Java/C2/Getting-started-Eclipse/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 17:03, 28 July 2017 by Madhurig (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 గెట్టింగ్ స్టార్టెడ్ విత్ ఎక్లిప్స్ పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకునే అంశాలు-
00:08 ఎక్లిప్స్ లో ప్రాజెక్టు ను సృష్టించి దానికి, ఒక క్లాస్ ను జత చేయుట.
00:12 జావా ప్రోగ్రాం ను వ్రాయట మరియు
00:14 ఎక్లిప్స్ లో జావా ప్రోగ్రాం ను అమలుపరచుట.
00:18 ఈ టుటోరియల్ కోసం మనము ఉబంటు Linux 11.10 మరియు ఎక్లిప్స్ 3.7 ఉపయోగిస్తున్నాము
00:25 ఈ ట్యుటోరియల్ అనుసరించేందుకు, మీ సిస్టమ్ పై
00:28 ఎక్లిప్స్ స్టాపించి ఉండాలి.
00:30 లేకపోతే సంబంధిత ట్యుటోరియల్ కోసం మా వెబ్ సైట్ ను సంప్రదించగలరు.
00:39 ఎక్లిప్స్ ఒక క్రోడీకృత నిర్మాణ పర్యావరణం (Integrated Development Environment).
00:42 ఈ సాధనాన్ని జావా ప్రోగ్రాంలను వ్రాయటానికి, సవరణలకు మరియు అమలుపరుచేందుకు ఉపయోగిస్తాం.
00:50 ఇప్పుడు మనం ఎక్లిప్స్ ను తెరుద్దాం.
00:55 Alt F2 నొక్కి, డైలాగ్ బాక్స్ లో ఎక్లిప్స్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
01:08 మనకు వర్క్ స్పేస్ లాంచర్ డైలాగ్ బాక్స్ వస్తుంది.
01:11 ఎక్లిప్స్ మరియు మీ ప్రాజెక్ట్ సంబందించిన ఫైల్స్ అన్నీ వర్క్ స్పేస్ లో నిల్వచేయబడుతాయి.
01:19 వర్క్ స్స్పేస్ కు ముందే నిర్దేశించిన స్థానం ఉంది.
01:24 బ్రౌస్ ఎంపిక ఉపయోగించుకొని వేరొక డైరెక్టరీను ఎంచుకోవచ్చు.
01:27 ప్రస్తుతానికి, default డైరెక్టరీను ఎంచుకొని ముదుకు వెళ్దాం.
01:30 Ok నొక్కి ముందుకు సాగండి.
01:39 ఇది మన Welcome to Eclipse పేజ్.
01:46 పైన కుడి మూలలో ఉన్న వర్క్ బెంచ్ పై క్లిక్ చేయండి.
01:52 ఇది మన ఎక్లిప్స్ ఐ‌డి‌ఈ. ఇప్పుడు ఇందులో ఒక ప్రాజెక్ట్ సృష్టిద్దాం.
01:57 ఫైల్ మెను లో న్యూ లో ప్రాజెక్ట్ ఎంచుకోండి.
02:05 ప్రాజెక్ట్ జాబితాలో జావా ప్రాజెక్ట్ ను ఎంచుకోండి.
02:10 మనం చాలా టుటోరియల్ లలో జావా ప్రాజెక్ట్ ను ఉపయోగిస్తాం. Next పై క్లిక్ చేయండి.
02:19 ప్రాజెక్ట్ పేరు లో EclipseDemo అని టైప్ చేయండి.
02:30 Use default location అనే ఎంపికను గమనించండి.
02:34 ఈ ఎంపికను ఎంచుకొంటే, ఎక్లిప్స్ డెమో ప్రాజెక్ట్ సంబంధిత files(డేటా) అన్ని, default వర్క్-స్పేస్ లో నిల్వచేయబడతాయి.
02:41 దీన్ని ఎంచుకోపోతే, బ్రౌస్ పై క్లిక్ చేసి వేరే చోటుని ఎంచుకోవచ్చు.
02:47 ప్రస్తుతానికి మనం పూర్వనిర్ధారిత స్థానాన్ని ఎంచుకుందాం.
02:52 విజార్డ్ లో కింద కుడి మూల లో ఉన్న Finish పై క్లిక్ చేయండి
03:00 Open Associated Perspective డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది
03:04 పెర్స్ పెక్టివ్, ఎక్లిప్స్ లో ఐటంలు ఎలా అమర్చబడ్డాయో సూచిస్తుంది.
03:09 ఈ డైలాగ్ బాక్స్ జావా నిర్మాణం పూరకంగా ఉండే పెర్స్ పెక్టివ్ ని సూచిస్తుంది.
03:20 Remember my decision (నా నిర్ణయాన్ని గుర్తుంచుకో) ఎంపికను ఎంచుకొని యెస్ పై క్లిక్ చేయండి.
03:27 ఇది ప్రాజెక్ట్ తోబాటు ఉన్న ఎక్లిప్స్ IDE, ఇప్పుడు ప్రాజెక్ట్ కు ఒక క్లాస్ జోడిద్దాం.
03:37 ప్రాజెక్ట్ పై రైట్ క్లిక్ చేసి, న్యూ లో క్లాస్ ఎంచుకోండి.
03:46 క్లాస్ పేరు DemoClass (డెమో క్లాస్ ) అని ఇవ్వండి.
03:55 మాడిఫైయర్స్ లో పబ్లిక్ మరియు డీఫాల్ట్ అనే రెండు ఎంపికలు ఉన్నాయని గమనించండి.
03:59 ఇప్పుడు, ఇప్పటికీ పబ్లిక్ ఎంపికనే ఎంచుకుందాం.
04:01 మిగతా ఎంపికల గురించి తరువాత ట్యుటోరియల్స్ లో వివరిస్తాను.
04:06 మరియు మెథడ్ స్టబ్స్ జాబితాలో, public static void main అనే ఎంపికను ఎంచుకొండి.
04:14 మిగతా ఎంపికలగురించి తరువాత ట్యుటోరియల్స్ లో వివరిస్తాను.
04:19 విజార్డ్ కు కింద కుడి మూలలో ఫినిష్ పై క్లిక్ చేయండి.
04:30 ఇది మన క్లాస్ ఫైల్.
04:35 ఇక్కడ చాలా విభాగాలున్నాయని గమనిచండి. వీటిని పోర్ట్-లెట్స్ అంటారు.
04:41 ప్యాకేజ్ఎక్స్-ప్లోరర్, పోర్ట్-లెట్, ఫైల్ బ్రౌసర్ లా పనిచేస్తుంది.
04:46 ఎడిటర్ పోర్ట్-లెట్ లో కోడ్ ను టైప్ చేయగలం.
04:50 ఔట్ లైన్ పోర్ట్-లెట్ ప్రాజెక్ట్ తారతమ్యాన్ని సూచిస్తుంది.
04:56 ప్రతి పోర్ట్-లెట్ యొక్క పరిమాణాన్ని మార్చగలం.
05:10 మినిమైస్ బటన్ ఉపయోగించి వీటిని మినిమైస్ చేయగలం.
05:26 రెస్టోర్ బటన్ ను ఉపయోగించి పోర్ట్-లెట్ రిస్టోర్ చేయగలం.
05:37 ఇప్పుడు ఎడిటర్ తప్ప మిగతా అన్నీ పోర్ట్ లెట్స్ ని మినిమైజ్ చేద్దాం.
05:49 ఇక్కడ ఎక్లిప్స్, మనకోసం నిర్మించిన కొంచెం కోడ్ కనిపిస్తుంది.
05:54 క్లాస్ నిర్మిచే సమయంలో మన ఎంపికలకు తగ్గట్టు ఈ కోడ్ నిర్మించబడుతుంది.
06:00 ఇప్పుడు, ఇక్కడ print స్టేట్మెంట్ ను జతచేద్దాం.
06:08 System.out.println టైప్ చేసి పరాంతసిస్ లో కోట్స్ లో Hello Eclipse (హలో ఎక్లిప్స్ )అని టైప్ చేయండి.
06:26 వాక్యం చివరన సెమికోలన్ ను పెడదాం.
06:31 ఫైల్ మేను లో సేవ్ ఎంచుకొని ఫైల్ ను సేవ్ చేయండి.
06:37 బదులుగా, crtl +s నొక్కి కూడా సేవ్ చేయగలరు.
06:42 కోడ్ ను అమలుపరుచుటకు ఎడిటర్ పై రైట్ క్లిక్ చేసి Run-as ఎంపికలో జావా అప్ప్లికేషన్ ఎంచుకోండి.
06:56 ఔట్ పుట్ కంసోల్ లో ప్రోగ్రాం అవుట్ ఫుట్ ను ముద్రిస్తుంది.
07:04 మన కోడ్ లో ఎటువంటి లోపాలున్నా, ప్రాబ్లమ్స్ పోర్ట్ లెట్ లో సూచిస్తుంది.
07:10 ఈ విధంగా, ఎక్లిప్స్ లో జావా ప్రోగ్రాం ని వ్రాసి, అమలుపరుచుతాం.
07:18 ఇంతటితో ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
07:20 ఈ ట్యుటోరియల్ లో ఎక్లిప్స్ లో ప్రాజెక్ట్ ను సృష్టించడం ప్రాజెక్ట్ కి క్లాస్ ను జత చేయడం, జావా సోర్స్ కోడ్ ను వ్రాయడం మరియు అమలుపరచడం అనే విషయాలు తెలుసుకున్నాం.
07:33 అసైన్మెంట్ గా, డిస్ప్లే పేరుతో ఒక ప్రాజెక్ట్ నిర్మించండి.
07:38 తరువాత Display కు, welcome అనే క్లాస్ ను జతచేయండి.
07:44 స్పోకన్ టుటోరియల్ గురించి మరిన్ని వివరాల కొరకు ఈ లింక్ లోని వీడియో ను చూడగలరు.
07:50 ఇది స్పోకన్ టుటోరియల్ సారాంశం ఇస్తుంది.
07:53 మంచి బాండ్ విడ్త్ లేకపోతే, డౌన్ లోడ్ చేసి చూడగలరు.
07:58 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్:
07:59 స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ లను ర్వహిస్తుంది.
08:02 ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును.
08:05 మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి.
08:12 స్పోకెన్ టుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం
08:17 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
08:23 దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది.
08:27 ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు స్వామి. పాల్గొన్నందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india