LibreOffice-Suite-Calc/C2/Working-with-Cells/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 17:25, 23 June 2014 by Chaithaya (Talk | contribs)

Jump to: navigation, search
VISUAL CUE NARRATION
00:00. లిబ్రే ఆఫీస్ క్యాల్క్ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వగతం - సెల్ల్స్ తో పనిచేయుట
00:06 ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకునేది:
00:08 . ఒక స్ప్రెడ్షీటు లో సంఖ్యలు, టెక్స్ట్, సంఖ్యలను టెక్స్ట్ రూపంలో, తేదీ మరియు సమయములను ఎలా ఎంటర్చేయాలి.
00:16 Format Cells (ఫార్మ్యాట్ సెల్స్) డైలాగ్బాక్స్ను ఎలా ఉపయోగించాలి.
00:19 సెల్స్ మధ్యలో మరియు షీట్ల మధ్య ఎలా సంచరించాలి
00:23 రోలు, కాలమ్స్ మరియు షీట్ల లోని అంశాలను ఎలా ఎంచుకోవాలి
00:29 మనము ఉబంటు(Ubuntu) 10.04 ను మన ఆపరేటింగ్సిస్టంగా మరియు లిబ్రే ఆఫీస్ వర్షన్ 3.3.4 ను ఉపయోగిస్తాము.
00:39 సెల్స్లోడేటాను ఎలా ఎంటర్ చేయాలో ముందుగా నేర్చుకుందాము.
00:43 "personal finance tracker.ods"(పర్సనల్ ఫైనాన్స్ ట్రాకర్.ods) ఫైల్ను తెరుద్దం
00:49 సెల్ పై క్లిక్ చేసి కీబోర్డ్ (keyboard) ఉపయోగిచి టైప్ చేయడం ద్వారా ఒక ప్రత్యేక సెల్ లో ఏదైన టెక్స్ట్ టైప్ చేయవచ్చు.
00:59 డిఫాల్ట్ గా టెక్స్ట్ ఎడమ వైపు అమారి ఉంటుంది. ఫార్మాటింగ్ బార్ లో అలైన్‌మెంట్ ట్యాబ్ ఏదైనా ఒక దానిని క్లిక్ చేయడం ద్వారా సమలేఖనం మార్చవచ్చు.
01:08 దీనిని undoచేద్దాం.
01:11 స్ప్రెడ్షీట్ లోని "A1" కు సంబంధించిన సెల్ క్లిక్ చేయండి. .
01:15 మీరు ఎంచుకున్న సెల్ హైలైట్ చేయబడుతుంది
01:20 ఇక్కడ ఇదివరకే కాలమ్ హెడింగ్స్ టైప్ చేసినము
01:24 "Items" హెడ్డింగ్ క్రింద "Salary", "House rent", "Electricity bill", "Phone bill", "Laundry" మరియు "Miscellaneous" అనే కొన్ని అంశాల పేర్లను ఒకదాని క్రింద మరొకటి టైప్చేద్దాము.
01:38 సెల్ లో సంఖ్యలను ఎంటర్ చేయుటకు సెల్ పై క్లిక్ చేసి టైప్ చేయండి.
01:43 రుణ సంఖ్య ఎంటర్, చేయుటకు, దాని ఎదురుగా ఒక మైనస్ గుర్తు టైప్ లేదా బ్రాకెట్ల లో ఉంచండి
01:53 డిఫాల్ట్ గా, సంఖ్యలు కుడివైపు సమలేఖనమై మరియు రుణాత్మక సంఖ్యలు మైనస్ గుర్తు కలిగి ఉంటాయి
02:01 మార్పులను అన్డూ చేద్దాము.
02:04 మన ( “Personal finance traker.ods”)( "పర్సనల్ ఫైనాన్స్ ట్ర్యాకర్.ods") స్ప్రెడ్షీట్లో "SN" అని సూచించబడిన సీరియల్ నంబర్ హెడ్డింగ్ క్రింద ఒక దాని క్రింద ఉన్న ప్రతి అంశం యొక్క వరుస సంఖ్య కావాలి.
02:17 కాబట్టి "A2" కు సంబంధించిన సెల్ పై క్లిక్ చేసి, 1,2,3 సంఖ్యలను ఒక దాని క్రింద మరొకటి ఎంటర్ చేయండి.
02:27 వరుస సంఖ్యలు ఆటో ఫిల్(Auto fill) చేయుటకు సెల్ "A4" పై క్లిక్ చేయండి. ఒక చిన్న బ్లాక్ బాక్స్ సెల్ క్రింది కుడి మూల వద్ద కనిపిస్తుంది.
సెల్ "A7" వరకు డ్రాగ్ చేసి మౌస్ బటన్ ను వదిలివేయండి
02:42 "A5 నుండి "A7" వరకు తరువాత వరుస సంఖ్యలతో నిండాడం చూడగలరు
02:51 అంశాల వరుస సంఖ్య ఎంటర్ చేసిన తరువాత, హెడింగ్ "Cost”( "కాస్ట్") క్రింద ప్రతి అంశం యొక్క ఖర్చును ప్రవేశ పెద్దాం
02:59 "C3” అని సూచించబడే సెల్ పై క్లిక్ చేసి "House rent" కొరకు ఖర్చు "Rupees 6000" అని టైప్ చేద్దాం.
03:07 సంఖ్య ముందు రూపాయి చిహ్నము కనపడాలంటే ఎలా?
03:11 "Electricity bill" కొరకు "Rupees 800" ఎంటర్ చేయాలనుకుంటునరా, అయితే సెల్ “C4” పై రైట్ క్లిక్ చేయండి మరియు "Format cells" ఆప్షన్ పై క్లిక్ చేయండి
03:23 దీనితో "Format Cells"(ఫార్మ్యాట్ సెల్స్) అనే బాక్స్ ఓపెన్ అవుతుంది.
03:27 మొదటి టాబ్ "Numbers"(నంబర్స్) ఇదివరకు ఎంపిక చేయకపోతే, దాని పై క్లిక్ చేయండి
03:32 "Category" (క్యాటగిరి ) క్రింద వివిధ క్యాటగరీలు చూడవచ్చు. అవి Number, Percent, Currency, Date, Time మరియు ఇంకా ఎన్నో ఉంటాయి.
03:41 మనము “Currency”(కరెన్సీ ) ని ఎంచుకుందాము.
03:44 Format(ఫార్మాట్ )ఎంపికలోని, డౌన్ ఆరో పై క్లిక్ చేయండి.

ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ కరెన్సీ చిహ్నాలు ప్రదర్శించబడతాయి

03:53 పైకి స్క్రోల్ చేసి, INR Rupees English India (INR రుపీస్ ఇంగ్లీష్ ఇండియా) ఎంచుకోండి. డిఫాల్ట్ గా, రూపాయి 1234 డ్రాప్ డౌన్ క్రింద ఎంపిక చెయ్యబడుతుంది.
04:04 దాని యొక్క ప్రీవ్యూను కుడి వైపున చిన్న ప్రీవ్యూ ప్రదేశములో చూడవచ్చు
04:10 Options(ఆప్షన్స్ ), క్రింద Decimal places(డెసిమల్ ప్లేసస్) సంఖ్యను మరియు కావలసిన “Leading zeroes”(లీడింగ్ జిరోస్ ) సంఖ్యను జోడించడానికి అవకాశం ఉంది.
04:20 సున్నాల సంఖ్య పెంచినప్పుడు , Format(ఫార్మ్యాట్) క్రింద ఎంపిక Rupees 1,234 (రుపీస్ 1,234)దశాంశ సున్నా సున్నా సూచించే 2 దశాంశ స్థానాల వరకు మార్చబడిందని గమనించాలి.
04:35 మార్పు ప్రీవ్యూ ప్రదేశములో కనిపిస్తుందని గమనించండి.
04:40 ప్రతి వేయికి ఒక "comma" సెపరేటర్ను చేర్చుటకు Thousands separator (థౌసండ్స్ సెప్యారేటర్) పై క్లిక్ చేయండి తిరిగి ప్రీవ్యూ ప్రదేశములో మార్పును గమనించండి
04:50 ఫాంట్ టాబ్ పై క్లిక్ చేసి ఫాంట్ శైలి మార్చవచ్చు. దానిలో ఫాంట్, టైప్ఫేస్ మరియు సైజు అనే వివిధ ఎంపికలు ఉన్నాయి.
05:00 వీటి గురించి మరింత నేర్చుకొనుటకు Font Effects( ఫాంట్ ఎఫెక్ట్స్) గురించి తెలుసుకోండి
05:05 మనం మరొక ట్యుటోరియల్ లో Alignment టాబ్ లోని ఎంపికల గురించి నేర్చుకొందాం
05:11 OK పై క్లిక్ చేద్దాం.
05:15 800 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. 800 అనేసంఖ్య Rupees 800 లో 2 దశాంశ స్థానాలతో సూచించబడుతుందని గమనించండి
05:26 C5 నుండి C7 వరకు సెల్స్ ని ఎంచుకోండి. CTRLకీ నొక్కి మరియు G2 సెల్ ని ఎంచుకోండి. ఎంచుకున్న సెల్స్ హైలైట్ చేయబడ్దాయని గమనించండి
05:39 హైలైట్ చేయబడిన సెల్స్ పై రైట్ క్లిక్ చేసి Format(ఫార్మ్యాట్ ) సెల్స్ ఎంచుకోండి.
05:46 ఇంతకు ముందు మాదిరిగానే ఎంపికలను ఎంచుకోని,

OK పై క్లిక్ చేయండి

05:51 ఇ ఇతర అంశాలనిటి ఖర్చులు ఒక దాని తరవాత ఒకటి టైప్ చేద్దాం.

ఉదాహరణకు "రుపీస్ 600” “ఫోన్ బిల్” కొరకు ”రుపీస్ 300” “లాండ్ర్” చార్జస్ మరియు “రుపీస్ 2000” “మిసిలేనీయియస్” చార్జస్ అని టైప్ చేస్తాం

06:06 ”Accounts”("అకౌంట్స్") హెడ్డింగ్ క్రింద "రుపీస్ ౩౦౦౦౦" నెల జీతం గా టైప్ చేద్దాం
06:13 క్యాల్క్ లో తేదీ ఏటెర్ చేయడానికి, సెల్ ని ఎంచుకొని తేదీ టైప్ చేయండి.
06:18 ఫోర్వోర్డ్ స్లాష్ లేక హైఫెన్ లేక 10 అక్టోబర్ 2011 లాంటి టెక్స్ట్ ఉపయోగించి తేదీ మూలకలను వేరు చేయవచ్చు.
06:27 క్యాల్క్ వివిధ తేదీ ఫార్మాట్ల్ లను గుర్తిస్తుంది.
06:32 ప్రత్యామ్నాయంగా, సెల్ పై రైట్ క్లిక్ చేసి Format cells( "ఫార్మ్యాట్ సెల్స్") ఎంపికను ఎంచుకోవచ్చు.
06:38 వర్గం క్రింద "Date" మరియు "Format" క్రింద కావలసిన ఫార్మట్ను ఎంచుకోండి. నేను 12,31,1999 అనే దానిని ఎంచుకుంటాను. ప్రీవ్యూ ప్రదేశములో ప్రీవ్యూను చూడండి.
06:51 అలాగే, Format కోడ్ MM, DD మరియు YYYY క్రింది ప్రదర్శించబడుతుంది. కావలసిన విధంగా ఫార్మాట్కోడ్ను మార్చుకోవచ్చు.
07:02 నేను DD,MM మరియు YYYY అని టైప్చేస్తాను. ప్రీవ్యూ ప్రదేశములో మార్పును గమనించండి. OK పై క్లిక్ చేయండి
07:12 క్యాల్క్ సమయమును ఎంటర్ చేయుటకు సెల్ను ఎంచుకొని, సమయమును టైప్ చేయండి.
07:18 10 కోలన్, 43 కోలన్ 20 వంటి వాటిని ఉపయోగించి సమయము యొక్క అంశములను వేరు చేయవచ్చు
07:24 ప్రత్యామ్నాయంగా, సెల్ పై రైట్ క్లిక్ చేసి “Format cells”("ఫార్మ్యాట్ సెల్స్" )ఎంపికను ఎంచుకోవచ్చు.
07:31 క్యాటగరీ క్రింద "Time" ను మరియు "Format"(ఫార్మ్యాట్) క్రింద కావలసిన ఫార్మాట్ ఎంచుకోండి.

నేను 13,37,46 అనే దానిని ఎంచుకుంటాను. ప్రీవ్యూ ప్రదేశములొ ప్రీవ్యూను చూడండి.

07:43 ఇంకా, క్రింద ఫార్మాట్కోడ్ HH:MM:SS మరియు YYYY అనికనిపిస్తుంది. కావలసిన విధంగా ఫార్మాట్కోడ్ను మార్చుకోవచ్చు. నేను HH:MM అని టైప్ చేస్తాను
07:57 ప్రీవ్యూ ప్రదేశములో మార్పును గమనించండి.
OK పై క్లిక్ చేయండి
08:03 మార్పులను అన్డూ చేద్దాము.
08:06 కాల్క్లోటెక్స్ట్, సంఖ్యలు మరియు తేదీలను ఎలా వ్రాయాలో నేర్చుకున్న తరువాత, ఒక స్ప్రెడ్షీట్లో ఒక సెల్నుండి మరొక సెల్కు మరియు ఒక షీట్నుండి మరొక షీట్నకు ఎలా సంచరించాలో నేర్చుకుందాము
08:17 ముందుగా మనము ఒక స్ప్రెడ్షీట్లో ఒక సెల్ నుండి మరొక సెల్కు ఎలా సంచరించాలో చూద్దాం
08:23 కర్సర్తోసెల్పైక్లిక్చేయడముద్వారాఒకసెల్లోనికిమీరుప్రవేశించగలరు.
08:29 ఆ సెల్ హైలైట్ అవడం మీరు చూడగలరు
08:32 ఒక సెల్లోనికి ప్రవేశించుటకు మరొక పద్ధతి సెల్ రిఫరెన్స్ ను ఉపయోగించడం
08:38 "Name Box"(నేమ్ బాక్స్) యొక్క కుడి వైపున ఉన్న చిన్న నల్లటి డౌన్ఆరో పై క్లిక్ చేయండి
08:43 ఇప్పుడు మీరు వెళ్ళాలనుకుంటున్న సెల్ యొక్క రిఫరెన్స్ పై టైప్ చేయండి, తరువాత ఎంటర్ నొక్కండి
08:49 మీరు "Name Box"(నేమ్ బాక్స్) లోకూడ క్లిక్ చేయవచ్చు. అక్కడ ఉన్న సెల్ రిఫరెన్స్ ను తొలగించి మీకు కావలసిన సెల్ రిఫరెన్స్ ను టైపు చేసి ఎంటర్ నొక్కండి
08:58 తదుపరి మనం ఒక స్ప్రెడ్ షీట్ లో సెల్స్ మధ్య ఎలా సంచరించాలో నేర్చుకుందాము
09:03 సెల్ల్స్ మధ్య సంచరించుటకు మొదటి పద్ధతి కర్సర్ ను ఉపయోగించడం
09:09 కర్సర్ ఉపయోగించి ద్రుష్టి మలించడానికి, కేవలం కర్సరును మీకు కావాల్సిన సెల్ వద్ద కు కదలించి ఎడమ మౌస్ బటన్ క్లిక్ చేయండి.
09:18 ఇది దృష్టి ని కొత్త సెల్కు మార్చుతుంది. 09:22 ఈ పద్ధతి రెండు సెల్స్ చాలా దూరంగా ఉన్నపుడు ఉపయోగపడుతుంది
09:28 సెల్ల్స్ మధ్య సంచరించడానికి మరో పద్ధతి - ఒక రో లోని తరువాతి సెల్ వెళ్ళడానికి "Tab"
09:35 ఒక రో లోని మునుపటి సెల్ కు వెళ్ళడానికి, ”Shift + Tab” నొక్కండి
09:39 ఒక కాలంలోని తరువాతి సెల్కు వెళ్ళుటకు Enter నొక్కండి
09:42 కాలంలో మునుపటి సెల్కు వెళ్ళుటకు "Shift + Enter" నొక్కండి
09:46 తరువాత కీబోర్డును ఉపయోగించి కాల్క్ లోని వివిధ స్ప్రెడ్షీట్ల మధ్య ఎలా సంచరించాలో నేర్చుకుందాం
09:53 సక్రియ షీట్ కుడి షీట్ను ను యాక్సెస్ చేయడానికి " CTRL + PGDN” ( "కంట్రోల్ " ప్లస్ "పేజ డౌన్") కీలు ఏకకాలంలో నొక్కండి.
10:00 ప్రస్తుత షీట్యొక్క ఎడమ వైపు ఉన్న షీట్లోనికి వెళ్ళుటకు, "Control" + "Page Up"("కంట్రోల్ " ప్లస్ "పేజ ఉప్ ") కీలను ఏకకాలంలో నొక్కండి.
10:08 మీరు షీట్ల మధ్య సంచ్రించుటకు కర్సర్ ను ఉపయోగించివచ్చు
10:13 దీని గురించిన వివరణ "Working with Sheets"(వర్కింగ్ విత్ షీట్స్) అనే ట్యుటోరియల్లో ఇవ్వబడింది.
10:19 మీ వద్ద పెద్ద సంఖ్యలో షీట్లు కలిగి ఉంటే, కొన్ని షీట్ టాబ్లు స్క్రీన్ దిగువన గల సమతల స్క్రోల్ బార్ వెనుక దాగి ఉండవచ్చు.
10:28 ఆ సందర్భంలో, షీట్ టాబ్లు క్రింది ఎడమ వైపు లో ఉన్నా నాలుగు బటన్లు కదిలించడం ద్వారా వాటిని చూడవచ్చు.
10:36 మార్పులను అన్డూ చేద్దాము.
10:39 చాలా దగ్గరగా ఉన్న ఒక సెల్ల పరిధి ని కర్సర్ తో ఎంచుకోడానికి, మొదట ఒక సెల్ పై క్లిక్ చేయండి
10:45 ఇప్పుడు మౌస్ ఎడమ బటన్ నొక్కి పట్టుకోండి
10:48 కర్సర్ ను స్క్రీన్ చుట్టూ కదిలించి, కావలసిన సెల్ల్స్ హైలైట్ చేయబడిన తరువాత ఎడమ మౌస్ బటన్ వదలండి ఎంచుకున్న సెల్స్ హైలైట్ చెయ్యబడ్డాయని మీరు చూడవచ్చు.
11:00 పక్క పక్కనే అనేక రోలు లేదా కాలమ్ లను ఎంచుకోవడానికి, సమూహంలోని మొదటి కాలమ్ లేదా రో ను క్లిక్ చేయండి
11:09 ఇప్పుడు "Shift" కీ నొక్కి పట్టుకోండి
11:12 సమూహంలోని చివరి కాలమ్ లేదా రోను క్లిక్ చేయండి.
11:15 పక్కపక్కన లేని అనేక కాలమ్స్ లేదా రోస్ ను ఎంచుకోవడానికి, సమూహంలోని మొదటి కాలమ్ లేదా రో ని క్లిక్ చేయండి
11:23 "కంట్రోల్" కీని నొక్కి పట్టుకొని , తదనంతరం ఉన్న కాలమ్స్ లేదా రోస్ ని క్లిక్ చేయండి “Control”("కంట్రోల్" )కీని పట్టుకుని ఉన్నప్పుడు.
11:31 పక్కపక్కన ఉన్న అనేక షీట్లను ఎంచుకొనుటకు, మొదటి కావలసిన షీట్ కోసం షీట్ టాబ్ పై క్లిక్ చేయండి.
11:39 ఇప్పుడు కర్సర్ ను కావలసిన చివరి షీట్ కొరకు షీట్ టాబ్ వరకు కదిలించండి .
11:43 "Shift" కీ నొక్కి పట్టుకొని , షీట్ టాబ్ పై క్లిక్ చేయండి.
11:48 ఈ రెండు షీట్ల మధ్య ఉన్న అన్ని టాబ్లు అవి ఎంచుకోబడ్డాయని సూచించుటకు తెల్లగా మారతాయి.
11:56 మీరు చేసే ఏ పని అయినా ఇప్పుడు అన్ని హైలైట్ చేయబడిన షీట్ల పై ప్రభావం చూపుతుంది
12:01 పక్కపక్కన లేని అనేక షీట్లను ఎంచుకొనుటకు, మొదటి షీట్ కొరకు షీట్ టాబ్ పై క్లిక్ చేయండి.
12:08 ఇప్పుడు మూడవ షీట్ టాబ్ పై కర్సర్ను కదిలించండి.
12:12 "Control" కీ నొక్కి పట్టుకొని , షీట్ టాబ్ పై క్లిక్ చేయండి.
12:16 ఎంచుకోబడిన టాబ్లు తెల్లగా మారతాయి మరియు మీరు చేసే ఏ పని అయినా హైలైట్చేయబడిన ఈ షీట్ల పై ప్రభావము చూపుతుంది.
12:24 దీనితో మనము లిబ్రే ఆఫీసు కాల్క్ స్పోకెన్ ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
12:30 సారాంశముగా, మనము ఈ క్రింది విషయాలను నేర్చుకున్నాము:
12:33 క్యాల్క్ లో సంఖ్యలు, టెక్స్ట్, సంఖ్యలను టెక్స్ట్రూపములో, తేదీ మరియు సమయమును ఎలాఎంటర్చేయాలి.
12:40 Format Cells (ఫార్మాట్ సెల్ల్స్ ) డైలాగ్బాక్స్ను ఎలా ఉపయోగించాలి.
12:43 సెల్ల్స్ మధ్య మరియు షీట్స్ మధ్య ఎలా సంచరించాలి
12:47 రోస్ , కాలమ్స్ మరియు షీట్స్ లోని అంశాలను ఎలా ఎంచుకోవాలి
12:52 కాంప్రెహెన్సివ్ అసైన్‌మెంట్
12:55 "SpreadsheetPractice.ods" తెరవండి
12:58 "Serial Numbers" క్రింద 1 నుండి 5 వరకు వరుస సంఖ్యలను ఒక దాని క్రింద మరొకటి టైప్ చేయండి.
13:04 కీలను ఉపయోగించి సెల్ల్స్ మధ్య సంచరించండి.
13:09 సీరియల్ నంబర్స్ క్రింద అన్ని అంశములను ఎంచుకోండి.
13:13 తేదీ మరియు సమయము కొరకు ఒక కాలం చేర్చండి.
13:16 ఫార్మాట్ సెల్స్ డైలాగ్ బాక్స్ ఎంపికలను ఉపయోగించి వాటిలో కొన్ని విలువలను ఎంటర్ చేయండి
13:21 *ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
13:24 *ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది
13:27 *మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు
13:32 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం
13:35 *స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది
13:38 *ఆన్లైన్ పరీక్షలు ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది
13:41 *మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. org కువ్రాసిసంప్రదించండి.
13:48 *స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ లో ఒక భాగము
13:52 *ICT, MHRD,భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ వారు దీనిని సహకరిస్తున్నారు
14:00 *ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఇక్కడ అందుబాటులో ఉంది
14:03 *స్పోకెన్-ట్యుటోరియల్ డాట్ org NMEICT హైఫెన్ఇంట్రో
14:11 ట్యుటోరియల్ తెలుగు లోకి అనువదించింది చైతన్య
14:16 *చేరినందుకు ధన్యవాదములు

Contributors and Content Editors

Chaithaya, Madhurig, Sneha, Yogananda.india