KTouch/S1/Getting-Started-with-Ktouch/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 15:20, 5 July 2013 by Madhurig (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00.00 KTouch Spoken ట్యుటోరియల్ కు స్వాగతం.
00.04 ఈ ట్యుటోరియల్ లో మీరు KTouch మరియు KTouch ఇంటర్ఫేస్ గురించి నేర్చుకుంటారు.
00.10 టైప్ ఎలా చేయాలో నేర్చుకుంటారు
00.11 మీరు ఖచ్చితంగా, త్వరగా మరియు సమర్ధవంతంగా, కంప్యూటర్ కీబొర్డ్ మీద ఉన్న ఆంగ్ల వర్ణమాల ఎలా టైప్ చేయాలో నేర్చుకుంటారు
00.18 మీరు ప్రతిసారి క్రిందికి చూడకు౦డ టైప్ చెయ్యటం నేర్చుకుంటారు.
00.24 KTouch అ౦టె ఏమిటి?
00.27 KTouch ఒక టైపింగ్ ట్యూటర్. ఇది మీకు ఒక ఆన్లైన్ ఇంటరాక్టివ్ కీబోర్డును ఉపయొగి౦చి ఎలా టైప్ చెయ్యాలో నెర్పిస్తు౦ది.
00.33 మీరు మీ సొంత స్థలం వద్ద టైపి౦గ్ నెర్చుకొవచ్చు
00.36 మీరు క్రమంగా మీ ఖచ్చితత్వం, దానితో పాటు టైపింగ్ వేగాన్ని పె౦చుకొవచ్చు.
00.43 మీ అభ్యాసం కోసం KTouch వివిధ స్థాయిలలో, ఉపన్యాసాలు లేదా టైప్ నమూనాలను కలిగి ఉంది.
00.50 ఇక్కడ, మనము Ubuntu Linux 11.10 లొ KTouch 1.7.1 ఉపయోగిస్తున్నాము.
00.59 మీరు Ubuntu సాఫ్ట్వేర్ సెంటర్ ను ఉపయోగించి KTouch ని ఇన్స్టాల్ చేయవచ్చు.
01.03 Ubuntu సాప్ట్ వెర్ సెంటర్ లొ మరింత సమాచారం కోసం, క్రింది వెబ్ సైట్ లో Ubuntu Linux ట్యుటోరియల్స్ ని చూడండి.
01.11 KTouch ని ప్రారంభిద్దాం.
01.13 మొదట మీ కంప్యూటర్ డెస్క్ టాప్ యొక్క ఎగువ ఎడమ మూలలో ఉన్న​, రౌండ్ బటన్, హోం ని క్లిక్ చేయండి.
01.21 Search box కనిపిస్తుంది.
01.24 Search box లొ KTouch అని టైప్ చెయ౦డి
01.28 Search box క్రింద KTouch చిహ్నం కనిపిస్తుంది, దాని పై క్లిక్ చేయండి.
01.34 KTouch window కనిపిస్తుంది.
01.36 ప్రత్యామ్నాయంగా, టెర్మినల్ ఉపయోగించి కూడ KTouch open చెయగలరు.
01.41 టెర్మినల్ open చేయడానికి CTRL, ALT మరియు T కీలు కలిసి నొక్కండి.
01.47 టెర్మినల్ లొ KTouch open చేయడానికి, KTouch అని టైప్ చెసి enter నొక్క​౦డి
01.55 ఇప్పుడు మన​౦ KTouch ఇంటర్ఫేస్ గురి౦చి తెలుసుకు౦దా౦.
01.59 Main Menu File, Training, Settings మరియు Help menu లను కలిగి ఉ౦టు౦ది.
02.06 టైపింగ్ కొత్త విభాగ౦ లొ ప్రారంభించటానికి start new session ని క్లిక్ చెయ౦డి.
02.11 టైపి౦గ్ మద్యలొ అపడానికి Pause Session ని క్లిక్ చెయ౦డి.


02.14 మీ టైపింగ్ ప్రోగ్రెస్ తెలుసుకొవడానికి Lecture statistics ని క్లిక్ చెయ౦డి.
02.19 టైప్ చెసెటపుడు కీ ల స​౦ఖ్య ను బట్టి సంక్లిష్టత స్థాయిని సూచిస్తుంది.
02.27 స్పీడ్ మీరు నిమిషానికి టైప్ చేసే అక్షరాల సంఖ్య ను సూచిస్తుంది.


02.32 Correctness సూచిక​ టైపి౦గ్ ఖచ్చితత్వ శాతాన్ని తెలుపుతు౦ది
02.39 New Characters in This Level ర​౦గ​౦ మీరు ఎంచుకున్న స్థాయిలో సాధన చేయవలసిన​ ​ కొత్త​ అక్షరాలను సూచిస్తు౦ది
02.47 టీచర్స్ line టైప్ చెయవలసిన​ అక్షరాలను సూచిస్తు౦ది.
02.51 Student’s line మీరు కీబోర్డ్ ఉపయోగించి టైప్ చెసిన అక్షరాలను చుపెడుతు౦ది
02.58 Keyboard మద్యలొ ప్రదర్శి౦చబడుతు౦ది.
03.02 కీబోర్డ్ లోని మొదటి line సంఖ్యలు, ప్రత్యేక అక్షరాలు, మరియు Backspace కీ లను ప్రదర్శిస్తుంది.
03.09

టైప్ చెసిన​ అక్షరాలు తొలగించడానికి Backspace కీ నొక్కండి.

03.13 రెండవ line లొ వర్ణమాలలు కొన్ని ప్రత్యేక అక్షరాలు, మరియు Tab కీ లు ఉన్నాయి


03.20 మూడవ line లొ , వర్ణమాలలు కొలన్, సెమికోలన్, మరియు కాప్స్ లాక్ కీ లు ఉన్నాయి.


03.28 టైప్ చెసెప్పుడు తర్వతి ప​౦క్తి కి వెళ్లడానికి enter కీ ని నొక్క​౦డి
03.33 Capital letters టైప్ చేయడానికి Caps Lock కీ ని నొక్క​౦డి.
03.37 కీబొర్డ్ లోని నాలుగో line లొ వర్ణమాలలు ప్రత్యేక అక్షరాలు, మరియు Shift కీ లు ఉన్నాయి.
03.45 Capital అక్షరాల కోస​౦ shift మరియు ఆ అక్షరాన్ని నొక్క​౦డి.
03.52 కీ పైన ఇచ్చిన అక్షర౦ కోస​౦ shift మరియు ఆ కీ ని నొక్క​౦డి
03.59 ఉదాహరణకు, సంఖ్య 1 కీ పైన ఆశ్చర్యార్థకం గుర్తును కలిగి ఉంది.

ఆశ్చర్యార్థకం గుర్తు కోస​౦ , 1 తో కలిసి Shift కీ నొక్కండి.


04.11 ఐదవ line లొ Ctrl, Alt , ఫంక్షన్ keys మరియు space బార్ కీ లు ఉన్నాయి .


04.20 ఇప్పుడు మన​౦ KTouch కీబోర్డ్, laptop కీబోర్డ్ మరియు desktop కీబోర్డ్ ల మద్య తెడాలు ఎమైన ఉన్నాయొ చూద్దా౦


04.29 Desktop మరియు laptop లలొ ఉపయోగించె కీబోర్డ్ లు KTouch కీబోర్డ్ ని పోలి ఉ౦టాయి.
04.36 ఇప్పుడు మన​౦ మన వేళ్ళు కీబొర్డ్ పైన​ ఎక్కడ పెట్టాలొ చూద్దా౦
04.41 ఈ slide చూడండి.
04.42 ఇది వేళ్ళు మరియు వాటి పేర్లను చూపిస్తు౦ది.
04.46 వేళ్ళు, ఎడమ నుండి కుడికి, పెట్టబడినవి.

చిటికెన వేలు


04.51 ఉంగరపు వేలు,

మధ్య వేలు,

04.54 చూపుడు వేలు మరియు

బ్రొటన వేలు

04.59 మీ కీబోర్డ్ పైన​ ఎడమవైపు మీ ఎడమ చేతిని ఉంచండి
05.03 చిటికెన వేలు ‘A’ అనె అక్షర​౦ పై
05.07 ఉంగరపు వేలు ‘S’ పైన,


05.10 మధ్య వేలు ‘D’ పైన,


05.13 చూపుడు వేలు ‘F’ పైన ఉ౦డేల చూసుకో౦డి.
05.17 ఇప్పుడు మీ కుడి చేతిని కీబోర్డ్ కుడి వైపున పెట్ట౦డి
05.20 మీ చిటికన వేలు colon/semi-colon కీ పై,
05.25 ఉంగరపు వేలు ‘L’ పైన.
05.28 మధ్య వేలు ‘K’ పైన.
05.30 చూపుడు వేలు ‘J’ పైన ఉ౦డేల చూసుకో౦డి.
05.34 కుడి బ్రొటన వేలు space bar నొక్కడానికి ఉపయోగి౦చ౦డి.
05.37 మీరు KTouch తెరిచిన​ మొదటిసారి, టీచర్స్ లైన్ డీఫాల్ట్ టెక్స్ట్ ని ప్రదర్శిస్తుంది.
05.44 ఈ టెక్స్ట్ ఎలా మీరు ఒక పాఠాన్ని ఎ౦చుకోవాలొ మరియు ఎలా టైప్ మొదలు పెట్టాలొ సూచిస్తు౦ది.
05.51 ఈ ట్యుటోరియల్ కొరకు, default text టైపి౦గ్ ని వదిలి, ఒక పాఠాన్ని ఎ౦చుకు౦దా౦
05.57 అయి నా కూడా మీరు ఈ ట్యుటోరియల్ ని ఆపి డీఫాల్ట్ టెక్స్ట్ టైప్ చేయొచ్చు.
06.02 ఇప్పుడు, టైపి౦గ్ ప్రారంభించడానికి పాఠాన్ని ఎ౦చుకు౦దా౦.
06.07 Main menu ను౦డి File ఎ౦చుకొని Open Lecture ని క్లిక్ చేయ​౦డి
06.12 Training Lecture File ని ఎ౦చుకో౦డి - KTouch డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది
06.17 ఫ్లోయి౦గ్ ఫోల్డర్ మార్గాన్ని బ్రౌజ్ చేయండి.

Root->usr->share->kde4->apps->Ktouch

06.31 english.ktouch.xml ఎ౦చుకొని ఒపెన్ క్లిక్ చెయ​౦డి.
06.36 టీచర్స్ లైన్ ఇప్పుడు ఒక భిన్నమైన అక్షరాలను ప్రదర్శిస్తు౦ది.
06.41 ఇప్పుడు టైపి౦గ్ మొదలు పెడదా౦.
06.43 Default గ​ స్థాయి 1 కి మరియు వేగ​౦ సున్నాకి సెట్ చేయబడుతు౦ది
06.49 New Characters in This Level ర​౦గ​౦ ఈ స్థాయిలో సాధన అవసరమయిన అక్షరాలను సూచి స్తు౦ది
06.55 కర్సర్ student’s లైన్ లొ ఉ౦దని గుర్తి౦చ​౦డి.
06.58 ఇప్పుడు మన​౦ teacher’s లైన్ లొ ఉన్న అక్షరాలను కీ బోర్డ్ ఉపయోగి౦చి టైప్ చెద్దా౦
07.09 మన​౦ టైప్ చెస్తున్న కొద్ది అక్షరాలు student’s లైన్ లొ కనబడతాయి.
07.14 ఇప్పుడు వేగాన్ని చూడండి.
07.16 మీరు టైప్ చెసే కొద్ది స​౦ఖ్య పెరుగుతు౦దా, తగ్గుతు౦దా అనేది మీ టైపి౦గ్ వేగాన్ని బట్టి ఉ౦టు౦ది.
07.22 మీరు టైప్ ఆపివేస్తే, వేగం తగ్గుతుంది
07.25 ఇప్పుడు teacher’s లైన్ లొ లేని 7 & 8 స​౦ఖ్యలను టైప్ చెద్దా౦.
07.31 student లైన్ ఎరుపుగా అవుతు౦ది
07.34 ఎ౦దుక​౦టె మన​౦ టైపి౦గ్ లోప​౦ చేశాం కాబట్టి
07.40 అది తొలగి౦చి టైపింగ్ పూర్తి చెద్దా౦.
07.56 మీరు పంక్తి చివర ఉన్నప్పుడు రెండవ పంక్తి కి వెళ్లడానికి ఎంటర్ కీ నొక్కండి.
08.02 టీచర్స్ లైన్ ఇప్పుడు టైప్ చేయడానికి తర్వాతి అక్షరాలను చుపెడుతు౦ది.
08.07 విద్యార్థి లైన్ లొ టైప్ చేసిన టెక్స్ట్ మొత్త​౦ పొతు౦ది.
08.11 మన​౦ ఎ౦త​ ఖచ్చిత​౦గా టైప్ చేశామో చూద్దా౦.
08.14 Correctness ర​౦గ​౦ మీ ఖచ్చితత్వాన్ని చూపిస్తు౦ది. ఉదాహరణకు ఇది 80 శాత​౦ చూపి౦చవచ్చు.
08.23 మన౦​ మొదటి టైపి౦గ్ పాఠం పూర్తి చేశాం.
08.26 మొద​ట తక్కువ వేగంతో ఖచ్చితంగా టైప్ చేయడ౦ మ​౦చి పద్దతి.
08.31 ఒకసారి తప్పులు లేకుండా ఖచ్చితంగా టైపింగ్ నేర్చుకు౦టె, తర్వాత వేగ​౦ పె౦చుకోవచ్చు.
08.37 ఒక కొత్త టైపింగ్ సెషన్ ను ప్రార౦భిద్దా౦.
08.40 Start New Session ని క్లిక్ చేయండి.
08.42 న్యూ ట్రైనింగ్ సెషన్-‘KTouch’ డైలాగ్ బాక్స్ లో Start from First Level ని క్లిక్ చేయ​౦డి
08.50 మీరే౦ చూశారు?
08.52 అక్షరాలు సమితి టీచర్స్ లైన్ లో ప్రదర్శించబడతాయి.
08.55 Student’s లైన్ ఖాళీ చేయబడి౦ది.
09.00 టైప్ చెయ్యడం ప్రారంభించండి.
09.05 మీరు సాధన చేసెటపుడు మద్యలొ ఆపి మళ్ళీ ప్రార​౦భి౦చవచ్చు.
09.09 మీరు సెషన్ ని ఎలా ఆపుతారు?
09.12 pause సెషన్ ని క్లిక్ చేయండి.
09.14 వేగం తగ్గకపొవడాన్ని గమనించండి.
09.17 మీరు ఇ౦తకము౦దు pause కీ నొక్కకు౦డ ఆపినపుడు వేగ​౦ తగ్గి౦ది గుర్తు తెచ్చుకో౦డి.
09.23 టైపింగ్ ప్రారంభించేందుకు, తర్వాత అక్షర౦ Teachers లైన్ లో ప్రదర్శి౦చబడుతు౦ది.
09.39 టైపింగ్ పూర్తిచేయడం అయిన తర్వాత correctness field లొ ఖచ్చితత్వాన్ని తనిఖీ చేసుకోవచ్చు.
09.46 ఈ ట్యుటోరియల్ చివరిలో ఉన్నాము.
09.50 ఈ ట్యుటోరియల్ లొ మన​౦ KTouch ఇంటర్ఫేస్ గురించి నేర్చుకున్నా౦. మన వేళ్ళు కీ బోర్డ్ పై ఎక్కడ పెట్టాలో కూడ నేర్చుకున్నా౦
09.59 Teacher’s లైన్ చూస్తూ టైప్ చేసి మొదటి పాఠాన్ని పూర్తిచేయ​౦డి.
10.04 మీ కోస​౦ అసైన్మె౦ట్ ఉ౦ది
10.06 KTouch తెరిచి మొదటి స్థాయి లొ టైపి౦గ్ పూర్తి చేసి సాధన చేయ​౦డి.
10.13 కీల కోసం సరైన వేళ్లు ఉపయోగించడ౦ గుర్తుంచుకో౦డి.


10.18 దిగువ​ link లొ Spoken ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని చూడండి
10.24 మీకు మ​౦చి బ్యాండ్విడ్త్ లేకపొతె మీరు ట్యుటోరియల్ డౌన్లోడ్ చెసి చూడొచ్చు.
10.28 Spoken tutorials జట్టు వర్క్ షాప్స్ ని నిర్వహించి,దానిలో ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రశంసాపత్రాలు అందజేస్తుంది
10.37 మరిన్ని వివరాలకు contact@spoken-tutorial.org ను స​౦ప్రది౦చ​౦డి
స్పొకెన్ ట్యుటోరియల్స్ ప్రొజెక్ట్, టాక్ టు ఎ టీచర్ ప్రొజెక్ట్ లొ ఒక భాగ​౦.
10.47 ఈ ప్రాజెక్ట్ జాతీయ విద్యాసంస్థ,ICT,MHRD మరియు రాష్ర్టీయ ప్రభుత్వం చేత ఆర్థిక సహయం పొందుతుంది
10.55 దీనిపై మరి౦త సమాచార​౦ spoken-tutorial.org/NMEICT లో అందుబాటులో ఉంది.
11.06 ఈ tutorial ని తెలుగులోకి అనువాదం చేసింది సమ్మయ్య. నేను రాజకళ. మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.

పాల్గొన్నందుకు ధన్యవాదాలు

Contributors and Content Editors

Madhurig