Inkscape/C2/Create-and-edit-multiple-objects/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 11:31, 9 May 2017 by Simhadriudaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 Inkscape ను ఉపయోగించి Create and edit multiple objects పై ఈ Spoken Tutorial కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లోమనం నేర్చుకునేవి- ఆబ్జెక్ట్ లను కాపీ మరియు పేస్ట్ చేయటం.
00:13 ఆబ్జెక్ట్ లను డూప్లికేట్ మరియు క్లోన్ చేయటం
00:16 వివిధ ఆబ్జెక్ట్ లను సమూహ పరచుట మరియు క్రమ పరచుట
00:19 మల్టిపుల్ సెలక్షన్ మరియు ఇన్వెర్ట్ సెలక్షన్ (బహుళ ఎంపిక మరియు ఎంపికను తిరగవేయటం).
00:22 Clipping మరియు Masking.
00:25 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయటానికి, నేను-Ubuntu Linux 12.04 OS
00:31 Inkscape వర్షన్ 0.48.4 ఉపయోగిస్తున్నాను
00:35 Dash home కు వెళ్ళి, Inkscap అని టైప్ చేయండి.
00:39 మీరు logo పై క్లిక్ చేసి కూడా Inkscape ను తెరువవచ్చు.
00:42 మనం ఇంతకుముందే రూపొందించిన Assignment.svg ఫైల్ ను తెరుద్దాం.
00:49 నేను దానిని నా Documents ఫోల్డర్ లో భద్రపరిచాను.
00:52 ముందుగా మనం ఒక ఆబ్జెక్ట్ ను copy మరియు paste ఎలా చేయాలో నేర్చుకుందాం.
00:56 ఆలా చేయటానికి, ముందుగా మనం ఒక ఆబ్జెక్ట్ ను ఎంచుకోవాలి. కనుక, పంచభుజి పై క్లిక్ చేయండి.
01:02 దానిని copy చేయటానికి మీ కీ బోర్డు పై Ctrl + C ని నొక్కండి.
01:07 ఆబ్జెక్ట్ ను పేస్ట్ చేయటానికి Ctrl + V ని నొక్కండి.మీరు కేన్వాస్ పై పంచభుజి యొక్క ఒక ప్రతిని చూడవచ్చు.
01:17 ఆబ్జెక్ట్ ల కాపీలు సృష్టించడానికి మూడు ఇతర మార్గాలు ఉన్నాయి.
01:21 ఈ మూడు పద్ధతులలోను, ఆబ్జెక్ట్ యొక్క కాపీ ఖచ్చితంగా అసలుదానివలె సృష్టించబడుతుంది.
01:29 మొదటి పద్దతిని Paste Special అంటారు.
01:32 ఆబ్జెక్ట్ ను copy చేయటానికి ఇప్పటికే మనం Ctrl + C ని నొక్కామని గుర్తుంచుకోండి.
01:38 ఆబ్జెక్ట్ ఎక్కడనుండి అయితే కాపీ చేయబడిందో ఖచ్చితంగా అదే స్థానంలో paste చేయటానికి, Ctrl + Alt + V కీ ని నొక్కండి.
01:47 సరిగ్గా దానికిందనే ఉన్న అసలు ఆబ్జెక్ట్ ను చూడటానికి కాపీ చేయబడిన ఆబ్జెక్ట్ ను కదిలించండి.
01:54 ఈ రెండు ఆబ్జెక్ట్ లను కదిలిద్దాం ఇంకా వాటిని ఒక పక్కన పెడదాం.
01:57 రెండవ పద్దతిని Duplication అంటారు.డూప్లికేషన్ కొరకు, మనం ముందుగా ఆబ్జెక్ట్ ను కాపీ చేయవల్సిన అవసరం లేదు.
02:05 పంచభుజిని ఎంచుకోండి ఇంకా మీ కీబోర్డ్ పై Ctrl + D కీ లను నొక్కండి.
02:13 సరిగ్గా అసలు దానిలాగే ఉన్న ఒక డూప్లికేట్ పంచభుజి, అసలు దాని పైన సృష్టించబడింది
02:19 డూప్లికేట్ ఆబ్జెక్ట్ కిందన ఉన్న అసలు ఆబ్జెక్ట్ ను చూడటానికి దానిని కదిలిద్దాం.
02:25 డూప్లికేట్ ఆబ్జెక్ట్ మీద చేసిన మార్పులు అసలు ఆబ్జెక్ట్ ను ప్రభావితం చేయవు.
02:32 రంగు ను ఆకు పచ్చకు మార్చడం ఇంకా సైజు ను తగ్గించటం చేత దానిని చెక్ చేద్దాం.
02:40 మూడవ పద్దతిని Cloning అంటారు.
02:44 ఒక clone ను సృష్టించడానికి ellipse పై క్లిక్ చేయండి ఇంకా Alt + D నొక్కండి.
02:49 ముందువలె, ఒక క్లోన్డ్ ఆబ్జెక్ట్ కూడా అసలు దాని పైనే సృష్టించబడింది.
02:55 దానిని మనకు కనిపించేలా చేయటానికి, పక్కకి కదిలిద్దాం.
02:58 క్లోన్డ్ ఆబ్జెక్ట్ ఎల్లపుడు అసలైన ఆబ్జెక్ట్ తో జోడించబడి ఉంటుందని దయచేసి గమనించండి.
03:04 అసలు ఆబ్జెక్ట్ ను దాని మూలము అని కూడా అంటారు.
03:08 అసలు ఆబ్జెక్ట్ పై పరిమాణంలో, రంగు మొదలైనవాటిలో ఏ విధమైన మార్పులు చేసినా అవి దాని క్లోన్ ను ప్రభావితం చేస్తాయి.
03:16 అసలు ఆబ్జెక్ట్ యొక్క రంగును గులాబీకి మార్చడం, రొటేట్ చేయడం మరియు దాని యొక్క పరిమాణాన్ని తగ్గించడం చేత దానిని చెక్ చేద్దాం.
03:30 క్లోన్డ్ ఆబ్జెక్ట్ లోఖచ్చితమైన అవే మార్పులు స్వయంచాలకంగా ప్రతిబింబిస్తాయి, గమనించండి.
03:36 అసలు ఆబ్జెక్ట్ నుండి క్లోన్ లింక్ ను తొలగించటానికి, ముందు clone ను ఎంచుకుని తరువాత Shift + Alt + D ను నొక్కండి.
03:44 ఇప్పుడు, అసలు ఆబ్జెక్ట్ ను మళ్ళీ ఎంచుకోండి మరియు దాని యొక్క పరిమాణాన్ని మార్పు చేయండి.
03:50 క్లోన్డ్ ఆబ్జెక్ట్ ప్రభావితం కాలేదు, గమనించండి.
03:54 ఈ ప్రక్రియల కొరకు షార్ట్ -కట్ ఐకాన్స్ command bar లో చూపినవిధంగా ఉన్నాయి.
04:01 బహుళ ఆబ్జెక్ట్ లను ఎంచుకోవడానికి, Shift కీ ని నొక్కి ఉంచండి మరియు మీరు ఎంచుకోవాలి అనుకున్న ఆబ్జెక్ట్ లపై క్లిక్ చేయండి
04:08 నేను ముందుగా ఒక దీర్ఘవృత్తాన్నిఎంచుకుంటాను. తరువాత నేను Shift కీ ని నొక్కి పట్టుకొని, వేరొక దీర్ఘవృత్తాన్ని ఎంచుకుంటాను.
04:15 ఇప్పుడు రెండు ఆబ్జెక్ట్లు ఎంచుకోబడ్డాయి గమనించండి.
04:19 Ctrl + G కీలను కలిపినొక్కడం ద్వారా వాటిని మనము సమూహం చెయ్యవచ్చు.
04:24 ఇప్పుడు ఈ దీర్ఘవృత్తాలు ఒకే ఆబ్జెక్ట్ గా సమూహం చేయబడ్డాయి గమనించండి.
04:28 మీరు వాటిని చుట్టూ కదిలించవచ్చుమరియు రెండు ఆబ్జెక్ట్ లు కలిసి ఒకే ఆబ్జెక్ట్ గా కదులుతున్నాయని గమనిస్తారు.
04:35 సమూహాన్నిపునఃపరిమాణం చేయటానికి ప్రయత్నించండి, రెండు ఆబ్జెక్ట్ లు పరస్పరానుగుణంగా పరిమాణంలో మార్పును పొందాయని గమనిస్తారు.
04:43 రంగును నీలం కు మార్చండి మరియు రెండు ఆబ్జెక్ట్స్ అదే రంగుకు మారాయి గమనించండి.
04:53 ఒకవేళ మనం సమూహం లోని ఒక ఆబ్జెక్ట్ యొక్క లక్షణాలను మాత్రమే మార్పుచేయాలి అనుకుంటే ఏమి చేయాలి?
05:01 సమూహంలోని ఒక్క ఆబ్జెక్ట్ ను మాత్రమే ఎంచుకోవడానికి, Ctrl బటన్ ను నొక్కి పెట్టి, ఆ ఆబ్జెక్ట్ పై క్లిక్ చేయండి.
05:08 ఈ చర్య వల్ల, మనం గ్రూప్ లోపలకి వెళ్ళవచ్చు మరియు నిర్దిష్ట ఆబ్జెక్ట్స్ ను ఎంచుకోవచ్చు.
05:13 సమూహాన్ని నిష్క్రమించటానికి.కేన్వాస్ పైన ఖాళీ స్థలంపై ఎక్కడైనా క్లిక్ చేయండి.
05:18 సమూహాన్ని విడదీయటానికి, ముందుగా సమూహాన్ని ఎంచుకోండి మరియు Ctrl + Shift + G కీస్ లేదా Ctrl + U కీస్ లలో ఏవయినా నొక్కండి.
05:28 ఇప్పుడు దీర్ఘవృత్తాల సమూహం విడిపోయింది.
05:31 ఈ ఆపరేషన్ కొరకు షార్ట్ -కట్ చిహ్నాలు ప్రస్తుతం కమాండ్ బార్ లో చూపిన విధంగా ఉన్నాయి.
05:36 కేన్వాస్ పైన ఉన్నఅన్నిఆబ్జెక్ట్ లను ఎంచుకోవడానికి, Ctrl + A కీ లను నొక్కండి.
05:42 ఆబ్జెక్ట్ లను వదిలి పెట్టటానికి, కేన్వాస్ పైన ఖాళీ స్థలంపై ఎక్కడైనా క్లిక్ చేయండి.
05:48 ఒకవేళ మనం నిర్దిష్టమైన ఒక దాన్ని మినహాయించి మిగిలిన అన్నిఆబ్జెక్ట్ లను ఎంచుకోవాలి అనుకుంటే, Invert Selection ఎంపికను ఉపయోగించవచ్చు.
05:55 మనం బాణం తప్ప మిగితా అన్ని ఆబ్జెక్ట్ లను ఎంచుకోవాలి అనుకుంటే,
05:59 ముందు బాణం పై క్లిక్ చేయండి.ఇప్పుడు Edit మెనూ కి వెళ్ళి Invert selection పై క్లిక్ చేయండి.
06:08 ఇప్పుడు బాణం తప్ప canvas పై ఉన్నఅన్ని ఆబ్జెక్ట్ లు ఎంచుకోబడ్డాయి గమనించండి.
06:16 ఇప్పుడు, ఆబ్జెక్ట్ లను ఎలా వరుసలో పెట్టాలో నేర్చుకుందాం.
06:20 చిన్న పంచభుజిని, పెద్ద పంచభుజి పైభాగానికి కదిలించండి.
06:25 ఇప్పుడు, ఒక నక్షత్రాన్ని గీద్దాం ఇంకా దాన్ని చిన్నపంచభుజి పైన పెడదాం.
06:36 చిన్న పంచభుజిని ఎంచుకోండి.ఇంకా Object మెనూ కి వెళ్ళి Raise పై క్లిక్ చేయండి.
06:42 ఇపుడు చిన్న పంచభుజి పైకి ఎత్త బడింది మరియు అది నక్షత్రం పైన ఉంది గమనించండి.
06:47 ఇప్పుడు, నక్షత్రం పై క్లిక్ చేయండి.Object మెనూ కి వెళ్ళి Lower పై క్లిక్ చేయండి.
06:53 ఇప్పుడు, నక్షత్రం కిందికి తరలించబడింది లేదా కిందికి దించబడింది మరియు పెద్ద పెంటగాన్ ఇప్పుడు దాని పైన కనిపిస్తుంది.
07:00 ఇప్పుడు, పెద్ద పంచభుజిపై క్లిక్ చేస్తాను.Object మెనూ కి వెళ్ళి Raise to top పై క్లిక్ చేయండి.ఇప్పుడు పెద్ద పంచభుజి అన్నిటికన్న పైన కనిపిస్తుంది
07:11 ఇపుడు మళ్ళీ Object మెనూ కి వెళ్ళండి.Lower to bottom పై క్లిక్ చేయండి.పెద్ద పంచభుజి ఇప్పుడు కిందికి కదులుతుంది గమనించండి.
07:20 మనం ఈ ఎంపికలను Tool controls bar లోకూడా చూస్తాము.
07:25 తరువాత, Clipping ఎలా చేయాలో నేర్చుకుందాం.
07:28 క్లిప్పింగ్ మీ క్లిష్టమైన ఆబ్జెక్ట్లనూ,
07:31 మీ డిజైన్ యొక్క వేరొక మూలకం లేదా ఆకారానికి అనుగుణంగా,
07:35 దాని యొక్క మొత్తం ఆకారాన్ని తొందరగా మరియు సులభంగా మార్పుచేయటం చేత తయారు చేయగలదు.
07:39 నేను ఈ ప్రదర్శన కోసం ఒక ఇమేజ్ ను ఉపయోగిస్తాను.ఇక్కడ నేను ఒక కొత్త ఇన్క్ స్కేప్ ఫైల్ లో ఒక చిత్రాన్ని కలిగియున్నాను.
07:45 ఈ చిత్రం పైన, నేను ఒక దీర్ఘవృత్తం ఆకారాన్ని గీస్తాను.
07:49 ఇప్పుడు, చిత్రాన్ని మరియు దీర్ఘవృత్తాన్ని ఎంచుకోండి.
07:53 Object మెనూ కి వెళ్ళండి.Clip పై క్లిక్ చేసి తరువాత Set పై క్లిక్ చేయండి.
07:59 ఇప్పుడు చిత్రం దీర్ఘవృత్తం యొక్క ఆకారానికి క్లిప్ చేయబడింది గమనించండి.
08:04 క్లిప్పింగ్ లో, క్లిప్ గా ఉపయోగించబడిన ఆబ్జెక్ట్ యొక్క ఆకారం అది కనిపిస్తున్న ప్రాంతంలో నిర్వచించబడుతుంది.
08:09 మనం Object మెనూ కి తిరిగి వెళ్ళి క్లిప్ ను తొలగించవచ్చు.Clip పై క్లిక్ చేసి తరువాత Release పై క్లిక్ చేయండి.
08:17 ఇప్పుడు clip వదలబడుతుంది.
08:19 తరువాత,Masking చేయడం నేర్చుకుందాం.
08:22 Masking చాలా వరకు Clipping ను పోలి ఉంటుంది.
08:25 Masking లో, ఒక ఆబ్జెక్ట్ యొక్క transparency లేదా lightness, రెండవ ఆబ్జెక్ట్ యొక్క opacity ని నిర్దారిస్తుంది.
08:32 Masking ను ప్రదర్శించడానికి, నేను ముందుగా గ్రేడియంట్ టూల్ ని ఉపయోగించి దీర్ఘవృత్తాన్ని సెమీ -ట్రాన్స్పరెంట్ గా చేస్తాను.
08:38 ఇప్పుడు, దీర్ఘవృత్తాన్ని ఎంచుకోండి.
08:40 Object మెనూ కి వెళ్ళి Fill and stroke పై క్లిక్ చేయండి.
08:44 Radial gradient పై క్లిక్ చేసి తరువాత Edit పై క్లిక్ చేయండి.
08:50 రంగును తెలుపుగా మార్చటానికి RGB స్లయిడర్స్ ను కుడి వైపు చివరికొన వరకు కదిలించండి.
09:00 Stop డ్రాప్ -డౌన్ యారో పై క్లిక్ చేసి వేరొక స్టాప్ ను ఎంచుకోండి.
09:05 రంగును నలుపుకి మార్చడానికి RGB స్లయిడర్స్ ను ఎడమ చివరికొన వైపు కదిలించండి తర్వాత alpha విలువను 255 కు మార్చండి
09:15 మధ్యలో ఎక్కువ రంగును చేర్చటానికి Add stop పై క్లిక్ చేయండి.
09:20 Node tool పై క్లిక్ చేయండి మరియు డైమండ్ హేండిల్ ను పైభాగం వైపు కదిలించండి.
09:27 ఇప్పుడు, చిత్రాన్ని మరియు దీర్ఘవృత్తాన్ని ఎంచుకోండి.
09:30 Object మెనూ కి వెళ్ళండి.
09:32 Mask పై క్లిక్ చేసి తరువాత Set పై క్లిక్ చేయండి.
09:36 చిత్రం పైన ఏర్పడిన mask ను గమనించండి.
09:40 masking ఆబ్జెక్ట్ అయిన దీర్ఘవృత్తం యొక్క ట్రాన్స్పరెన్సీ లక్షణాలను చిత్రం తీసుకుంది గమనించండి.
09:47 మాస్క్ ను తొలగించటానికి, Objectమెనూ కి తిరిగి వెళ్ళండి.
09:51 Mask పై క్లిక్ చేసి తరువాత Release పై క్లిక్ చేయండి.
09:54 mask ఇప్పుడు తొలగించబడింది.
09:56 సారాంశం చూద్దాం.ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నవి: ఆబ్జెక్ట్స్ ను కాపీ మరియు పేస్ట్ చేయటం.
10:02 డూప్లికేట్ మరియు clone ఆబ్జెక్ట్స్.
10:05 వివిధ ఆబ్జెక్ట్స్ లను గ్రూప్ మరియు ఆర్డర్ చేయుట.
10:08 మల్టిపుల్ సెలక్షన్ మరియు ఇన్వెర్ట్ సెలక్షన్ (బహుళ ఎంపిక మరియు ఎంపికను తిరగవేయటం).
10:10 క్లిప్పింగ్ మరియు మాస్కింగ్.
10:12 ఇక్కడ మీకోసం రెండు అసైన్మెంట్లు -
10:15 బూడిద రంగు లో ఒక నిలువు దీర్ఘ వృత్తము మరియు నలుపు రంగు లో ఒక వృత్తాన్ని సృష్టించండి.
10:20 దీర్ఘ వృత్తము పైన మధ్యలో వృత్తాన్ని ఉంచండి.
10:23 ఇది ఒక కన్ను ఆకారం లాగా ఉండాలి.
10:25 ఇప్పుడు వాటిని సమూహం చేయండి.
10:27 ఇంకొక కన్ను తయారు చేయటానికి ఒక clone ను సృష్టించండి.
10:31 రెండు కళ్ళు కనిపించటానికి దాన్ని ఒక పక్కకి కదిలించండి.
10:35 నీలం రంగులో ఒక వృత్తాన్ని మరియు ఎరుపు రంగులో ఒక చతురస్రాన్ని సృష్టించండి.
10:40 చతురస్రం డూప్లికేట్ చేయండి మరియు రెండు చతురస్రాలను వికర్ణంగా వ్యతిరేక దిశలలో ఉంచండి.
10:45 రెండు చతురస్రాలు ఎంచుకోండి మరియు వాటిని ఒకే ఆబ్జెక్ట్ గా సమూహం చేయండి.
10:50 చతురస్రాల సమూహం పైభాగంలో వృత్తాన్ని మధ్యలో ఉంచండి.
10:54 రెండిటిని ఎంచుకోండి మరియు ఒక clip సృష్టించండి.అది చూడటానికి ఒక విల్లులాగా ఉండాలి.
11:00 మీరు పూర్తిచేసిన అసైన్మెంట్ ఇలా ఉండాలి.
11:03 ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చుడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
11:12 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
11:21 మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి.
11:23 దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.
11:31 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
11:35 మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
11:38 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya