Inkscape/C3/Create-an-A4-Poster/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 16:14, 27 July 2017 by Simhadriudaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 Inkscape ను ఉపయోగించి Create an A4 Poster అను Spoken Tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకునేవి,
00:10 Document properties ను మార్చడం
00:12 ఒక A4 poster రూపకల్పన మరియు
00:14 poster ను pdf లో Save చేయడం.
00:17 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయటానికి,నేను,
00:19 Ubuntu Linux 12.04 OS
00:22 Inkscape వర్షన్ 0.48.4 ఉపయోగిస్తున్నాను.
00:26 Inkscape ను తెరుద్దాం.
00:28 File కి వెళ్ళి New పై క్లిక్ చేయండి.
00:32 ఇవి అందుబాటులోఉన్నఅప్రమేయ canvas పరిమాణాలు.
00:37 అప్రమేయంగా, నా canvas, A4 size లో ఉంది.
00:41 కనుక, నేను దానిని ఎలా ఉందో అలాగే వదిలేస్తాను.
00:44 ఒకవేళ మీ కంప్యూటర్ లో ఆలా లేనట్టయితే, A4 size ను ఎంచుకోండి.
00:49 ఇప్పుడు కొన్ని సెట్టింగులను మార్చుదాం.
00:51 File కి వెళ్ళి Document properties పై క్లిక్ చేయండి.
00:54 అక్కడ మనం వివిధ టాబ్లు మరియు ఎంపికలతో తెరుచుకున్న ఒక డైలాగ్ బాక్స్ ను చూస్తాము.
00:59 మనం వాటిని గురించి ఒకదాని తరువాత ఒకటి నేర్చుకుందాం.
01:03 మొదటి టాబ్ Page లో, Default units డ్రాప్ -డౌన్ జాబితాపై క్లిక్ చేయండి.
01:08 నేను ఒకదాని తరువాత ఒకటి క్లిక్ చేస్తుంటే, ruler యొక్క కొలతలలో మార్పులను గమనించండి.
01:13 నేను కొలతని pixels గా ఉంచుతాను.
01:16 Background ఎంపిక, బ్యాక్ గ్రౌండ్ యొక్క పారదర్శకత మరియు రంగును మార్చడానికి సహాయపడుతుంది.
01:21 మనం దానిపై క్లిక్ చేసినప్పుడు, ఒక కొత్త dialog box కనిపిస్తుంది.
01:24 RGB slider లను ఎడమ మరియు కుడికి కదిలించండి.
01:29 background colour ను canvas పైన కనిపించేలా చేయటానికి, alpha slider ను కుడివైపుకు కదిలించండి.
01:35 ఇప్పుడు పారదర్శకత ఎంచుకున్న RGB విలువలకు మారుతుంది.
01:40 Document properties విండో లో, నేను మార్పులను చేస్తుంటే, బ్యాక్ గ్రౌండ్ ఎంపికపై రంగును గమనించండి.
01:47 Alpha స్లయిడర్ ను ఎడమ వైపు చివరకి తీసుకువచ్చి డైలాగ్ బాక్స్ ను మూసివేయండి.
01:52 Page size కింద మనం చాల ఎంపికలను చూస్తాము.
01:55 మనం ఈ ఎంపికలను ఉపయోగించి కూడా canvas యొక్క పరిమాణాన్ని మార్చవచ్చు.
02:00 నేను క్లిక్ చేస్తుంటే, canvas పరిమాణంలో వచ్చే మార్పును గమనించండి.
02:04 పేజీ పరిమాణాన్ని A4 గా ఉంచుదాం.
02:08 Orientation ను Portrait లేదా Landscape కు మార్చవచ్చు.
02:12 రెండు ఎంపికలపై క్లిక్ చేసి canvas పై వచ్చే మార్పును గమనించండి.
02:17 మనం Width మరియు Height పారామీటర్ లను ఉపయోగించి canvas యొక్క వెడల్పు మరియు ఎత్తులను మార్చవచ్చు.
02:23 Units డ్రాప్ -డౌన్ జాబితా పై క్లిక్ చేయండి. ఇక్కడ, మనం మన అవసరాలకు తగినట్టుగా కొలతలను మార్చుకోవచ్చు.
02:31 ఇప్పుడు యూనిట్స్ ను pixels కు మార్చుదాం.
02:34 Resize page to content ఎంపికపై క్లిక్ చేయండి.
02:37 అందుబాటులో ఉన్న వివిధ ఎంపికలు తెరుచుకుంటాయి.
02:41 ఇక్కడ అన్ని వైపుల కోసం అంచులను సెట్ చేయవచ్చు.
02:45 అంచులను అమర్చిన తరువాత, Resize page to drawing or selection బటన్ పై క్లిక్ చేయవలసి ఉంటుంది.
02:51 తరువాతది Border ఎంపిక. ఇక్కడ 3 చెక్ బాక్స్ ఎంపికలను చూడవచ్చు.
02:57 ఈ ఎంపికలను ప్రదర్శించడానికి,ముందుగా నేను ఈ పద్దతిలో ఒక ellipse ను గీస్తాను.
03:03 మొదటి ఎంపికను పేజీ యొక్క సరిహద్దును చేస్తుంది, అనగా, canvas యొక్క సరిహద్దు కనిపిస్తుంది.
03:08 ఈ ఎంపికను ఆన్ చెక్ చేయండి సరిహద్దులు(బోర్డర్స్) మరి కనిపించవు.
03:13 అప్పుడు మళ్ళీ ఎంపికపై క్లిక్ చేస్తే, సరిహద్దులు(బోర్డర్స్) తిరిగి కనిపిస్తాయి, గమనించండి.
03:18 రెండవ ఎంపిక డ్రాయింగ్ యొక్క పైభాగంలో సరిహద్దును(బోర్డర్) అమర్చుతుంది కనుక అది స్పష్టముగా కనిపిస్తుంది.
03:25 ఈ ఎంపికను మళ్ళీ ఒకసారి చెక్ చేసి అన్ చెక్ చేయండి canvas పైన ఏమి జరుగుతుందో గమనించండి.
03:31 మూడవ ఎంపిక కుడి వైపు మరియు దిగువలన కాన్వాస్ యొక్క నీడను చూపుతుంది.
03:36 ఇక్కడ గమనించండి, కుడి మరియు దిగువ సరిహద్దులు(బోర్డర్స్) ఇతర రెండు వైపుల కంటే మందంగా ఉంటాయి.
03:42 మూడవ ఎంపికను అన్ చెక్ చేస్తే, ఈ నీడ అదృశ్యమవుతుంది గమనించండి.
03:47 మన అవసరాలు మరియు ప్రాధాన్యతల ప్రకారం ఈ ఎంపికలను మనం ఉపయోగించుకోవచ్చు.
03:52 Border color ఎంపిక మనకు సరిహద్దు రంగును నిర్ణయించటానికి అనుమతిస్తుంది.
03:57 అప్రమేయంగా సరిహద్దుకు ఉన్న రంగును అలాగే వదిలేద్దాం.
04:01 తరువాత, Guides ట్యాబ్ పై క్లిక్ చేయండి.
04:03 canvas పై టెక్స్ట్ మరియు గ్రాఫిక్ ఆబ్జెక్ట్ లను సమలేఖనం చేయడంలో Guides మీకు సహాయపడతాయి.
04:08 ఇక్కడ మీరు ruler guides ను సృష్టించవచ్చు.
04:12 వర్టికల్ ruler పై క్లిక్ చేసి ఒక guideline ను లాగండి.
04:15 ఇపుడు మొదటి ఎంపిక Show Guides ను చెక్ మరియు అన్ చెక్ చేయండి.
04:19 canvas పైన మార్గదర్శిని కనిపిస్తుంది తరువాత కనిపించ కుండా పోతుంది,గమనించండి.
04:25 Guide colorరే, guideline యొక్క రంగు.
04:28 మార్గదర్శిని ఎప్పుడైనా ఒక నిర్దిష్ట స్థానానికి లాగబడితే Highlight color దాని రంగు అవుతుంది.
04:33 guide మరియు highlight యొక్క అప్రమేయ రంగులు ఇక్కడ కనిపిస్తాయి.
04:37 మీరు మీ ప్రాధాన్యతను అనుసరించి వాటిని మార్చుకోవచ్చు.
04:41 నేను అప్రమేయ రంగులనే వదిలేస్తాను.
04:44 ఆబ్జెక్ట్ లు లేదా సరిహద్దు పెట్టె(బౌండింగ్ బాక్స్) ను సమీప మార్గదర్శకాలకు లాగుతున్నపుడు Snap guides while dragging ఎంపిక వాటిని snap చేయటానికి సహాయం చేస్తుంది.
04:52 తరువాత, Grids ట్యాబ్ పై క్లిక్ చేయండి.
04:54 ఈ ఎంపికను ఉపయోగించి, మనము canvas పై చిత్రకళ వెనుక కనిపించే grid ను సెట్ చేయవచ్చు.
05:00 Grids అనేవి canvas పైన ఆబ్జెక్ట్ లను స్థానపరచడానికి ఉపయోగపడతాయి కానీ అవి ముద్రిచబడవు.
05:07 డ్రాప్ -డౌన్ జాబితా పై. click చేయండి.
05:09 Rectangular grid మరియు Axonometric grid అనే అందుబాటులో ఉన్న రెండు రకాలgrids.
05:16 Rectangular grid ను ఎంచుకుని New బటన్ పై క్లిక్ చేయండి.
05:20 వెంటనే, canvas బాక్గ్రౌండ్ పై ఒక grid ఏర్పడుతుంది.
05:25 అందుబాటులో ఉన్నఎంపికలను ఉపయోగించి మన అవసరానికి అనుగుణంగా grid లక్షణాలను మనం సెట్ చేయవచ్చు.
05:31 దిగువన గల Remove బటన్ క్లిక్ చేయడం ద్వారా grid ను మనము తొలగించవచ్చు.
05:36 ఇదే విధంగా, మీరు Axonometric grid కోసం కూడా ఈ ఎంపికలను ప్రయత్నించవచ్చు.
05:41 తదుపరి 3 ట్యాబ్ లలోని ఎంపికలు ఈ సిరీస్ లోని అధునాతన స్థాయి టోటోరియల్స్ లో చేర్చించబడుతాయి.
05:47 ఇప్పుడు, పోస్టర్ సృష్టించడం ప్రారంభిద్దాం.
05:50 కనుక, ముందుగా నేను ellipse మరియు guideline లను తొలగిస్తాను.
05:53 మన పోస్టర్ కోసం, ముందు మనం ఒక బాక్గ్రౌండ్ ని రూపొందిద్దాం.
05:58 Rectangle tool పై క్లిక్ చేయండి.
06:00 మొత్తం canvas ను కప్పి ఉంచేలా ఒక పెద్ద దీర్ఘ చతురసాన్ని గీయండి.
06:06 దానికి లేత నీలం ప్రవణతతో(గ్రేడియంట్ తో) రంగు చేయండి.
06:08 తరువాత, Bezier tool ని ఉపయోగించి కాన్వాస్ యొక్క,
06:16 పైభాగంలో ఒక header area మరియు దిగువభాగం వద్ద ఒక footer area ను గీయండి.
06:23
మనం దాన్ని నీలం రంగు చేద్దాం.
06:25 ఇప్పుడు Spoken Tutorial logo ని దిగుమతి చేద్దాం.
06:28 Code Files లింక్ లో ఈ లోగో మీకు ఇవ్వబడింది.
06:32 కనుక, అన్నిటికంటే ముందు, ట్యుటోరియల్ ను విరామంలో ఉంచి Code Files పై క్లిక్ చేసి zip file డౌన్లోడ్ చేయండి.
06:39 ఇప్పుడు ఫోల్డర్ ను unzip చేసి, మీ కంప్యూటర్ లో మీకు కావాల్సిన స్థానంలో దాన్ని save చేయండి.
06:45 ఇప్పుడు మన Inkscape డాక్యుమెంట్ కు తిరిగిరండి.
06:47 File మెనూ కి వెళ్ళి Import పై క్లిక్ చేయండి.
06:51 logo భద్రపరచబడిన ఫోల్డర్ కు వెళ్ళండి.
06:54 Spoken Tutorial logo ను ఎంచుకొని Open పై క్లిక్ చేయండి.
06:59 ఒక కొత్త డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. OK పై క్లిక్ చేయండి.
07:03 ఇప్పుడు లోగో మన canvas పైకి దిగుమతి అవుతుంది.
07:06 దానిని 100×100 pixels కు Resize చేయండి.
07:09 header area యొక్క ఎడమ ఎగువ మూలలో దానిని ఉంచండి.
07:14 ఇప్పుడు, Spoken Tutorial అనే టెక్స్ట్ టైప్ చేయండి.
07:18 దాన్ని Bold చేయండి.
07:20 టెక్స్ట్ ఫాంట్ సైజ్ ను 48 కి మార్చండి.
07:24 దానిని logo యొక్క కుడి వైపున ఉంచండి.
07:27 దీని తర్వాత,partner with us...help bridge the digital divide అనే టెక్స్ట్ ను టైప్ చేయండి.
07:35 ఫాంట్ సైజ్ ను 20 కి మార్చండి.
07:39 తరువాత, కొంత టెక్స్ట్ ను జోడిద్దాం.
07:42 నేను ఇప్పటికే నా కంప్యూటర్ లో LibreOffice Writer డాక్యుమెంట్ లో ఒక శాంపిల్ టెక్స్ట్ ను భద్రపరిచాను.
07:47 ఈ శాంపిల్ టెక్స్ట్ Code Files లో మీకు అందించబడింది.
07:51 దయచేసి దీన్ని మీ సేవ్ చేసిన ఫోల్డర్లో గుర్తించండి.
07:54 ఇప్పుడు, నా పోస్టర్లో ఖాళీ ప్రదేశంలో నేను ఈ టెక్స్ట్ ను copy మరియు paste చేస్తాను.
08:00 ఫాంట్ సైజ్ ను 28 కి మార్చండి.
08:04 వరుస అంతరాన్నిసెట్ చేయండి.
08:06 bullet లను సృష్టించి ప్రతీ వాక్యానికి ముందు ఉంచండి.
08:10 మనం దాని కింద రెండు చిత్రాలను జోడిస్తాము.
08:13 ఇంతకు ముందులగే, వాటిని ఒకొకటిగా import చేయండి.
08:17 నేను వాటిని images ఫోల్డర్ లో భద్రపరిచాను.
08:20 ఈ చిత్రాలు మీకు Code Files లోఅందించబడ్డాయి.
08:24 దయచేసి వాటిని మీ సేవ్ చేసిన ఫోల్డర్లో గుర్తించండి.
08:27 చిత్రాలను ఎంచుకుని వాటి పరిమాణాన్ని మార్చండి.
08:30 poster యొక్క దిగువభాగానికి వాటిని కదిలించండి.
08:33 footer area వద్ద సంప్రదింపు వివరాలను రాయండి.
08:37 ఒకసారి మళ్ళీ, LibreOffice Writer డాక్యుమెంట్ నుండి టెక్స్ట్ ను copy మరియు paste చేయండి.
08:42 ఫాంట్ సైజ్ ను 18 కి మార్చండి.
08:45 ఇప్పుడు, మన poster సిద్ధమైనది.
08:47 తరువాత, దానిని pdf' ఫార్మాట్ లో ఎలా భద్రపరచాలో నేర్చుకుందాం.
08:51 File కి వెళ్ళి Save As పై క్లిక్ చేయండి.
08:55 ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
08:58 మీరు సేవ్ చేయదలిచిన ఫోల్డర్ను ఎంచుకోండి.
09:00 నేను Desktop ను ఎంచుకుంటాను.
09:02 డైలాగ్ బాక్స్ యొక్క దిగువ కుడివైపు డ్రాప్-డౌన్ జాబితాపై క్లిక్ చేయడం ద్వారా ఫార్మాట్ ను pdf గా మార్చండి.
09:09 ఇక్కడ,Name స్థానంలో, Spoken-Tutorial-Poster.pdf అని టైప్ చేసి,
09:16 అప్పుడు Save బటన్ పై క్లిక్ చేయండి.
09:18 మన పోస్టర్ Desktop లో భద్రపరచబడింది.
09:21 Desktop కి వెళ్ళి, మన పోస్టర్ ని చెక్ చేద్దాం.
09:25 అలా, మనం pdf ఫార్మాట్ లో పోస్టర్ ని కలిగిఉన్నాము.
09:28 సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి,
09:32 Document properties ను మార్చడం,
09:34 ఒక A4 poster రూపకల్పన,
09:36 పోస్టర్ ను pdf లో భద్రపరచడం.
09:38 ఇక్కడ మీ కోసం ఒక అసైన్మెంట్-
09:40 Spoken Tutorial Project కొరకు ఒక A4 poster ను సృష్టించండి.
09:44 మీ పూర్తి అయిన అసైన్మెంట్ చూడటానికి ఇలా ఉండాలి.
09:48 ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది దయచేసి దానిని చూడండి.
09:54 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
10:01 మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి: contact@spoken-tutorial.org.
10:04 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.
10:10 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro.
10:14 మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
10:16 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Simhadriudaya, Yogananda.india