోకెన్ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
09:57 సంగ్రహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది:
10:00 ఫైండ్ మరియు రీప్లేస్.
10:01 స్పెల్ చెక్ మరియు
10:02 ఆటో కరెక్ట్.
10:04 సంగ్రహ పరీక్ష.
10:06 రైటర్ లో కింది టెక్స్ట్ ను టైప్ చేయండి - ”This is a new document.

The document deals with find and replace”.

10:15 ఇప్పుడు “Document ” అనే పదాన్ని“file” అనే పదం తో “Find and Replace” చేయండి.
10:21 మీ డాక్యుమెంట్ లోని “టెక్స్ట్ ” అనే పదాన్ని “t x t” తో బదిలీ చేయండి.
10:27 స్పెల్ చెక్ లక్షణం తో స్పెల్లింగ్ ను “టెక్స్ట్ ” గా సరి చేయండి.
10:31 డిఫాల్ట్ భాషా "English(USA)" ను ఉపయోగించండి.
10:36 "AutoCorrect" లక్షణం ఉపయోగించి “This is LibreOffice Writer” టెక్స్ట్ కు సంకేతాక్షరము “TLW” ను తయారు చేసి, దాని అమలు చూడండి.
10:48 * ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.

ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది

10:55 * మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు.
10:59 * స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది ఆన్లైన్ పరీక్షలు ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు జరిచేస్తుంది
11:09 *మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org కువ్రాయండి.
11:15 * స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
11:19 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
11:27 * ఈ మిషన్ గురించి http://spoken-tutorial.org/NME ICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
11:38 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తెసుకున్తున్నాను.ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Pratik kamble