LibreOffice-Suite-Base/C4/Database-Maintenance/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 16:22, 19 February 2018 by Yogananda.india (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 LibreOffice Base నందు Spoken tutorial కు స్వాగతం
00:04 ఈ ట్యూటోరియాల్లో మనం ఒక డేటాబేస్ ను నిర్వహించడo, నిర్మాణాన్ని సవరించడం మరియు డిఫాల్ట్ బ్యాకప్ తీసుకొనడం నేర్చుకుంటాము.
00:19 డేటాబేస్ ను నిర్వహించడం -
00:21 Base డేటాబేస్ జివిత కాలం మొత్తం మనం డాటాను సురక్షితం మరియు అప్డేట్ చేస్తుండాలి
00:31 దీనిలో భాగంగా, మనం data structure మరియు form ను ప్రస్తుతానికి అనుగుణంగా అప్డేట్ చేస్తుండాలి.
00:41 ఉదాహరణకి మనం పూర్వపు ట్యుటోరియల్ లో చేసిన Library డేటాబేస్ ను తీసుకుందాం
00:48 ఈ డేటాబేస్, మొదటగా books, members మరియు books issued వంటి tables ఉంటాయి.
00:55 మనం ఈ డేటాబేస్ పై మన ఉదాహరణలను, ప్రశ్నలను, రిపోర్టులు నిర్మించాము.
01:03 ఆ తరువాత library లో DVDs మరియు CDs ఉండేలా విస్తరిoపచేస్తాం.
01:11 కాబట్టి Library database ను, మార్చడం వల్ల మనం ఆ నిర్మాణాన్ని అప్డేట్ చేయవచ్చు
01:16 దీనికొరకు Media అనే మరొక పట్టికను జోడించాలి
01:21 మనం DVD and CD సమాచారాన్ని ఈ కొత్త Media పట్టికలో భద్రపరుస్తాం
01:28 ఈ విధంగా, అవసరమైనప్పుడు మార్పులు చేయడం వలన, డేటాబేస్ మరింత ఉపయోగకరంగా మరియు తాజాగా మారింది.
01:39 table లో మార్పు చేసినప్పుడు మనo formలలో మార్పులు చేయడం వలన ఉపయోగించడానికి మరింత సులభకరమవుతుంది
01:47 లేదా కొత్త పద్దతులను అవలంభించడం ద్వారా కొత్త పట్టికలను తయారుచేయవచ్చు
01:54 ఉదాహరణకి మన వద్ద పుస్తకాల డాటాను ఎంటర్ చేయడానికి form ఉన్నట్లయితే, అందులో DVDs మరియు CDల డేటా ఎంట్రి చేయవచ్చు
02:08 ఇక్కడ మనం books లేదా DVDs లేదా CDs అనేదాన్ని ఎంపిక చేయడం వల్ల ప్రచారణ రకాన్ని ఎన్నుకోవచ్చు
02:19 లేదా, కేవలం DVD మరియు CD మీడియా కోసం డేటా ఎంట్రీని అనుమతించడానికి మనం కొత్త బ్రాండ్స్ ను జోడించవచ్చు.
02:28 అలాగే డేటా స్ట్రక్చర్ మారినప్పుడు, మనం కొత్త ప్రశ్నలు మరియు రిపోర్టులు మార్చవలసి లేదా జోడించవలసి ఉంటుంది.
02:39 కొన్నిసార్లు మనం ఉన్న పట్టిక స్ట్రక్చర్ లోనే మార్పులు చేయవలసి ఉంటుంది
02:45 ఉదాహరణకి Members పట్టిక తీసుకున్నప్పుడు అది Library సభ్యులను చూపిస్తుంది
02:53 అది కేవలం సభ్యుల ఫోన్ నంలు మరియు పేర్లు మాత్రమే భద్రపరుస్తుంది
02:58 ఒకవేళ మనం వాళ్ళ చిరునామా పట్టణం గురించి సమాచారం భద్రపరచదలిచితే Members పట్టిక స్ట్రక్చర్ లో మార్పులు చేయవలసి ఉంటుంది
03:09 దీని కొరకు మనం SQL సింటాక్స్
03:15 ALTER TABLE Members ADD Address TEXT, ADD City TEXT ను ఉపయోగిస్తాము.
03:22 ALTER TABLE పట్టిక ను మార్చి పట్టికకు మరొక రెండు కొత్త columnsను జోడిస్తుంది.
03:30 TEXT డాటాలో Address మరియు City కూడా ఉంటుంది
03:36 పట్టికను సృష్టించడం , మార్పులు చేపట్టడం ఎలానో తెలుసుకోవడం కొరకు hsqldb.org/ అను వెబ్సైట్ ను సందర్శించండి
03:47 తెరపై ఉన్న url చిరునామాను ఉపయోగించండి
03:52 ఇప్పుడు Base డాటాబేస్ ను ఉపయోగించడం లో reliable ఎలా ఉంచాలో చూద్దాం.
03:59 కొన్నిసార్లు Base కు తక్కువ రికార్డుల సమాచారాన్ని భద్రపరచడానికి చాలా ఎక్కువ మెమరీ కావలసుంటుంది
04:08 ఇది ఎందుకంటే, బేస్, డేటాబేస్ కు కేవలం, కొంత మెమరీ మాత్రమే అవసరం అవుతుందని అనుకుంటుంది.
04:17 అదేవిధంగా, మనం చూస్తున్న డేటా అంతా అదే వరుసలో భద్రపరచబడి ఉండదు
04:26 ఎందుకంటే మనం పట్టికకు డేటా ను వివిధ సమయాలలో జోడిస్తుంటాము కాబట్టి, అది ఒకే వరుసలో భద్రపరచబడదు
04:36 మనం గ్రంధాలయం లో పుస్తకాలకు క్యాటలాగ్ ఉపయోగించినట్లు, పట్టిక లోని డేటా కు index ను ఉపయోగిస్తాం.
04:45 క్యాటలాగ్ పుస్తకాల జాబితాను ఉంచడమే కాక వాటి ప్రదేశాన్ని కూడా భద్రపరుస్తుంది
04:53 అదేవిధముగా మనం పట్టికకు ఇండెక్స్ నిర్మించడం ద్వారా డేటాను సమర్ధవంతంగా కనుకొనవచ్చు.
05:00 కానీ అవి చాలా మెమరీ ఉపయోగించుకుంటాయి
05:04 కొన్నిసార్లు పట్టిక డాటాను తొలగించడం వల్ల డేటా పూర్తిగా తొలగింపబడదు.
05:11 అవి టేబుల్ ఇండెక్స్ నుండి విడదీయబడతాయి కానీ కొత్త డేటా చేర్చేంతవరకు ఆ మెమరీ ను అలాగే వినియోగించుకుంటుంది
05:24 అందువల్లనే మనం భద్రపరచిన డేటా కొoచెం ఐనప్పటికీ, డేటా చివరికి పెద్దదిగా కనిపిస్తుంది
05:35 Base డిఫ్రాగ్మెంటింగ్ అనే పునర్వ్యవస్థీకరించే ఒక మంచి మార్గాన్ని అందిస్తుంది.
05:42 దీనికొరకు డిఫ్రాగ్మెంటింగ్ కావలసిన డాటాబేస్ ను మనం ఓపెన్ చేయాలి.
05:49 LibreOffice Base విండో లోపల, మనం Tools మెను పై క్లిక్ చేసి, ఆపై SQL sub menu పై క్లిక్ చేయాలి
06:01 ఆ తరువాత SQLవిండోలో క్రింది ఆదేశాన్ని టైప్ చేయాలి
06:07 CHECKPOINT DEFRAG
06:10 ఈ SQL ఆదేశం డేటాబేస్లోని అనవసరమైన సమాచారాన్ని తొలగిస్తుంది
06:19 ఇది ముందు డాటాబేస్ను మూసేసి కొత్త డేటాను మొదలుపెడుతుంది
06:27 SQL విండో లో మనం వేరొక ఆదేశాన్ని కుడా ఉపయోగిస్తాం
06:33 SHUTDOWN COMPACT.
06:36 తేడా ఏమిటంటే, ఈ ఆదేశం డాటాబేస్ ను మలరా తెరవలేదు
06:43 డిఫ్రాగ్మెంటింగ్ మీద మరింత సమాచారం కొరకు hsqldb.org Chapter 11 ను సందర్శించండి
06:54 చివరిగా Backups గురించి మాట్లాడుకుందాం ఇవి డాటాబేస్ ను సురక్షితంగా ఉంచుతాయి.
07:02 మనం మన డాటాను
07:06 కంప్యూటర్ క్రాష్ అవడం, హార్డుడిస్క్ పగలడం వల్ల లేదా ఏవైనా Viral ఇన్ఫక్షన్ల వలన కోల్పోతాము.
07:14 లిబ్రేఆఫీస్కు డాటాబేస్ నష్టం ను తగ్గించుటకు, మంచి రికవరీ విజార్డ్ ఉంది
07:20 కానీ ఒక తెలివైన విషయం ఏమిటంటే, డేటాబేస్ యొక్క కాల క్రమానుగత బ్యాకప్ తీసుకొనడం.
07:26 బ్యాకప్ ను తీసుకోవడం చాల సులభం
07:30 మనం కేవలం డేటాబేస్ కాపీని తీసుకొని,
07:34 బాహ్య హార్డ్ డిస్క్లు, CD లు లేదా DVD లు, ఫ్లాష్ డ్రైవ్లు వంటివి హార్డుడిస్క్లోని ద్వితీయ మీడియాలో నిల్వ చేస్తాము.
07:47 కాబట్టి బ్యాకప్నుతీసుకోవడానికి Library databaseలో Library.odb ఫైల్ ఎక్కడుందో కనుక్కోవాలి
07:57 ఆపై, ఫైల్ ను కాపీ చేసి వేరే హార్డ్ డిస్క్ డ్రైవ్లో లేదా ఫ్లాష్ డ్రైవ్లో కాఫీ మరియు పేస్ట్ చేయాలి
08:08 ఈ కాఫీ మరియు పేస్ట్ డేటాబేస్ యొక్క డేటా నిర్మాణాలు, డేటా,
08:17 రూపాలు, ప్రశ్నలు మరియు నివేదికలు వంటి వాటి యొక్క పూర్తి బ్యాకప్ భాద్యతలు తీసుకుంటుంది
08:24 మనం బ్యాకప్లు ఎప్పుడు తీసుకోవాలి?
08:28 ఇది డేటా మరియు నిర్మాణంలోని మార్పుల మీద ఆధారపడి ఉంటుంది
08:37 అంటే - మనం డేటాను జోడించడం, మార్చడం లేదా తొలగించడం ఎంత తరచుగా చేస్తున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది
08:42 అంతేకాకుండా మనం పట్టిక నిర్మాణంలు, పద్ధతులు, ప్రశ్నలు లేదా రెపోరేట్లను ఎంత తరచుగా చేస్తున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది
08:49 కాబట్టి మనం డేటాబేస్ ఉపయోగించే తరచుదనం మీద ఆధారపడి, బ్యాక్ అప్లను రోజువారీ, లేదా వారమునకు షెడ్యూల్ చేస్తాము.
08:58 ఇక్కడ ఒక అసైన్మెంట్ ఉంది
09:00 Members పట్టికకు రెండు కొత్త columns - Address and City ను జోడించాలి
09:08 ఈ రెండు columns ల డేటాటైప్ TEXT.
09:13 Members పట్టికను, Data Entry మోడ్ లో తెరిచి,address మరియు city లకు నమూనా డేటా ను ఎంటర్ చేయండి
09:23 తరువాత Library database ను డీఫ్రాగ్మెంట్ చేయండి.
09:27 చివరిగా లైబ్రరీ డాటాబేస్ బ్యాక్ అప్ ను తీసుకొని దాన్ని, అందుబాటులోఉన్న ఫ్లాష్ డ్రైవ్ లేదా హార్డుడిస్క్లో సేవ్ చేయండి.
09:38 ఇది మనలను Database Maintenance in LibreOffice Base ట్యుటోరియల్ చివరికు తీసుకొస్తుంది
09:45 దీనిని సంగ్రహించేందుకు, మనం
09:48 డాటాబేస్ ను నిర్వహించడం,
09:50 డేటాబేస్ నిర్మాణాన్ని సవరించడం,
09:54 డాటాబేస్ను డీఫ్రాగ్మెంట్ చేయడం, మరియు
09:56 బ్యాక్ అప్స్ ను తీసుకొనుట నేర్చుకోవాలి
09:58 Spoken Tutorial ప్రాజెక్టు Talk to a Teacher లోని ఒక భాగం
10:03 ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
10:10 ఈ ప్రాజెక్ట్ http://spoken-tutorial.org ద్వారా సమన్వయించబడుతుంది.
10:15 దీనిపై మరింత సమాచారం క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉంది.
10:20 దీనిని అనువదించినది హరి. చేరినందుకు ధన్యవాదాలు

Contributors and Content Editors

Yogananda.india