KTouch/C2/Customizing-Ktouch/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 18:11, 16 October 2015 by Madhurig (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:00 Customizing KTouch స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
00:04 ఈ ట్యుటోరియల్లో మీరు నేర్చుకునేది;
00:08
  • ఒక లెక్చర్ సృష్టించుట
  • KTouchని అనుకూలీకరించుట
  • మీ సొంత కీబోర్డ్ని సృష్టించుట.
00:13 ఇక్కడ మనము Ktouch 1.7.1 ఉబుంటు లినక్స్ 11.10 పై ఉపయోగిస్తున్నాము.
00:21 KTouchని తెరుద్దమ్.
00:25 లెవల్ మూడు(3) చూపుతుందని గమనించండి.
00:28 ఎందుకంటే, మనము Ktouch ముసినప్పుడు స్థాయి మూడు(3)లో ఉన్నము.
00:32 ఒక కొత్త లెక్చర్ సృస్టించుట నేర్చుకుందాం.
00:36 ఇక్కడ టీచర్స్ వరసలో ప్రదర్శింపబడే కొత్త అక్షరాల సెట్ సృస్టించవచ్చు.
00:42 మెయిన్ మెనూ నుండి, ఫైల్ ఎంచుకొని Edit Lectureను క్లిక్ చేయండి.
00:48 Open Lecture File డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
00:52 Create New Lecture ఎంపికను ఎంచుకొని OK క్లిక్ చేయండి.
00:57 KTouch Lecture Editor డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
01:01 Title రంగంలో A default lecture పేరుని ఎంచుకొని తొలగించండి మరియు "My New Training Lecture” టైప్ చేయండి.
01:12 Level Editor లెక్చర్ స్థాయిని చూపుతుంది.
01:15 Level Editor బాక్స్ లోపాల క్లిక్ చేయండి.
01:18 Data of Level 1 క్రింద New Characters in this Level రంగంలో చిహ్నాలు ampersand(&), star(*) మరియు dollar($)లను ప్రవేశ పెట్టండి.
01:29 వాటిని ఒక సారి మాత్రమే ప్రవేశ పెట్టాలి.
01:32 ఈ అక్షరాలు Level Editor బాక్స్లోని మొదటి వరసలో ప్రదర్శింపబడ్డాయని గమనించండి.
01:38 మొదట Level Data రంగంలో కనిపించే టెక్స్ట్ను ఎంచుకొని తొలగించండి.
01:44 ampersand(&), star(*) మరియు dollar(*)చిహ్నాలను ఐదు(5) సార్లు ప్రవేశ పెట్టండి.
01:49 Level Editor బాక్స్ క్రింద, ప్లస్ గుర్తు పై క్లిక్ చేయండి. ఏం జరిగింది?
01:57 వర్ణమాలతో కూడిన రెండవ వరస Level Editor బాక్స్లో కనిపిస్తుంది.
02:02 Level Editor బాక్స్లోని రెండవ వరసను ఎంచుకుందాం.
02:06 Data of Level రంగం 2 చూపుతుంది.
02:09 ఇది మన టైపింగ్ పాఠం యొక్క రెండవ స్థాయి అవుతుంది.
02:13 New Characters in this Level రంగంలో "fj" ప్రవేశ పెట్టండి.
02:20 Level Data రంగంలో fjని ఐదు సార్లు ప్రవేశ పెట్టండి.
02:24 మీ టైపింగ్ పాఠంలో మీ అవసరాన్ని బట్టి అనేక స్థాయిలను సృష్టించవచ్చు.
02:29 అదేవిధంగా మీ టైపింగ్ పాఠంలో మీకు కావలసిన స్థాయులను సృష్టించవచ్చు.
02:35 Save ఐకాన్ క్లిక్ చేయండి.
02:37 Save Training Lecture – KTouch డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
02:41 Name రంగంలో New Training Lecture ప్రవేశ పెట్టండి.
02:45 ఫైల్ కొరకు ఒక ఫార్మాట్ను ఎంచుకుందాం.
02:49 Filter డ్రాప్ డౌన్ జాబితాలో త్రిభుజం(triangle) క్లిక్ చేయండి.
02:52 KTouch Lecture Files బ్రాకెట్లలో star.ktouch.xml ఫైల్ ఫార్మాట్గా ఎంచుకోండి.
03:03 ఫైల్ను సేవ్ చేయుటకు డెస్క్టాప్కు బ్రౌజ్ చేయండి. సేవ్ క్లిక్ చేయండి.
03:08 KTouch Lecture Editor డైలాగ్ బాక్స్ ఇప్పుడు New Training Lecture

అనే పేరును చూపుతుంది.

03:15 మనము రెండు స్థాయిలు ఉన్న కొత్త శిక్షణ లెక్చర్ను సృస్టించాము.
03:19 KTouch Lecture Editor డైలాగ్ బాక్స్ను ముసివెద్దాం.
03:24 మనము సృష్టించిన లెక్చర్ను తెరుద్దాం.
03:28 మెయిన్ మెనూ నుండి, ఫైల్ ఎంచుకొని ఆ తరవాత Open Lecture క్లిక్ చేయండి.
03:34 Select Training Lecture File డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
03:38 డెస్క్టాప్కు బ్రౌజ్ చేసి New Training Lecture.ktouch.xmlను ఎంచుకోండి.
03:46 చిహ్నాలు & *, మరియు $ టీచర్స్ వరసలో ప్రదర్శించబడ్డాయని గమనించండి. టైపింగ్ ప్రారంభిద్దాం.
03:54 మన సొంత లెక్చర్ను సృష్టించి, దానిని టైపింగ్ పాఠంగా ఉపయోగించాము.
03:59 KTouch టైపింగ్ పాఠాలకు తిరిగి వెళ్ళుటకు, మెయిన్ మెనూ నుండి ఫైల్ ఎంచుకొని Open Lecture క్లిక్ చేయండి. ప్రవహించే ఫోల్డర్ పాత్ను బ్రౌసె చేయండి.
04:10 Root->usr->share->kde4->apps->Ktouch మరియు english.ktouch.xml ఎంచుకోండి.
04:26 మనము KTouchను మనకు సరిపోయే ప్రాధాన్యతలతో(ప్రేఫెరేన్సుస్) అనుకూలీకరించవచ్చు.
04:30 ఉదాహరణకు, టీచర్స్ వరసలో ప్రదర్శింపబడని అక్షరమును టైప్ చేసినప్పుడు, స్టూడెంట్ వరస ఎరుపు రంగులోకి మారుతుంది.
04:37 మీరు వివిధ ప్రదర్శనలకు రంగులను అనుకూలీకరించవచ్చు.
04:41 ఇప్పుడు రంగు సెట్టింగులను మారుద్దాం.
04:44 మెయిన్ మెనూ నుండి Settings ఎంచుకొని Configure – KTouchను క్లిక్ చేయండి.
04:50 Configure – KTouch డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
04:53 Configure – KTouch డైలాగ్ బాక్స్లో Color Settings క్లిక్ చేయండి.
04:58 Color Settings వివరాలు కనిపిస్తాయి.
05:02 Use custom colour for typing line బాక్స్ను తనిఖీ చేయండి.
05:05 Teacher’s line రంగంలోని Text రంగం ప్రక్కన ఉన్న రంగు బాక్స్ పై క్లిక్ చేయండి.
05:12 Select-Color డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
05:15 Select-Color డైలాగ్ బాక్స్లోని ఆకూపచ్చ క్లిక్ చేసి OK చేయండి.
05:21 Configure – KTouch డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. Apply క్లిక్ చేసి OK చేయండి.
05:29 టీచర్స్ వరసలోని అక్షరాలు ఆకూపచ్చగా మారుతాయి!
05:33 ఇప్పుడు మన సొంత కీబోర్డ్ను సృష్టిద్దాం.
05:37 కొత్త కీబోర్డ్ను సృస్టించుటకు, మనము ఇదివరకే ఉన్న కీబోర్డ్ను ఉపయోగించాలి.
05:42 దానిలో మార్పులు చేసి భిన్నమైన పేరుతో సేవ్ చేయాలి.
05:46 మెయిన్ మెనూ నుండి ఫైల్ ఎంచుకొని, Edit Keyboard Layoutని క్లిక్ చేయండి.
05:52 Open Keyboard File డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
05:56 Open Keyboard File డైలాగ్ బాక్స్లో, Open a default keyboard ఎంచుకోండి.
06:02 దాని ప్రక్కన ఉన్న బటన్ను క్లిక్ చేయండి.
06:06 కీబోర్డుల జాబితా ప్రదర్శించబడుతుంది. en.keyboard.xml ఎంచుకోని OK క్లిక్ చేయండి.
06:15 KTouch Keyboard Editor డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
06:19 Keyboard Title రంగంలో Training Keyboard ప్రవేశ పెట్టండి.
06:25 మన కీబోర్డ్ కొరకు ఒక భాషను ఎంచుకోవాలి.
06:29 Language id డ్రాప్ డౌన్ జాబితా నుండి "en" ఎంచుకోండి.
06:35 మనము ఇదివరకే ఉన్న కీబోర్డ్ లోని ఫాంట్లను మారుద్దాము.
06:39 Set Keyboard Font క్లిక్ చేయండి.
06:42 Select Font – KTouch డైలాగ్ బాక్స్ విండో కనిపిస్తుంది.
06:48 Select Font - KTouch డైలాగ్ బాక్స్లో, ఫాంట్ ను ఉబుంటు గా, ఇటాలిక్ను ఫాంట్ శైలిగా మరియు సైజు 11గా ఎంచుకొందాం.
06:58 OK క్లిక్ చేయండి.
07:00 కీబోర్డ్ని సేవ్ చేసేందుకు, Save Keyboard As క్లిక్ చేయండి.
07:04 సేవ్ కీబోర్డు - KTouch డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
07:08 ప్రవహించే ఫోల్డర్ మార్గాన్ని బ్రౌజ్ చేయండి.
07:10 Root-> usr-> share-> kde4-> apps-> KTouch మరియు english.ktouch.xmlను ఎంచుకోండి.
07:26 Name రంగంలో Practice.keyboard.xml ప్రవేశ పెట్టి, సేవ్ క్లిక్ చేయండి.
07:33 '<name> .keyboard.xml' ఫార్మాట్లో ఫైల్ సేవ్ చెయ్యబడ్డది, Close క్లిక్ చేయండి.
07:42 మీరు వెంటనే కొత్తగ కీబోర్డ్ ఉపయోగించవచ్చా? లేదు.
07:46 మీరు కొత్త కీ బోర్డుని KDE-edu మెయిలింగ్ IDకి మెయిల్ చేయాలి. అది KTouch యొక్క తదుపరి వెర్షన్లో చేర్చబడుతుంది.
07:57 దీనితో మనము KTouch ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
08:01 ఈ ట్యుటోరియల్లో మనము శిక్షణ కోసం ఒక లెక్చర్ సృష్టించడం మరియు రంగు సెట్టింగులు సవరించడం నేర్చుకున్నాము.
08:08 ఇదివరకే ఉన్న కీబోర్డ్ లేఅవుట్ని తెరిచి, దానిని సవరించడం మరియు మన సొంత కీబోర్డ్ సృష్టించడం కూడా నేర్చుకున్నాము.
08:15 ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ ఉంది.
08:18 మీ స్వంత కీబోర్డు సృష్టించండి.
08:20 కీబోర్డ్లో రంగులు మరియు ఫాంట్ స్థాయి మార్పులను చేయండి. ఫలితాలను తనిఖీ చేయండి.
08:28 http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial.

క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్నవీడియోని చూడండి.

08:31 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశమును ఇస్తుంది.
08:34 మీకు మ౦చి బ్యాండ్విడ్త్ లేకపొతె మీరు ట్యుటోరియల్ డౌన్లోడ్ చెసి చూడొచ్చు.
08:38 స్పోకెన్ ట్యుటోరియల్స్ జట్టు,
08:41 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.
08:44 దానిలో ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రశంసాపత్రాలను జరిచేస్తుంది.
08:48 మరిన్ని వివరాలకు contact@spoken-tutorial.orgకు వ్రాయండి.
08:54 స్పొకెన్ ట్యుటోరియల్స్ ప్రొజెక్ట్, టాక్ టు ఎ టీచర్ ప్రొజెక్ట్ లో ఒక భాగము.
08:59 ఈ ప్రాజెక్ట్ జాతీయ విద్యాసంస్థ, ICT,MHRD మరియు రాష్ర్టీయ ప్రభుత్వం చేత ఆర్థిక సహయం పొందుతుంది.
09:07 దీనిపై మరి౦త సమాచార౦ spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Introలో అందుబాటులో ఉంది.
09:17 ఈ ట్యుటోరియల్ని తెలుగులోకి అనువాదం మాధురి గణపతి, పాల్గొన్నందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig