LibreOffice-Suite-Draw/C2/Create-simple-drawings/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 12:43, 28 March 2016 by Chaithaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:02 లిబరే ఆఫీసు డ్రా లో హౌ టు క్రిఏట్ సింపుల్ డ్రాయింగ్స్ (How to Create Simple Drawings)పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది:
00:13 * రేఖలు, బాణాలు మరియు దీర్ఘ చతురస్రాల లాంటి ప్రాథమిక ఆకారాలు
00:17 * ప్రాథమిక రేఖాగణిత ఆకారాలు, చిహ్నాలు, నక్షత్రాలు, బ్యానర్ల ను వాడి సాధారణ రేఖా చిత్రాలు ఎలా సృష్టించాలి,
00:22 *ఒక ఆబ్జెక్ట్ ను ఎంచుకోవడం, తరలించడo మరియు తొలగించడo.
00:27 * రూలర్ (ruler) మరియు అలైన్(align) టూల్బార్ ను ఉపయోగించి ఆబ్జెక్ట్ లను సరైన స్థానంలో పెట్టడం .
00:33 ఇక్కడ, మనం ఉపయోగిస్తున్నది :
  • ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు
  • లిబరే ఆఫీసు సూట్ వర్షన్ 3.3.4.
00:42 ఆబ్జెక్ట్ అనే పదంను నిర్వచిద్దాం
00:44 ఆబ్జెక్ట్ అనే పదం , ' డ్రా (Draw)' లో ఉపయోగించే ఆకారాలు లేదా ఆకారాల

సమూహలను అనగా రేఖలు, చతురస్రాలు, బాణాలు, ఫ్లో చార్ట్ లు మరియు ఇతరులను సూచిస్తుంది.

00:55 ఈ స్లయిడ్లో చూపిన అన్ని ఆకారాలు ఆబ్జెక్ట్ లుగా సూచించ బడుతాయి.
00:59 డెస్క్టాప్ పై సేవ్ చేసిన "వాటర్ సైకిల్ (WaterCycle)"ఫైల్ ను తెరుద్దాం.
01:04 ముందుగా ఒక ఆబ్జెక్ట్ ను ఎలా ఎంచుకోవాలో నేర్చుకుoదాం.
01:08 మేఘాన్ని ఎంచుకోడానికి దాని పై క్లిక్ చేయండి.
01:13 ఇలా చేయడం వల్ల ఎనిమిది హ్యాండిల్స్ కనిపిస్తాయి.
01:16 హ్యాండిల్స్- హ్యాండిల్స్ అనగా ఎంచుకున్న ఆబ్జెక్ట్ యొక్క అన్ని పక్కల కనిపించే చిన్న నీలం లేదా ఆకుపచ్చ చతురస్రాలు.
01:22 హ్యాండిల్స్ మరియు వాటి ఉపయోగం గురించి తరువాతి ట్యుటోరియల్స్లో నేర్చుకుంటారు.
01:27 రేఖాచిత్రాన్నికి మరి కొన్ని ఆబ్జెక్ట్ స్ లను జోడి ద్దాం.
01:30 నేలను చూపడానికి ఒక దీర్ఘచతురస్రO జోడింద్దాం.
01:34 డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి , బేసిక్ షేప్స్ (Basic Shapes) పై క్లిక్ చేసి తరవాత రేక్ట్యాగిల్ Rectangle) పై క్లిక్ చేయండి .
01:39 కర్సరుని పేజీ(page) పైకి కదిపితే . ప్లస్ గుర్తు తో పాటు కాపిటల్ 'I' కనిపిస్తుంది.
01:45 ఒక దీర్ఘ చతురస్రం గీయడానికి మౌస్ ఎడమ బటన్ పట్టుకొని లాగండి .
01:50 మౌస్ బటన్ వదలండి.
01:52 నేల నుండి మబ్బుకి నీటి ఆవిరి యొక్క కదలిక చూపించడానికి కొన్ని బాణాలు గీద్దాం.
02:00 ఒక రేఖ గీయడానికి డ్రాయింగ్(Drawing) టూల్బార్లో లైన్(Line)పై క్లిక్ చేద్దాం.
02:04 పేజి(page)వైపు కర్సర్ ను కదపండి.
02:06 ప్లస్ గుర్తు తో ఒక స్లాన్టింగ్ డాష్ ను చూస్తారు.
02:10 మౌస్ ఎడమ బటన్ పట్టుకొని పై నుండి కిందికి లాగండి
02:15 ఒక సరళ రేఖ ను గీశారు !
02:17 లైన్ కు రెండు హ్యాండిల్స్ ఉన్నాయి.
02:20 రేఖకు ఒక ఆరో హెడ్ జోడిద్దాం.
02:23 రేఖను ఎంచుకోండి.
02:25 కంటేక్స్ట్ మెనూ కొరకు రైట్ క్లిక్ చేసి 'లైన్(Line)' 'పై క్లిక్ చెయ్యండి.
02:30 "లైన్(Line)" డైలాగ్ బాక్స్ చూస్తారు. ఆరో స్టైల్స్ (Arrow styles) ట్యాబ్ పై క్లిక్ చేసి తర్వాత' ఆరో స్టైల్(Arrow style) డ్రాప్-డౌన్ పై క్లిక్ చేయండి .
02:39 ఇది అందుబాటులో వున్న ఆరో స్టైల్స్ (Arrow styles)ని చూపిస్తుంది .
02:43 'ఆరో (Arrow)' అనే మొదటి ఎంపికను ఎంచుకోండి.
02:46 "ఓకే(ok)" క్లిక్ చేయండి.
02:48 ఇది లైన్ యొక్క రెండు చివరలకు ఆరో హెడ్స్ ను ఎంచుకున్న స్టైల్ లో జోడిస్తుంది.
02:52 కానీ మనకు లైన్ యొక్క ఒకే చివరలో ఆరో హెడ్ కావాలి.
02:57 కాబట్టి, ముందుగా " Ctrl + Z నొక్కి మార్పును "అన్డూ"("undo") చేద్దాం .
03:02 కాంటెక్స్ట్ మెనూ కోసం మళ్ళీ రైట్ క్లిక్ చేయండి.
03:05 'లైన్' '(Line)ట్యాబ్ పై క్లిక్ చేయండి.
03:09 ఆరో స్టైల్స్ (Arrow styles) కింద, స్టైల్ (style) “అనే ఫీల్డ్ చూస్తారు.
03:14 రెండు డ్రాప్-డౌన్ బాక్సులను చూస్తారు - ప్రతి లైన్ ముగింపు కోసం ఒకటి.
03:19 ఎడమ డ్రాప్ డౌన్ బాక్స్ పై క్లిక్ చేసి Arrow(ఆరో) ఎంచుకోండి.
03:23 కుడి డ్రాప్-డౌన్ బాక్స్లో, 'none(నన్)' ఎంచుకోండి.
03:26 "ఓకే(ok)" క్లిక్ చేయండి.
03:28 లైన్ పైన ముగింపు వద్ద ఒక ఆరో హెడ్ జతపర్చబదిందని గమనించండి.
03:33 “లైన్స్ అండ్ ఆరో స్(Lines and Arrows)” ఎంపిక వాడి కూడా బాణాలు గీయవచ్చు.
03:38 ఈ బాణం పక్కన ఇంకా రెండు బాణాలు గీద్దాం.
03:42 డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి Lines and Arrows పై క్లిక్ చేసి Line Starts with Arrow ఎంచుకోండి.
03:48 డ్రా పేజీ(Draw page)' కి కర్సరును కదపండి
03:51 మౌస్' ఎడమ బటన్ పట్టుకొని పై నుండి కిందికి లాగండి.
03:56 బాణాన్ని ఈ విధంగా గీయడం సులభం కదా ?
04:00 ఇదే పద్ధతిలో మరో బాణం జోడించండి .
04:06 ఈ ట్యుటోరియల్ లో విరామం తీసుకొని ఈ అసైన్మెంట్ చేయండి.
04:09 “మై వాటర్ సైకిల్(MyWaterCycle) ”, ఫైల్ లో ఒక లైన్ గీయండి.
04:13 లైన్ ఎంచుకొని 'లైన్' '(Line)డైలాగ్ బాక్స్ తెరవండి.
04:16 లైన్ ప్రాపర్టీస్(Line Properties) ఫీల్డ్ కింద, లైన్ల యొక్క style, color, width మరియు transparency మార్చండి .
04:24 ఆరో స్టైల్స్(Arrow Styles) ఫీల్డ్ కింద , ఆరో స్టైల్స్ మార్చండి .
04:28 తర్వాత, ఒక స్టార్ గీద్దాం .
04:31 'డ్రాయింగ్(Drawing)' టూల్బార్ వద్దకు వెళ్ళి స్టార్స్(Stars) పక్కన చిన్న నల్ల త్రికోణం క్లిక్ చేయండి.
04:37 5-పాయింట్ స్టార్(5-Point Star) ఎంచుకొండి.
04:41 మబ్బు పక్కన కర్సర్ని ఉంచండి.
04:44 'మౌస్' ఎడమ బటన్ పట్టుకొని, ఎడమ వైపు కు లాగండి.
04:48 ఒక స్టార్ని గీశారు !
04:50 ఆబ్జెక్ట్ ను ఎలా తరలించాలో మరియు ఎలా తొలగించాలో నేర్చుకుందాం.
04:54 ఆబ్జెక్ట్ ను కదపడానికి, దానిని ఎంచుకోని, కావలసిన స్థానానికి లాగండి.
04:59 'మౌస్' బటన్ వదలండి.
05:02 కీబోర్డ్ పై వున్న అప్, డౌన్, మరియు సైడ్ బాణం(up, down and side arrow) కీలను వాడి ఒక ఆబ్జెక్ట్ను తరలించవచ్చు.
05:08 ఆబ్జెక్ట్ లను కదపడం తేలిక కదా ?
05:11 ఒక ఆబ్జెక్ట్ ను తొలగించడానికి, దానిని ఎంచుకొని కీబోర్డ్ నుండి డిలీట్(Delete) కీ నొక్కండి.
05:17 ఆబ్జెక్ట్ తొలగించబడింది. ఇది కూడా తేలిక.
05:20 ప్రాథమిక సహాయాలు -రూలర్ (Ruler) మరియు అలైన్(align ) టూల్బార్ల గురిoచి నేర్చుకుందాం.
05:26 పేజీ మార్జిన్లు ఏర్పాటు చేయడానికి, మరియు కొలతల యూనిట్లు సవరించడానికి 'రూలర్' ను ఉపయోగిస్తారు.
05:31 అలైన్(Align) టూల్బార్ని ఆబ్జెక్ట్ లను సరైన స్థానం లో పెట్టడానికి ఉపయోగిస్తారు.
05:35 'రూలర్(Ruler) డ్రా వర్క్ స్పేస్ (Draw workspace)' 'పైన మరియు ఎడమ వైపు కనిపిస్తుంది.
05:40 కొలతల యూనిట్లు ఏర్పాటు చేయడానికి, పైన వున్న 'రూలర్(Ruler)' పై రైట్ క్లిక్ చే యండి .
05:45 కొలత యూనిట్ల జాబితా చూస్తారు.
05:48 'సెంటీమీటర్(Centimeter)పై క్లిక్ చేయండి.
05:50 పైన ఉన్నరూలర్(top ruler)కి కొలత యూనిట్ సెంటీమీటర్కు సెట్ చేయబడినది .
05:55 అదే విధంగా, ఎడమ వైపు రూలర్(ruler)కి కొలతలు సెట్ చేద్దాం.
06:00 ఆబ్జెక్ట్ స్ లను సరైన స్కేల్ కు చిత్రీకరించుటకు, రెండు రూలర్ల కొలతలు ఒకే యూనిట్కు సెట్ చేయ్యడం గుర్తుంచుకోండి.
06:08 వాడుకలో వున్న రూలర్ తెలుపురంగులో ఉందని గమనించoడి.
06:12 'పేజీ సెటప్(Page Setup)' 'లో సెట్ చేసిన పేజీ మార్జిన్ల విలువలను రూలర్(ruler) చివరలు సూచిస్తాయి.
06:19 ఆబ్జెక్ట్ స్ కోసం కొలతలను 'రూలర్(Ruler)' ఎలా ప్రదర్శిస్తుందో చూద్దాం.
06:23 క్లౌడ్ ఎంచుకోండి.
06:25 మీరు రూలర్(ruler) పైన రెండు చిన్న ప్రారంభ మరియు ముగింపు మార్కులు చూసారా?
06:29 ఇవి మేఘం అంచులని నిర్వచిస్తాయి.
06:32 రూలర్ పై ఈ మార్కులు తరలిస్తే, తదనుగుణంగా చిత్రంలో మార్పులు గమనించవచ్చు.
06:38 రూలర్ 'పేజీ' పై ఒక ఆబ్జెక్ట్ యొక్క పరిమాణం చూపిస్తుంది.
06:42 ఇది ఆబ్జెక్ట్ ను పేజీ పై ఉంచడానికి అనుమతిస్తుంది మరియు పేజీ సరిహద్దులు చూపిస్తుంది.
06:49 మరొక ప్రాథమిక సహాయం- అలైన్(align ) టూల్బార్ వద్దకు వెళ్దాం.
06:53 అలైన్(align ) టూల్బార్ ఉపయోగించి ఎంచుకున్న ఆబ్జెక్ట్ ను ఎడమకి, కుడికి, పైకి, క్రిందకి మరియు మధ్యలోకి సమలేఖనం చేయవచ్చు .
07:01 "అలైన్(Align)" టూల్బార్ను ఎనేబుల్ చేయడానికి మెయిన్ మెనూ(Main Menu) వద్దకు వెళ్ళి “వ్యూ(View)” పై క్లిక్ చేయండి.
07:07 “వ్యూ(View)” మెనూ , దిగువన టూల్బార్స్(Toolbars) పై క్లిక్ చేయండి.
07:11 మీరు టూల్బార్స్ యొక్క జాబితా చూస్తారు.
07:13 "అలైన్(Align)" క్లిక్ చేయండి.
07:15 "అలైన్(Align)" టూల్బార్ చూస్తారు.
07:18 వివిధ "అలైన్(Align)" ఎంపికలు ఉపయోగించినప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఎలా సమలేఖనo చేయబడుతుందో చూద్దాం.
07:24 క్లౌడ్ ఎంచుకోండి.
07:26 అలైన్(Align) టూల్బార్ పైన , లెఫ్ట్(Left) క్లిక్ చేయండి.
07:29 మేఘం ఎడమ వైపు సమలేఖనo చేయబడినది .
07:32 సెంటర్డ్” ('Centered)మరియు Centre(సెంటర్)” eeరెండు ఎంపికల మధ్య వ్యత్యాసం అర్థం చేసుకుందాం.
07:38 మనం వృత్తాన్ని “Centre(సెంటర్)” కు సమలేఖనo చేసి తర్వాత సెంటర్డ్ (Centered)కు చేద్దాం.
07:43 ముందుగా, వృత్తాన్ని కుడి వైపుకు సమలేఖనo చేద్దాం.
07:47 వృత్తాన్ని ఎంచుకొని “అలైన్ (Align)” టూల్బార్ పై క్లిక్ చేసి, 'రైట్(Right)' పై క్లిక్ చేయండి.
07:52 అలైన్(Align) టూల్బార్ లో నుండి , Centre(సెంటర్)పై క్లిక్ చేయండి.
07:56 వృత్తం మధ్య స్థానానికి సమలేఖనం అయింది .
07:59 సెంటర్(Centre) ఎంపిక ఆబ్జెక్ట్ ను సరిగ్గా పేజీ ఎగువ మరియు దిగువన అంచుల మధ్య కేంద్ర్రేకరిస్తుంది.
08:06 ఇది పేజీ వెడల్పు తో పాటు ఆబ్జెక్ట్స్ ను తరలించదు.
08:10 'అలైన్(Align)' టూల్బార్ నుండి," సెంటర్డ్(Centered) " ఎంచుకోండి.
08:15 వృత్తం పేజీ మధ్యలో కి సర్దుబాటు చేయబడినది.
08:18 సెంటర్డ్ (Centered)ఎంపిక వృత్తాన్ని పేజీ మధ్యలో కి సర్దుబాటు చేస్తుంది.
08:23 ఇది ఎగువ మరియు దిగువ అంచులు మరియు పేజీ వెడల్పు కు అనుగుణముగా ఆబ్జెక్ట్ లను తరలిస్తుంది.
08:33 నమూనా రేఖా చిత్రం ప్రకారం ఆబ్జెక్ట్ లను తిరిగి సరైన స్థానాలకు తరలిద్దాం.
08:40 ఫైల్ని మూసే ముందు దానిని "సేవ్(save)"చేయడం గుర్తు పెట్టుకోండి.
08:43 ఒక అసైన్మెంట్,
08:46 "మై వాటర్ సైకిల్ (MyWaterCycle)" ఫైల్ లో, ఒక పేజీని జోడించండి.
08:50 ఈ రెండు చిత్రాలను సృష్టించoడి.
08:53 ఆరో కీలను ఉపయోగించి వాటిని తరలించoడి.
08:55 గీసిన ఏ ఆబ్జెక్ట్ నైన ఎంచుకోని తొలగించండి.
08:59 కొన్ని ఆబ్జెక్ట్ ల యొక్క పరిమాణాన్ని కొలవడానికి రూలర్ (ruler)ను ఉపయోగించండి.
09:04 "అలైన్(Align)" టూల్బార్ ఉపయోగించి ఆబ్జెక్ట్ లను పేజీ మధ్యలోకి సమలేఖనం చేయండి.
09:11 ఇప్పుడు డ్రా ( Draw ) ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
09:15 ఈ ట్యుటోరియల్లో, మనం నేర్చుకున్నది ఈ కింది వాటిని వాడి సాధారణ రేఖా చిత్రాలను ఎలా సృష్టించాలి:
09:19 *ప్రాథమిక ఆకారాలు అనగా రేఖలు, బాణాలు, దీర్ఘ చతురస్రాలు.
09:24 * ప్రాథమిక రేఖాగణిత ఆకారాలు, చిహ్నాలు, నక్షత్రాలు మరియు బ్యానర్లు.
09:29 ఒక ఆబ్జెక్ట్ని ఎంచుకోని తొలగించడం నేర్చుకున్నారు.
09:32 రూలర్ (ruler) మరియు అలైన్(align) టూల్బార్లను ఉపయోగించి ఆబ్జెక్ట్ లను సరైన స్థా నం లో పెట్టడం .
09:37 ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
09:41 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ సారాంశం.
09:44 మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడండి.
09:48 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం:
09:51 * స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
09:54 ఆన్లైన్ పరీక్ష లో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది .
09:58 మరిన్ని వివరాలకు contact@spoken-tutorial. org ను సంప్రదించండి.
10:04 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
10:09 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
10:17 ఈ మిషన్ గురించి స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ org స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
10:27 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నే ను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Chaithaya, Madhurig, Pratik kamble