Java/C2/if-else/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 08:26, 29 August 2017 by Simhadriudaya (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:02 జావా నందు if else constructs అనే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకునేవి,
00:09 conditional statements గురించి,
00:11 వివిధ రకాల conditional statements మరియు
00:13 జావా ప్రోగ్రాం లో conditional statementsను ఉపయోగించడం.
00:18 ఈ ట్యుటోరియల్ కొరకు, మనం ఉబంటు వర్షన్ 11.10 JDK1.6 మరియు Eclipse IDE 3.7.0 ఉపయోగిస్తున్నాం.
00:27 ఈ ట్యుటోరియల్ ను అనుసరించేందుకు మీకు,
00:31 జావా లోని అర్థమెటిక్, రిలేషనల్ మరియు లాజికల్ ఆపరేషన్స్ పై అవగాహన ఉండాలి.
00:35 లేదంటే, తత్సంబంధ ట్యుటోరియల్ కొరకు మా వెబ్సైట్ ను సంప్రదించండి
00:42 కండీషనల్ స్టేట్మెంట్స్- మీరు వేర్వేరు నిర్ణయాలకై వేర్వేరు ప్రక్రియలను నిర్వహించcవలసిcఉన్నపుడు,
00:48 అటువంటి సందర్భాలలో మీరు కండీషనల్ స్టేట్మెంట్స్ ను ఉపయోగించవచ్చు.
00:52 ఒక కండీషనల్ స్టేట్మెంట్ ఒక ప్రోగ్రామ్ యొక్క అమలు యొక్క ప్రవాహాన్ని నియంత్రించడానికి సహాయం చేస్తుంది.
00:57 జావా లో మనకు ఈ క్రింది conditional statements ఉన్నాయి.
01:01 If స్టేట్మెంట్
01:02 If...Else స్టేట్మెంట్
01:03 If...Else if స్టేట్మెంట్
01:05 Nested If స్టేట్మెంట్
01:06 Switch స్టేట్మెంట్
01:08 ఈ ట్యుటోరియల్ లో మనం If, If...Else and If...Else If అనే స్టేట్మెంట్స్ గురించి వివరంగా నేర్చుకుంటాం.
01:15 if statement: ఒక కండిషన్ పై ఆధారపడి స్టేట్మెంట్స్(ప్రకటనల) యొక్క ఒక బ్లాక్ ను (సమూహాన్న) అమలుపరుచుటకు ఇఫ్ స్టేట్మెంట్ ను ఉపయోగిస్తాము.
01:22 దీనిని సింగల్ కండిషనల్ స్టేట్మెంట్ అంటారు.
01:26 if స్టేట్మెంట్ కొరకు సింటాక్స్.
01:28 ఇఫ్ స్టేట్మెంట్ లో, కండిషన్ సత్యం ఐతే, బ్లాక్ అమలు అవుతుంది.
01:34 ఒకవేళ కండిషన్ అసత్యం ఐతే, బ్లాక్ వదిలివేయబడి, అమలు కాదు.
01:40 ఇప్పుడు, if స్టేట్మెంట్ ను ఎలా ఉపయోగించవచ్చో అర్థంచేసుకోవడానికి ఒక ఉదాహరణను చూద్దాం.
01:45 అందుకు,ఎక్లిప్స్ కు మారుదాం.
01:48 మనం ఒక వ్యక్తి మైనర్ అవునా కాదా అని తెలుసుకోడానికి ఒక ప్రోగ్రాం ను వ్రాద్దాం.
01:53 నేను ఇంతకు ముందే Person అనే ఒక class ను సృష్టించాను.
01:56 ఇప్పుడు మెయిన్ మెథడ్ లో int రకానికి సంభందించిన age అనే వేరియబుల్ ను డిక్లేర్ చేద్దాం.
02:02 కనుక- మెయిన్ మెథడ్ లో int స్పేస్ age ఈక్వల్ టు 20 semicolon అని టైపు చెయ్యండి.
02:14 ఇప్పుడు, మనం దీనిని అనుసరిస్తున్నట్లుగా If స్టేట్మెంట్ ను వ్రాద్దాం.
02:18 తర్వాత వరుసలో, if బ్రాకెట్ లోపల age < 21 కర్లీ బ్రాకెట్స్ తెరిచి ఎంటర్ నొక్కండి.
02:30 ఇక్కడ, మనం age అనేది 21 కన్నా తక్కువగా ఉందేమో అని పరిశీలిస్తున్నాం. కర్లీబ్రాకెట్స్ తెరవండి.
02:34 బ్రాకెట్ లోపల ఏదయితే ఉందో అదంతా if బ్లాక్ కు సంభందించింది.
