LibreOffice-Suite-Calc/C3/Linking-Calc-Data/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 12:56, 29 March 2013 by Udaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 లిబ్రే ఆఫీస్ Calc లో లింకింగ్ ఇన్ కాల్క్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం
00:06 ఈ ట్యుటోరియల్ లో మీరు ఈ క్రింది వాటి గురించి నేర్చుకుంటారు:
00:10 Calc లో ఇతర షీట్లను ఎలా రిఫరెన్స్ చేయాలి
00:13 Calc లో హైపర్ లింక్స్ ఎలా ఉపయోగించాలి
00:17 ఇక్కడ మనము Ubuntu Linux version 10.04 ను మన ఆపరేటింగ్ సిస్టమ్ గా మరియు లిబ్రేఆఫీస్ సూట్ 3.3.4. ను వాడుతున్నాము.
00:29 లిబ్రే ఆఫీస్ Calc మిమ్మలిని
00:33 మరొక షీట్ లో ఉన్న సెల్ నుండి ప్రస్తుతము ఉన్న సెల్ కు
00:37 ఒకవేళ మీరు రెండు స్ప్రెడ్ షీట్లను సేవ్ చేసి ఉంటే, మరొక స్ప్రెడ్ షీట్ నుండి సెల్ రిఫరెన్స్ కొరకు అనుమతిస్తుంది.
00:44 మనము "Personal-Finance-Tracker.ods" ను ఓపెన్ చేద్దాము.
00:49 మన ఫైల్ యొక్క షీట్ 1 లో "Personal-Finance-Tracker.ods" కొరకు స్ప్రెడ్ షీట్ ఉంటుంది.
00:55 నేను "Spent" మరియు "Received" వరుసలో కొంత మొత్తమును చేర్చాను.
01:04 ఇప్పుడు, మనము వరుసగా "Cost" మరియు "Spent" వరుసలలో ఉన్న మొత్తాన్ని కనుగొందాము.
01:11 C9 అని రిఫరెన్స్ చేయబడిన సెల్ పై క్లిక్ చేయండి మరియు "is equal to SUM" అనే సూత్రాన్ని మరియు బ్రేసెస్ లో "C3 colon C7" అని ఎంటర్ చేయండి.
01:24 తరువాత ఎంటర్ కీ ప్రెస్ చేయండి.
01:27 D9 అని రిఫరెన్స్ చేయబడిన సెల్ పై క్లిక్ చేయండి మరియు అదే సూత్రాన్ని ఉపయోగిస్తూ మొత్తాన్ని కనుగొనండి.
01:36 ఇప్పుడు, సెల్ రిఫరెన్సింగ్ ఉపయోగించి వేరొక షీట్ పై "Cost" మరియు "Spent" క్రింద మొత్తము బ్యాలెన్స్ చూపిద్దాము.
01:45 "Sheet 2" ట్యాబ్ పై క్లిక్ చేద్దాము.
01:48 ఇది కొత్త షీట్ ను ఓపెన్ చేస్తుంది.
01:51 ఇప్పుడు A1 అని రిఫరెన్స్ చేయబడిన సెల్ పై క్లిక్ చేయండి మరియు "COMPONENT" అనే హెడ్డింగ్ ను దాని లోపల టైప్ చేయండి.
02:00 B1 అని రిఫరెన్స్ చేయబడిన సెల్ పై క్లిక్ చేయండి మరియు "BALANCE" అనే హెడ్డింగ్ ను దాని లోపల టైప్ చేయండి.
02:07 ఇప్పుడు, హెడ్డింగ్ క్రింద కాంపొనెంట్స్ పేర్లను ఎంటర్ చేద్దాము.
02:12 A3 అని రిఫరెన్స్ చేయబడిన సెల్ పై క్లిక్ చేయండి మరియు "COSTS" అని టైప్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి.
02:19 "COSTS" క్రింద, మనము తరువాతి కాంపొనెంట్ ను "SPENT" అని A4 గా రిఫరెన్స్ చేయబడిన సెల్ లో ఎంటర్ చేద్దాము.
02:27 ఇప్పుడు, ఖాళీ సెల్ B3 పై క్లిక్ చేయండి.
02:31 B3 మరియు B4 సెల్స్ "COST" మరియు "SPENT" అనే హెడ్డింగ్ ల క్రింద మొత్తము బ్యాలెన్స్ కలిగి ఉంటాయి.
02:38 దీనిని మనము "Sheet 1" లో లెక్కించాము.
02:41 ఇది రిఫరెన్సింగ్ ద్వారా చేయబడుతుంది.
02:44 B3 సెల్ లో సెల్ రిఫరెన్స్ చేయుటకు, "Input Line" పక్కన ఉన్న "equal to" చిహ్నము పై క్లిక్ చేయండి.
02:53 ఇప్పుడు, షీట్ ట్యాబ్ పై "Sheet 1" పై క్లిక్ చేయండి.
02:59 ఈ షీట్ లో, మనము C9 సెల్ పై క్లిక్ చేస్తాము. ఇది "Costs" అనే వరుస క్రింద మొత్తమును కలిగి ఉంటుంది.
03:07 "Input line" లో "Sheet 1 dot C9" స్టేట్మెంట్ ప్రదర్శించబడుతుందని గమనించండి.
03:15 "Sheet 1 ట్యాబ్ లో "Costs" క్రింద గ్రాండ్ టోటల్ "Sheet 2" ట్యాబ్ లో B3 అని రిఫరెన్స్ చేయబడిన సెల్ లోనికి ఆటోమాటిక్ గా ఎంటర్ అవుతుందని గమనించండి.
03:20 అలాగే, రిఫరెన్సింగ్ ద్వారా మనము ఇతర కాంపొనెంట్స్ యొక్క గ్రాండ్ టోటల్స్ ను ఎంటర్ చేయగలము.
03:34 ఒకవేళ ఎక్కువ డేటా కంటెంట్ తో చాలా షీట్లు ఉంటే, వాటి సారాంశమును తీయుటకు రిఫరెన్సింగ్ ఉపయోగకరముగా ఉంటుంది.
03:41 ఇప్పుడు, Calc షీట్లలో హైపర్ లింక్స్ ఎలా సృష్టించాలో నేర్చుకుందాము.
03:49 ఈ షీట్ లో, మనము C9 సెల్ పై క్లిక్ చేస్తాము. ఇది "Costs" అనే వరుస క్రింద మొత్తమును కలిగి ఉంటుంది.
03:55 మీరు

ఒక స్ప్రెడ్ షీట్ లో వేరొక స్థానమునకు వేరువేరు ఫైల్స్ లోకి లేదా వెబ్ సైట్లలోనికి కూడా. జంప్ చేయుటకు హైపర్ లింక్స్ ఉపయోగించవచ్చు

04:06 "Personal-Finance-Tracker.ods" లో,

పర్సనల్ ఫైనాన్స్ ట్రాకర్ "Sheet 1" లో ఉంది మరియు మిగిలిన కంటెంట్ "Sheet 2" లో ఉంది.

04:17 మనము Sheet 1 నుండి Sheet 2 కు జంప్ చేయవలసి ఉంటే
04:22 ముందుగా, "Sheet 1" ట్యాబ్ పై క్లిక్ చేయండి.
04:25 ఇక్కడ, B14 అని రిఫరెన్స్ చేయబడిన సెల్ పై క్లిక్ చేద్దాము మరియు "Sheet2 అని ఎంటర్ చేద్దాము.
04:33 "Input line" పై "Sheet 2" అనే పేరు కనిపించడము మీరు చూడవచ్చు.
04:38 ఇప్పుడు, Input line లో "Sheet 2" అనే టెక్స్ట్ ఎంచుకోండి.
04:44 టెక్స్ట్ ను ఎంచుకున్న తరువాత, టూల్ బార్ లో ఉన్న "Hyperlink" ఐకాన్ పై క్లిక్ చేయండి.
04:51 Hyperlink డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
04:55 ఎడమవైపు, మనము "Document" ఐఛ్చికమును ఎంచుకుందాము.
04:59 డైలాగ్ బాక్స్ లో "Target in document" ఐకాన్ పై క్లిక్ చేయండి.
05:04 ఒక కొత్త "Target in document" డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
05:08 ఇప్పుడు, "Sheet " ఆప్షన్ పక్కన ఉన్న "plus sign" పై క్లిక్ చేయండి.
05:13 కనిపించే డైలాగ్ బాక్స్ లో, "Sheet 2" ఆప్షన్ పై క్లిక్ చేయండి.
05:18 ఇప్పుడు, "Apply" బటన్ పై క్లిక్ చేయండి మరియు ఆ తరువాత "Close" బటన్ పై క్లిక్ చేయండి.
05:24 ఇప్పుడు, హైపర్ లింక్ డైలాగ్ బాక్స్ నుండి, "Apply" పై క్లిక్ చేయండి మరియు ఆ తరువాత "Close" పై క్లిక్ చేయండి.
05:32 సెల్ లో "Sheet 2" హై లైట్ అయిన టెక్స్ట్ తో "Sheet 1" ట్యాబ్ ముందుగా కనిపిస్తుంది
05:40 ఇప్పుడు, మనము "Sheet 2" పై క్లిక్ చేసినప్పుడు, కాస్ట్స్ కొరకు బ్యాలెన్స్ ను ఎంటర్ చేసిన షీట్ కు అది మనలను నేరుగా తీసుకెళ్తుంది.
05:51 మనము ఒక హైపర్ లింక్ సృష్టించాము!
05:55 హైపర్ లింక్ ను తొలగించుటకు, ముందుగా హైపర్ లింక్ చేయబడిన టెక్స్ట్ "Sheet 2" ను ఎంచుకోండి.
06:01 ఇప్పుడు రైట్ క్లిక్ చేయండి మరియు కాంటెక్స్ట్ మెనూ నుండి, "Default Formatting" ఆప్షన్ పై క్లిక్ చేయండి.
06:09 టెక్స్ట్ ఇకపై హైపర్ లింక్ కలిగి ఉండదు.
06:12 ఇది డాక్యుమెంట్ లో మిగతా సాధారణ టెక్స్ట్ వంటిదే.
06:16 మనము మార్పులను అండూ చేద్దాము.
06:20 దీనితో మనము లిబ్రే ఆఫీస్ కాల్క్ పై స్పోకెన్ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
06:25 సారాంశము తెలుసుకొనుటకు, మనము ఈ క్రింది విషయమును నేర్చుకున్నాము:

Calc లో ఇతర షీట్లకు రిఫరెన్స్

06:31 Calc లో హైపర్ లింక్స్ ఉపయోగించడము.
06:36 ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
06:40 అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశమును అందిస్తుంది.
06:43 ఒకవేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకుంటే, మీరు దానిని డౌన్ లోడ్ చేసుకొని చూడవచ్చు.
06:47 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం

స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.

06:52 ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి సర్టిఫికేట్స్ ఇస్తుంది.
06:56 మరిన్ని వివరముల కొరకు, దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
07:03 స్పొకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము.
07:07 దీనికి ఐసీటీ, యం హెచ్ ఆర్ డీ, భారత ప్రభుత్వము వారిచే నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారము అందిస్తోంది
07:15 ఈ మిషన్ గురించి మరింత సమాచారము

spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro వద్ద అందుబాటులో ఉంది.

07:25 ఈ ట్యుటోరియల్ దేశీ క్రూ సొల్యూషన్స్ ప్రై. లి. వారిచే అందించబడింది. పాల్గొన్నందుకు ధన్యవాదములు
ఈ స్క్రిప్ట్ ను అనువదించినవారు భరద్వాజ్ మరియు నిఖిల.

Contributors and Content Editors

Madhurig, Pratik kamble, Udaya