LibreOffice-Suite-Calc/C2/Working-with-Sheets/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 14:51, 1 November 2013 by Chaithaya (Talk | contribs)

Jump to: navigation, search

Resources for recording Working with Sheets

VISUAL CUE NARRATION
00.00 Spoken tutorial కు స్వాగతం LibreOffice Calc- cells మరియు sheets తో పని చేయుట.
00:07 ఈ tutorial లో మనం నేర్చుకునేది:
00:09 rows మరియు columns ను చేర్చుట మరియు తొలగించుట.
00:13 sheets ను చేర్చుట మరియు తొలగించుట. sheets కు మళ్ళీ పేరు పెట్టుట
00:17 మనం ఇక్కడ operating system Ubuntu Linux version 10.04 మరియు LibreOffice Suite version 3.3.4. ను ఉపయోగిస్తున్నాము
00:29 ఒక spreadsheet లో rows మరియు columns ఎలా చేర్చాలో మరియు ఎలా చెరిపి వేయాలో అనే దానితో ఈ ట్యుటోరియల్ మొదలు పెడదాం
00:35 “personal finance tracker.ods” fileతెరుద్దాం
00:42 columns మరియు rows విడిగా లేదా గుంపుగా చేర్చవచ్చు
00:47 ఎక్కడైతే కొత్త column లేదా row ను చేర్చాలో అక్కడ cell, column లేదా row ను ఎంచుకొని, spreadsheet లో column లేదా row ను చేర్చవచ్చు
01:00 ఉదాహరణకు “personal finance tracker.ods” file లో ఎక్కడైనా మొదటి row వద్ద క్లిక్ చేయండి
01:09 “Cost” రాసి వున్న సెల్ పై క్లిక్ చేస్తాను
01:13 ఇప్పుడు menu bar లోని “Insert” option పై క్లిక్ చేసి తర్వాత “Rows”పై క్లిక్ చేయండి
01:19 ఎంచుకున్న row పై ఒక కొత్త row చేరడం గమనించవచ్చు
01:25 అదేవిధముగా, ఒక కొత్త column చేర్చడానికి menu bar లోని “Insert” option పై క్లిక్ చేసి “columns”పై క్లిక్ చేయండి
01:34 ఎంచుకున్నcell column పై ఒక కొత్త column చేరడం గమనించవచ్చు
01:40 ఇప్పుడు మనం చేసిన మార్పులను చెరిపి వేద్దాం
01:44 ఒకవేళ మీరు వర్ణమాల తో సుచించబడే column పై లేదా అంకెలతో సుచించబడే row పై క్లిక్ చేసి column ను లేదా row ను ఎంచుకున్నట్లయితే, కుడి button click చేసి drop down menu లో కనిపించే Insert Columns లేదా Insert Rows option పై క్లిక్ చేసి ఒక కొత్త column లేదా row ను చేర్చవచ్చు
02:04 ప్రత్యామ్నాయంగా కర్సర్ తో సెల్ పై క్లిక్ చేసి cell ను ఎంచుకోండి. తర్వాత కుడి button click చేసి Insert option ఎంపిక చేయండి . ఒక dialog box కనిపిస్తుంది
02:18 Entire Row లేదా Entire Column option ను ఎంచుకొని row లేదా column ను చేర్చవచ్చు.
02:25 ఒకేసారి చాలా columns లేదా rows చేర్చాలంటే, మొదటి సెల్ పై మౌస్ యొక్క ఎడమ బటన్ పట్టుకొని ఎన్ని columns లేదా rows చేర్చాలో వాటిని ప్రధానదృశ్యంగా చూపిస్తూ అదే మొత్తం లో identifiers ను లాగాలి
02:43 ఇక్కడ నలుగు సెల్ల్స్ ను ప్రధానదృశ్యంగా చూపిస్తున్నాము
02:47 ముందుగ వివరించిన పద్దతిలో నుండి ఒక దాని ద్వార కొత్త rows లేదా columns ను చేర్చండి. నేను కొత్త rows చేర్చలనుకుంటున్నాను కనుక నా ఎంపిక పై కుడి బటన్ నొక్కి Insert option ను ఎంపిక చేసుకుంటాను
03:00 Entire Row option ఎంపిక చేసుకొని “OK” button పై click చేస్తాను. ఎంపిక చేసుకున్నrows లోని మొదటి row పై నాలుగు కొత్త row లు చేరడం గమనించండి.
03:14 తర్వాత columns విడిగా మరియు సముహముగా ఎలా తొలగించాలో నేర్చుకుందాం
03:20 విడిగా ఒక column లేదా row తొలగించాలంటే, తొలగించాలనుకుంటున్న column లేదా row ను ఎంపిక చేసుకోండి
03:28 ఉదాహరణకు “Laundry” column ను తొలగించాలంటే. ఆ column లోని ఒక సెల్ పై క్లిక్ చేయడం ద్వార ఆ column ను ఎంచుకోండి
03:37 ఇప్పుడు cell పై కుడి button ను క్లిక్ చేసి “Delete” option ను క్లిక్ చేయండి
03:43 “Delete Cells” అనే heading తో ఒక dialog box కనిపిస్తుంది
03:47 “Shift cells up” option పై క్లిక్ చేసి “OK” button పై క్లిక్ చేయండి
03:53 ఆ సెల్ తొలగించబడి ఆ సెల్ యొక్క కింది సెల్ల్స్ పైకి రావడం గమనించండి. ఈ క్రియను రద్దు చేద్దాం
04:01 ఇప్పుడు మనం సముహముగా columnsలేదాrows ఎలా తొలగించాలో చూద్దాం
04:08 ఉదాహరణకు ఒకవేళ మీరు “Miscellaneous” అని వ్రాసి వున్నrow ను తొలగించాలని అనుకుంటే, మొదటగా వరుస సంక్య 6 వున్నా సెల్ ను ఎంపిక చేసుకోండి
04:18 ఇప్పుడు ఆ సెల్ పై మౌస్ యొక్క ఎడమ బటన్ పట్టుకొని ఆ మొత్తం రో పై లాగండి. ప్రత్యామ్నాయంగా తొలగించాలనుకుంటున్న row పై క్లిక్ చేయండి. Row అంతా ప్రధానాంశంగా చూపబడుతుంది
04:33 సెల్ పై కుడి బటన్ తో క్లిక్ చేసి “Delete” పై క్లిక్ చేయండి
04:38 “Delete Cells” శీర్షిక తో ఒక dialog box తెరుచుకుంటుంది
04:43 “Shift cells up” ఎంపిక పై క్లిక్ చేసి “OK” button క్లిక్ చేయండి
04:48 ఆ row అంత తొలగించబడి కింది రో పైకి రావడం గమనించండి
04:55 అదేవిధముగా rows కాకుండా columns ను ఎంపిక చేసుకోవడం ద్వారా columns తొలగించవచ్చు . ఈ క్రియ ను రద్దు చేద్దాం
05:04 rows మరియు columns ను సముహముగా ఎలా చేర్చాలో మరియు ఎలా తొలగించాలో నేర్చుకున్న తర్వాత Calc లో sheets ను ఎలా చేర్చాలో మరియు ఎలా తొలగించాలో నేర్చుకుందాం
05:14 calc లో ఒక కొత్త sheet ను చేర్చడానికి చాల పద్దతులు వున్నవి. వీటన్నింటిని వరుసగా నేర్చుకుందాం
05:23 అన్నింటిల్లో మొదటి పద్ధతి ఎ sheet తర్వాత కొత్త sheet చేర్చాలో ఆ sheet ను ఎంపిక చేసుకోండి
05:30 menu bar లో నుండి “Insert” ఎంపిక పై క్లిక్ చేసి “Sheet” పై క్లిక్ చేయండి.
05:36 “Insert Sheet” శీర్షిక తో ఒక dialog box తెరుచుకుంటుంది.
05:41 ఇప్పుడు “After current sheet” అనే radio button ఎంపిక చేసుకోండి . ఇది ప్రస్తుత sheet తర్వాత ఒక కొత్త sheet ను చేర్చుతుంది
05:49 “Name” field లో ఈ కొత్త sheet యొక్క పేరు“Sheet 4” గా తెలియజేస్తుంది
06:01 “OK” button పై క్లిక్ చేయండి. ప్రస్తుత sheet తర్వాత కొత్త sheet చేరడం గమనించండి
06:09 మరొక పధ్ధతి. Calc window లోని కింది ఎడమ భాగం లో ప్రస్తుత sheet tab పై మౌస్ యొక్క కుడి బటన్ తో క్లిక్ చేసి కొత్త షీట్ ను చేర్చవచ్చు
06:19 మీరు position, number of sheets మరియు name లను ఎంపిక చేసుకోవచ్చు . “OK” button పై క్లిక్ చేయండి. ఇది అదేవిధంగా sheet ను చేరుస్తుంది
06:31 మరొక సులభ పద్దతి. షీట్ ట్యాబు పక్కన ప్లస్ గుర్తు తో సూచించబడిన “Add Sheet” button పై క్లిక్ చేసి

ప్రస్తుత షీట్ తర్వాత కొత్త షీట్ ను చేర్చవచ్చు

06:43 దీనిని క్లిక్ చేయడం ద్వారా , వరుసలో చివరగా వున్నా షీట్ తర్వాత ఒక కొత్త షీట్ స్వతస్సిద్ధంగా చేర్చబడుతుంది
06:51 చివరి పద్ధతి. కింద వున్న షీట్ ట్యాబు పక్కన ప్లస్ గుర్తు తో సూచించబడిన “Add Sheet” పక్క వున్న ఖాలీ ప్రదేశం లో క్లిక్ చేయడం ద్వార వచ్చే “Insert Sheet” dialog box ద్వారా కొత్త షీట్ ను చేర్చవచ్చు
07:06 ఖాలీ ప్రదేశం లో క్లిక్ చేయడం ద్వారా Insert Sheet” dialog box కనిపిస్తుంది
07:13 మీరు dialog box లో sheet వివరాలు ప్రవేశింప చేసి “OK” button పై క్లిక్ చేయండి
07:20 sheets ను ఎలా చేర్చాలో నేర్చుకున్న తర్వాత మనం sheets ను ఎలా తొలగించాలో నేర్చుకుందాం
07:27 sheets ను విడిగా లేదా సముహముగా తొలగించవచ్చు
07:31 ఒక sheet ను తొలగించాలంటే, ఏ sheet తొలగించాలో ఆ sheet tab పై మౌస్ యొక్క కుడి బటన్ తో క్లిక్ చేయాలి. ఆ తర్వాత pop up menu లో నుండి “Delete Sheet” ఎంపిక ఫై క్లిక్ చేసి “Yes” ఎంపిక పై క్లిక్ చేయండి
07:45 షీట్ తొలగించాబడడం గమనించండి
07:48 మరొక పద్ధతి. menu bar లో నుండి “Edit” ఎంపిక ద్వారా ఆ ప్రత్యేకమైన sheet ను తొలగించవచ్చు
07:55 ఉదాహరణకు ఒకవేళ మీరు జాబితా నుండి “Sheet 3” ను తొలగించాలంటే menu bar లో నుండి “Edit” ఎంపిక పై క్లిక్ చేసి తర్వాత“Sheet” ఎంపిక పై క్లిక్ చేయండి
08:05 ఇప్పుడు మీరు pop up menu నుండి “Delete” ఎంపిక పై క్లిక్చేసి తర్వాత “Yes” ఎంపిక పై క్లిక్ చేయండి
08:12 షీట్ తొలగించాబడడం గమనించండి. ఈ డాక్యుమెంట్ లో చేసిన మార్పులను చేరిపివేద్దాం
08:19 sheets ను సముహముగా తొలగించాలంటే, ఉదాహరణకు ఒకవేళ “Sheet 2” మరియు “Sheet 3” తొలగించాలంటే ముందుగా “Sheet 2” tab పై క్లిక్చేసి keyboard పై వున్న “Shift” button పట్టుకొని “Sheet 3”tab పై క్లిక్ చేయండి
08:36 ఇప్పుడు ఇందులోనుండి ఒక tab పై కుడి బటన్ తో క్లిక్ చేసి, pop-up menuలో “Delete Sheet” ఎంపిక పై క్లిక్ చేసి , “Yes” ఎంపిక పై క్లిక్ చేయండి
08:47 రెండు షీట్స్ చెరిపి వెయ బడడం గమనించండి. ఇక నేర్చుకోవడానికి మనం చేసిన మార్పులను రద్దు చేద్దాం
08:56 ఒక ప్రత్యేకమైన షీట్ ను తొలగించడానికి మరొక పద్ధతి menu barలోనుండి “Edit” ఎంపిక ఉపయోగించడం.
09:03 ఉదాహరణకు జాబితా లో నుండి “Sheet 6” మరియు “Sheet 7” చేరిపివేయాలంటే menu bar లో నుండి “Edit” option క్లిక్ చేసి ఆ తర్వాత “Sheet” ఎంపిక పై క్లిక్ చేయాలి
09:14 pop up menu లో నుండి “Select” ఎంపిక పై క్లిక్ చేయాలి
09:19 dialog box లో నుండి “Sheet 6”ఎంపిక పై క్లిక్ చేసి తర్వాత keyboard పై వున్న “Shift” button ని పట్టుకొని “Sheet 7” పై క్లిక్ చేయాలి
09:30 “OK” button పై క్లిక్ చేయాలి. ఇది మనం తొలగించాలనుకున్నsheets ను ఎంపిక చేసుకుంటుంది
09:37 ఇప్పుడు మళ్లీ menu bar నుండి “Edit” ఎంపిక పై క్లిక్ చేసి తర్వాత “Sheet” ఎంపిక పై క్లిక్ చేయాలి.
09:45 pop up menu నుండి “Delete” ఎంపిక పై క్లిక్ చేసి తర్వాత “Yes” ఎంపిక పై క్లిక్ చేయాలి
09:51 ఎంపిక చేసుకున్న sheets తొలగించాబడడం గమనించండి
09:56 Calc లో షీట్స్ ఎలా తొలగించాలో నేర్చుకున్న తర్వాత, spreadsheet లో షీట్స్ కు మళ్లీ పేరు ఎలా పెట్టాలో నేర్చుకుందాం
10:03 spreadsheet లో వివిధ sheets పేర్లు “Sheet 1”, “Sheet 2”, “Sheet 3” మరియు ఆప్రకారము గా వుండడం గమనించండి
10:13 ఒకవేళ spreadsheet చిన్నదిగా వుండి చాల తక్కువ sheets ను కలిగి వున్నప్పుడు ఇలా వుండడం పరువాలేదు. కానీ ఒకవేళ చాలా ఎక్కువగా sheets వుంటే భారం గా వుంటుంది
10:21 calc మన ఇష్ట ప్రకారంగా sheet కు పేరు పెట్టడానికి వసతిని కల్పిస్తుంది
10:27 ఉదాహరణకు “Sheet 4” కు “Dump” గా పేరు పెట్టడానికి “Sheet 4”tab కింద రెండుసార్లు క్లిక్ చేయాలి .
10:37 “Rename Sheet” శీర్షిక తో ఒక dialog box తెరుచుకుంటుంది . default గా “Sheet 4” అని వ్రాసి వున్న ఒక textbox కనిపిస్తుంది
10:47 ఇప్పుడు, default పేరు తొలగించి కొత్త షీట్ పేరు Dump” అని వ్రాయండి
10:52 “OK” button పై క్లిక్ చేయండి. “Sheet 4” tab పేరు, “Dump” గా మారడం గమనించండి. Sheets 5 మరియు Dump ను తొలగిద్దాం
11:02 ఇప్పుడు మనం LibreOffice Calc పై Spoken Tutorial ముగింపుకు వచ్చాం
11:08 సంగ్రహంగా చెప్పాలంటే , మనం నేర్చుకున్నది  :
rows మరియు columns ను చేర్చుట మరియు తొలగించుట
11:14 sheets ను చేర్చుట మరియు తొలగించుట. Sheets కు మళ్ళీ పేర్లు పెట్టుట.
11:19 COMPREHENSIVE ASSIGNMENT

“Spreadsheet Practice.ods” file తెరవండి


11:25 “Serial Number” శీర్షిక తో వున్న row ను ఎంచుకొని తొలగించండి .sheet పేరు “Department Sheet” గా మార్చండి.
11:32 *ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
11:36 *ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది

మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు

11:44 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం *స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది
11:50 *ఆన్లైన్ పరీక్షలు ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది *మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. org కువ్రాసిసంప్రదించండి.
11:59 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.


12:12 ఈ మిషన్ గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది .
12:22 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య
 Thanks for joining
మాతో చేరినందుకు కృతజ్ఞతలు.


Contributors and Content Editors

Chaithaya, Pratik kamble, Sneha, Yogananda.india