02:38 అందుకే బ్రాకెట్ లోపల
02:41 సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ ఎల్ ఎన్ బ్రాకెట్ లో డబుల్ కోట్స్ లో the person is minor సెమీకోలన్ అని టైప్ చేయండి.
02:56 ఇక్కడ, ఒకవేళ age అనేది 21 కన్నా తక్కువ అయితే The person is minor అని ప్రదర్శించబడుతుంది.
03:03 కనుక, ఫైల్ ను save చేసి runచేయండి.
03:08 మనకు ఔట్పుట్ లో The person is minor అని వస్తుంది.
03:14 ఈ సందర్భంలో, వ్యక్తి వయసు 20 అది 21 కన్నా తక్కువ.
03:20 అందువల్ల మనకు ఔట్పుట్ లో వ్యక్తి మైనర్ The person is minor అని వచ్చింది.
03:24 ఇప్పుడు, మనం if...else స్టేట్మెంట్ గురించి నేర్చుకుంటాం.
03:27 if...else స్టేట్మెంట్ ను ప్రత్యమ్నాయ స్టేట్మెంట్ లను అమలు చేయడానికి ఉపయోగిస్తాం.
03:31 ఇవి సింగల్ కండిషన్ పై ఆధారపడి ఉంటాయి.
03:34 మనం if...else స్టేట్మెంట్ ను వ్రాయడం కొరకు సింటాక్స్ చూద్దాం.
03:38 ఒకవేళ కండిషన్ సత్యం అయితే ఒక స్టేట్మెంట్ లేదా ఒక బ్లాక్ అనేది (ఎక్సిక్యూట్) అమలు అవుతుంది.
03:44 లేదంటే, అది వేరొక స్టేట్మెంట్ ను లేదా కోడ్ యొక్క బ్లాక్ ను (ఎక్సిక్యూట్) అమలు చేస్తుంది.
03:49 ఇప్పుడు, మనం if...else స్టేట్మెంట్ ను ఒక ప్రోగ్రాంలో ఎలా ఉపయోగించవచ్చో చూస్తాం.
03:54 కనుక, ఎక్లిప్స్ కు మారుదాం.
03:57 ఇప్పుడు మనం, ఒక వ్యక్తి మైనరా లేక మేజరా అని తెలుసుకోవడానికి ఒక ప్రోగ్రాం వ్రాస్తాం.
04:03 అందుకు మెయిన్ మెథడ్ లో int age equal to 25 అని
04:12 తరువాత, if బ్రాకెట్స్ లోపల age greater than 21.
04:19 కర్లీ బ్రాకెట్స్ లోపల System dot out dot println, బ్రాకెట్స్ లోపల The person is Major అని టైప్ చేయండి.
04:28 తర్వాత,నెక్స్ట్ లైన్ ను టైపు చేయండి,
04:32 కర్లీ బ్రాకెట్ లో else అని టైప్ చేసి,
04:38 సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ ఎల్ ఎన్ బ్రాకెట్ లో డబుల్ కోట్స్ లో The person is Minor, సెమీకోలోన్ అని టైప్ చేయండి.
04:51 ఇక్కడ,ఒకవేళ age 21 కన్నా తక్కువ అయితే The person is Minor అని ప్రదర్శించబడుతుంది.
04:58 లేదంటే, The person is Major అని ప్రదర్శించబడుతుంది.
05:02 ప్రోగ్రాం ను సేవ్ చేసి రన్ చేద్దాం.
05:07 మనకు The person is Major అని ఔట్పుట్ వస్తుంది.
05:11 ఇక్కడ, వ్యక్తి వయసు 25 అది 21 కన్నా ఎక్కువ.
05:17 అందువల్ల ప్రోగ్రాం The person is Major అని ఔట్పుట్ గా ప్రదర్శించబడింది.
05:22 If…Else If స్టేట్మెంట్: f…Else If స్టేట్మెంట్ ను, స్టేట్మెంట్స్ యొక్క వివిధరకాల సముదాయాలను అమలు చేయడానికి ఉపయోగిస్తారు.
05:29 ఇవి ఇవ్వబడిన రెండు కండిషన్ ల పై ఆధారపడి ఉంటాయి.
05:33 మీరు మీ అవసరానికి తగ్గట్టు మరిన్ని కండిషన్ లను దీనికి జోడించవచ్చు.
05:38 దీనినే బ్రాంచింగ్ లేదా డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ అని కూడా అంటారు.
05:43 ఇప్పుడు,ఈ If…Else If స్టేట్మెంట్ కొరకు సింటాక్స్ వ్రాయడం ఎలాగో చూద్దాం.
05:48 ప్రాధమికంగా if స్టేట్మెంట్ కండిషన్ 1 కొరకు తనిఖీ చేస్తుంది.
05:53 ఒకవేళ కండిషన్ 1 సత్యం అయితే, అది statement-or-block1 code ను అమలు చేస్తుంది.
05:59 లేదంటే,అది మరలా కండిషన్2 ను తనిఖీ చేస్తుంది.
06:02 ఒకవేళ కండిషన్ 2 సత్యం అయితే అది statement-or-block 2 ను అమలు చేస్తుంది.
06:09 లేదంటే, అది statement 3 లేదా block code 3 ని అమలు చేస్తుంది.
06:13 ఈ విధంగా, మనం If…Else బ్లాక్స్ తో కోడ్ ను పొడిగించవచ్చు.
06:17 ఈ బ్లాక్స్ బహుళ కండిషన్లు కలిగి ఉంటాయి.
06:20 కండిషన్ సత్యం అయ్యేవరకు దానికి సంభందించిన కోడ్ ఎ అమలు అవుతూ ఉంటుంది.
06:25 ఒకవేళ అన్ని కండిషన్లూ అసత్యం అయితే, అది చివరి కండిషన్ అయిన Elseని అమలు చేస్తుంది.
06:30 మనం If…Else If స్టేట్మెంట్ ను ఒక ప్రోగ్రాం లో ఎలా వాడవచ్చో చూద్దాం.
06:35 కనుక, ఎక్లిప్స్ కు మారండి.
06:37 నేను ముందుగానే క్లాస్ ని సృష్టించి దానికి Student అనే పేరునిచ్చాను.
06:40 ఇప్పుడు విద్యార్థి (student) యొక్క గ్రేడ్ ను తెలుసుకోవడానికి ప్రోగ్రాం వ్రాద్దాం.
06:44 ఇది వారి స్కోర్ శాతం పై ఆధారపడి పని చేస్తుంది.
06:47 దానికోసం మెయిన్ మెథడ్ లోపల, int space testScore equal to 70 semicolon అని టైప్ చేయండి.
06:58 testScore అనే ఇన్పుట్ వేరియబుల్ ను పరీక్ష ఫలితాల స్కోర్ శాతం తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు.
07:05 తర్వాతి లైన్ లో, if బ్రాకెట్స్ లోపల testScore less than 35తరువాత కర్లీ బ్రాకెట్స్ లోపల System dot out dot println అని టైప్ చేసి, బ్రాకెట్స్ లోపల మరియు డబుల్ కోట్స్ లో C grade semicolon అని టైప్ చేయండి.
07:28 ఒకవేళ, testScore అనేది 35 కన్నా తక్కువ అయితే అప్పుడు ప్రోగ్రాం C Grade అని ప్రదర్శిస్తుంది.
07:34 తర్వాత లైన్ లో, else అని టైప్ చేయండి.
07:37 తర్వాత లైన్ లో, if బ్రాకెట్ లో testScore గ్రేటర్-దాన్ ఆర్ ఈక్వల్ టు 35 AND (&&) testScore లెస్-దాన్ ఈక్వల్ టు 60. ఈ పూర్తి కండిషన్ ని కర్లీ బ్రాకెట్స్ లో పెట్టి ఎంటర్ నొక్కండి.
08:03 System dot out dot println బ్రాకెట్స్ లో B grade సెమీకోలన్ అని టైప్ చేయండి.
08:13 ఇక్కడ, ప్రోగ్రాం Else If విభాగం లో రెండవ కండిషన్ పరీక్షిస్తుంది.
08:18 ఒకవేళ టెస్ట్ స్కోర్ 35 మరియు 60 కి మధ్యలో ఉంటే ప్రోగ్రాం B Grade అని చూపిస్తుంది.
08:24 తర్వాత లైన్ లో, else బ్రాకెట్ లో System dot out dot println బ్రాకెట్స్ లో మరియు డబుల్ కోట్స్ లోపల A grade సెమీకోలన్ అని టైప్ చేయండి.
08:42 చివరగా, ఒకవేళ రెండు కండిషన్స్ అసత్యం అయితే ప్రోగ్రాం A Gradeఅని ప్రదర్శిస్తుంది.
08:48 ఇప్పుడు, ఈ కోడ్ ను సేవ్ చేసి, రన్ చేద్దాం.
08:51 మనకు A Grade అనే ఔట్పుట్ వస్తుంది.
08:55 ఈ ప్రోగ్రాం లో, స్టూడెంట్ యొక్క టెస్ట్ స్కోర్ 70.
09:00 అందువల్ల A Grade అనే ఔట్పుట్ డిస్ప్లే అవుతుంది.
09:02 ఇప్పుడు, టెస్ట్ స్కోర్ ను 55కు మారుద్దాం.
09:07 ఇప్పుడు, ప్రోగ్రాం ను సేవ్ చేసి, రన్ చేద్దాం.
09:10 ఇప్పుడు, B Grade అని ఔట్పుట్ ను కనిపిస్తుంది.
09:16 మనం కండిషన్ ల సంఖ్య ను కూడా పెంచవచ్చు.
09:19 మనం B grade ఔట్పుట్ సెక్షన్ తర్వాత, మరో కండిషన్ ను చేర్చుదాం.
09:23 ఇక్కడ టైప్ చేయండి else, తర్వాత లైన్ లో, if బ్రాకెట్ లో testScore గ్రేటర్ తాన్ ఈక్వల్ టు 60 AND (&&) testScore లెస్ దాన్ ఈక్వల్ టు 70.
09:47 కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేసి, ఎంటర్ నొక్కి, System dot out dot println బ్రాకెట్స్ లోపల మరియు డబుల్ కోట్స్ లోపల O grade semicolon.
10:01 ఇక్కడ testScore విలువ 60 మరియు 70 ల మధ్య ఉంటే, ప్రోగ్రాం O Grade ని డిస్ప్లే చేస్తుంది.
10:07 ఇప్పుడు testScore విలువ ను 70 కు మార్చండి.
10:12 ఇప్పుడు, ఫైల్ ను సేవ్ చేసి,రన్ చేయండి.
10:15 మనకు ఔట్పుట్ ఇలా వస్తుంది.
10:17 ప్రోగ్రాం O grade అని ఔట్పుట్ ను ప్రదర్శిస్తుంది.
10:20 ఇది ఇంతకు ముందులా A grade కాదు.
10:23 ప్రోగ్రాం టెస్ట్ స్కోర్ 70 కన్నా ఎక్కువ ఉంటే A grade అని ప్రదర్శిస్తుంది.
10:28 కండిషనల్ స్ట్రక్చర్స్ ను వ్రాసేటప్పుడు:
10:30 స్టేట్మెంట్ చివరలో సెమీకోలోన్ తప్పక జోడించాలి అని గుర్తుంచుకొనండి.
10:35 కానీ కండిషన్ స్టేట్మెంట్ తర్వాత సెమీకోలోన్ ను జోడించకండి.
10:40 కోడ్ ను కర్లీబ్రాకెట్ లలోనే ఉంచండి.
10:43 ఒకవేళ బ్లాక్,సింగల్ స్టేట్మెంట్ కలిగి ఉంటే, కర్లీ బ్రేసెస్ అనేవి ఐచ్చికం మాత్రమే.
10:49 మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాం.
10:51 ఈ ట్యుటోరియల్ లో మనం,
10:53 కండిషనల్ స్టేట్మెంట్ గురించి వివరించాం.
10:56 కండిషనల్ స్టేట్మెంట్ల యొక్క రకాల జాబితా ను చూశాము.
10:59 కడిషనల్ స్టేటుమెంట్స్ if, if...else and if...else if లను జావా ప్రోగ్రామ్స్ లో ఉపయోగించాము.
11:04 ఇప్పుడు,కండిషనల్ స్టేట్మెంట్స్ -if, if...else మరియు if...else if స్టేట్మెంట్స్ ను ఉపయోగించి ఒక జావా ప్రోగ్రాం వ్రాయడాన్ని ఒక అసైన్మెంట్ గా తీసుకోండి.
11:12 if స్టేట్మెంట్ ఉపయోగించి రెండు విలువలను పోల్చడానికి ఒక జావా ప్రోగ్రామ్ ను వ్రాయండి.
11:17 ఇచ్చిన సంఖ్య సరిసంఖ్య లేదా బేసి సంఖ్య అని తెలుసుకోవడానికి ఒక జావా ప్రోగ్రాం వ్రాయండి.సూచన : if...else స్టేట్మెంట్ ఉపయోగించి.
11:23 ఇచ్చిన 3 సంఖ్యలలో గరిష్ట సంఖ్య ను తెలుసుకోవడానికి ఒక జావా ప్రోగ్రాం వ్రాయండి.సూచన : if...else స్టేట్మెంట్ ఉపయోగించి
11:29 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలకోసం
11:32 ఈ క్రింది లింక్ లో గల వీడియోను చూడండి.
11:35 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ సారాంశం.
11:38 మీకు మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు
11:42 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు టీమ్:
11:44 స్పోకన్ ట్యుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది.
11:47 ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇస్తుంది.మరిన్ని వివరాలకు contact AT spoken HYPHEN tutorial DOT org కి వ్రాయండి.
11:56 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్-టు-ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం.
12:00 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
12:06 మరిన్ని వివరాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి.
12:15 ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష మరియు ఉదయ ఉదయ లక్ష్మి. పాల్గొన్నందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya